You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు: సభలో బాలకృష్ణ మీసం తిప్పారంటూ వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యింది. టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో సభ్యులు నిరసన తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా, అలాంటప్పుడు ఏం చేయాలి?

  2. బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం

    తాజా వార్తలను మీకు ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.

    ధన్యవాదాలు... గుడ్ నైట్.

  3. మహిళా రిజర్వేషన్ బిల్లు: పార్లమెంటు ఆమోదించింది... కానీ, అమలయ్యేది ఎప్పుడు?

  4. గ్రామాల్లో దోమలను ఆయిల్ బాల్స్ నియంత్రిస్తాయా?

  5. మహిళలు, బాలికలు దుస్తులు ‘సరిగా’ ధరించకపోతే పదేళ్ల జైలు.. వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం

  6. ‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే మేం కూడా పంట వేశాం. తీరా చూస్తే..’

  7. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు: సభలో బాలకృష్ణ మీసం తిప్పారంటూ వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణ, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.

    తొలిరోజు సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యింది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు.

    సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారంటూ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆరోపించింది. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించాలని అంబటి వ్యాఖ్యానించారు.

    ఈ గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.

    టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసిన ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    టీడీపీ సభ్యులతోపాటు ఇటీవల వైసీపీ నుంచి సస్ఫెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ పోడియం వద్ద‌కు చేరి, నిరసనకు దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నిరసనల్లో పాల్గొన్నారు.

    ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ సహా వివిధ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.

    ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు ఇవి. దీంతో రాజధాని గ్రామాలు, అసెంబ్లీ పరిసర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  9. ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది?