You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మణిపుర్: మహిళలను పట్టపగలు నగ్నంగా నడిపించిన కేసులో ఇప్పటివరకు నలుగురి అరెస్ట్

ఈ కేసులో ప్రధాన నిందితుడిని బుధవారం అరెస్ట్ చేయగా, మరో వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. సాకే భారతికి ఐదు ఎకరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చారా? ఈ వార్తలపై ఆమె ఏమన్నారు?

  2. పెళ్లయినా సెక్స్‌లో పాల్గొనడం లేదా?

  3. ఇకపై దరఖాస్తులలో కులం, మతం నింపాల్సిన అవసరం లేదా? తెలంగాణ హైకోర్ట్ ఏం చెప్పింది

  4. హెన్రీ కిసింజర్: అమెరికా-చైనా మధ్య ఈ దౌత్య దిగ్గజం రాయబారం చేస్తున్నారా? బీజింగ్‌లో ఆయనతో జిన్‌పింగ్ ఏమన్నారు?

  5. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  6. ‘ కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడాను, కానీ భార్యను రక్షించుకోలేకపోయాను’ – మణిపుర్ బాధితురాలి భర్త

    ‘దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పోరాడాను కానీ, నా భార్యను రక్షించుకోలేకపోయాను’ అని మణిపుర్‌లోని తౌబాల్ జిల్లాలో లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళల్లో ఒకరి భర్త అన్నారు.

    మణిపుర్‌లో మెయితెయ్ వర్గానికి చెందిన పురుషులు ఇద్దరు కుకి మహిళలను వివస్త్రలను చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియో బుధవారం బయటకొచ్చింది. ఈ సంఘటన మే 4న జరిగింది.

    కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడిన అసోం రెజిమెంట్‌కు చెందిన సుబేదార్ ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

    ‘‘కార్గిల్ యుద్ధంలో నేను దేశం కోసం పోరాడాను. దేశాన్ని కాపాడాను. కానీ, నా పదవీ విరమణ తర్వాత నా భార్యను, గ్రామస్థులను కాపాడుకోలేకపోయాను. ఐయామ్ సారీ.’’ అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

    ‘‘కార్గిల్ యుద్ధం సమయంలో నేను యుద్ధాన్ని దగ్గర్నుంచి చూశాను. కానీ, యుద్ధ క్షేత్రం కంటే మరింత ప్రమాదకరంగా నా సొంత ప్రాంతం తయారైంది.’’ అని ఆయన చెప్పారు.

    లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత మణిపుర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయాలని వివక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

    మే 4న ఉదయం పూట, తమ ప్రాంతంలోని పలు ఇళ్లను మూక తగలపెట్టిందని బాధిత మహిళ భర్త ఆరోపించారు.

    ఇప్పటి వరకు ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

    తమ ఇళ్లను తగలబెట్టి, మహిళలతో అమానుషంగా ప్రవర్తించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మాజీ సైనికుడు కోరుతున్నారు.

  7. ఎన్డీయే, ఇండియా: దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల పార్టీల పాత్రేమిటి

  8. భారతి: కూలి పనులు చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ

  9. మణిపుర్ హింస: అసలేమైంది? ఎందుకు ఇదంతా జరుగుతోంది?

  10. మణిపుర్‌లో మహిళలపై లైంగిక వేధింపులు: ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పంటించిన మహిళలు, దిలీప్ కుమార్ శర్మ, బీబీసీ కోసం

    మణిపుర్‌లోని తౌబాల్ జిల్లాలో ఇద్దరు మహిళలతో దుస్తులు విప్పించి నగ్నంగా రోడ్డుపై పరుగులు పెట్టించిన కేసులోప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయితేయి ఇంటికి కొందరు మహిళలు నిప్పు పెట్టారు .

    మణిపూర్‌లో దశాబ్దాలుగా సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్న మీరా పైబీ సంస్థతో అనుబంధం కలిగి ఉన్న మహిళలు ఈ చర్యకు పూనుకున్నారు.

    మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఆ తర్వాత ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు.

    వీరిలో హుయిరేమ్‌ను అనే వ్యక్తిని గురువారం ఉదయం ఎనిమిది గంటలకు అరెస్టు చేశారు.ఇతను బాధిత మహిళలను పట్టుకొని నడుస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తున్నారు.

