పార్కులో ఆడుకుంటున్న పిల్లలపై కత్తితో దాడి చేసిన దుండగుడు
ఫ్రాన్స్‌లోని ఓ పార్కులో ఏడాది నుంచి మూడేళ్ల మధ్య వయసున్న నలుగురు చిన్నారులపై అబ్దెల్‌మాసిహ్ హనౌన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు తెలిపారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. మరిన్ని వార్తలతో ఆదివారం ఉదయం కలుద్దాం.
రేల పూలు ఎందుకంత ప్రత్యేకం?
లింగనిర్థరణ పరీక్షల పరికరాలు అమ్ముతున్నవారిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు

ఫొటో సోర్స్, UGC
లింగ నిర్థరణకు ఉపయోగిస్తున్న స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా వరంగల్ పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 25 లక్షల రూపాయల విలువ చేసే స్కానింగ్ యాంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో విజయవాడకు చెందిన అశోక్ కుమార్, కావలికి చెందిన తాతాపూడి కిరణ్ కుమార్ ఉన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం...
గత నెలలో కమిషనరేట్ పరిధిలో అక్రమంగా లింగ నిర్థరణ స్కానింగ్‌లు నిర్వహిస్తున్న 18 మందిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు జరిపిన విచారణలో భాగంగా అక్రమంగా స్కానింగ్ పరికరాలను వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన నిందుతుల్లో ఒకరైన మల్లిపూడి అశోక్ కుమార్ 2012 నుంచి ఈసీజీ, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు, ఆసుపత్రులతో పెరిగిన పరిచయాలతో 2018లో విజయవాడ అబిరనగర్‌లో ఒక గదిని కిరాయి తీసుకునని సొంతంగా ఆస్ట్రానిక్ టెక్నాలజీ పేరుతో బయోమెడికల్ ఎక్విప్మెంట్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశారు. తన పరిచయాలతో హాస్పిటల్స్, చెన్నై నగరంలో గుర్తింపు లేని బయెమెడికల్ సర్వీస్ కేంద్రాల నుంచి పాత స్కానింగ్ యంత్రాలను తక్కువ ధరలకు కోనుగోలు చేసి ఎక్కువ ధరకు అర్హతలేని వ్యక్తులకు విక్రయించేవారు. గతంలో అశోక్ కుమార్ వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో స్కానింగ్ యంత్రాల మరమ్మత్తు చేసే క్రమంలో వేముల ప్రవీణ్‌కు ఒక స్కానింగ్ యంత్రాన్ని నిందితుడు విక్రయించారు. ప్రస్తుతం అతని వద్ద విక్రయించడానికి సిద్ధంగా వున్న మరో 4 పోర్టబుల్, 11 ఫిక్స్‌డ్ స్కానింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదే సందర్భంలో గత నెలలో అక్రమ లింగనిర్థరణకు పాల్పడుతూ అరెస్ట్ అయిన డాక్టర్.సబిత ఇచ్చిన సమాచారం మేరకు ఆమెకు స్కానింగ్ యంత్రాన్ని విక్రయించిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన తాతాపూడి కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
2018 నుంచి డేవిస్ మెడికల్ ఎక్విప్మెంట్ కంపనీలో సేల్స్ మెన్‌గా పనిచేసిన కిరణ్ కుమార్ ఆ తర్వాత వాటి రిపేరింగ్ నేర్చుకుని 2021లో సేల్స్ మెన్ ఉద్యోగం మానేసి వివిధ హాస్పిటల్స్‌లో వినియోగానికి అనువుగా లేని స్కానింగ్ పరికరాలను కొని మరమ్మత్తులు చేసి విక్రయిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు.
కిరణ్ కుమార్ నుంచి ఒక ఫిక్స్‌డ్, రెండు పోర్టబుల్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
పార్కులో ఆడుకుంటున్న పసిపిల్లలపై కత్తితో దాడి చేసిన దుండగుడు

ఫొటో సోర్స్, UGC
ఫ్రాన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. గురువారం ఆల్పైన్ ప్రాంతంలోని ఓ పార్కులో ఏడాది నుంచి మూడేళ్ల మధ్య వయసున్న నలుగురు చిన్నారులపై అబ్దెల్‌మాసిహ్ హనౌన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అబ్దెల్‌మాసిహ్ సిరియాలో జన్మించాడని, అతనికి ఉగ్రవాదంతో సంబంధం లేదని న్యాయవాదులు తెలిపారు.
నిందితుడు పోలీసుల విచారణలో మౌనంగా ఉన్నట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు. అతడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ఘటనకు సంబంధించిన వీడియో ఫ్రాన్స్ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారులు క్షేమంగానే ఉన్నారని స్థానిక ప్రాసిక్యూటర్ బోనెట్-మాథిస్ చెప్పారు.
దాడి ఘటనను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పిరికిపంద చర్యగా పేర్కొన్నారు.
ఎవరెస్ట్ రూపం మారుతోందా? ఒక్కసారిగా మరణాలు ఎందుకు పెరిగాయి?
కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా?
బ్రేకింగ్ న్యూస్, శరద్ పవార్: 'ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ప్రఫుల్ పటేల్, సుప్రియ సూలే'

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, శరద్ పవార్, సుప్రియ సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ప్రఫుల్ పటే, సుప్రియా సూలే నియమితులయ్యారని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు.
దిల్లీలో పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
ప్రఫుల్ పటేల్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, గోవా రాష్ట్రాల బాధ్యతలు కూడా అప్పజెప్పినట్లు శరద్ పవార్ తెలిపారు.
అలాగే, సుప్రియా సూలే కూడా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలు చూసుకుంటారని ఆయన ప్రకటించారు.
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో నొవాక్ జొకోవిచ్

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ 2023లో ఫైనల్‌కి చేరుకున్నారు.
సెమీ ఫైనల్స్‌లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్‌ని 6-3, 5-7, 6-1, 6-1 తేడాతో జొకోవిచ్ ఓడించారు.
అయితే, ఫైనల్‌లో కాస్పర్ రూడ్ లేదా అలెక్సాండర్ జ్వెరెజ్‌లలో ఎవరితో పోటీపడతారో ఇంకా నిర్ణయించలేదు.
ఒకవేళ ఆదివారం జరిగే ఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్ విజయం సాధిస్తే, 22 సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన రఫెల్ నాదల్‌ను ఆయన వెనక్కి నెట్టనున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
డోనల్డ్ ట్రంప్ అణు రహస్య పత్రాలను తన బాత్‌రూమ్‌లో దాచిపెట్టారని ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images
న్యూక్లియర్ రహస్య పత్రాలు, సైన్యం ప్రణాళికలు సహా వందలాది అధికారిక పత్రాలను అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లోని డైనింగ్ రూములో, బాత్రూములో పడేశారని ఆరోపణలు నమోదయ్యాయి. అంతేకాకుండా, ఆయన ఈ విషయంలో దర్యాప్తు అధికారులకు అబద్ధాలు చెప్పారనే అభియోగాలు కూడా దాఖలయ్యాయి.
అధికారిక పత్రాలను ఇవ్వకుండా దర్యాప్తును ట్రంప్ అడ్డుకున్నారని ఈ అభియోగాల్లో పేర్కొన్నారు.
అమెరికాలో 2024లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్న ట్రంప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన వాల్ట్ నాటా మీద కూడా నేరారోపణలు నమోదయ్యాయి. వైట్ హౌస్ మిలటరీ అధికారి అయిన నాటా సదరు అధికార పత్రాలను ఎఫ్‌బీఐకి ఇవ్వకుండా ట్రంప్ ఇంటికి తరలించారని పేర్కొన్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం... హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్

ఫొటో సోర్స్, VarunTej/Twitter
సినీ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ తదితరులు హాజరయ్యారు.
'ఇట్స్ మై లావణ్య, ఫౌండ్ మై లవ్' అంటూ వరుణ్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్లలో షేర్ చేశారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం... హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పార్కులో ఆడుకుంటున్న పిల్లలపై కత్తితో దాడి చేసిన దుండగుడు
