హరిద్వార్: పతకాలను గంగానదిలో పడేయడానికి సిద్ధపడ్డ రెజ్లర్లు, వారించిన స్థానికులు, రైతు సంఘాల నాయకులు
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రెజ్లర్లు నెల రోజులుగా నిరసన తెలుపుతున్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్‌నైట్
ఘోట్కి కోవా : నోరూరించే ఈ వంటకాన్ని ఎలా తయారు చేస్తారంటే..
ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా
హరిద్వార్: పతకాలు గంగానదిలో వేయడానికి సిద్ధపడ్డ రెజ్లర్లు, వారించిన స్థానికులు, రైతు సంఘాలు, కార్యక్రమం 5 రోజులు వాయిదా

ఫొటో సోర్స్, ANI
భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగాట్ లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాము గెలుచుకున్న పతకాలను మంగళవారం సాయంత్రం గంగానదిలో వేయడానికి సిద్ధపడ్డారు.
అయితే, స్థానికులు, రైతు సంఘాల నాయకులువారిని వారించారు. దీంతో వారు తమ పతకాలను రైతు సంఘం నాయకుడు నరేశ్ టికైత్‌కు అప్పగించారు.
తమపై జరిగిన లైంగిక వేధింపు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వారు తాము సాధించిన పతకాలను హరిద్వార్ లోని గంగానదిలో విసిరేస్తామని రెజ్లర్లు ఇంతకు ముందు హెచ్చరించారు.
అయితే, హరిద్వార్ చేరుకున్న వీరిని స్థానికులు, రైతులు సంఘాల నాయకులు చుట్టుముట్టారు. పతకాలు నదిలో వేయవద్దని వారించారు. దీంతో నిర్ణయం మార్చుకున్న రెజ్లర్లు, ఈ కార్యక్రమాన్ని ఐదురోజులపాటు వాయిదా వేశారు.
మరోవైపు, రెజ్లర్లు గంగానదిలో తమ పతకాలను విసిరేసే ప్రయత్నాలను గంగా మహాసభ తీవ్రంగా వ్యతిరేకించింది.
"ఇక్కడ సనాతన ధర్మాన్ని ఆచరించే భక్తులు పూజల కోసం వస్తారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ఇది జంతర్ మంతర్ కాదు. దిల్లీ అంతకంటే కాదు. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని రాజకీయ వేదికగా మార్చడం సరికాదు’’ అని ఆ సంస్థ ప్రతినిధులు ఆజ్‌తక్‌తో అన్నారు.
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
దిల్లీ మైనర్ బాలిక హత్య: ప్రేమించినంత మాత్రాన చంపే హక్కు వస్తుందా? అబ్బాయిలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?
వరంగల్ - లింగ నిర్ధరణ పరీక్షల స్కామ్: సెక్స్ డిటెర్మినేషన్ టెస్ట్ అంటే ఏంటి , కడుపులో బిడ్డకు దీన్ని ఎందుకు నిర్వహించకూడదు?
పేద పిల్లల కోసం 100 స్కూళ్లకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ
బీట్‌రూట్‌తో 5 లాభాలు
మా పతకాలను గంగా నదిలో పడేస్తాం: రెజ్లర్లు

ఫొటో సోర్స్, @BAJRANGPUNIA
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు.
తమ పతకాలను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో పడేయనున్నట్లు రెజ్లర్లు ప్రకటించినట్లు ఏఎన్ఐ తెలిపింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ రెజ్లర్లు గత నెల రోజులుగా నిరసన తెలుపుతున్నారు.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొద్దిరోజులుగా ధర్నా చేస్తున్న రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి మార్చ్ చేపట్టారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెజ్లర్లను, నిరసనకారుల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అనంతరం రెజ్లర్లపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బైపోలర్ డిజార్డర్: ఉన్నట్టుండి తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకుంది.. ఆమెకు ఏమైంది?
తెలంగాణ: పల్లెలకు రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నిధులు ఇచ్చే 'గ్రామ జ్యోతి' పథకం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి
జమ్మూకశ్మీర్: లోయలో పడిపోయిన బస్సు, ఏడుగురు మృతి

ఫొటో సోర్స్, ANI
జమ్మూకశ్మీర్‌లో బస్సు లోయలో పడి, ఏడుగురు చనిపోయారు. బస్సు పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి జమ్మూకశ్మీర్‌లోని కాట్రా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జమ్మూ డీసీ తెలిపారు.
వీరిని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో మరో 12 మందికి గాయాలయ్యాయి. వీరికి స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎంఎస్ ధోనీ - రవీంద్ర జడేజా: ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్.. చివరి ఓవర్లో ఏం జరిగింది?
