ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఆసియా క్రీడల మహిళల 100మీ. హర్డిల్స్ ఫైనల్ రేసులో హైడ్రామా జరిగింది. తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజీ పాల్గొన్న ఈ రేసులో చైనా క్రీడాకారిణి వు యానీ, నిర్ణీత సమయం కంటే ముందే పరుగు ప్రారంభించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Twitter/SAI Media
ఆసియా క్రీడల్లో ఆదివారం జరిగిన మహిళల 100మీ. హర్డిల్స్ ఫైనల్ రేసులో హైడ్రామా జరిగింది.
తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజీ పాల్గొన్న ఈ రేసులో చైనా క్రీడాకారిణి వు యానీ, నిర్ణీత సమయం కంటే ముందే పరుగు ప్రారంభించారు.
చైనా అథ్లెట్ తప్పిదంతో రేసు మొదలైందనుకున్న జ్యోతి కూడా పరుగు ప్రారంభించారు.
ఈ రేసులో జ్యోతి మూడో స్థానంలో, వు యానీ రెండో స్థానంలో నిలిచారు.
అయితే వీరిద్దరూ తప్పు చేసినట్లుగా అధికారులు తొలుత భావించారు.
తప్పు చేసిన చైనా అథ్లెట్‌ను డిస్ క్వాలిఫై చేశారు.
తర్వాత జ్యోతి ఉద్దేశపూర్వకంగా చేయలేదని తేలడంతో ఆమెకు రజతాన్ని అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/SAI Media
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణాన్ని సాధించాలని ఆశించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు నిరాశ ఎదురైంది.
ఆదివారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో పటిష్టమైన చైనా చేతిలో ఓడిపోయి భారత్ రజతంతో సరిపెట్టుకుంది.
దీంతో భారత్ ఇప్పటివరకు 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలు సాధించింది.
ఫైనల్లో భారత్ 2-3తో చైనాతో చేతిలో పరాజయం పాలైంది.
తొలుత రెండు మ్యాచ్‌ల్ని నెగ్గిన భారత్, తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడటంతో బంగారు పతకం చేజారింది.
టీమ్ ఈవెంట్‌లో భాగంగా తొలుత జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ (భారత్) 22-20, 14-21, 21-18తో షి యుకీ (చైనా)పై గెలిచాడు.
రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జంట 21-15, 21-18తో లియాంగ్-వాంగ్ (చైనా) జోడీపై నెగ్గి భారత్‌కు 2-0తో ఆధిక్యాన్ని ఇచ్చింది.
మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 22-24, 9-21తో ఫిషెంగ్ లీ (చైనా)చేతిలో ఓడిపోయాడు. తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో ధ్రువ్ కపిల-కృష్ణ ప్రసాద్ (భారత్) జంట 6-21, 15-21తో యుచెన్ లియు- యునీ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
చివరి మ్యాచ్‌లో వెంగ్ హాంగ్‌యాంగ్ (చైనా) 21-12, 21-4తో మిథున్ మంజునాథ్ (భారత్)ను వరుస గేముల్లో ఓడించి తమ జట్టును విజేతగా నిలిపాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, KTR
బీఆర్ఎస్‌పై ప్రధాని మోదీ చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడమని తెలంగాణ ప్రజలకు తెలుసని కేటీఆర్ అన్నారు.
జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలు కాదని ఆయన ట్వీట్ చేశారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉంది. కానీచ బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలోకి వెళ్లిపోయింది. మీరు కిసాన్ సమ్మాన్ పథకం కింద ఇచ్చింది కేవలం నామమాత్రం. కానీ ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో వేసిన విషయం మీరు తెలుసుకుంటే మంచిది. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం మిలియన్ డాలర్ జోక్. దేశ చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. అన్నదాత అప్పులు మాఫీ చేసి జైకిసాన్ ప్రభుత్వం మాది. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన ప్రభుత్వం మీది’’ అంటూ కేటీఆర్ విమర్శించారు.

ఫొటో సోర్స్, Twitter/SAi Media
ఆసియ క్రీడల్లో భారత అథ్లెట్లు సీమా పూనియా, నందిని అగసరా, ఎం. శ్రీశంకర్, అజయ్, జిన్సన్, హర్మిలాన్ బైన్స్ పతకాలను సాధించారు.
మహిళల 1500 మీ. పరుగులో హర్మిలాన్ బైన్స్, పురుషుల 1500 మీ. పరుగులో అజయ్ కుమార్, పురుషుల లాంగ్ జంప్‌లో ఎం. శ్రీశంకర్ రన్నరప్‌లుగా నిలిచి రజత పతకాలు గెలుచుకున్నారు.
మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో సీమా పూనియా, మహిళల హెప్టాథ్లాన్‌లో నందిని అగసర, పురుషుల 1500మీ. ఫైనల్లో జిన్సన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను అందుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది.
