జీ20: భారత్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీతో భేటీ
"ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు భారత్, అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేస్తాయి" అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
లైవ్ కవరేజీ
చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?
ఆంధ్రప్రదేశ్: ఏసీబీ కోర్టుకు చంద్రబాబు, ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చిన సీఐడీ
మొరాకో భూకంపం: 2000 దాటిన మృతుల సంఖ్య...ఎటు చూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద శవాలు
పవన్ కల్యాణ్: జనసేన అధినేత ఫ్లైట్‌కు అనుమతి నిరాకరణ, ఎందుకంటే..
G 20: ప్రపంచ నాయకులకు ఆహ్వానం పలికిన ఈ నటరాజ విగ్రహం ప్రత్యేకత ఏమిటి?
‘‘దిల్లీ డిక్లరేషన్‌లో గట్టి భాషే ఉపయోగించారు’’, సమర్థించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి దిల్లీ డిక్లరేషన్‌లో గట్టి భాషను ఉపయోగించారని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అన్నారు. ఈ సదస్సులో రష్యాను విడిగా పెట్టినట్లు అయిందని ఆయన అన్నారు.
‘‘మీరు చూస్తున్న ఈ డిక్లరేషన్‌లో చాలా గట్టి భాష ఉపయోగించారు. ఆహార ధరలపై యుద్ధం చూపుతున్న ప్రభావాన్ని దీనిలో ప్రధానంగా ప్రస్తావించారు’’ అని సునక్ చెప్పారు.
యుక్రెయిన్ ఆహార ధాన్యాలు ప్రపంచ మార్కెట్లలోకి వచ్చేందుకు ‘బ్లాక్ సీ గ్రైన్ ఇనీషియేటివ్’ను పక్కాగా అమలు చేయాలని ఈ డిక్లరేషన్‌లో పిలుపునిచ్చారు. ఈ ఆహార ధాన్యాలు పేదలకు చేరాల్సిన అవసరముందని చెప్పారు.
‘‘ప్రాదేశిక సమగ్రతపై ఐరాస నిబంధనలను అనుసరించాలని కూడా ఆ డిక్లరేషన్‌లో సూచించారు. ఇది చాలా మంచి, గట్టి డిక్లరేషన్’’ అని సునక్ అన్నారు.
దిల్లీ పరిస్థితి బాలీ కంటే భిన్నమైనది, బీబీసీ ప్రశ్నకు జైశంకర్ సమాధానం

ఫొటో సోర్స్, Getty Images
జాయింట్ డిక్లరేషన్‌లో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పేరాలు నేటి పరిస్థితికి అద్దంపట్టేలా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
నిరుడు బాలీ డిక్లరేషన్‌తో పోలిస్తే ప్రస్తుతం కాస్త మెతక వైఖరిని అనుసరించారా? అని బీబీసీకి చెందిన సమీరా హుస్సేన్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.
‘‘నేను మీకు ఒక విషయం చెబుతాను. బాలీ అంటే బాలీనే.. దిల్లీ అంటే దిల్లీనే’’ అని ఆయన అన్నారు.
‘‘బాలీ ఏడాది క్రితం జరిగింది. నేటి పరిస్థితి వేరు. బాలీ తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి’’ అని జైశంకర్ అన్నారు.
భౌగోళిక రాజకీయ పరిణామాలకు సంబంధించిన ఎనిమిది పేరాల్లో ఏడు యుక్రెయిన్ గురించే ఉన్నాయని ఆయన చెప్పారు.
‘‘మేం ప్రస్తావించిన సమస్యలు నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వీటిలో ఆహార ధాన్యాలు, ఎరువుల సరఫరా, మౌలిక సదుపాయాలపై దాడులు కూడా ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
‘దిల్లీ డిక్లరేషన్‌లో కాస్త మెతక భాష ఉపయోగించారు’, వికాస్ పాండే విశ్లేషణ