    ఆయనను అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే తౌబాల్ జిల్లా పైచీ గ్రామంలో ఉన్న నిందితుడి ఇంటికి మీరా పైబీకి చెందిన మహిళలు నిప్పు పెట్టారు.

    దీనితో పాటు, హెరోదాస్‌ కుటుంబాన్ని పైచీ అవాంగ్ లీకై ప్రాంతం నుంచి తరిమికొట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు.

    వేధింపుల వీడియోను రికార్డ్ చేసిన యుమ్లెంబమ్ జీవన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అతని నివాసం నుంచి అరెస్ట్ చేశారు.

  11. ‘‘జైల్లో కెమెరాల ముందు దుస్తులు విప్పించారు.. శానిటరీ ప్యాడ్లు, టాంపాన్‌లను తొలగించమన్నారు’’-ఇరాన్ మహిళల ఆరోపణ

  12. రాహుల్ గాంధీ: పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 4కు వాయిదా, పూర్ణేశ్ మోదీకి సుప్రీంకోర్టు నోటీసులు

    మోదీ ఇంటిపేరు కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీం కోర్టు, పూర్ణేశ్‌ మోదీకి నోటీసులు జారీ చేసింది.

    పది రోజుల్లోగా ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

    ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 4న జరుగనుంది.జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కె మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.

    రాహుల్ గాంధీపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు.

    ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేశారు. అయితే, తన శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. దాన్ని కోర్టు తిరస్కరించింది.

    2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ ఇంటిపేరుకు సంబంధించి రాహుల్ గాంధీ వివాదాస్పద ప్రకటన చేశారు.

    లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందని రాహుల్ ప్రశ్నించారు.ఈ ప్రకటన తర్వాత రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదైంది.

    రాహుల్ గాంధీ మొత్తం మోదీ వర్గం ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు.

  13. డీమిలిటరైజ్డ్ జోన్ : అతికొద్ది మంది మాత్రమే దాటగలిగిన ఈ సరిహద్దు ప్రత్యేకత ఏంటి? అమెరికా సైనికుడు అందులోకి ఎలా వెళ్లారు?

  14. విండీస్‌తో రెండో టెస్టు: యశస్వి, రోహిత్ అర్ధసెంచరీలు.. సెంచరీ దిశగా కోహ్లి, భారత్ 288/4

    వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అర్ధసెంచరీలు సాధించారు.

    దీంతో గురువారం మొదలైన ఈ టెస్ట్ తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్లకు 288 పరుగులు చేసింది.

    యశస్వి 74 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 57 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

    గిల్ 10 పరుగులే చేశాడు.

    విరాట్ కోహ్లి అజేయంగా 87 పరుగులతో సెంచరీ దిశగా నడుస్తున్నాడు. కోహ్లి 161 బంతుల్లో 8 బౌండరీలు నమోదు చేశాడు.

    కోహ్లితో పాటు రవీంద్ర జడేజా (36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రహానే (8) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.

    విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, షనాన్ గాబ్రియెల్, జోమెల్ వారికన్, జేసన్ హోల్డర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

  15. మణిపుర్: మహిళలను నగ్నంగా నడిపించిన కేసులో ఇప్పటివరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారంటే?

    మణిపుర్‌లోని తౌబాల్ జిల్లాలో మే 4వ తేదీన ఇద్దరు మహిళలను వీధుల్లో నగ్నంగా నడిపించిన మూక కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు.

    మహిళలను వేధిస్తోన్న ఈ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ దుశ్చర్యపై అధికార, విపక్షాల నాయకులు ఘాటుగా స్పందించారు.

    ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గురువారం సాయంత్రం మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పారు.

    బుధవారం ప్రధాన నిందితుడిని మొదట అరెస్ట్ చేశామని, గురువారం ఈ కేసుకు సంబంధించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు బీరేన్ సింగ్ వెల్లడించారు.

    దీనితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరినీ అరెస్ట్ చేసేందుకు కేంద్ర బలగాలను అంతటా మోహరించామని చెప్పారు.

    ఆయన ఈ వివరాలను వెల్లడించిన కొన్ని గంటల తర్వాత, మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మణిపుర్ పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుల వివరాలను బహిర్గతం చేయలేదు.