షాట్‌ఫుట్ ఈవెంట్‌లో భారత్ మరో స్వర్ణాన్ని కొల్లగొట్టింది.
భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 28 ఏళ్ల తేజిందర్ పాల్ సింగ్ తూర్ ఫైనల్లో గుండును అత్యుత్తమంగా 20.36 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు.
దీంతో ఈ ఎడిషన్ ఆసియా క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో భారత్‌కు రెండో స్వర్ణం, ఓవరాల్‌గా 13వ బంగారు పతకం దక్కింది.
2018 జకార్తా ఆసియా క్రీడల్లో కూడా తేజిందర్ షాట్‌పుట్‌లో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/SAI Media
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది.
పురుషుల 3000మీ. స్టీపుల్‌చేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే చాంపియన్‌గా నిలిచాడు.
ఆదివారం జరిగిన పురుషుల 3000మీ. స్టీపుల్‌చేజ్ రేస్‌ను అవినాశ్ 8 నిమిషాల 19:50 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.
ఈ ఎడిషన్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో దక్కిన తొలి స్వర్ణం ఇదే.
అవినాశ్ స్వర్ణంతో భారత్ ఖాతాలో 12వ స్వర్ణం చేరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/SAI Media
ఆసియా క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు కాంస్య పతకం దక్కింది.
మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ సెమీఫైనల్లో ఓటమి పాలైంది.
ఆదివారం సెమీస్ మ్యాచ్‌లో నిఖత్ 2-3తో రక్సత్ చుతామత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది.
దీంతో, ఆమె కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘నా కుటుంబ సభ్యుల్లారా’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఆయన ఏమన్నారంటే...
‘‘దేశంలో పండగల సీజన్ మొదలైంది.
నారీ శక్తి చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో నవరాత్రులకు ముందే శక్తి పూజ భక్తి భావాన్ని నింపాం.
తెలంగాణలో అనేక ప్రాముఖ్యమైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేశాం.
రూ.13,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం.
ఇక్కడి ప్రజల జీవితాల్లో గణనీయ మార్పును తీసుకొచ్చే అనేక రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది.
కేంద్రం చేపట్టిన పనులతో ఇక్కడ ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.
జాతీయ రహదారుల నిర్మాణంతో తెలంగాణకు ఇతర రాష్ట్రాలతో అనుసంధానం పెరిగింది.
తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు సమ్మక్క సారక్క పేరుతో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం రూ. 900 కోట్లను వెచ్చిస్తాం.’’ అని ప్రధాని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలని బీజేపీ నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల తర్వాత వారు కోరుకుంటున్న ప్రభుత్వం వస్తుందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ చెప్పినట్లు నడుస్తోందని ప్రధాని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ మాదిరిగా ప్రభుత్వం నడుస్తోందని, అందులో పదవులన్నీ ఒక కుటుంబానికి చెందినవారివేనని మోదీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, WWW.NEWDELHI.MFA.AF
దిల్లీలో తమ దేశ ఎంబసీ కార్యాలయాన్ని అఫ్గానిస్తాన్ ఆదివారం మూసివేసింది.
భారత్‌లో అక్టోబర్ 1 నుంచి తమ ఎంబసీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్గాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
భారత ప్రభుత్వం నుంచి ఆశించినంతగా మద్దతు లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అఫ్గాన్ ప్రజల ప్రయోజనాలకు తగినట్లుగా పని చేయలేకపోవడం, తగిన సిబ్బంది లేకపోవడం కూడా కారణమని ప్రకటించింది.
అయితే, అఫ్గాన్ సిటిజన్స్ కోసం అత్యవసర కాన్సులర్ సేవలు అందిస్తామని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

తుర్కియేలోని పార్లమెంటు వద్ద జరిగిన పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు ఆ దేశం తెలిపింది.
ఈ దాడిని ‘టెర్రరిస్ట్ అటాక్’ అని ఆ దేశ హోంశాఖ మంత్రి అలీ తెలిపారు.
సైనిక వాహనంలో వచ్చిన ఇద్దరు సాయుధులు దాడి చేశారని, ఒకరు తనను తాను పేల్చుకోగా మరొకరు పోలీసుల ఆపరేషన్‌లో చనిపోయినట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Aditi Ashok/Facebook
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత గోల్ఫర్ అదితి అశోక్, మహిళల వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.
ఆసియా గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి మహిళా గోల్ఫర్‌గా అదితి చరిత్ర సృష్టించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Narendra Modi
ప్రధాని మోదీ నేడు తెలంగాణలోని మహబూబ్ నగర్‌లో పర్యటించనున్నారు. ర్యాలీలో పాల్గొనడంతోపాటు రహదారులు, రైల్వే, ఇంధనం వంటి విభాగాలకు సంబంధించి రూ.13,500 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మోదీ ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.