చంద్రయాన్ -3: స్లీప్ మోడ్ నుంచి బయటకు రాని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్

వాస్తవానికి, 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు చేసిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు శాశ్వతంగా స్లీప్ మోడ్‌లోకి వెళ్లి, పనికి రాకుండా పోతాయని ఇస్రో గతంలోనే చెప్పింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. చంద్రయాన్ -3: స్లీప్ మోడ్ నుంచి బయటకు రాని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్

    చంద్రయాన్

    ఫొటో సోర్స్, ISRO

    చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కమ్యూనికేషన్‌ కోసం ప్రయత్నించామని, కానీ వాటి నుంచి సిగ్నల్స్ అందలేని ఇస్రో పేర్కొంది.

    చంద్రుడిపై శుక్రవారం నాడు సూర్యోదయం ఉండటంతో, విక్రమ్, ప్రజ్ఞాన్‌లను యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తామని ఇస్రో ఇంతకు ముందే ప్రకటించింది.

    వాస్తవానికి, 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు చేసిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు శాశ్వతంగా స్లీప్ మోడ్‌లోకి వెళ్లి, పనికి రాకుండా పోతాయని ఇస్రో గతంలోనే చెప్పింది.

    అయితే, తిరిగి సూర్యోదయం అయ్యాక వాటిని స్లీమ్ మోడ్ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు.

    స్లీప్ మోడ్ నుంచి బయటకు తీసుకురాగలిగితే అది అదృష్టమేనని, ఈ ప్రాజెక్టు ద్వారా మరికొంత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని ఇస్రో వెల్లడించింది.

    అయితే, శుక్రవారం నాడు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రలేపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ, వాటి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదని, వాటితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. లోక్‌సభ: ఎంపీ డానిష్ అలీ పై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు, దీనిపై ఎవరేమన్నారు ?

  4. పీవీ సింధు: ఆసియన్ గేమ్స్‌లో ఈ తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ మెరుపులు మెరిపిస్తారా?

  5. లోక్‌సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్

    రమేశ్ బిధూరి

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభలో సహచర ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ హెచ్చరించారు.

    గురువారం లోక్‌సభలో 'చంద్రయాన్-3 విజయం'పై చర్చ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ఉద్దేశించి బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    దక్షిణ దిల్లీకి చెందిన బీజేపీ ఎంపి రమేష్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బిధూరి వ్యాఖ్యలు చేసిన వెంటనే సభలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఈ విషయంపై బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. 'నాకు న్యాయం జరుగుతుందని, స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలా జరగకపోతే ఈ సభను నుంచి వెళ్లిపోవడంపై నిర్ణయం తీసుకుంటా' అని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  6. చంద్రబాబుకు రెండు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది.

    అయిదు రోజుల కస్టడీ కావాలని సీఐడీ కోరగా, రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.

    ఈ సందర్భంగా కోర్టు సీఐడీకి పలు షరతులను కూడా విధించింది. చంద్రబాబును న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని, ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని ఆదేశించింది.

    రెండు రోజుల కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచాలని కూడా ఏసీబీ కోర్టు సీఐడీని ఆదేశించింది.

    మరోవైపు బెయిల్ పిటిషన్‍పై రేపు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు లాయర్లు తెలపగా, అందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది.

    కస్టడీ సమయంలో బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సరికాదని, ఏసీబీ కస్టడి ముగిసిన తర్వాత సోమవారం బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.

  7. బ్రేకింగ్ న్యూస్, చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ కొట్టివేత

    ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రిమాండు రిపోర్టును కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేసింది.

    చంద్రబాబుకి రిమాండ్ కొనసాగిస్తూ కొద్ది సేపటి కిందట ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు తరుపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ స్క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. మూడు రోజుల పాటు విచారణ సాగింది. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది.

    మరోవైపు చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటీషన్ మీద ఏసీబీ కోర్టు తీర్పు వెలువడబోతోంది. హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ మీద తీర్పు వెలువడుతున్న తరుణంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదుల కోరిక మేరకు ఈ ఉదయం ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసింది.

  8. డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?

  9. చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...

  10. క్రికెట్ ప్రపంచ కప్: భారత క్రికెట్ చరిత్రను మార్చిన ఒక్క క్యాచ్

  11. బ్రేకింగ్ న్యూస్, చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు

    చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, UGC

    ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో నారా చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించారు. ఈ మేరకు విజయవాడ ఏసిబి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 24వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

    ఈ నెల 9న అరెస్ట్ అయిన చంద్రబాబును కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. 14 రోజుల రిమాండ్ గడువు ముగుస్తున్న తరుణంలో శుక్రవారం విచారణ జరిగింది.

    వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుని కోర్టు ఎదుట హాజరు పరిచారు. రిమాండులో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా అని చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు. అనంతరం ఈనెల 24 వరకూ జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారని తెలిపింది.

  12. ల్యాండర్, రోవర్ల యాక్టివేట్ ప్రక్రియను ప్రారంభించిన ఇస్రో

    విక్రమ్ ల్యాండర్

    ఫొటో సోర్స్, ISRO

    చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి నేడు మరొక కీలక ఘటన చోటు చేసుకోనుంది. చంద్రుని మీద స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను తిరిగి యాక్టివేట్ చేసేందుకు నేడు ఇస్రో ప్రయత్నించనుంది.

    చంద్రుని మీద ఒక రోజు (లూనార్ డే) అంటే సుమారు 28 రోజులు. అంటే 14 రోజులు పగలు. 14 రోజులు రాత్రి. అందువల్ల సూర్యకాంతి 14 రోజులు మాత్రమే లభిస్తుంది కాబట్టి ల్యాండర్, రోవర్ల జీవితకాలం కూడా 14 రోజులు ఉండేలా డిజైన్ చేశారు.

    ఆగస్టు 23న చంద్రుని మీద ల్యాండర్ దిగింది. ఆ తరువాత చంద్రుని మీద రాత్రి మొదలవుతుండటంతో సెప్టెంబరు 4న ల్యాండర్, రోవర్లను ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. ఇప్పుడు మళ్లీ సూర్యుడు వస్తుండటంతో తిరిగి లేపేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను మొదలు పెట్టింది.

    కానీ చంద్రుని మీద రాత్రిళ్లు -200 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాంటి కఠిన వాతావరణంలో ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకొని ఉండటం చాలా కష్టం. అందువల్ల ల్యాండర్, రోవర్లు మళ్లీ యాక్టివేట్ కాకపోతే ఇక ఎప్పటికీ అవి పని చేయవని నిపుణులు చెబుతున్నారు.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.