ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. రేపు మరిన్ని జాతీయ అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ కలుద్దాం....గుడ్ నైట్
వర్షం పడే అవకాశాలు ఇంకా ఉన్నాయని, అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని టాస్ గెలిచిన అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ధోనీ చెప్పాడు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. రేపు మరిన్ని జాతీయ అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, ANI
ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 215 పరుగులు విజయ లక్ష్యాన్ని ఉంచింది గుజరాత్ టైటాన్స్ జట్టు.
చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. వృద్ధిమాన్ సాహ 39 బంతుల్లో 54 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 20 బంతుల్లో 39 పరుగులు సాధించాడు.
హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రషీద్ ఖాన్ చివరి బంతికి డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఫొటో సోర్స్, ANI
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్ల మధ్య ఐపీఎల్ 2023 చివరి మ్యాచ్ ఆదివారం జరగాల్సి ఉంది, అయితే అహ్మదాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో, రిజర్వ్ డే అయిన సోమవారం నాడు ఆడాలని నిర్ణయించారు.
ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టోర్నమెంటును గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్, డిఫెడింగ్ చాంపియన్ గా ఫైనల్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి.
వర్షం పడే అవకాశాలు ఇంకా ఉన్నాయని, అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని టాస్ గెలిచిన అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ధోనీ చెప్పాడు.
ఒకవేళ టాస్ గెలిచి ఉంటే ముందుగా బౌలింగ్ చేసి ఉండేవాడినని హార్దిక్ చెప్పాడు.
ఆదివారం అహ్మదాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా టాస్ కూడా వేయలేకపోయింది. 9 గంటల ప్రాంతంలో వర్షం ఆగిపోయింది. మైదానం మొత్తం ఎండిపోవడంతో అంపైర్లు, ఆటగాళ్లు మైదానాన్ని పరిశీలించేందుకు వెళ్లే సరికి మళ్లీ వర్షం మొదలైంది.
ఆ తర్వాత రాత్రి 11 గంటలకు ఈ మ్యాచ్‌ని సోమవారం రాత్రి 7.30 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, ANI
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
ఉదయం 10.42 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.
రాకెట్‌ను ప్రయోగించిన 19 నిమిషాల తర్వాత 2,232 కిలోల బరువు కలిగిన అధునాతన ఎన్‌వీఎస్-01 నేవిగేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో తెలిపింది.
ప్రయోగం విజయవంతం కావడంతో, శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
అంతరిక్షంలో ఇప్పటికే 8 ఐఆర్ఎన్ఎస్ఎస్ నావిగేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో కాలం చెల్లిన ఒక దానికి బదులుగా ఎన్‌వీఎస్01 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో తయ్యిప్ ఎర్డోగాన్ మరోమారు విజయం సాధించారు.
వరుసగా మూడోసారి ఎర్డోగాన్ టర్కీ అధ్యక్షుడయ్యారు. 2028 వరకు ఆయన టర్కీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
ఆయన ప్రత్యర్థి కెమల్‌కు 47.86 శాతం ఓట్లు రాగా, ఎర్డోగాన్ 52.14 శాతం దక్కించుకున్నట్లు టర్కీ సుప్రీం ఎలక్షన్ కౌన్సిల్(వైఎస్‌కే) ప్రకటించింది.
ఎర్డోగాన్‌కు ఈ ఎన్నికలు అత్యంత క్లిష్టతరంగా మారాయి.
దేశీయంగా ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. టర్కీలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ ఏడాది వచ్చిన తీవ్ర భూకంప ప్రభావం నుంచి ఆ దేశం ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎర్డోగాన్‌ను తేలిగ్గా ఓడించవచ్చని ప్రతిపక్ష పార్టీలు భావించాయి. కానీ, ఎర్డోగాన్‌నే మరోసారి ప్రజల మన్ననలను పొందారు. కాగా, మే 14న టర్కీలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.

ఫొటో సోర్స్, ISRO
తిరుపతి జిల్లా శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్12 నింగిలోకి దూసుకెళ్లనుంది.
లాంచ్ రిహార్సల్స్ ఇప్పటికే నిర్వహించారు.
ఆదివారం ఉదయం 7.12 గంటలకు ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రయోగానికి ముందు నిరంతరాయంగా 27.30 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత ఈ రోజు ఉదయం ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
షార్ కేంద్రం నుంచి చేపట్టే 87వ ప్రయోగమిది. జీఎస్‌ఎల్వీ మార్క్ 2 సిరీస్‌లో ఇది 15వ ప్రయోగం. 2,232 కేజీల బరువు కలిగిన నావిక్ 01 ఉపగ్రహాన్ని ఇది రోదసిలో ప్రవేశపెట్టనుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.