బజరంగ్‌దళ్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకి పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది.
బజరంగ్‌దళ్, ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధిస్తామని కర్ణాటక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
దానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ఖర్గేపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.
విశ్వ హిందూ పరిషత్ అనుబంద సంస్థ అయిన 'బజరంగ్ దళ్ హిందూస్తాన్' అధ్యక్షుడు హితేశ్ భరద్వాజ్ పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మల్లికార్జున్ ఖర్గేకు సమన్లు ఇచ్చింది.
అధికారంలోకి వస్తే కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, బజరంగ్‌దళ్ వంటి సంస్థల పేర్లను అందులో చేర్చింది.
అయితే, బజరంగ్‌దళ్‌ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో కాంగ్రెస్ పోల్చడం వివాదానికి దారితీసింది.
బజరంగ్‌దళ్‌ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సిమి, అల్ ఖైదా వంటి సంస్థలతో పోల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిషేధిస్తామంటూ చేస్తున్న బెదిరింపులకు బజరంగ్‌దళ్ భయపడదని విశ్వహిందూ పరిషత్ తెలిపింది.