మోదీ ఇంటి పేరు కేసు: రాహుల్ గాంధీ అప్పీల్‌ను కొట్టివేసిన గుజరాత్ హైకోర్ట్
మోదీ ఇంటిపేరును ఉద్దేశించి నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్ళీ రేపు ఉదయం లేటెస్ట్ అప్డేట్స్‌తో కొత్త లైవ్ పేజీలో కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
ఒకొముటున్: 1200 ఏళ్ళ కిందటి ఈ మాయా నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం వెనుక మర్మమేంటి?
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
మెదడుకు 6 అద్భుతమైన ఆహారాలు
మహాత్మాగాంధీని 'జాతిపిత' అనకూడదా... ఏమిటీ వివాదం?
ఆంధ్రప్రదేశ్: విశాఖను కుదిపేస్తున్న భూవివాదాలు... వందల కోట్ల విలువైన భూముల చుట్టూ రాజకీయ దుమారం
ఫిరాయింపుల నిరోధక చట్టం: ఏపీ, తెలంగాణ నేతలు అనర్హత వేటు నుంచి ఎలా తప్పించుకున్నారు
మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం: తెలంగాణ మంత్రి కేటీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KTR
‘మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం,ఎవరం హాజరుకాము’ అని తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడిన కేటీఆర్.. మోదీ పర్యటన విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై స్పష్టత ఇచ్చారు.
నాలుగేళ్ల కిందట మోదీని పచ్చిబూతులు తిట్టిన చంద్రబాబునాయుడు ఎన్డీయే సమావేశానికి ఎలా హాజరవుతారని ఆయన ప్రశ్నించారు.
గత నాలుగేళ్లలో మోదీ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మేలేమిటో చంద్రబాబు చెప్పాలని.. గత తొమ్మిదేళ్లలో ఏపీకి మోదీ చేసిన మేలేమిటో చెప్పిన తరువాత ఎన్డీయే సమావేశానికి వెళ్లాలని ఆయన అన్నారు.
కనీసం గత తొమ్మిదేళ్లలో మోదీ ఈ దేశానికి ఏం చేశారన్నదైనా చెప్పాలన్నారు కేటీఆర్.
కాగా శనివారం (జులై 8న) మోదీ వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, 5 బోగీలు పూర్తిగా దగ్థం.. ప్రయాణికులు సురక్షితం, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది.
భోగిల్లో ఒక్కసారిగా మంటలు అంటుకుని తగలబడుతున్నాయి.
హౌరా నుంచి సికింద్రాబాద్ వచ్చేఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ రావాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం పగిడిపల్లి – బొమ్మాయిపల్లి వద్దకు చేరుకోగానే ఎస్ 4 బోగీలో మంటలు అంటుకున్నట్లు స్థానిక రైల్వే వర్గాలు చెప్పాయి.
ఆ తర్వాత ఒక బోగీ నుంచి మరొక బోగీకి మంటలు వ్యాపించడంతో ఇప్పటివరకు మొత్తం 5బోగీలు తగలబడ్డాయి.
రైలును నిలిపివేసి ప్రయాణికులందరూ కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఇతర బోగీలను రైలు నుంచి వేరు చేశారు.

అగ్నిమాపక శకటాలు వెళ్లేందుకు వీల్లేని రూటు కావడంతో మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయి.
వాటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది వేర్వేరు మార్గాలను అన్వేషిస్తున్నారు.
బోగీలలో ఒక్కసారిగా పొగలు రావడంతో రైలును లోకోపైలట్ అక్కడే నిలిపివేశారు.
ప్రయాణికులు దిగి అక్కడే వేచి ఉన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎం ఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు.
ప్రయాణికులను అక్కడి నుంచి తరలించేందుకు మరో ప్రత్యేక రైలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా.. మరేదైనా కారణమా.. అనేది తేలాల్సి ఉందని చెప్పారు.
కాలిపోతున్న బోగీల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు దిగిపోవడంతో చాలావరకు సామగ్రి వాటిల్లోనే ఉండిపోయాయి. అవి కూడా మంటల్లో కాలిపోయాయి.

హైదరాబాద్- గుంటూరు బస్సులోనూ మంటలు
మరో ఘటనలో.. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న BHEL డిపో కి చెందిన రాజధాని ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది.
పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్ఆర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి.
బస్సులోని ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా మంటలు రావడంతో బస్సు డ్రైవర్ గమనించిప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయడంతో వారంతా కిందకు దిగారు.
ప్రమాద సమయంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.
బ్రేకింగ్ న్యూస్, మోదీ ఇంటి పేరు కేసు: రాహుల్ అప్పీల్‌ను కొట్టేసిన గుజరాత్ హైకోర్టు

ఫొటో సోర్స్, INC
మోదీ ఇంటి పేరు విషయంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది.
ఈ కేసులో ఇంతకుముందు సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
మోదీ ఇంటిపేరును ఉద్దేశించి నాలుగేళ్ల కిందట రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చినా రాహుల్‌కు వెంటనే బెయిల్ మంజూరైంది.
శిక్ష అమలు నిలుపుదల కోరుతూ రాహుల్ గుజరాత్ హైకోర్టులో రాహుల్ సవాలు చేశారు.
అప్పట్లో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించగానే, ఆయనను ఎంపీ పదవికి అనర్హులుగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసింది.
ఈ కేసులో వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.
ఈ కేసు నేపథ్యం ఏంటి?
దొంగలందరి ఇంటి పేర్లలో 'మోదీ' అని ఎలా ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారంటూ 2019లో ఒక క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలైంది.
రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుడు పూర్ణేశ్ మోదీ ఈ కేసును పెట్టారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 499, 500ల కింద రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.
తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఏమన్నారంటే...
రాహుల్ గాంధీ మీద దాదాపు 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
రాహుల్ గాంధీని దోషిగా తేల్చడం ఏ విధంగాను అన్యాయం కాదు.
ఈ కేసు విషయంలో మేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.
పసలేని, అస్థిత్వంలో లేని పాయింట్లతో ఆయన స్టే కోరుతున్నారు. దోషులుగా తేల్చిన తీర్పులపై స్టే ఇవ్వాలనే నియమం లేదు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
సెక్సువల్ ఫ్లూయిడిటీ: లైంగిక ఇష్టాలు చెప్పుకోవడంలో మహిళలే ముందున్నారా?
