ఉదయనిధి స్టాలిన్: 'హిందీ భాష ప్రజలను ఏకం చేస్తుందనడం ఆ భాషను రుద్దడమే'

'నాలుగైదు రాష్ట్రాల్లోనే హిందీని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మొత్తం ఇండియాను ఇది ఎలా ఏకం చేస్తుంది’ అని ఆయన ప్రశ్నించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. గేదెలు దొంగిలించిన కేసులో 58 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్

  3. హిందీ భాష ప్రజలను ఏకం చేస్తుందనడం ఆ భాషను రుద్దడమే: ఉదయనిధి స్టాలిన్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘హిందీ ఏకం చేస్తుంది’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ తప్పుబట్టారు. ఇది హిందీని రుద్దడం కోసం చేసే ప్రయత్నమని అన్నారు.

    'నాలుగైదు రాష్ట్రాల్లోనే హిందీని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మొత్తం ఇండియాను ఇది ఎలా ఏకం చేస్తుంది’’ అని ఆయన ప్రశ్నించారు.

    ‘‘హిందీ ప్రజలను ఏకం చేస్తుంది, స్థానిక భాషలను బలోపేతం చేస్తుంది’’ అనడం ద్వారా అమిత్ షా హిందీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని ఉదయనిధి అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ‘‘హిందీ నేర్చుకోవడం ద్వారా ఎదుగుతాం అన్న మాట హిందీని కీర్తిండానికి ఎంచుకున్న మరో మార్గం’’ అని ఎక్స్ (ట్విటర్)లో ఉదయనిధి వ్యాఖ్యానించారు.

    ‘‘తమిళనాడులో తమిళం మాట్లాడతారు. పొరుగున ఉన్న కేరళలో మలయాళం మాట్లాడతారు. ఈ రెండింటిని హిందీ ఎలా ఏకం చేస్తుంది’’ అని ఆయన ప్రశ్నించారు.

    'స్టాప్ హిందీ ఇంపోజిషన్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో, ఉదయనిధి తమిళంలో "అమిత్ షా హిందీయేతర భాషలను ప్రాంతీయ భాషలుగా పేర్కొనడం,వాటిని అవమానించడం మానేయాలి" అని ట్వీట్ చేశారు.

  4. ADR రిపోర్ట్: పార్లమెంటు సభ్యుల్లో తెలుగు ఎంపీలే సూపర్ రిచ్... నేర చరిత్రలోనూ మనవారే టాప్

  5. మత్స్య 6000 - సముద్రయాన్: చంద్రయాన్‌ లాంటి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ... సాగర గర్భంలో ఎందుకీ అన్వేషణ?

  6. ‘లిబియా వరదల మృతుల సంఖ్య 20 వేలు ఉండొచ్చు’

    లిబియా వరదలు

    ఫొటో సోర్స్, Getty Images

    లిబియాలోని డెర్నాలో చోటుచేసుకున్న విపత్తులో ఇప్పటికే 5300 మంది మృతి చెందారు.

    కానీ ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

    డెర్నా మేయర్ మాట్లాడుతూ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని, 18,000 నుంచి 20,000 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నామని అన్నారు.

    ఇప్పటికే ప్రపంచ దేశాలు లిబియాకు సాయం చేయడానికి ముందుకొచ్చాయి.

    ఈజిప్ట్, ట్యునీషియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ దేశాల నుంచి రెస్క్యూ టీంలు నగరానికి చేరుకున్నాయి.

  7. పవన్ కల్యాణ్: టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి.. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదు

  8. పవన్ కల్యాణ్: జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి.. ఇదే నా నిర్ణయం

    lokesh, pawan kalyan, balakrishna

    ఫొటో సోర్స్, janasena

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లు కలిశారు.

    అనంతరం వారు జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.

    రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.

    చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనకు సంఘీభావం ప్రకటించడానికే ఇక్కడికి వచ్చానని పవన్ అన్నారు.

