మణిపుర్ వైరల్ వీడియో కేసు: మరో నిందితుడి అరెస్ట్.. ఆరుగురిలో ఒకరు బాలుడు

అయిదుగురు ప్రధాన నిందితులు కాగా ఒకరు బాల నేరస్థుడని మణిపుర్ పోలీసులు తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. తెలంగాణలో వైకల్యంతో బాధపడుతున్నవారికి ఇచ్చే పింఛను మొత్తాల పెంపు

    కేసీఆర్

    ఫొటో సోర్స్, FB/KCR

    తెలంగాణలో వైకల్యంతో బాధపడుతున్నవారికి ఇచ్చే ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ. 4,016కి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    పెంచిన ఈ పింఛన్ మొత్తం జులై నుంచి అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

    ఇప్పటివరకు రూ. 3,016 చొప్పున నెలకు పింఛను వస్తుండగా ఇక నుంచి మరో వెయ్యి రూపాయలు అదనంగా అందనున్నాయి.

  3. పెళ్లయినా సెక్స్‌లో పాల్గొనడం లేదా?

  4. ఇకపై దరఖాస్తులలో కులం, మతం నింపాల్సిన అవసరం లేదా? తెలంగాణ హైకోర్ట్ ఏం చెప్పింది

  5. మణిపుర్ వైరల్ వీడియో కేసు: మరో నిందితుడి అరెస్ట్.. ఆరుగురిలో ఒకరు బాలుడు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.

    దీంతో ఇంతవరకు ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయింది.

    ఇందులో అయిదుగురు ప్రధాన నిందితులు కాగా ఒకరు బాల నేరస్థుడని మణిపుర్ పోలీసులు తెలిపారు.

  6. స్నేక్ ప్లాంట్: ఇంట్లో పెంచుకునే ఈ మొక్కలతో వాయు కాలుష్యం తగ్గుతుందా?

  7. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈవ్ వైవోనె సావిత్రీబాయిగా ఎందుకు మారారు, పరమవీర, శౌర్య చక్ర పతకాల రూకల్పనలో ఆమె పాత్ర ఏంటి?

  8. ప్రేమ కోసం పోలాండ్ నుంచి భారత్‌కు.. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి ఇల్లు కట్టిస్తూ పెళ్లికి సిద్ధమైన మహిళ

  9. బియ్యం ఎగుమతులపై నిషేధం: భారత్ నిర్ణయంతో అమెరికా సహా అనేక దేశాలపై ప్రభావం.. సూపర్ మార్కెట్ల దగ్గర క్యూ కడుతున్న ఆసియా ప్రజలు

  10. ఒక్క సీజన్లో టమోటాలు అమ్మి రూ.2.81 కోట్లు సంపాదించిన రైతు

  11. స్వార్మ్ డ్రోన్స్: చైనా‌, పాకిస్తాన్ బలగాలకు భారత సైన్యం వీటితో చెక్ పెట్టగలదా?

  12. హెన్రీ కిసింజర్: అమెరికా-చైనా మధ్య ఈ దౌత్య దిగ్గజం రాయబారం చేస్తున్నారా? బీజింగ్‌లో ఆయనతో జిన్‌పింగ్ ఏమన్నారు?

  13. సల్మా: ‘నా ప్రపంచం భారత్‌లోనే ఉంది.. పాకిస్తాన్‌కు పంపిస్తే నాకు చావే గతి’- భారత పౌరసత్వం కోసం 38 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాక్ మహిళ కథ

  14. రక్తదానం, వీర్యదానం సరే, మల దానం గురించి విన్నారా?

  15. భారత్ X విండీస్: 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్న కోహ్లి, సెంచరీతో రికార్డులు బ్రేక్

    విరాట్ కోహ్లి

    ఫొటో సోర్స్, Getty Images

    వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి పలు రికార్డులు బ్రేక్ చేశాడు.

    ఈ మ్యాచ్‌లో కోహ్లి 180 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో సెంచరీని అందుకున్నాడు. ఫలితంగా తాను ఆడుతున్న 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోవడంతో పాటు, దాదాపు అయిదేళ్ల తర్వాత టెస్టుల్లో విదేశీ గడ్డపై సెంచరీని నమోదు చేశాడు.

    కోహ్లీ చివరగా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో సెంచరీ చేశాడు.

    ఓవర్‌నైట్ స్కోరు 87 పరుగులతో రెండోరోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కోహ్లీ 206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేశాడు.

    ఈ సెంచరీతో టెస్టుల్లో దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. దాంతోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 76 సెంచరీలను అందుకున్నాడు.

    అంతేకాకుండా, భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సెహ్వాగ్ (8,586)ను వెనక్కి నెట్టి కోహ్లీ (8, 676) అయిదో స్థానానికి చేరాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్, లక్ష్మణ్ మాత్రమే ముందున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    భారత క్రికెటర్లలో సచిన్, ద్రవిడ్, ధోని మాత్రమే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా, తాజాగా ఈ జాబితాలో కోహ్లీ కూడా చేరాడు.

    రెండు టెస్టులో కోహ్లీతోపాటు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.

    విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జోమెల్ వారికన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. జేసన్ హోల్డర్‌కు 2, గాబ్రియెల్‌కు ఒక వికెట్ దక్కాయి.

    అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన విండీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.

    భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే విండీస్ ఇంకా 352 పరుగులు వెనుకబడి ఉంది.

    త్యాగనరైన్ చందర్‌పాల్ (33)ను జడేజా అవుట్ చేశాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  16. ఎంబీబీఎస్ అడ్మిషన్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా ఇచ్చిన జీవోల వల్ల ఏపీ విద్యార్థులే ఎక్కువ నష్టపోతారా?