LIVE తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ఇజ్రాయెల్: ‘హమాస్‌‌పై ప్రతీకారం ఇప్పుడే మొదలైంది’

    గాజాలో ప్రతీకార దాడులు

    ఫొటో సోర్స్, Reuters

    హమాస్‌పై తమ ప్రతీకారం ఇప్పుడే మొదలైందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.

    హమాస్‌ ఫైటర్లు భయానకమైన, కఠినమైన అనుభవాన్ని ఎదుర్కోనున్నారని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి ఆయన తెలిపారు.

    శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన భీకర దాడి తర్వాత 700 మందికి పైగా మరణించారు.

    ఆ తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 560 మంది చనిపోయారు.

    గాజాలో ఎక్కడ చూసినా అంత్యక్రియలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారికి కన్నీటి వీడ్కోలు చెబుతున్నారు.

    గాజాలో అంత్యక్రియలు

    ఫొటో సోర్స్, Reuters

  3. ‘పాకిస్తానీ జర్నలిస్ట్‌ను బలవంతంగా భారత్‌ నుంచి పంపలేదు’.. స్పష్టతనిచ్చిన ఐసీసీ

    జైనాబ్ అబ్బాస్

    ఫొటో సోర్స్, @ZAbbasOfficial

    పాకిస్తానీ స్పోర్ట్స్ జర్నలిస్ట్, కామెంటర్ జైనాబ్ అబ్బాస్‌ను బలవంతంగా భారత్ నుంచి పంపించలేదని ఐసీసీ చెప్పింది.

    భారత్‌లో జరుగుతోన్న ప్రపంచ కప్‌ ఐసీసీ ప్రజెంటర్లలో జైనాబ్ అబ్బాస్ కూడా ఒకరు.

    భారత్ నుంచి ఆమె తిరిగి పాకిస్తాన్‌ వెళ్లిన తర్వాత, బలవంతంగా ఆమెను అధికారులు పంపించారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

    దీనిపై ఐసీసీ సమాధానమిచ్చింది. జైనాబ్ తన వ్యక్తిగత కారణాలతో తిరిగి వెనక్కి వెళ్లినట్లు తెలిపింది.

    ‘‘వ్యక్తిగత కారణాలతో ఆమె తిరిగి స్వదేశానికి వెళ్లారు. జైనాబ్‌ను బలవంతంగా పాకిస్తాన్ పంపించలేదు’’ అని ఐసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ క్లయిర్ ఫర్లాంగ్ చెప్పారు.

    అయితే, ఈ విషయంపై జైనాబ్ స్పందించలేదు. ఏ వ్యక్తిగత కారణాలతో తాను తిరిగి పాకిస్తాన్ వెళ్లిందో కూడా చెప్పలేదు.

    అక్టోబర్‌ 5 నుంచి భారత్‌లో ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జైనాబ్ పాత ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్లు వైరల్ అయిన తర్వాత ఆమెకు బెదిరింపులు వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

    జైనాబ్ స్పందన కోసం బీబీసీ ఆమెను సంప్రదించింది. కానీ, ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

    పాకిస్తాన్‌లో జైనాబ్ అబ్బాస్ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

  4. ఇజ్రాయెల్‌పై హమాస్ ఊహకందని మెరుపు దాడి ఎలా చేసింది? బీబీసీ పరిశీలించిన ఆ వీడియోల్లో ఏముంది?

  5. హమాస్ దాడి - ఇజ్రాయెల్: ‘నాలుగైదు గంటలపాటు హర్రర్ మూవీని తలపించింది’.. మ్యూజిక్ ఫెస్టివల్‌లో 260 శవాలు

  6. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

  7. అర్థ శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం

    క్లాడియా

    ఫొటో సోర్స్, Harvard University

    ఫొటో క్యాప్షన్, క్లాడియా గోల్డిన్

    అర్థ శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అమెరికా లేబర్ ఎకనమిస్ట్ క్లాడియా గోల్డిన్‌ను ఎంపిక చేశారు.

    ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ప్రకటన చేసింది.

    ఆల్ఫర్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఎకనమిక్ సైన్సెస్‌లో స్వెరిజెస్ రిక్స్‌బ్యాంకు ప్రైజ్‌ను క్లాడియాకు ఇవ్వాలని నిర్ణయించినట్లు అకాడమీ తెలిపింది.

    లేబర్ మార్కెట్‌లో మహిళల ప్రాతినిధ్యం ఫలితాలపై అవగాహనను పెంచే పరిశోధనలకు గాను ఈ పురస్కారానికి ఆమెను ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.

    క్లాడియా 1946లో న్యూయార్క్‌లో పుట్టారు. 1972లో షికాగో యూనివర్సిటీ నుంచి ఆమె అర్థ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు.

    1989 నుంచి 2017 వరకు నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్(ఎన్‌బీఈఆర్)లో ఎకనమిక్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు డైరెక్టర్‌గా క్లాడియా పనిచేశారు.

    ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

    ఆదాయంలో జెండర్ గ్యాప్ నుంచి మహిళా ఉద్యోగుల ప్రాధాన్యం వరకు ఎన్నో అంశాలపై ఆమె విస్తృతమైన పరిశోధన చేపట్టారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌: విచారణను రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    చంద్రబాబునాయుడు

    ఫొటో సోర్స్, Getty Images

    స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

    జస్టిస్ అనిరుద్ధ బోస్,జస్టిస్ బేలా త్రివేదీ‌లతో కూడిన ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే సోమవారం వాదనలు వినిపించారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

  9. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు .. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడంటే

  10. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు

    సీఈసీ

    తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.

    సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.

    తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ నవంబర్ 3నుంచి డిసెంబర్ 5 వరకు కొనసాగనుంది.

    తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

    ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: 3 నవంబర్ 2023 (శుక్రవారం)

    నామినేషన్లకు ఆఖరు తేదీ: 10 నవంబర్ 2023 (శుక్రవారం)

    నామినేషన్ల పరిశీలన: 13 నవంబర్ 2023 (సోమవారం)

    నామినేషన్ల ఉపసంహరణకు తుది తేదీ: 15 నవంబర్ 2023 (బుధవారం)

    పోలింగ్ తేదీ: 30 నవంబర్ 2023 (గురువారం)

    ఓట్ల లెక్కింపు: 3 డిసెంబర్ 2023 (ఆదివారం)

  11. 'గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో లేజర్ లైట్ చూశాక బతుకే చీకటైపోయింది... లేజర్ కిరణాలతో కంటిచూపు పోతుందా?

  12. ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌నెట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టేసిన ఏపీ హైకోర్టు

    చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, Getty Images

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.

    ఆయన తరుపున వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ కేసులతోపాటుగా అంగళ్లు కేసులోనూ ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడింది. ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన మూడు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది.

    దాంతో, ఈ కేసుల్లో పీటీ వారెంట్ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

    పీటీ వారెంట్ల పై ఏసీబీ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ఇజ్రాయెల్-గాజా: హమాస్ దాడుల తర్వాత 1,100కు చేరిన మృతుల సంఖ్య

    గాజా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆదివారం సాయంత్రం గాజాలో పేలిన క్షిపణి

    హమాస్ సంస్థ దాడుల తర్వాత ఇజ్రాయెల్, గాజాలో కలిపి ఇప్పటివరకు 1,100 మంది మృతిచెందినట్లు నిర్ధారించారు.

    ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడుల కారణంగా గాజాలో 1,23,000 పాలస్తీనా ప్రజలు నిర్వాసితులుగా మారారని, దాదాపు 74 వేల మంది పాఠశాలల్లో ఏర్పాటు చేసిన షెల్టర్లలో తలదాచుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

    ఈ దాడులు ప్రారంభమై 36 గంటలు గడిచిన తర్వాత కూడా గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌లోకి రాకెట్లను ప్రయోగిస్తూనే ఉన్నారు.

    హమాస్ దాడుల్లో తమ దేశ పౌరులు మరణించారని, కొంతమంది అపహరణకు గురయ్యారని పలు ఇతర దేశాలు చెప్పాయి.

    గాజా

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, గాజా వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ
  14. అఫ్గానిస్తాన్ భూకంపం: 1,000 మందికి పైగా మృతి, 465కు పైగా ఇళ్లు నేలమట్టం

    ఆఫ్గానిస్తాన్

    ఫొటో సోర్స్, Getty Images

    అఫ్గాన్ భూకంపంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

    శనివారం హెరాత్ ప్రావిన్సులో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ఇప్పటివరకు 1,000 మందికిపై చనిపోయారు.

    కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు రోడ్లన్నీ శిథిలాలతో మూసుకుపోవడంతో కొన్ని చోట్ల సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

    వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితితో పాటు ఇతర సంస్థలు అత్యవసర సహాయక చర్యలకు సహాయం చేస్తున్నాయి.

    465కు పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

    భూకంప మృతుల సంఖ్య కచ్చితంగా ఇంకా నిర్ధారితం కాలేదు. వెయ్యికి పైగా మృతి చెందినట్లు, 500 మంది కనిపించకుండా పోయినట్లు అఫ్గానిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల కార్యాలయం తెలిపింది.

    2,000 మంది ప్రజలు చనిపోవడం లేదా గాయాల పాలయ్యారని ఆదివారం ఉదయం తాలిబాన్ ప్రభుత్వం చెప్పింది.

  15. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేడే

    ఎలక్షన్ కమిషన్

    ఫొటో సోర్స్, Getty Images

    తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు (సోమవారం) విడుదల కానుంది.

    కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించేందుకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు దిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    తెలంగాణ ఎన్నికలు

    తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఈసీఐ జాయింట్ డైరెక్టర్ అనుజ్ చందక్ మీడియాకు ఆహ్వానాలు పంపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది