మణిపుర్ ఘటనపై ప్రధాని పార్లమెంట్‌కు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నేత శశి థరూర్

‘పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ వెలుపల ప్రకటన చేయడం మరింత మంచిదని ప్రధాని భావించారు. ఇది ఆమోదించదగ్గది కాదు. ప్రధానమంత్రి పార్లమెంట్‌కి సమాధానం చెప్పాలి.’

లైవ్ కవరేజీ

  1. మగ శరణార్థుల కోసం తీరంలో తేలియాడే నివాసం.. లోపల ఏముంది?

  2. ప్రియుడు నస్రుల్లాతో నిశ్చితార్థం కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. పెళ్లి కోసం ఇస్లాంలోకి మారబోనన్న భారత మహిళ.. అక్కడ ఏం జరిగింది?

  3. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  4. దిల్లీలో ఆధునీకరించిన ఐటీపీఓ కాంప్లెక్స్, ఎల్లుండే ప్రారంభం

    ఐటీపీఓ కాంప్లెక్స్

    ఫొటో సోర్స్, Twitter/PIB India

    ఆధునీకరించిన ఐటీపీఓ కాంప్లెక్స్(ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)ను జూలై 26న ప్రారంభించనున్నారు. ఈ కాంప్లెక్స్ జీ20 నేతల సమావేశానికి ఆతిథ్యమివ్వనుంది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.

    దీని క్యాంపస్ ఏరియా సుమారు 123 ఎకరాల్లో ఉందని పీఐబీ ఇండియా ట్విటర్‌లో తెలిపింది.

    ఐటీపీఓ కాంప్లెక్స్‌ను ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌గా కూడా పిలుస్తారు. దేశంలోనే అతిపెద్ద ఎంఐసీఈ(మీటింగ్స్, ఇన్సెటివ్స్, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లకు) డెస్టినేషన్‌గా పేరుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. మణిపుర్ ఘటనపై ప్రధాని పార్లమెంట్‌కు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నేత శశి థరూర్

    శశి థరూర్

    ఫొటో సోర్స్, ANI

    మణిపుర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌కి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు.

    మణిపుర్ ఘటనపై ఆయన సభలో ప్రకటన చేయాలన్నారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఈ ఘటనపై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

    ప్రధాని మోదీ పార్లమెంట్‌లో దీనిపై ఒక ప్రకటన చేయాలని శశి థరూర్ కూడా అన్నారు.

    ‘‘పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ వెలుపల ప్రకటన చేయడం మరింత మంచిదని ప్రధాని భావించారు. ఇది ఆమోదించదగ్గది కాదు. ప్రధానమంత్రి పార్లమెంట్‌కి సమాధానం చెప్పాలి. ఇది పార్లమెంట్ ప్రజాస్వామ్య సంప్రదాయం’’ అని శశి థరూర్ చెప్పారు.

    ‘‘ఇవాళ దేశం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సంక్షోభం మణిపుర్ హింస. మన రాష్ట్రాల్లో ఒకటి అట్టుడుకుతోంది. పక్కనున్న మిజోరాం రాష్ట్రం కూడా దీని తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది’’ అని తెలిపారు.

    ఇంత పెద్ద సంఘటనపై ప్రధానమంత్రి కాకుండా మరెవరూ ప్రకటన చేసినా, చర్చను ప్రారంభించలేమన్నారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    మణిపుర్ ఘటనపై ప్రధాని ఏం అన్నారు?

    గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

    మణిపుర్ ఘటనపై ప్రధానమంత్రి పార్లమెంట్ వెలుపల ఒక ప్రకటన చేశారు.

    మణిపుర్‌లో మహిళల పట్ల జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ తన హృదయం బాధతో నిండిపోయిందని అన్నారు.

    ఈ సంఘటన సిగ్గుచేటన్నారు. ఇలాంటి చర్యలతో దేశాన్ని అవమానిస్తున్నారని చెప్పారు.

    ఈ ఘటనపై 140 కోట్ల మంది దేశ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. అక్కాచెల్లెళ్లను, తల్లులను రక్షించే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులను అభ్యర్థించారు.

    మణిపుర్‌తో పాటు రాజస్తాన్, చత్తీష్‌గడ్ ప్రాంతాలను ప్రస్తావించిన మోదీ, ‘‘సంఘటన ఏ రాష్ట్రంలో జరిగిందని కాదు, అక్కడ ఏ ప్రభుత్వం ఉందని కాదు, మహిళలను గౌరవించే విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి’’ అని చెప్పారు.

  6. హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్... పుష్ప సినిమాను మించిన ఐడియాలు చూసి ఆశ్చర్యపోతున్న పోలీసులు

  7. కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?

