ఇరాక్‌లో అమ్ముతున్న భారత కంపెనీ దగ్గు మందు ప్రమాదకరమన్న డబ్ల్యూహెచ్‌వో

ఈ మందు ఏమాత్రం సురక్షితం కాదని, దీన్ని వాడడం ప్రాణాంతకం కూడా కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ఇరాక్‌లో అమ్ముతున్న భారత కంపెనీ దగ్గు మందు ప్రమాదకరమన్న డబ్ల్యూహెచ్‌వో

    cough syrup

    ఫొటో సోర్స్, Getty Images

    ఇరాక్‌లో విక్రయిస్తున్న భారతీయ కంపెనీ ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ తయారుచేసిన దగ్గు మందుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది.

    ఈ మందులో కలుషిత రసాయనాలను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

    ఇరాక్‌లోని డాబిలైఫ్ ఫార్మా కోసం ఈ దగ్గు మందును ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ తయారు చేసింది. ‘కోల్డ్ అవుట్’ పేరుతో ఈ దగ్గు మందును అక్కడ అమ్ముతున్నారు.

    ఈ మందు ఏమాత్రం సురక్షితం కాదని, ముఖ్యంగా పిల్లలకు ఇది ప్రమాదకరమని, దీన్ని వాడడం ప్రాణాంతకం కూడా కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

    ఇందులో పరిమితికి మించి డైథలీన్, ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్లు డబ్ల్యూహెవో తెలిపింది.

  3. ‘వీల్‌చెయిర్‌లో మన్మోహన్ సింగ్’ ఫొటో.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం

    Manmohan

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీ సర్వీసెస్ బిల్లుపై సోమవారం పార్లమెటులో చర్చ జరిగినప్పుడు రాజ్యసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాగా ఆయన రాకపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

    చాలాకాలంగా అనారోగ్యంతో ఉన్న మన్మోహన్ సింగ్ వీల్ చెయిర్‌లో సభకు వచ్చారు.

    ఆ ఫొటోను, ప్రధాని మోదీకి చెందిన మరో ఫొటోను కలిపి షేర్ చేసిన కాంగ్రెస్ మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది.

    వీల్ చెయిర్‌లో ఉన్న మన్మోహన్ ఫొటో.. పక్కనే తెర చాటు నుంచి చూస్తున్న మోదీ ఫొటో ఒకటి కలిపి పెట్టి ‘ఇంటెగ్రిటీ వర్సెస్ ఎస్కేప్’ అన్న క్యాప్షన్‌తో కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    90 ఏళ్ల వయసులోనూ మన్మోహన్ తన బాధ్యతలు నిర్వహిస్తుండగా మోదీ మాత్రం పార్లమెంటుకు రాకుండా తప్పించుకుంటున్నారని.. రెండు రాష్ట్రాలు మండిపోతున్నా మోదీ పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్దింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అయితే, దీనికి బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. అనారోగ్యంతో ఉన్న మాజీ ప్రధానిని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కూటమిని కాపాడుకోవడం కోసం ఇలా వాడుకుంటోందంటూ ట్విట్ చేసింది బీజేపీ.

    రెండు పార్టీల నేతలు కూడా దీనిపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  4. చీజ్ దిమ్మెల కిందపడి మృతి

    Cheese wheels

    ఫొటో సోర్స్, Getty Images

    వేల సంఖ్యలో చీజ్ దిమ్మెలు మీదపడడంతో ఇటలీకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

    ఇటలీలోని లాంబార్డీ రిజయన్‌కు చెందిన గియాకామో చియాప్రిని(74) తన గోడౌన్‌లో ఉన్నప్పుడు షెల్ఫ్ విరిగి వేల సంఖ్యలో చీజ్ దిమ్మెలు(చీజ్ వీల్స్) కిందపడ్డాయి. చియాప్రిని వాటి కింద చిక్కుకోవడంతో ఊపిరాడక మరణించారు.

    ఒక్కొక్కటి సుమారు 40 కేజీల బరువుండే చీజ్ దిమ్మెలు ఒక్కసారిగా మీద పడడంతో చియాప్రిని వాటి నుంచి బయటపడలేకపోయారు.

    చీజ్ కింద ఇరుక్కుని మరణించిన చియాప్రినిని బయటకు తీయడానికి 12 గంటలు పట్టిందని ఫైర్ ఫైటింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆంటోనియన్ డూసి ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.

    గోడౌన్‌లొ చాలా ఎత్తు వరకు వీటిని అమర్చడంతో కొన్ని చీజ్ దిమ్మెలలో కొన్ని 10 మీటర్ల ఎత్తు నుంచి కూడా కిందపడ్డాయి.

    ఇవన్నీ ఒక్కసారిగా కిందపడడంతో పెద్ద ఉరుము ఉరిమినంత శబ్దం వినిపించిందని చుట్టుపక్కలవారు చెప్పారు.

    చీజ్ కింద పడడంతో సుమారు రూ. 74 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

  5. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్పై క్లిక్ చేయండి.