LIVE యుక్రెయిన్: ‘‘క్షిపణి దాడిలో హరోజా గ్రామంలోని ప్రతీ కుటుంబం ప్రభావితమైంది’’

ఈశాన్య యుక్రెయిన్‌లోని హరోజా గ్రామంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఆ గ్రామంలోని ప్రతీ కుటుంబం ప్రభావితమైందని యుక్రెయిన్ హోం మంత్రిత్వ శాఖ మంత్రి తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. LIVE ఇజ్రాయెల్‌పై వేల రాకెట్లతో దాడులు చేసిన హమాస్... గాజాపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్

  2. చిన్నా రివ్యూ : సిద్ధార్థ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమా ఎలా ఉందంటే...

  3. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  4. ప్రపంచ కప్: నెదర్లాండ్స్‌పై 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం

    సౌద్ షకీల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’ సౌద్ షకీల్

    క్రికెట్ ప్రపంచ కప్‌లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది.

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులు చేయగా, నెదర్లాండ్స్‌ 41 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది.

    పాకిస్తాన్ ఆటగాడు సౌద్ షకీల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

    అతడు 52 పరుగుల్లో 68 పరుగులు చేశాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. ఒక్కరోజులో గుండె ఆరుసార్లు ఆగిపోయింది, అయినా ఎలా బతికాడంటే..

  6. మీ నోరు కంపు కొడుతోందా? ముందు ఈ 4 అపోహలు తొలగించుకోండి

  7. ‘రూల్స్ రంజన్’ రివ్యూ: కిరణ్ అబ్బవరం సినిమా మిమ్మల్ని నవ్విస్తుందా, లేదా?

  8. బ్రేకింగ్ న్యూస్, ఏసియన్ గేమ్స్: పసిడి పతకం గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు

    హాకీ జట్టు

    ఫొటో సోర్స్, Reuters

    చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు పసిడి పతకం సాధించింది. ఫైనల్లో జపాన్‌పై 5-1 తేడాతో గెలిచింది.

    దీంతో, ఏసియన్ గేమ్స్‌లో భారత్ 22 పసిడి పతకాలను సొంతం చేసుకుంది.

    ఈ గెలుపుతో పారిస్ ఒలింపిక్స్‌కు భారత పురుషుల హాకీ టీమ్ క్వాలిఫై అయింది.

    ఇప్పటి వరకు భారత్ ఈ ఏసియన్ గేమ్స్‌లో మొత్తంగా 95 పతకాలను సాధించింది.

    ఏసియన్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పసిడి పతకం గెలవడం ఇది నాలుగోసారి.

    1996, 1998, 2014లలో కూడా భారత్ హాకీలో పసిడి పతకాన్ని గెలుచుకుంది.

    గత ఏడాది ఏసియన్ గేమ్స్‌లో పాకిస్తాన్‌ జట్టును ఓడించి భారత్ టీమ్ పసిడి పతకాన్ని పొందింది.

  9. భగత్ సింగ్ ఎవరినైనా ప్రేమించారా? ఆ ఉత్తరంలో ఏముంది?

  10. ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన నార్గెస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి పురస్కారం

    నర్గిస్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నార్గెస్ మొహమ్మదీ (పాత చిత్రం)

    ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మొహమ్మదీకి శుక్రవారం నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు.

    నార్గెస్ ప్రస్తుతం ఇరాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

    ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులను కాపాడేందుకు ఆమె చేసిన కృషికి గాను నార్గెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

    నార్గెస్‌ వయసు ప్రస్తుతం 51 ఏళ్లు.

    శాంతిని స్థాపించడంలో, ప్రోత్సహించడంలో ఉన్నతమైన సేవలను అందించిన వ్యక్తులకు లేదా సంస్థలకు నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేస్తారు.

    ఇప్పటికే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య రంగం, సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ ఏడాది వివిధ రంగాల్లో నోబెల్ పురస్కారాలకు ఎంపికైన వారు..

    వైద్య రంగంలో నోబెల్ పురస్కారం: డాక్టర్ కాటలిన్ కరికో, డాక్టర్ డ్రూ వాయిస్‌మన్

    రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి: మౌంగి జీ. బవెండీ, లూయిస్ ఈ బ్రూస్, అలెక్సీ ఐ. ఎకిమోవ్

    సాహిత్యంలో నోబెల్ పురస్కారం: రచయిత జాన్ ఫోస్సె

    భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి: పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యులియర్

  11. యుక్రెయిన్: ‘‘క్షిపణి దాడిలో హరోజా గ్రామంలోని ప్రతీ కుటుంబం ప్రభావితమైంది’’, క్రిస్టీ కూనీ, బీబీసీ న్యూస్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA

    ఈశాన్య యుక్రెయిన్‌లోని హరోజా గ్రామంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఆ గ్రామంలోని ప్రతీ కుటుంబం ప్రభావితమైందని యుక్రెయిన్ హోం మంత్రిత్వ శాఖ మంత్రి తెలిపారు.

