You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్: తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

లైవ్ కవరేజీ

  1. ఎన్‌సీఆర్‌బీ డేటా: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?

  2. లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం. ధన్యవాదాలు.

  3. రష్యా-యుక్రెయిన్ యుద్ధం: కఖోవ్కా డ్యామ్ ధ్వంసంతో నీటిపై తేలుతున్న మందుపాతరలు

  4. పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో ఎలా మునిగిపోయింది?

  5. సాదీ షిరాజీ: ఈ పర్షియన్ రచయిత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి బ్రాహ్మణుడిగా మారారా? ఇది నిజమా, కల్పితమా?

  6. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

    లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, తొలి రోజు మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.

    రెండో రోజు ఆట మొదలైన తర్వాత స్టీవెన్ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు.

    రెండో రోజు ఉదయం ఆసీస్ నాలుగో వికెట్ (ట్రావిస్ హెడ్) కోల్పోయింది. ఈ వికెట్ సహా మొహమ్మద్ సిరాజ్ మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు.

    మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.

    ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 163 పరుగులు, స్టీవెన్ స్మిత్ 121 పరుగులు కొట్టారు.

    ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 పరుగులు, అలెక్స్ కేరీ 48 పరుగులు చేశారు.

  7. ఫాషియా: ఇది ఒళ్లంతా ఉంటుంది.. కీళ్ల నొప్పికీ, దీనికీ సంబంధం ఏమిటి?

  8. 'సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించాడు'

  9. గూఢచారి రాబర్ట్ హన్‌సెన్: అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఇంటి దొంగ’ కథ

  10. ఎన్నికలు సమీపిస్తుండగా పెరుగుతున్న మతతత్వ హింస

  11. జూన్ 23న పట్నాలో అఖిలపక్ష సమావేశం... రాహుల్, కేజ్రీవాల్ సహా అగ్రనేతలు హాజరుకానున్నారు

    జూన్ 23న పట్నాలో ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు సమావేశం కానున్నారని బిహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ బుధవారం మీడియాకు తెలిపారు.

    ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హాజరవుతారని చెప్పారు.

    వీరితో పాటు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇందులో పాల్గొంటారని జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్ తెలిపారు.

    ఈ సమావేశంలో అన్ని పార్టీల అధినేతలు పాల్గొనాలని దీనికి సూత్రధారిగా వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్ ఒక మీడియా నమావేశంలో కోరారు.

  12. రెజ్లర్లకు, ప్రభుత్వానికి మధ్య రాజీ కుదిరిందా, చర్చల్లో ఏం నిర్ణయించారు?

  13. మెగుమి ఒకానో అత్యాచారానికి గురయ్యారు. తనను రేప్ చేసిన వ్యక్తి చట్టం నుంచి తప్పించుకోగలడని ఆమెకు తెలుసు. ఎందుకంటే, జరిగింది రేప్ కాదని జపాన్ ప్రభుత్వం కొట్టిపారేయవచ్చు.

    అందుకే అతను ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలిసినా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

    "అతను హాయిగా, కులాసాగా తిరుగుతున్నాడు. అది చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది" అన్నారు మెగుమి.

    మిగతా కథనం ఇక్కడ చదవండి.

  14. న్యూయార్క్‌ నగరం భూమిలోకి కుంగిపోతోంది, ఆపడం ఎలా?

  15. మహరాష్ట్ర: 32 ఏళ్ల మహిళ శరీర భాగాలు దొరికాయి

    మహరాష్ట్రలో 56 ఏళ్ల పురుషుడు తనతో సహజీవనం చేస్తున్న 32 ఏళ్ల మహిళను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చిందని ఏఎన్ఐ తెలిపింది.

    ఈ ఘటన థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో జరిగిందని, పోలీసులకు మహిళ శరీర భాగాలు బుధవారం రాత్రి దొరికాయని పీటీఐ వెల్లడించింది.

    పోలీసులు అందించిన వివరాల ప్రకారం, మనోజ్ సాహ్ని అనే వ్యక్తి సరస్వతి వైద్య అనే మహిళను మూడు, నాలుగు రోజుల క్రితం హత్యచేశాడు. తరువాత, ఒక రంపం కొని తెచ్చి ఆమెను ముక్కలు ముక్కలుగా కోశాడు.

    నిందితుడు ముక్కలుగా కోసినా ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో పెట్టి ఉడికించాడని, తరువాత వాటిని ప్లాస్టిక్ సంచీలో ఉంచి పారవేశాడని, ఒక 12-13 ముక్కలు ఘటనా స్థలంలో దొరికాయని పోలీసులు చెప్పినట్టు ఏఎన్ఐ తెలిపింది.

  16. రెపో రేటులో మార్పు లేదు - ఆర్బీఐ

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్దే ఉంచాలని నిర్ణయించింది.

    ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ తెలిపింది.

    ఆర్‌బీఐ ఇతర బ్యాంకులు రుణాలిచ్చే రేటునే రెపో రేటు అంటారు.

    ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి 2022 మే నుంచి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లకు పెంచుతూ 6.5 శాతానికి తీసుకొచ్చింది ఆర్‌బీఐ.

    ఈ ఏప్రిల్‌లో తొలిసారిగా పెంపును నిలిపివేసింది. ఈ ఏడాదిలో ఇది తొలి సమావేశం.

    ఇప్పుడు రెండో సమావేశంలో కూడా రెపో రేటులో ఏ మార్పు లేనట్టు ప్రకటించింది.

    మానిటరీ పాలసీలో భాగంగా, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి రెపో రేటును పెంచితే, డిమాండ్ తగ్గుతుంది. ధరలు తగ్గుతాయి.

  17. దూరదర్శన్ ఒకప్పటి ప్రముఖ న్యూస్ రీడర్ గీతాంజలి అయ్యర్ ఇక లేరు..

    దూరదర్శన్‌లో ఒకప్పటి పాపులర్ న్యూస్ రీడర్ గీతాంజలి అయ్యర్ బుధవారం 72 ఏళ్ల వయసులో మరణించారు.

    ఆమె కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో పోరాడుతున్నారు. "బుధవారం వాకింగ్‌కు వెళ్లి వచ్చిన తరువాత ఆమె కుప్పకూలిపోయారని, ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారని" వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

    కోల్‌కతాలోని లోరెటో కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గీతాంజలి అయ్యర్, 1971లో దూరదర్శన్‌లో చేరారు.

    ఎంతో అందంగా ఇంగ్లిష్ వార్తలు చదివేవారు. నాలుగు సార్లు బెస్ట్ యాంకర్ అవార్డు అందుకున్నారు. 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు కూడా గెలుచుకున్నారు.

    జర్నలిజం చదువుకున్న గీతాంజలి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి డిప్లొమా కూడా అందుకున్నారు.

    గీతా అయ్యర్ మృతి పట్ల కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా దేశంలోని సీనియర్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

    "గీతాంజలి అయ్యర్ మరణం కలచివేసింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో తొలితరం ఉత్తమ ఆంగ్ల వార్తా వ్యాఖ్యాతలలో ఆమె ఒకరు" అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

  18. నమస్కారం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్‌పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  19. జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించిన మొఘల్ చక్రవర్తి