You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి పీవీ సింధు ఇంటిముఖం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇంటిముఖం పట్టారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరలేకపోవడం ఆమె కెరీర్‌లో ఇదే తొలిసారి.

లైవ్ కవరేజీ

  1. చెస్ ప్రపంచ కప్‌ రన్నరప్‌గా ప్రజ్ఞానంద.. ఎవరీ కుర్రాడు?

  2. పాకిస్తాన్ కేబుల్ కార్ ప్రమాదం: 900 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయిన మొత్తం 8 మందినీ కాపాడారు

  3. చంద్రయాన్-3: అంతరిక్ష నౌక చుట్టూ ఉండే పసుపు పచ్చ ఫిల్మ్‌ను బంగారంతో చేస్తారా?

  4. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.

    రేపు కలుద్దాం.

  5. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి సింధు ఇంటిముఖం

    ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్- 2023 నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇంటిముఖం పట్టారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరలేకపోవడం ఆమె కెరీర్‌లో ఇదే తొలిసారి అని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

    డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారాతో మ్యాచ్‌లో 14-21, 14-21 తేడాతో ఆమె ఓడిపోయారు.

    గత మూడేళ్లలో ఒకుహారా, సింధు మధ్య జరిగిన మొదటి మ్యాచ్ ఇదే.

  6. ఫేక్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి గౌరవ డాక్టరేట్ల ప్రదానం.. అందుకున్న వారిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

  7. విక్రమ్ సారాభాయ్: భారత అంతరిక్ష పరిశోధనలకు పునాది వేసిన సైంటిస్ట్ కథ

  8. చంద్రయాన్-3: 'విక్రమ్' ల్యాండర్‌ను పరీక్షించిన ఈ మట్టి అక్కడ తప్ప ఇండియాలో ఎక్కడా దొరకదు

  9. చంద్రయాన్-ఇస్రో: ఇలాంటి ప్రయోగాల నుంచి ఆదాయం ఎంత సంపాదించవచ్చు?

  10. నాయకుడి ఆజ్ఞ కోసం 17ఏళ్లు అడవిలో ఎదురు చూసిన రహస్య దళం, చివరకు ఏం తెలిసిందంటే....

  11. ఎల్లుండే నా అరెస్ట్.. వెల్లడించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

    జార్జియా ఎన్నికల కేసులో తాను గురువారం అరెస్ట్ అవుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ ద్వారా డోనల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు.

    ఎన్నికల ప్రక్రియలో కలగజేసుకున్నారన్న అభియోగాలపై గురువారం తాను జార్జియా రాష్ట్రంలోని కోర్టు ముందు హాజరు కావాలని అనుకుంటున్నట్లు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

    ట్రంప్ తనపై నమోదైన 13 అభియోగాలను ఖండిస్తున్నారు.

    ‘‘మీరు నమ్ముతారా? నేను గురువారం జార్జియాలోని అట్లాంటాకు అరెస్ట్ అయ్యేందుకు వెళ్తున్నాను.’’ అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో రాశారు.

    తొలిసారి ఏప్రిల్‌లో అరెస్ట్ అయినప్పటి నుంచి ట్రంప్ నాలుగోసారి అరెస్ట్ అవుతున్నారు.

  12. నమస్తే

    బీబీసీ లైవ్ పేజ్‌కు స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజ్‌ను చూడండి. నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.