ఫొటో సోర్స్, ani
దిల్లీ డిక్లరేషన్‌ను జాగ్రత్తగా గమనిస్తే యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉపయోగించిన పదాలు కాస్త మెతకగా కనిపిస్తున్నాయి. బాలీ డిక్లరేషన్ తరహాలో రష్యా చర్యలను దీనిలో నేరుగా ఖండించలేదు.
బాలీ డిక్లరేషన్‌లో యుక్రెయిన్ మీద రష్యా దాడిని కాస్త గట్టిగానే ఖండించారు. అయితే, ఈ విషయంలో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
కానీ, దిల్లీ డిక్లరేషన్‌లో నేరుగా రష్యాను విమర్శించలేదు.‘‘ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ప్రజలు అనుభవించే తీవ్రమైన బాధ, ప్రతికూల ప్రభావాలపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని మాత్రమే పేర్కొన్నారు.
అయితే, ఇక్కడ బల ప్రయోగాలకు దిగకూడదని అనే వ్యాఖ్యలు పరోక్షంగా రష్యాను ఉద్దేశించి చేసినవేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వాతావరణ మార్పులపై విభేదాలు, నవీన్ సింగ్ ఖాడ్కా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశాల తరహాలో జీ20 శిఖరాగ్ర సదస్సుల్లో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు కనిపించవు.
కానీ, ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను పెంచడం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల కట్టడి లాంటి అంశాలపై జాయింట్ డిక్లరేషన్‌లో ప్రస్తుతం విభేదాలు కనిపించాయి.
జీ20 దేశాలు ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో 75 శాతానికి కారణం. అయితే, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలనే అభివృద్ధి చెందిన దేశాల వాదనకు రష్యా, చైనా, సౌదీ అరేబియా, భారత్ ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
విజయవాడ సమీపంలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు

శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడ సమీపంలోని కుంచనపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు.
చంద్రబాబును సిట్ కార్యాలయానికి తేవడంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి.
దీంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు.
జైశంకర్, నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, ani
జీ20 సదస్సుపై కేంద్ర మంత్రులు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు.
మొదటగా విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ‘‘ఈ రోజు సదస్సులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. జాయింట్ డిక్లరేషన్‌లో పటిష్టమైన, అన్నింటికీ సమ ప్రాధాన్యమిచ్చే , సమ్మిళిత వృద్ధికి పెద్దపీట వేశాం’’ అని ఆయన చెప్పారు.
ఆయన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడారు. ‘‘ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుక్కునే క్రమంలో అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్తాం. ఇక్కడ నిర్ణయాలు తీసుకునే క్రమంలో దక్షిణార్ధగోళంలోని దేశాల గళం కూడా వినిపించేలా చూసేందుకు భారత్ కట్టుబడి ఉంది’’ అని ఆమె అన్నారు.
‘‘గ్రూపులోని ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను భారత్ సూచించింది’’ అని ఆమె తెలిపారు.
అణ్వాయుధాలను అసలు ఉపయోగించకూడదు- జీ20 డిక్లరేషన్
యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావనలో అణ్వాయుధాల గురించి కూడా స్పందించారు.
‘‘ఐక్యరాజ్యసమితి నిబంధనలు అన్ని దేశాలు అనుసరించాలి. ఇతర దేశాల సార్వభౌమాధికారం, రాజకీయ స్వతంత్రత, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలి. ఇక్కడ ఎలాంటి బలప్రయోగాలకూ దిగకూడదు’’ అని పేర్కొన్నారు.
అయితే, ఇక్కడ ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. కాబట్టి ఎవరికి నచ్చినట్లు వారు భాష్యం చెప్పుకోవచ్చు.
అయితే, అణ్వాయుధాలను అసలు ఉపయోగించకూడదని తర్వాత పేరాలో పునరుద్ఘాటించారు. ఇవి పరోక్షంగా రష్యాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి? ఆ బాక్స్‌లో ఏమేం ఉండాలి?
జాయింట్ డిక్లరేషన్‌లో ఏముంది?
జాయింట్ డిక్లరేషన్‌ను విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. దీనిలో వివాదాస్పద అంశాలను మొదట చూద్దాం. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాల్లో ఎలా ఏకాభిప్రాయం కుదిరిందో మొదట తెలుసుకుందాం.
‘‘ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ప్రజలు అనుభవించే తీవ్రమైన బాధ, ప్రతికూల ప్రభావాలపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని మొదటి లైన్‌లో పేర్కొన్నారు.
అయితే, ఇక్కడ యుద్ధానికి బాధ్యత వహించాల్సింది రష్యానేనని ఎక్కడా పేర్కొనలేదు. కానీ, యుద్ధం వల్ల ప్రజలు పడే ఇబ్బందుల గురించి స్పందించారు. దీనిపై రష్యా, పశ్చిమ దేశాలు తమకు నచ్చినట్లుగా భాష్యం చెప్పుకోవచ్చు.
బ్రేకింగ్ న్యూస్, జాయింట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరిందని ప్రకటించిన నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images
జీ20 శిఖరాగ్ర సదస్సు జాయింట్ డిక్లరేషన్‌పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
అయితే, ఈ సంయుక్త ప్రకటనలో ఏమేం వివరాలు ఉన్నాయో ఆయన వెల్లడించలేదు.
యుక్రెయిన్ యుద్ధంపై గ్రూపులో విభేదాలు ఉండటంతో అసలు జాయింట్ డిక్లరేషన్ వస్తుందా? అనే సందేహాలను నిపుణులు వ్యక్తంచేయడంతో మోదీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబు అరెస్ట్: రెండేళ్ల కిందటి ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినా ఎందుకు అరెస్టు చేశారు? ఆ ఎఫ్ఐఆర్‌లో ఎవరెవరి పేర్లున్నాయి
జీ20 సదస్సు: కోణార్క్ చక్రం ఎదుట విదేశీ నేతలకు ఆహ్వానం.. దీని విశేషాలేంటో తెలుసా?

