ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్‌లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకు 125 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. మరో 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్‌లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక సీఎం పదవికి బసవరాజ బొమ్మై రాజీనామా చేశారు. శనివారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను బొమ్మై కలిసి రాజీనామా పత్రం అందజేశారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించారని బొమ్మై తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ 130కి పైగా స్థానాల్లో గెలుపొందింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది న్యాయవ్యవస్థేనని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
లాహోర్ నుంచి ఆన్‌లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ “నిన్నటి నుంచి నాకు వార్తలు రావడం ప్రారంభించాయి. నేను వాస్తవాలను తెలుసుకుంటున్నాను. నా ర్యాలీలకు కుటుంబాలు వస్తాయి, స్త్రీలు వస్తారు. మాకు హింస ఎందుకు?'' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రభుత్వం ఎన్నికల నుంచి దూరంగా పారిపోతోందని ఆయన ఆరోపించారు.
"ఈ వ్యక్తులు న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థకు అండగా నిలవాలని దేశాన్ని కోరుతున్నా. కాలిపోయిన అన్ని ప్రభుత్వ భవనాలపై విచారణ జరగాలని నేను కోరుకుంటున్నా.
కాల్పులు జరిపిన వారిపై విచారణ జరగాలి. కానీ వారిని ప్రభుత్వం కాకుండా ప్రధాన న్యాయమూర్తి విచారించాలని కోరుతున్నా'' అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
మరోవైపు విధ్వంసానికి పాల్పడిన వారిని 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారులను ఆదేశించినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్ ఇచ్చిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.
లక్నో జట్టులో ప్రేరక్ మన్‌కడ్ 45 బంతుల్లో( 7 ఫోర్లు, 2 సిక్సర్లు) 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్కస్ స్టోయినిస్ 25 బంతుల్లో 40 పరుగులు, నికోలస్ పూరన్ 13 బంతుల్లో 44 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 182 పరుగులు సాధించింది. హన్రీచ్ క్లాసెన్ 29 బంతుల్లో 47 పరుగులు, అన్మోల్ ప్రీత్ సింగ్ 27 బంతుల్లో 36 పరుగులు, అబ్దుల్ సమద్ 25 బంతుల్లో 37 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ జట్టు భారీ స్కొరు సాధించింది.
అయితే లక్నో జట్టు మన్‌కడ్, స్టోయినిస్, పూరన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో 183 పరుగులు లక్ష్యాన్ని చివరి ఓవర్లో అందుకుంది. కాగా, ఈ ఓటమితో హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, NURPHOTO
''కర్ణాటక ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఓటర్లందరికీ సెల్యూట్'' అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
ఈ విజయం 2024లో వాళ్ల అంతానికి నాంది అని, బీజేపీ కనీసం వంద సీట్లు కూడా దాటలేదని ఆమె అన్నారు.
''కర్ణాటక ప్రజలకు సెల్యూట్. ఓటర్లకు, విజేతలకు కూడా సెల్యూట్. కుమారస్వామి మంచి విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ రెండు ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదని భావిస్తున్నా. ఇది 2024లో జరగబోయే అంతానికి నాంది. వాళ్లు (బీజేపీ) వంద సీట్లు కూడా దాటలేరు'' అని మమతా బెనర్జీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది.
కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌జిత్ కౌర్ చౌదరిపై 58 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ గెలుపొందినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్‌లోని స్వార్, ఛాన్‌బే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 10న జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షం అప్నా దళ్ (ఎస్) విజయం సాధించింది.
ఛాన్‌బే నుంచి అప్నా దళ్(ఎస్) అభ్యర్థి రింకీ కోల్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కీర్తి కోల్‌పై 9 వేల 587 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వార్ నియోజకవర్గం నుంచి అప్నా దళ్(ఎస్) అభ్యర్థి షఫీక్ అహ్మద్ అన్సారీ 8 వేల 724 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఒడిశాలోని ఝార్సుగుడా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిజు జనతా దళ్ అభ్యర్థి దీపాలి దాస్, బీజేపీ అభ్యర్థి తకధర్ త్రిపాఠిపై 48 వేల 721 మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
మేఘాలయలోని సోహియాంగ్ అసెంబ్లీ బైపోల్‌లో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి ఎస్‌కేఆర్ లింగ్డో తబహ్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అభ్యర్థి సమ్లిన్ మంగియాంగ్‌పై ఈసీ ప్రకటించింది.

