You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘పాకిస్తాన్‌ ప్రధానిగా అన్వరుల్ హక్‌ను మాకు చెప్పకుండా నియమించారు’ – ఇమ్రాన్ ఖాన్ పార్టీ

తాత్కాలిక ప్రధానమంత్రి అయినా ప్రజల రాజ్యాంగ, ప్రజాస్వామ హక్కులను మరింత దిగజార్చరని ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యాఖ్యానించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. రుషికొండ: ఇది తరచూ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?

  3. మిలా: ‘‘సవతి తండ్రి కంటే ముందు నుంచే ఒక అంకుల్ ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు’’

  4. మల్లికార్జున్ ఖర్గే: ‘‘మోదీ ప్రతీ మాట అబద్ధమే’’

    భారత్‌లో మరో కొత్త ఎయిమ్స్‌ను ప్రారంభిస్తామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు.

    ఎయిమ్స్‌లకు సంబంధించిన ఒక నివేదికలోని అంశాలను వెల్లడిస్తూ ప్రధాని లక్ష్యంగా ఖర్గే ఆరోపణలు చేశారు.

    దేశంలోని 19 ఎయిమ్స్‌ వైద్యశాలల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరత ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

    దీని గురించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, "దోపిడీ, మోసాలతో దేశాన్ని వంచించారు. మోదీ మాట్లాడే ప్రతి మాటలో అబద్ధాలు మాత్రమే ఉంటాయి. ఎన్నో ఎయిమ్స్‌లను నిర్మించామని చెబుతున్నారు. కానీ, వైద్యులు, సిబ్బంది కొరతతో అవన్నీ పోరాడుతున్నాయి’’ అని అన్నారు.

    దేశంలోని ఆరోగ్య వ్యవస్థను మోదీ ప్రభుత్వం వ్యాధిగ్రస్తంగా మార్చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మోసాన్ని ప్రజానీకం గుర్తించిందని, ఇప్పుడు 'మీ ప్రభుత్వానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని' అన్నారు.

  5. మణిపుర్: కుకీ, మెయితీల తర్వాత నాగాలు ఎందుకు వీధుల్లోకి వస్తున్నారు?

  6. ముతంజన్: ఒకప్పుడు భారతీయ రాజులు ఇష్టంగా తిన్న ఈ వంటకం గురించి మీకు తెలుసా?

  7. నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?

  8. తెలంగాణ: కేసీఆర్ అప్పుడు అసంభవం అని చెప్పిన పనులను ఇప్పుడు హడావిడిగా ప్రకటిస్తున్నారెందుకు?

  9. ‘పాకిస్తాన్‌ తాత్కాలిక ప్రధానిని మమ్మల్ని సంప్రదించకుండానే నియమించారు’ – ఇమ్రాన్ ఖాన్ పార్టీ

    పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన సెనెటర్ అన్వరుల్ హక్ కాకడ్‌ను నామినేట్ చేసే సమయంలో షాబాజ్ షరీఫ్ తమ పార్టీని సంప్రదించలేదని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) ఆరోపించింది.

    తాత్కాలిక ప్రధానమంత్రి అయినా ప్రజల రాజ్యాంగ, ప్రజాస్వామ హక్కులను మరింత దిగజార్చరని ఆశిస్తున్నట్లు పార్టీ చెప్పింది.

    పార్లమెంట్ వెలుపల, లోపల దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ పీటీఐ అని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధికార ప్రతినిధి అన్నారు.

    కీలుబొమ్మలా మారిన ప్రధానమంత్రిని, నేషనల్ అసెంబ్లీలోని విపక్షాల నకిలీ నేతను సంప్రదించి సెనెటర్ అన్వరుల్ హక్ కాకడ్‌ను ఈ పదవికి నామినేట్ చేశారని అన్నారు.

    ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ ఎన్నికపై ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ ఆమోదం తెలపడంతో తాత్కాలిక ప్రధాని పదవికి ఆయన పేరు ఖరారైంది.

    తాత్కాలిక ప్రధానిగా అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో కాకడ్ ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

  10. నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచిన భారత్

    నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.

    శనివారం సాధించిన ఈ గెలుపుతో, భారత క్రికెట్ జట్టు ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

    నేడు(ఆదివారం) ఐదవ, నిర్ణయాత్మక మ్యాచ్‌ను ఆడనున్నారు. ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో భారత జట్టు బరిలోకి దిగుతుంది.

    శనివారం జరిగిన మ్యాచ్ వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మాన్ పావెల్ టాస్ గెలుచుకుని, తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు.

    20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు 178 పరుగులు చేసింది.

    ఆ తర్వాత ఆడిన భారత జట్టు, కేవలం ఒకే ఒక్క వికెట్‌ను కోల్పోయి 17 ఓవర్లలోనే 179 పరుగులు చేసి అలవోకగా విజయాన్ని సాధించింది.

    యశస్వీ జైశ్వాస్ 51 బాల్స్‌కి 84 పరుగులు చేశాడు. చివరి వరకు యశస్వీ మైదానం నుంచి వెనుతిరగలేదు.

    ఈ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ 11 ఫోర్లను, 3 సిక్స్‌లను కొట్టాడు.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌పైక్లిక్ చేయండి.