ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. రేపు మళ్లీ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ కేసులో మైనర్ బాలిక, ఆమె తండ్రి స్టేట్‌మెంట్స్ ఆధారంగా బ్రిజ్ భూషణ్ మీద పోక్సో కేసు రద్దు చేయాలని కోరుతూ దిల్లీ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. రేపు మళ్లీ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన పోక్సో కేసును రద్దు చేయాలని కోరుతూ దిల్లీ పోలీసులు పటియాలా హౌస్ కోర్టుకు నివేదిక సమర్పించారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన పోక్సో కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని దిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ సుచిత్ర మొహంతి తెలిపారు.
ఈ కేసులో మైనర్ బాలిక, ఆమె తండ్రి స్టేట్‌మెంట్స్ ఆధారంగా పోక్సో కేసు రద్దు చేయాలని కోరుతూ కోర్టుకు నివేదిక సమర్పించినట్లు దిల్లీ పోలీసులు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
పటియాలా హౌస్ కోర్టు జూలై 4న ఈ కేసులో తదుపరి విచారణ జరపనుంది.
రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో దిల్లీ పోలీసులు తొలి చార్జిషీట్ దాఖలు చేశారు.
ఐపీసీ సెక్షన్లు 354 (మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమెపై దాడి చేయడం), 354-ఏ (లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం), 354-డీ (మహిళను వెంటపడి వేధించడం), 506-1 (బెదిరింపులు) కింద నమోదైన అభియోగాలపై దిల్లీ పోలీసులు వెయ్యి పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసు తదుపరి విచారణ జూన్ 22న జరగనుంది.
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగాట్, బజ్‌రంగ్ పునియా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు.
దీంతో బ్రిజ్ భూషణ్‌పై నెల రోజల క్రితం లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మైనర్ రెజ్లర్‌పై లైంగిక హింసకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో జరిగిన సమావేశంలో జూన్ 15లోగా కేసు విచారణ పూర్తి చేయాలని రెజ్లర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐపీఎల్ సీజన్ 16 ముగిసిన తర్వాత క్రికెటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు.
టీమిండియా మిడిలార్డర్‌లోని ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లలో అంబటి రాయుడు ఒకరు.
2019 ప్రపంచకప్ తుది జట్టులో అంబటి రాయుడికి చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ, బీసీసీఐ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు. అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్‌కి చోటు దక్కింది.
ఆ విషయంపై అంబటి రాయుడు తొలిసారి స్పందించారు.
2019 వరల్డ్‌కప్‌కి రెడీగా ఉండాలని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు 2018లో తనతో చెప్పారని అంబటి రాయుడు తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9తో చెప్పారు.
తనకు జట్టులో స్థానం దక్కకపోవడానికి అప్పటి చీఫ్ సెలెక్టరే కారణమని అంబటి రాయుడు చెప్పారు. అయితే, ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించలేదు.
టీమ్ మేనేజ్‌మెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో తనకు విభేదాలున్నట్లు ఆయన చెప్పారు. 2019 ప్రపంచ కప్‌కి జట్టు ఎంపిక సమయంలో ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నారు.
''నేను ఆరోజు ఫ్లైట్‌లో ఉన్నా. నేను సెలెక్ట్ కాలేదని సంకేతాలు వస్తున్నాయి. కానీ స్పష్టం తెలియదు. ఐపీఎల్ జరుగుతుండడంతో ఒకచోట నుంచి మరోచోటుకి తిరుగుతున్నాం. ఫ్లైట్ దిగిన తర్వాత ఫోన్ ఆన్ చేశాను. నేను టీమ్‌లో లేనని అప్పటికే మెసేజ్‌లు వచ్చాయి. నేను స్టాండ్‌బైగా ఉన్నా. అది నాకు నిరాశ కలిగించింది'' అని అంబటి రాయుడు ఛానల్‌తో చెప్పారు.
''నేను భారత్ తరఫున, మరీముఖ్యంగా ప్రపంచ కప్‌లో ఆడాలనుకున్నా. భారత్ గెలవాలని అందరూ కోరుకుంటారు. నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదో వారికే తెలియాలి. టీం బలంగా ఉండేందుకు నాకు బదులు మరెవరినైనా ఎంపిక చేసి ఉంటే బావుండేది. అందువల్ల నాకు కోపం వచ్చింది. విజయ్ శంకర్‌పై నాకేం కోపం లేదు. వాళ్లు ఏం చేయగలరు. నన్ను జట్టులోకి తీసుకోకపోవడం వెనక ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. మనం వరల్డ్ కప్ ఆడుతున్నామో? లేక లీగ్ మ్యాచ్ ఆడుతున్నామో? నాకు అర్ధం కాలేదు.'' అని అన్నారు.
''ఒకవేళ వాళ్లు రహానే లాంటి అనుభవం ఉన్న వాళ్లను తీసుకుని ఉంటే అర్థం చేసుకోవచ్చు.'' అని అంబటి రాయుడు అన్నారు.
గుజరాత్‌లోని కచ్ జిల్లా జాఖు పోర్టుకు సమీపంలో బిపర్జోయ్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సుమారు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే భారత వాతావరణ శాఖ సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
బిపర్‌జోయ్‌ని పెనుతుపానుగా చెబుతున్నారు. తుపాను కారణంగా గుజరాత్‌లో భారీ నష్టం సంభవించే అవకాశముందని, ఇళ్లు, పంటపొలాలు, రోడ్లు, రైల్వే ట్రాకులు ధ్వంసమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశముంది.
ఈశాన్య దిశగా కదులుతున్న బిపర్‌జోయ్ తుపాను గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు పాకిస్తాన్‌పై కూడా ప్రభావం చూపనుంది.
కచ్ జిల్లాలోని జాఖు పోర్టుకి సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు సుమారు 125 కిలోమీటర్ల నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వేగం 150 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుపాను పరిస్థితిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోందని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ 12 బృందాలను గుజరాత్‌కు పంపింది. మరో 15 బృందాలను సిద్ధం చేసింది.
కోస్టు గార్డ్, నేవీ విభాగాలు సహాయక చర్యలు చేపట్టేందుకు షిప్‌లు, హెలికాప్టర్లను సిద్ధం చేశాయి. ఆర్మీ ఎయిర్‌ఫోర్స్, ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ టీమ్‌లు పడవలు, సహాయక చర్యలకు అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉన్నాయి.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో చూడండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.