    ఈ దాడిలో 51 మంది చనిపోయినట్లు వెల్లడించారు.

    ఖార్కియెవ్ రీజియన్‌లోని హరోజా గ్రామంలో ఒక కేఫ్‌పై జరిగిన క్షిపణి దాడిలో మరణించిన వారిలో ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నారు.

    ‘‘ప్రతీ ఇంటికి చెందిన వ్యక్తులు ఈ దాడిలో ప్రభావితమయ్యారు’’ అని ఐహోర్ తెలిపారు.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    ఆ ప్రాంతంలో మిలిటరీ స్థావరాలేవీ లేవంటూ రష్యా దాడిని యుక్రెయిన్ రక్షణ శాఖ ఖండించింది.

    రష్యా ఇంతవరకు ఈ దాడి గురించి నేరుగా స్పందించలేదు.

    ఈ దాడిని క్రూరమైన చర్యగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అభివర్ణించారు.

    2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా-యుక్రెయిన్ సైనికుల మధ్య దాడులకు ఖార్కియెవ్ ప్రాంతం కేంద్రంగా మారింది.

    నెలల తరబడి పోరాడిన తర్వాత ఖార్కియెవ్ కొన్ని ప్రాంతాలను తాము తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌లో యుక్రెయిన్ చెప్పింది.

  12. క్రికెట్ బ్యాట్ ఎలా పుట్టింది... 400 ఏళ్ళ చరిత్రలో ఎలా మారుతూ వచ్చింది?

  13. ఆర్‌బీఐ: యథాతథంగా రెపో రేటు

    ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

    ఫొటో సోర్స్, Getty Images

    పరపతి విధాన కమిటీ సమీక్షలో రెపో రేటును మార్చకుండా యథాతథంగా 6.5 శాతం వద్దే ఉంచినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు.

    రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతంగా ఉంచామని చెప్పారు.

    అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో బుల్లెట్ చెల్లింపు పథకం కింద బంగారు రుణాన్ని రెండింతలు చేసి రూ.4 లక్షలకు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం అక్టోబర్ 4 నుంచి మొదలై నేటితో ముగిసింది.

    వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. క్రికెట్ వరల్డ్ కప్ 2023: మ్యాచ్ జరుగుతుంటే మోదీ స్టేడియం ఖాళీ... ప్రారంభ మ్యాచ్ వాంఖెడేలో కాకుండా అహ్మదాబాద్‌లో ఎందుకు నిర్వహించారు?

  15. క్రికెట్ వరల్డ్‌కప్: "ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌కు తీవ్ర జ్వరం"

    గిల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్ట్రేలియాతో ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌కు ముందు భారత జట్టులో ఆందోళన మొదలైంది.

    ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు తీవ్ర జ్వరం ఉందని, అతనికి డెంగీ పరీక్షలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఈ వార్తల నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్ చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగనుంది.

    “చెన్నైకి చేరుకున్న తర్వాత శుభ్‌మన్ గిల్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. అతనికి వైద్య పరీక్షలు జరిగాయి. శుక్రవారం కూడా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత అతను తొలి మ్యాచ్‌లో ఆడగలడా లేదా అనేది నిర్ణయిస్తాం’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    శుభ్‌మన్ గిల్‌కు డెంగీ పరీక్ష జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే ఆరంభ మ్యాచ్‌కు గిల్ దూరం అవుతాడు.

    అయితే ఇంకా ఎలాంటి నిర్ధారణ జరుగలేదని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. ఆసియా క్రీడలు: తిలక్ వర్మ అర్ధసెంచరీ, ఫైనల్లో టీమిండియా

    రుతురాజ్ గైక్వాడ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు ఫైనల్‌కు చేరింది.

    శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 9 వికెట్లతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది.

    వికెట్ కీపర్ జాకీర్ అలీ అజేయంగా చేసిన 24 పరుగులే బంగ్లా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్.

    భారత బౌలర్లలో సాయి కిశోర్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.

    అనంతరం భారత్ 9.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.

    హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ 26 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో అజేయంగా 55 పరుగులు చేశాడు.

    కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. యశస్వీ జైస్వాల్ డకౌట్ అయ్యాడు.