    చంద్రబాబుకు తనకు గతంలో విధానపరమైన అభిప్రాయభేదాలున్నాయని, అప్పట్లో వేర్వేరుగా పోటీ చేశామని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసినందున మద్దతు తెలుపుతున్నానన్నారు.

    2014 ఎన్నికలలో నరేంద్ర మోదీకి తాను ఎందుకు మద్దతు తెలపాల్సి వచ్చిందో ఆయన చెప్పుకొచ్చారు. దక్షిణ భారత దేశం నుంచి మోదీకి బహిరంగంగా మద్దతు పలికింది తానేనని, అప్పుడు అంతా తనను వ్యతిరేకించారని.. కానీ, తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని.. చంద్రబాబు విషయంలోనూ అంతేనని, చంద్రబాబు చేసిన అభివృద్ధి, ఆయన సామర్థ్యాలపై తనకు ఎలాంటి అనుమానం లేదని.. కేవలం ప్రత్యేక హోదా విషయంలో, పాలసీల విషయంలో విభేదించానని చెప్పారు.

    lokesh, pawan kalyan, balakrishna

    ఫొటో సోర్స్, janasena party

    ఎంతో సంపద సృష్టించిన వ్యక్తిని రూ. 371 కోట్ల అవినీతి ఆరోపణలు మోపడం సరికాదన్నారు. అన్ని రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించిన జగన్, ఈడీ కేసులున్న జగన్ ఇలా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు పవన్.

    రాష్ట్రంలో అభివృద్ధి లేదని, మద్యపాన నిషేధం హామీ, సీపీఎస్ రద్దు వంటి హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్కటీ నిలబెట్టుకోని జగన్ అవినీతికి పాల్పడుతున్నారని.. ఆయన అవినీతి బురదలో కూరుకుపోయి అందరిపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు.

    తనను కూడా ఆంధ్ర సరిహద్దుల్లోకి రాగానే అడ్డుకున్నారని.. తనలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని.. అలాంటి గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబును ఇబ్బందులు పెట్టడం వారికో లెక్క కాదన్నారు.

    జగన్ చేస్తున్న దోపిడీ, బెదిరింపులు కారణంగానే తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న నిర్ణయానికి వచ్చానని అన్నారు.

    ‘ఈ రోజు చంద్రబాబుకు జరిగింది రేపు రాష్ట్రంలోని అందరికీ జరిగే ప్రమాదం ఉంది. రోడ్డుపై వచ్చి నిరసన తెలిపినంత మాత్రానే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు’ అన్నారు.

    ‘చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలుంటే చూపించండి.. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప ఇంకేమీ కాదు’ అన్నారు.

    చంద్రబాబును జైలులో పెట్టడాన్ని ఖండిస్తున్నానని.. ఖండించి ఇక్కడి నుంచి వెళ్లిపోవడం లేదని.. టీడీపీ, జనసేన, భాజపా కలిసి పోటీ చేయాలన్నదే నా కోరిక అన్నారు పవన్.

  9. కెంట్: భారత సైనికులను కాపాడే క్రమంలో మిలిటెంట్ల కాల్పులకు బలైన జాగిలం

  10. లిబియా: సముద్రం నుంచి బయటకు కొట్టుకొస్తున్న శవాలు

    లిబియా వరదలు

    ఫొటో సోర్స్, Getty Images

    లిబియాలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 5,300 దాటింది. ఇంకా వేల మంది జాడ తెలియలేదు.

    మధ్యధరా సముద్రంలో ఏర్పడిన డేనియల్ తుపాన్ తీవ్రతతోపాటు డ్యామ్ ధ్వంసం కావడంతో లిబియాలోని డెర్నా ప్రజలు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు.

    ఆదివారం వరద సునామీలా నగరంపై పడటంతో 5,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    ‘సముద్రం డజన్ల కొద్దీ శవాలను బయటపడేస్తోంది’ అని లిబియా మంత్రి మీడియాతో అన్నారు.

    భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటానికి రెస్క్యూ టీం లు ప్రయత్నిస్తున్నాయి. కానీ శవాలే బయటపడుతున్నాయి. మార్చురీలు మృతదేహాలతో నిండిపోయాయి.

    సామూహిక ఖననాలు, సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

    10 వేల మంది ఆచూకీ తెలియలేదని అధికారులు చెప్తున్నారు. 30 వేల మంది నిరాశ్రయులు అయ్యారని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ పేర్కొంది.

    డెర్నా సమీపంలోని ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నజీబ్ తర్హోనీ బీబీసీ రేడియోతో మాట్లాడుతూ తమకు ఇంకా సాయం కావాలని అన్నారు.

    lybya

    ఫొటో సోర్స్, Getty Images

    ‘ఇక్కడ పనిచేస్తున్న నా స్నేహితులలో చాలామంది కుటుంబాలను కోల్పోయారు’ అని అన్నారు.

    డెర్నాలోని వీధులన్ని బురదతో, తిరగబడిన వాహనాలు, శిథిలాలతో నిండిపోయాయి.

    నగరం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్థానిక అధికారి చికౌత్ అన్నారు.

    “ఇది సునామీలా అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు” అని అన్నారు. డెర్మాకు చెందిన ఫొటో జర్నలిస్ట్బీ బీసీ న్యూస్ అవర్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. డ్యామ్ పరిస్థితిపై నిపుణులు 2011లోనే హెచ్చరించారని, ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.

    ‘డ్యామ్ ధ్వంసం అవడం ఎయిర్ స్ట్రైక్ లా అనిపించింది’ అని అన్నారు.

    “వరద తగ్గింది. ఇప్పుడు మిగిలిందల్లా బురద, వరద తీసుకువెళ్లిన ప్రజల మృతదేహాలు మాత్రమే” అని అన్నారు.

    ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాళ్లు కూడా చనిపోయారని లిబియా ఫుట్ బాట్ ఫెడరేషన్ పేర్కొంది.

    క్రీడాకారులు షాహీన్ అల్ జమీల్, సాలెహ్ శశీ, అయూబ్ శశీ సోదరులు, మందెర్ సదఖాలు చనిపోయినట్లు తెలిపింది.

    lybya వరద సహాయం

    ఫొటో సోర్స్, Getty Images

    డెర్నాతోపోటు సౌస్సా, అల్ మర్జ్, మిస్రతా నగరాలు కూడా ఈ తుపాను ధాటికి దెబ్బతిన్నాయి.

    2011లో కల్నల్ గడాఫీ మరణం తర్వాతి నుంచి లిబియాలో రాజకీయంగా అల్లర్లు చెలరేగుతున్నాయి.

    తూర్పున ఉన్న ట్రిపోలిలో ఐక్యరాజ్య సమితి మద్దతుతో ప్రభుత్వం నడుస్తోంది.

    లిబియాతో శత్రుత్వం ఉన్నప్పటికీ ట్రిపోలీ ప్రభుత్వం ఈ విపత్తు సమయంలో వైద్య సహయం చేయడానికి ముందుకొచ్చింది.

  11. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు.

    చంద్రబాబు తనయుడు లోకేశ్, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ రోజు చంద్రబాబును కలవనున్నారు.

    పవన్ వస్తుండడంతో రాజమండ్రి జైలు వద్దకు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.

    లోకేశ్, బాలకృష్ణలు కూడా రానుండడంతో టీడీపీ కార్యకర్తలూ అక్కడ పెద్దసంఖ్యలో ఉన్నారు.

    దీంతో జైలు వద్ద భారీ భద్రత కల్పించారు.

    చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా రాజమండ్రిలోనే ఉన్నారు.

    పవన్ కల్యాణ్

    ఫొటో సోర్స్, janasena

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌ను నిరంతరం బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీలో చూడండి.