You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

గద్దర్ అంత్యక్రియల్లో జర్నలిస్ట్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి

మీడియాలో గద్దర్‌కు అత్యంత సన్నిహితుల్లో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్, జర్నలిస్ట్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ఒకరు. గద్దర్‌కు ఇంటివద్ద నివాళులు అర్పించిన అలీఖాన్, తర్వాత నీరసంతో కింద పడిపోయారు.

లైవ్ కవరేజీ

  1. ఆదిత్య L1: సూర్యుడిపై పరిశోధనకు సెప్టెంబరు 2న ఇస్రో ప్రయోగం.. దీని లక్ష్యం ఏమిటి?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. మణిపుర్: ప్రతి 75 మంది పౌరులకు ఒక జవాన్.. అయినా హింస ఎందుకు ఆగట్లేదు?

  4. గద్దర్ అంత్యక్రియల్లో జర్నలిస్ట్ మృతి

    హైదరాబాద్‌లో గద్దర్ అంత్యక్రియల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ చనిపోయారు.

    సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్, జర్నలిస్ట్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ప్రాణాలు కోల్పోయారు.

    మీడియాలో గద్దర్‌కు అత్యంత సన్నిహితుల్లో జహీరుద్దీన్ ఒకరు.

    గద్దర్‌కు ఇంటివద్ద నివాళులు అర్పించిన అలీఖాన్, తర్వాత నీరసంతో కింద పడిపోయారు.

    ఊపిరి ఆడకపోవడంతో పాటు, గుండెపోటుకు గురయ్యారు.

    వెంటనే స్థానికులు దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

  5. గద్దర్: ఉద్యమాల నుంచి రాజకీయాల వరకు.. అంతులేని అభిమానం నుంచి విమర్శల దాకా..

  6. సుప్రీంకోర్టు: ‘‘మణిపుర్ హింసపై ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కమిటీ’’

    మణిపుర్ హింస అంశంపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

    మణిపుర్‌ హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

    ‘‘ఈ కమిటీలోని ముగ్గురు న్యాయమూర్తులు ఈ అంశంపై దర్యాప్తు, పరిహారం, పునరావాసం తదితర అంశాలను చూస్తారు. సహాయ శిబిరాలను కూడా పరిశీలిస్తారు’’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

    మణిపుర్‌లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికే ఇలా చేస్తున్నామని సీజేఐ చంద్రచూడ్ అన్నట్లు బీబీసీ ప్రతినిధి సుచిత్రా మొహంతి చెప్పారు.

    దీనికి సంబంధించిన వివరణాత్మక ఉత్తర్వులు సాయంత్రంలోగా వస్తాయని చంద్రచూడ్ తెలిపారు.

    విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మాట్లాడుతూ, మణిపుర్ ప్రభుత్వం చాలా పరిణతితో వ్యవహరిస్తోందన్నారు.

    మహిళలపై నేరాలకు సంబంధించిన మొత్తం 12 కేసులను సీబీఐ విచారిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

  7. జ్వరం లేకుండానే డెంగీ రావచ్చు.. ఆ లక్షణాలు ఏమిటి?

  8. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఎవరు అర్హులు? ఎవరు కాదు? నిర్ణయించేది ఎవరు?

  9. యూసీసీ: గిరిజనులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారు ప్రత్యేక గుర్తింపును కోల్పోతారా?

  10. బ్రేకింగ్ న్యూస్, రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    'మోదీ ఇంటిపేరు' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో లోక్‌సభ ఆయన సభ్యత్వం రద్దు చేస్తూ మార్చి 24న నోటిఫికేషన్ ఇచ్చింది.

    అయితే, సూరత్ కోర్టు తీర్పును రాహుల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ఆగస్టు 4న ఉత్తర్వులు జారీచేసింది.

    ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ పునరుద్దరించింది. 2019లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

  11. ధందో ఇన్వెస్ట్‌మెంట్: బొమ్మాబొరుసు సూత్రంతో మదుపు లాభదాయకమా... వారెన్ బఫెట్ ఏకలవ్య శిష్యుడు ఏం చెబుతున్నారు?

  12. చంద్రయాన్-3 పంపిన చంద్రుని మొదటి వీడియో ఇదే..

    చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ దశను దాటిన తర్వాత, చంద్రయాన్ చంద్రుని దృశ్యాలను మొదటిసారి రికార్డు చేసి పంపింది.

    వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినప్పుడు, చంద్రుడు ఇలా కనిపించాడని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన చంద్రయాన్-3 ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియోను పోస్టు చేసింది.

    జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ఇస్రో ప్రయోగించింది. ఈ మిషన్‌కు ఆగస్టు 23 అత్యంత ముఖ్యమైన తేదీ. ఆ రోజు చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం మీద దిగుతుంది.

    చంద్రయాన్-3

    ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు చేపట్టింది కేవలం రోవర్లు, ల్యాండర్లను చంద్రుడి మీదకు పంపించడానికి మాత్రమే కాదు. ఎప్పటికైనా మానవుల్ని కూడా చంద్రుడి మీదకు పంపేందుకు ప్రయత్నిస్తోంది.

    పూర్తి కథనం చదవండి:

  13. యుక్రెయిన్ మహిళా సైనికులు: 'ఒక మగవాడు తుపాకీ కాల్చాలా వద్దా అని సంకోచిస్తాడు... కానీ, మహిళ ఎప్పుడూ వెనుకాడదు'

  14. క్రికెట్: రెండో టీ20లోనూ భారత్ ఓటమి, 2-0 ఆధిక్యంలో వెస్టిండీస్

    ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టీమిండియాపై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

    20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

    భారత బ్యాట్స్‌మెన్లలో తిలక్ వర్మ అత్యధికంగా 51 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 27, హార్దిక్ పాండ్యా 24, అక్షర్ 14 పరుగులు చేశారు.

    అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేధించింది.

    విండీస్ జట్టులో నికోలస్ పూరన్ అత్యధికంగా 67 పరుగులు చేశారు. భారత జట్టులో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, యజువేంద్ర చాహల్ 2 వికెట్లు తీశారు.

    ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

  15. గద్దర్ అంతిమయాత్ర ఈరోజు 11 గంటలకు ఎల్‌బీ స్టేడియం నుంచి ప్రారంభం

    ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం నుంచి ఈ యాత్ర మొదలవనుంది.

    గద్దర్ భౌతిక కాయాన్ని కళాకారులతో భారీ ర్యాలీగా తీసుకెళ్లనున్నారు. ఎల్‌బీ స్టేడియం నుంచి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహ మార్గం మీదుగా గన్‌పార్క్ వైపు అంతిమయాత్ర సాగనుంది.

    గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు యాత్ర కొనసాగుతుంది. అక్కడ కళాకారులు పాటలతో నివాళులు అర్పిస్తారు.

    అనంతరం భూదేవినగర్‌లోని గద్దర్ నివాసం వద్ద మహాబోధి విద్యాలయం ఆవరణలో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి.

  16. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.