డోనల్డ్ ట్రంప్: రిపబ్లికన్ పార్టీ డిబేట్స్‌లో పాల్గొననని తేల్చి చెప్పిన అమెరికా మాజీ అధ్యక్షుడు
అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి కోసం జరిగే రిపబ్లికన్ పార్టీ చర్చల్లో పాల్గొననని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తనకు పెద్ద మొత్తంలో సపోర్ట్ ఉందని సర్వేలో తేలిందన్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
‘వాసెక్టమీ’తో సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? ఇది నిజమా? మగవారు ఎందుకు వెనకాడుతున్నారు?
మైనార్టీ తీరని స్నేహితుడి కుమార్తెను రేప్ చేశారనే ఆరోపణలపై దిల్లీ ఉన్నతాధికారి అరెస్టు.. అసలేమిటీ కేసు?
గజ్వేల్, కామారెడ్డిల నుంచి కేసీఆర్ పోటీ.. ఆ ఎనిమిది ‘సిట్టింగ్’ స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మార్చారు?
భారత దగ్గు మందు మరణాలు: ‘ఈ ఔషధాన్ని ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
డీఎస్‌పీ కాబోతున్న గిరిజన యువతి, ఏపీపీఎస్సీలో ఎలా విజయం సాధించారంటే...
పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
డోనల్డ్ ట్రంప్: రిపబ్లికన్ పార్టీ డిబేట్స్‌లో పాల్గొననని తేల్చి చెప్పిన అమెరికా మాజీ అధ్యక్షుడు

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి కోసం జరిగే రిపబ్లికన్ పార్టీ డిబేట్స్‌లో తాను పాల్గొననని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.
2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఇతర ప్రత్యర్థులతో పోలిస్తే తనకు పెద్ద మొత్తంలో సపోర్ట్ ఉందని సర్వేలో తేలిందన్నారు.
‘‘నేనెవరన్నది, నేనెంత విజయవంతంగా అధ్యక్షతను వ్యవహరించారన్నది ప్రజలకు తెలుసు’’ అని సోషల్ మీడియా పోస్ట్‌లో డోనల్డ్ ట్రంప్ తెలిపారు.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఆగస్ట్ 23న తొలి డిబేట్‌ను నిర్వహించనుంది.
రెండో డిబేట్ ఆ తర్వాత రోజే జరిగే అవకాశముంది.
రాబోయే రోజుల్లో మరో రెండు డిబేట్లు జరగనున్నాయి.
రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలకు ఓటింగ్ లోవా రాష్ట్రం నుంచి 2024 జనవరి 15న ప్రారంభం కానున్నాయి.
పలు నేరపూరిత అభియోగాలను ఎదుర్కొంటోన్న డోనల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ నామినేషన్ రేసులో ముందంజలో ఉన్నారని ఇప్పటికే పలు పోల్స్ చెబుతున్నాయి.
‘‘ సరికొత్త సీబీఎస్ పోల్ వచ్చేసింది, పెద్ద మొత్తంలో నెంబర్లతో నేను ముందంజలో ఉన్నట్లు ఈ పోల్‌లో వెల్లడైంది’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ట్రంప్ రాశారు.
ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ వంటి ఇతర ప్రత్యర్థులు తనకు చాలా వెనుకంజలో ఉన్నట్లు చెప్పారు.
‘‘నేనెవరో ప్రజలకు తెలుసు. నేనెంత బాగా అధ్యక్ష పదవిని చేపట్టానో కూడా వారికి తెలుసు. నేను పదవిలో ఉన్న సమయంలో సరిహద్దులు, సైన్యం చాలా బలంగా ఉన్నాయి. నా ప్రభుత్వంలో అతిపెద్ద పన్ను, రెగ్యులేషన్ కోతలు చేపట్టాను. ద్రవ్యోల్బణమన్నదే లేదు. చరిత్రలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ నా కాలంలోనే ఉంది.’’ అని తెలిపారు.
అందుకే తాను రిపబ్లికన్ పార్టీ నిర్వహించే డిబేట్లలో పాల్గొనని చెప్పారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.
నిన్నటి లైవ్ పేజీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
9 హత్యలు చేసిన వ్యక్తిని పోలీసులు పిచ్చివాడని వదిలేశారు... ఆ తరువాత మరో 30 మందిని కిరాతకంగా చంపేశాడు
