You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఇటలీ తీరంలో పడవ మునక, 41 మంది వలసదారుల మృతి

ఇటలీ ద్వీపం లంపెడూసా తీరంలో మధ్యదరా సముద్రంలో పడవ ప్రమాదంతో 41 మంది వలసదారులు చనిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు బతికి బయటపడ్డారు.

లైవ్ కవరేజీ

  1. మదర్స్ డే: తల్లిపాలు బిడ్డలకు ఎప్పుడు, ఎలా మాన్పించాలి?

  2. అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? ఓటింగ్ ఎలా జరుగుతుంది?

  3. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  4. ఆంధ్రప్రదేశ్: సమ్మె విరమించుకున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయం

  5. లోక్‌సభలో మహిళా ఎంపీకి రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? స్మృతి ఇరానీ ఏమన్నారు?

  6. ఇటలీ తీరంలో పడవ మునక, 41 మంది వలసదారుల మృతి

    ఇటలీ ద్వీపం లంపెడూసా తీరంలో మధ్యదరా సముద్రంలో పడవ ప్రమాదంతో 41 మంది వలసదారులు చనిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు బతికి బయటపడ్డారు. వారే స్థానిక మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.

    ట్యునీషియాలోని ఎస్‌ఫాక్స్ నుంచి ముగ్గురు పిల్లలు సహా 45 మందితో వారం క్రితం తమ పడవ ఇటలీకిబయల్దేరిందని వారు చెప్పారు. బయల్దేరిన కొన్ని గంటలకే భారీ అల తాకిడికి పడవ మునిగిపోయిందని తెలిపారు. అప్పుడు వారిలో 15 మందే లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎస్‌ఫాక్స్, లంపెడూసా మధ్య దూరం 130 కిలోమీటర్లు.

    ప్రాణాలతో బయటపడ్డ నలుగురు వలసదారులు ఐవరీ కోస్ట్, గినీ(Guinea)లకు చెందినవారు. వారు బుధవారం లంపెడూసా చేరుకున్నారు. తమను ఒక వాణిజ్య నౌక కాపాడిందని, తర్వాత తమను ఇటలీ కోస్ట్ గార్డ్ నౌకకు చేర్చిందని వారు వివరించారు.

    ఉత్తర ఆఫ్రికా నుంచి ఐరోపాకు సముద్ర మార్గంలో చేరుకొనే ప్రయత్నంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,800 మందికి పైగా చనిపోయారు.

  7. కేరళ ఇక ‘కేరళం’ - అసెంబ్లీలో తీర్మానం

    కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

    అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

    మలయాళం భాషలో రాష్ట్రం పేరు ‘కేరళం’ అని, ఇతర భాషల్లో కేరళ అని పిలుస్తారని ఆయన చెప్పారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    రాజ్యాంగ అధికరణ 3 ప్రకారం తమ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరుతోందని ముఖ్యమంత్రి చెప్పారు.

    రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లో తమ రాష్ట్రం పేరును ‘కేరళం’గా వ్యవహరించాలని విజయన్ కోరారు.

  8. చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటపడింది

  9. రాహుల్‌గాంధీ: ‘మణిపుర్‌లో భరతమాతను చంపేశారు’

    ‘‘మణిపుర్‌లోని ప్రజలను చంపేస్తూ భరతమాతను హత్య చేశారు. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహులు. అందుకే ప్రధాని మోదీ మణిపుర్‌కి వెళ్లడం లేదంటూ’’ రాహుల్ గాంధీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

    భరతమాత రక్షకులు కాదని, భరతమాత హంతకులని రాహుల్ గాంధీ అన్నారు.

    లోక్‌సభలో వరుసగా రెండో రోజూ అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు.

    రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, తన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు.

    ‘‘గత కొన్ని రోజుల క్రితం నేను మణిపుర్ వెళ్లాను, కానీ మన ప్రధానమంత్రి ఇప్పటి వరకు అక్కడికి వెళ్లలేదు. ఆయన దృష్టిలో మణిపుర్ భారత్‌ కాదు. మీరు మణిపుర్‌ను రెండు భాగాలుగా విడదీశారు. వీరు మణిపుర్‌లో భారత్‌ను హత్య చేశారు. భరతమాతను చంపేశారు. అందుకే ప్రధాని మోదీ మణిపుర్‌కి వెళ్లడం లేదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

  10. చంద్రయాన్ 3: ‘సెన్సార్లు, ఇంజిన్లు ఫెయిలైనా చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అవుతుంది’

    చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23వ తేదీన చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ కానుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు.

    చంద్రయాన్ 3 సెన్సార్లు లేదా ఇంజిన్లు ఫెయిల్ అయినా, ఆగస్ట్ 23న విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వగలుగుతుందని తెలిపారు.

    విక్రమ్‌ను ఆ విధంగా రూపొందించామని, ఏ రకమైన ఫెయిల్యూర్‌ అయినా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉందని సోమనాథ్ అన్నారు.

    ఒకవేళ విఫలమైనా, అన్ని సెన్సార్లు పనిచేయడం ఆగిపోయినా, ఏది పనిచేయకున్నా, విక్రమ్ ల్యాండ్ అవ్వగలుగుతుందన్నారు.

    కానీ, ఇది ల్యాండ్ అవడం కోసం మాత్రం ప్రొపల్షన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాల్సి ఉందని తెలిపారు.

    చంద్రయాన్ 3ను జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఆగస్ట్ 5న చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ 3 ప్రవేశించింది.

  11. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివాసీ సంబరాల ఛాయాచిత్రాలు

  12. ‘భారత్ జోడో యాత్ర’ను మళ్లీ ప్రారంభించనున్న రాహుల్ గాంధీ

    కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ త్వరలోనే మళ్లీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించనున్నారు.

    మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నానా పటోలే పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.

    గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుందని పటోలే చెప్పారు.

    రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగే సమయంలో, మహారాష్ట్రలో స్థానిక నేతలు పాల్గొంటారని పటోలే తెలిపారు.

    రాహుల్ గాంధీ ఇంతకుముందు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కి.మీల వరకు పాదయాత్ర చేశారు.

    ఈ పాదయాత్ర సెప్టెంబర్ 7న మొదలై, జనవరిలో శ్రీనగర్‌లో ముగిసింది.

    ఈ యాత్రలో, రాహుల్ గాంధీ 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా పయనించారు.

    మోదీ ఇంటిపేరు పరువు నష్టం కేసులో ఇటీవలే రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.

    ఈ ఊరట తర్వాత, రాహుల్ గాంధీ రద్దయిన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరిగి పొందారు.

    12 గంటలకు పార్లమెంట్‌లో మాట్లాడనున్న రాహుల్ గాంధీ

    ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడనున్నారు.

    లోక్‌సభలో విపక్షాల నేత అధిర్ రంజన్ చౌదరి ఈ విషయాన్ని తెలిపారు.

    కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడతారని చెప్పారు.

  13. రాజ సంస్థానాలు: భారత్‌లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.