ఫొటో సోర్స్, ECI

ఫొటో సోర్స్, ECI

ఫొటో సోర్స్, ECI

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
''కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతున్నా'' అని మోదీ ట్వీట్ చేశారు.
కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కష్టాన్ని అభినందిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో కర్ణాటకకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకు 114 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. మరో 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
శనివారం సాయంత్రం 5 గంటల వరకున్న సమాచారం ప్రకారం, బీజేపీ 51 స్థానాల్లో గెలుపొందింది. 13 చోట్ల ముందంజలో ఉంది. జేడీఎస్ 17 స్థానాల్లో గెలుపొందగా, మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
మొత్తం 224 స్థానాలకు మే 10న ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు సాధించాలి.
కర్ణాటకలో కాంగ్రెస్ అద్భుతమైన విజయం సాధించిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పేదల తరఫున పోరాడి గెలిచామన్నారు. త్వరలో ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాల్లోనూ ఫలితాలు ఇలాగే వస్తాయని చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ డబుల్ ఇంజిన్ వర్కవుట్ కాలేదని, ఈ ఎన్నికల కోసం మూడేళ్లు నిద్రలేకుండా పనిచేశామని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది తమ పార్టీ అధినాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 20 సార్లు కర్ణాటకకు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.
జాతీయ స్థాయి బీజేపీ నేతలు ప్రచారం చేసినా ప్రజలు తమకే ఓటు వేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ఈ ఓటమికి చాలా కారణాలున్నాయని, అన్నింటినీ విశ్లేషించుకుని లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు.
బీజేపీకి గెలుపోటములు కొత్త కాదని, కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడొద్దని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. ఈ ఓటమిని స్వీకరిస్తున్నానని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండడంపై పార్టీ కార్యకర్తలకు సీనియర్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
''మా పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. అది నాకు బాగా నచ్చిన విషయం'' అని రాహుల్ అన్నారు.
''కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పెట్టుబడిదారుల స్నేహితులకు, పేద ప్రజలకు మధ్య పోటీ జరిగింది. అధికారంపై పేదప్రజలు విజయం సాధించారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే జరుగుతుంది'' అని ఆయన చెప్పారు.
''మేం పేద ప్రజల కోసం పోరాడాం. ఎన్నికల కోసం తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదు. ఈ దేశం ప్రేమను ప్రేమిస్తుందని కర్ణాటక ప్రజలు నిరూపించారు. ఇది కర్ణాటక ప్రజల విజయం. మేం పేద ప్రజలకు ఐదు హామీలు ఇచ్చాం. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆ ఐదు హామీలను నెరవేరుస్తాం'' అని రాహుల్ చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం - కాంగ్రెస్ 50 స్థానాల్లో గెలుపొందింది, మరో 87 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. మరో 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
జేడీ (ఎస్) 9 సీట్లలో గెలుపొందింది. 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
కల్యాణ్ రాజ్య ప్రగతి పక్ష, సర్వోదయ కర్ణాటక పక్ష పార్టీలు చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
మరో రెండు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ 43.2 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ 35.6 శాతం, జేడీ (ఎస్) 13.3 శాతం ఓట్లు దక్కించుకున్నాయి.

ఫొటో సోర్స్, ECI
కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
మధ్యాహ్నం 2.00 గంటలకు కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుపొందింది, 126 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
బీజేపీ 60 స్థానాలలో ముందంజలో ఉంది. నాలుగు స్థానాల్లో గెలుపొందింది.
ఇతరులు 26 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
లైవ్ ఫలితాలు తెలుసుకోవడానికి ఈ కింద లింక్‌ను క్లిక్ చేయండి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
మే 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలు, ఒడిశా, మేఘాలయలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.
ఈ ఉప ఎన్నికల్లో యూపీలోని స్వార్, ఛాన్‌బే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీయే మిత్రపక్షం అప్నా దళ్ (ఎస్) ముందంజలో ఉంది.
ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
ఛాన్‌బే నుంచి అప్నా దళ్(ఎస్) అభ్యర్థి రింకీ కోల్, ఎస్పీ అభ్యర్థి కీర్తి కోల్ కంటే ముందంజలో ఉన్నారు.
స్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అప్నా దళ్(ఎస్) అభ్యర్థి షఫీక్ అహ్మద్ అన్సారీ, సమాజ్‌వాదీ అభ్యర్థి అనురాధ చౌహాన్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఒడిశాలోని ఝార్సుగుడా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తకధర్ త్రిపాఠిపై బిజు జనతా దళ్ అభ్యర్థి దీపాలి దాస్ ముందంజలో ఆధిక్యంలో ఉన్నారు.
మేఘాలయలోని సోహియాంగ్ అసెంబ్లీ బైపోల్‌లో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి ఎస్‌కేఆర్ లింగ్డో తబహ్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అభ్యర్థి సమ్లిన్ మంగియాంగ్‌పై ముందంజలో ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
జలంధర్ లోక్‌సభ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్ రింకూ, కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌జిత్ కౌర్ చౌదరిపై 56 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, 12.45 గంటల వరకు సుశీల్ రింకుకు 2,89,530 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌జిత్ కౌర్ చౌదరికి 2,32,801 ఓట్లు వచ్చాయి.
జలంధర్ నుంచి బీజేపీ అభ్యర్థి ఇక్బాల్ సింగ్ అత్వాల్ 132279 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్‌విందర్ సుఖీ 149677 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
భారీ ఆధిక్యంలో ఉన్న ఆప్ ఇప్పటికే సంబరాలు మొదలెట్టింది.

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము వెనకబడిపోయామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత ఓటమిపై విశ్లేషణ జరుపుకుంటామని ఆయన అన్నారు.
తమ వైపు నుంచి జరిగిన పొరపాట్లను, లోపాలను గుర్తించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి 121 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 72 స్థానాలలో ముందంజలో ఉంది.
లైవ్ ఫలితాలు తెలుసుకోవడానికి ఈ కింద లింక్‌ను క్లిక్ చేయండి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి 121 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో, రేపు ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశం కానుంది.