  8. అమిటి హనుమంతు, ASP: 'బడిలో చేరాలని వెళ్తే బిచ్చగాడని తరిమేశారు...'

  9. ఆల్కలీన్ డైట్ అంటే ఏంటి?

  10. తెలంగాణలో రెవెన్యూ సంస్కరణల చరిత్ర ఏమిటి? ఎప్పుడు ఎలా మారుతూ వచ్చాయి?

  11. తెలంగాణలో మైనార్టీల‌కు ఉచితంగా లక్ష రూపాయలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  12. జ్ఞాన్‌వాపి మసీదు సర్వేపై జులై 26 వరకు స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

    వారణాసి

    ఫొటో సోర్స్, Utpal Pathak

    జ్ఞాన్‌వాపి మసీదు సర్వేపై జులై 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    ‘‘వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బుధవారం (జులై 26) సాయంత్రం 5 గంటల వరకు అమల్లోకి రావు. ఈ లోగా వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయవచ్చు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

  13. భారత్ రెండో ఇన్నింగ్స్ 181/2 డిక్లేర్డ్, విండీస్ విజయ లక్ష్యం 365 పరుగులు

    టీమిండియా

    ఫొటో సోర్స్, Getty Images

    వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 181/2 వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్‌కు 365 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

    నాలుగో రోజు, ఆదివారం 229/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 255 పరుగులకు మిగతా 5 వికెట్లను కోల్పోయి ఆలౌటైంది.

    దీంతో భారత్‌కు 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.

    అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన భారత్‌కు యశస్వి జైస్వాల్ (38), కెప్టెన్ రోహిత్ శర్మ (57) శుభారంభాన్ని ఇచ్చారు.

    శుభ్‌మన్ గిల్ (29 నాటౌట్), ఇషాన్ కిషన్ (52 నాటౌట్) మూడో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు.

    టెస్టుల్లో ఇషాన్ తొలి అర్ధసెంచరీ చేయగానే రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

    రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.

    నేడు ఆటకు చివరి రోజు కాగా విండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు చేయాల్సి ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. మణిపుర్ హింస‌: మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  15. వారణాసి: జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వే

    జ్ఞాన్‌వాపి మసీదు

    ఫొటో సోర్స్, Samiratmaj Mishra

    వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే కోసం భారత పురాతత్వ సర్వేక్షణ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఏఎస్‌ఐ) బృందం సోమవారం ఉదయం అక్కడికి చేరుకుంది.

    ఈ బృందంలో మొత్తం 30 మంది ఉన్నారు. సర్వే దృష్ట్యా, వారణాసిలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. మసీదు వెలుపల భద్రతా దళాలను మోహరించారు.

    ఇరు వర్గాల లాయర్లు కూడా సర్వేలో పాల్గొంటున్నారు.

    కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును శాస్త్రీయంగా సర్వే చేయాలని గత శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశించింది.

    కాశీ విశ్వనాథ ఆలయం

    ఫొటో సోర్స్, Utpal Pathak

    అయితే, వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు ఒక పిటిషన్ దాఖలు చేసింది.

    దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

    జ్ఞాన్‌వాపి మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ తరఫున సీనియర్ లాయర్ హుజెఫా అహ్మదీ వాదనలు వినిపిస్తూ- వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తక్షణమే స్టే విధించాలని కోరారు.

    ఏఎస్‌ఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ- జ్ఞాన్‌వాపిలో కేవలం ఫోటోలు, వీడియోల ఆధారంగానే సర్వే చేస్తున్నారని, ఇప్పుడు ఎలాంటి తవ్వకాలు చేపట్టట్లేదని చెప్పారు.

    వారణాసి కోర్టు ఆదేశాల విషయంలో అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని మసీదు కమిటీకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆలయాన్ని కూల్చివేసి జ్ఞాన్‌వాపి మసీదును నిర్మించారా, లేదా అనే అంశాన్ని ఏఎస్‌ఐ సర్వే ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

    హిందూ దేవాలయం మీద జ్ఞాన్‌వాపి మసీదును నిర్మించారని హిందువుల పక్షం వాదిస్తోంది.

    మసీదులో ఉన్న వజూఖానాను సర్వేలో చేర్చలేదు. ఇక్కడ శివలింగం ఉందని హిందువుల పక్షం వాదిస్తుండగా, అది ఫౌంటెన్ అని ముస్లింల పక్షం చెబుతోంది.

    ఈ అంశంపై ఆగస్టు 4 లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ రిపోర్టులో సర్వే సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు కూడా చేర్చాల్సి ఉంటుంది.