పాకిస్తాన్: ఇమ్రాన్‌ఖాన్‌కు 8 రోజుల రిమాండ్

అల్ కాదిర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది. ఇమ్రాన్‌ఖాన్‌ను ఉంచిన ప్రత్యేక ప్రదేశంలో కోర్టు విచారణ జరిగింది.

లైవ్ కవరేజీ

  1. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌పై పార్టీల భిన్నవాదనలు, అసలు వీటిని ఎలా నిర్వహిస్తారు, కచ్చితత్వం ఎంత?

  2. , ధన్యవాదాలు

    ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 65.7 శాతం పోలింగ్ నమోదు

    ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికల అధికారులు సీల్ చేశారు.

    రాష్ట్రంలో 65.7 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపినట్టు ఏఎన్‌ఐ వార్తా సంస్థ చెప్పింది.

    కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం మందకొడిగా సాగిన ఓటింగ్ ఆ తర్వాత పుంజుకుంది.

    సాయంత్రం 5 గంటల నాటికి చిక్‌బళ్లాపూర్ జిల్లాలో అత్యధికంగా 76.64 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది.

    బెంగళూరు దక్షిణ జిల్లాలో అత్యల్పంగా 48.63 శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు రూరల్‌లో 76.10 శాతం, బాగల్‌కోట్ 70.04, బెంగళూరు అర్బన్‌లో 52.19 శాతం పోలింగ్ జరిగినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: సైనిక ఆస్తులపై ఉద్దేశపూర్వకంగానే దాడులు - పాకిస్తాన్ సైన్యం ప్రకటన

    పాక్ ఆర్మీ

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత దేశంలో జరుగుతున్న అల్లర్లపై పాక్ ఆర్మీ స్పందించింది.

    సైనిక సంస్థలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయడం ద్వారా పాకిస్తాన్‌ను అంతర్యుద్ధంలోకి నెట్టాలనుకునే వారికి ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది.

    ప్రజలను రెచ్చగొట్టి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించేది లేదని పాక్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పాకిస్తాన్(ఐఎస్‌పీఆర్) విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

    మే 9వ తేదీ ఒకటి చీకటి అధ్యాయంగా గుర్తుంటుందని, కొన్ని దుష్ట శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నాయని విమర్శించింది.

    ''ఇస్లామాబాద్‌ హైకోర్టు వద్ద మంగళవారం పాకిస్తాన్ తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ చైర్మన్‌ అరెస్టు తర్వాత ఆర్మీ ఆస్తులు, సంస్థలపై ఉద్దేశపూర్వక దాడులు జరిగాయి. ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు'' అని ఐఎస్‌పీఆర్ తెలిపింది.

    ''వారి కపట బుద్ధికి ఉదాహరణ ఇది. 75 ఏళ్లుగా శాశ్వత శత్రువు చేయలేని పనిని, రాజకీయం ముసుగులో అధికారం కోసం పాకులాడుతున్న వాళ్లు చేశారు. అయినప్పటికీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్మీ సంయమనం పాటించింది. ఆర్మీ ప్రతిస్పందిస్తే తమ స్వార్థ రాజకీయాల అవసరాలకు వాడుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆర్మీ సంయమనంతో వారి కుట్రను తిప్పికొట్టింది" అని చెప్పింది.

    "ఇవి ఆ పార్టీ ప్లాన్ ప్రకారమే చేసిందని మాకు తెలుసు. ఈ కుట్రలో భాగమైన వారు, ప్లాన్ చేసిన వారు, రాజకీయ నేతలను గుర్తించి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. తర్వాత జరగబోయే పరిణామాలకు ఆ దుష్టశక్తులదే బాధ్యత" అని హెచ్చరించింది.

    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసనలు జరిగాయి.

  5. ఉత్తరాంధ్ర - గంగమ్మ: జీడితోట యజమాని కూలీగా ఎందుకు మారారు? ఆమె జీడితోట షావుకారు చేతుల్లోకి ఎలా వెళ్లింది?

  6. గ్రహాన్ని నక్షత్రం ఎలా మింగేస్తుందో చూడండి

  7. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవీ

  8. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? కచ్చితత్వం ఎంత?

  9. మొక్కలకు చల్లని నీరు పోయకూడదు, ఎందుకో తెలుసా?

  10. ఇమ్రాన్‌ ఖాన్‌కు 8 రోజుల రిమాండ్

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, SHAHZAIB AKBER/EPA-EFE/REX/Shutterstock

    అల్ కాదిర్ ట్రస్టు కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది.

    ఇమ్రాన్‌ ఖాన్‌ను ఉంచిన ప్రత్యేక ప్రదేశంలో కోర్టు విచారణ జరిగింది.

    ఇమ్రాన్ ఖాన్‌ను 14 రోజుల రిమాండ్‌కు అప్పగించాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ), కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

    అయితే, ఆయనకు 8 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. ఇమ్రాన్ ఖాన్‌‌ అరెస్టుపై పాకిస్తాన్ ఆర్మీ వైఖరి ఏమిటి? ఆయనకు ఎవరి మద్దతు ఉంది?

  12. కర్ణాటక పోలింగ్: తొలి 4 గంటల్లో 21% పోలింగ్, విజయంపై బీజేపీ, కాంగ్రెస్ దీమా

    కర్ణాటక ఎలక్షన్స్

    ఫొటో సోర్స్, ANI

    కర్ణాటక శాసనసభలో 224 స్థానాలకు జరుగుతున్న ఓటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు తమదే విజయమని ప్రకటించుకున్నారు.

    ఓటర్లు మార్పు కోసమే ఓటు వేస్తారని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, కనకపుర అభ్యర్థి డీకే శివకుమార్ ఓటు వేయడానికి ముందు మీడియాతో అన్నారు.

    ‘‘ఈరోజు యువ ఓటర్లకు మంచి అవకాశం ఉంది, మార్పు కోసం ఓటు వేస్తారు. రాష్ట్రంలో అవినీతి, ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందో వారికి తెలుసు. మార్పును ఎంచుకుని 141 సీట్లు ఇస్తారని నేను నమ్ముతున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అన్నారు.

    కర్ణాటక ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా తమ పార్టీదే విజయమని ప్రకటించారు. ‘‘కాంగ్రెస్‌కు అవినీతి ట్రాక్‌ రికార్డు ఉంది. చాలా మంది కాంగ్రెస్ నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్నారు. మాజీ సీఎంలు, ఇతరులపై లోకాయుక్తలో 60కి పైగా కేసులు నమోదయ్యాయి’’ అని అన్నారు.

    కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, తొలి నాలుగు గంటల్లో 21శాతం ఓటింగ్ నమోదైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది.

  13. తెలుగు, కన్నడ భాషల లిపి చూడడానికి ఒకేలా ఎందుకు ