కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం, వందల మందికి గాయాలు, భారీ సంఖ్యలో మృతులు
ఈ సంఘటన బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో జరిగింది. గాయపడిన వారిని బాలాసోర్ ఆసుపత్రిలో చేర్చారు.
లైవ్ కవరేజీ
మరిన్ని వార్తలతో శనివారం ఉదయం కలుద్దాం.
ధన్యవాదాాలు.
కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే...
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం, వందల మందికి గాయాలు, భారీ సంఖ్యలో మృతులు

ఫొటో సోర్స్, ANI
ఒడిషాలోని బాలాసోర్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించారని స్థానిక ఫైర్ సర్వీస్ అధికారి సుధాంశు సారంగిని ఉటంకిస్తూ ఎన్డీటీవీ వెల్లడించింది.
సంఘటనా స్థలానికి 50 అంబులెన్సులు పంపామని, ఒడిశా ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. 350 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ సంఘటన బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ స్టేషన్ దగ్గర జరిగింది. గాయపడిన వారిని బాలాసోర్ ఆసుపత్రిలో చేర్చారని ఏఎన్ఐ, పీటీఐ వార్తా సంస్థలు వెల్లడించాయి.
అయితే, రెండు పాసింజర్ రైళ్లు, ఒక గూడ్సు రైలు మధ్య ఈ ప్రమాదం జరిగిందని భువనేశ్వర్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి సుబ్రతా పతి తెలిపారు.
‘‘రాత్రి 7 గంటలకు, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10-12 కోచ్‌లు బాలేశ్వర్ సమీపంలో పట్టాలు తప్పాయి. అవి పక్కన ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. కొంత సమయం తరువాత, యశ్వంత్‌పూర్ నుండి హౌరాకు వెళ్లే మరో రైలు, పట్టాలు తప్పి పడిన కోరమండల్ కోచ్‌ల మీదకు దూసుకెళ్లింది, ఫలితంగా యశ్వంత్‌పూర్ -హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 3-4 కోచ్‌లు పట్టాలు తప్పాయి అని రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ చెప్పారు.
ఈ ఘటన సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఫొటో సోర్స్, OTV
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గాయపడిన వారిని గుర్తించడానికి తమ ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంతో టచ్‌లో ఉందని చెప్పారు.
రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసిన ఆమె, సహాయ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తమ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని అని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల బృందాన్ని ప్రమాద స్థలానికి పంపింది.
ఈ ఘటనపై ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని మమత తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 3X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 4X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
పోస్ట్ X స్కిప్ చేయండి, 5X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
రాహుల్ గాంధీ - బీజేపీ: జిన్నా ముస్లిం లీగ్‌కు, కాంగ్రెస్ మిత్రపక్షం ముస్లిం లీగ్‌కు మధ్య తేడా ఏమిటి?
‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
మాంసాన్ని మరిపించే కొత్తరకం బఠానీలు
ఒమన్: ‘‘నన్ను అమ్మేస్తానని బెదిరించేవారు’’
జీడిమెట్ల: ‘ఈ నీరు కింద పడితే నేల ఎర్రగా మారిపోతోంది’.. హైదరాబాద్ శివార్లలోని భూగర్భ జలాన్ని బీబీసీ టెస్ట్ చేయిస్తే బయటపడిన వాస్తవం ఇదీ
‘అందరూ నా వక్షోజాలే చూస్తుంటే ఇబ్బందిగా ఉండేది.. ఆపరేషన్ చేయించుకుని తగ్గించుకోవాల్సి వచ్చింది’
వేదికపై తూలిపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Video Grab
వేదికపై ఒక చిన్న ఇసుక బ్యాగ్‌కు కాలు తగిలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొట్రుపడి పడిపోయారు. కొలరాడోలోని వైమానిక దళ అకాడమీలోని గ్రాడ్యుయేషన్ సెరెమొనీలో ఈ ఘటన జరిగింది.
80 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారిలో అత్యధిక వయసున్న నాయకుడు. పడిపోయిన ఆయనకు వెంటనే సిబ్బంది సాయం చేశారు.
ఆయన ప్రస్తుతం బానే ఉన్నారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ తెలిపారు.
‘‘చిన్న ఇసుక మూటకు కాలు తగలడంతో పడిపోయాను’’అని విలేఖరులతో జో బైడెన్ చెప్పారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