ఫొటో సోర్స్, G20
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండపం వద్ద జరుగుతున్న జీ20 సదస్సుకు విదేశాల నుంచి వచ్చిన అధినేతలకు, ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.
విదేశీ నేతలకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికిన వేదిక వెనుకాల అతిపెద్ద కోణార్క్ చక్రాన్ని ఏర్పాటు చేశారు.
కోణార్క్ చక్రం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించారు.
కోణార్క్ చక్రం ప్రత్యేకతలేంటో మనం చూద్దాం..
కళింగా (నేటి ఒడిశా)లోని కోణార్క్ సూర్య దేవాలయానికి చెందినది ఈ చక్రం. రాజు లాంగుల నరసింహాదేవ్ 1 పాలనలో 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
1238 నుంచి 1264 మధ్య కాలంలో నరసింహాదేవ్ 1 పాలన సాగింది. తన పాలన సమయంలో ఒడిశాలోని సముద్ర తీరంలో ఉన్న కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని కట్టారు.
హిందూ వాస్తుశిల్పానికి ఈ ఆలయం ఒక చిహ్నంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో మూడు భాగాలుంటాయి.
ప్రధాన ద్వారంతో, ప్రార్థనా స్థలంతో, నాట్య వేదికతో ఈ ఆలయం అనుసంధానమై ఉంటుంది.
ఆలయం, ప్రార్థనా స్థలం రథం ఆకారంలో ఉంటాయి. 12-12 మొత్తం 24 చక్రాలుంటాయి. వీటినే చక్రా అని పిలుస్తారు.
ఏడు గుర్రాల చేత లాగుతున్నట్లుగా ఉన్న సూర్యుని రథాన్ని ఇది సూచిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కోణార్క్ సూర్యదేవుని ఆలయం చోటు దక్కించుకుంది.
19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన నుంచి దీన్ని కాపాడేందుకు ఆలయంలోని ప్రధాన భాగంలో మొత్తం రాళ్లు, ఇనుప కడ్డీలతో నింపారు.
ఆలయం లోపలున్న ఈ రాళ్లు, ఇసుక, ఇనుమ కడ్డీలను తొలగించాలని భారత పురావస్తు శాఖ 2022లో నిర్ణయించింది.
ఈ చక్రం భారత పురాతన పరిజ్ఞానాన్ని, నాగరికతను, వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తోంది.
కోణార్క్ చక్రం పురోగతిని, నిరంతర మార్పును సూచిస్తోంది. కోణార్క్ చక్ర రొటేషన్‌ను కాలచక్రతో పోలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ కావాలనే ఓడించిందా, అసలేం జరిగింది?
జీ-20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్యం

ఫొటో సోర్స్, G20
జీ-20 సదస్సు తొలి సెషన్‌లో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ-20లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
జీ-20 శాశ్వత సభ్యదేశం హోదాలో కేటాయించిన కుర్చీలో ఆసీనులు కావాలని ఆఫ్రికన్ యూనియన్ అధినేతను మోదీ ఆహ్వానించారు.
ప్రధాని ఆహ్వానం మేరకు ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్ అజలి అసౌమని తన కుర్చీలో ఆసీనులయ్యారు.
ఆయనకు జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటోన్న దేశాధినేతలందరూ చప్పట్లతో స్వాగతం పలకగా.. ప్రధాని మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జీ20 గ్రూప్‌లో అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, బ్రిటన్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియేతో కలిపి 19 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఈ గ్రూప్‌లో 20వ మెంబర్.
ప్రస్తుతం ఆఫ్రికన్ యూనియన్ కూడా ఈ గ్రూప్ శాశ్వత సభ్యత్వం పొందింది. దీంతో 19 దేశాలు, రెండు యూనియన్లు దీనిలో సభ్యులుగా మారాయి.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
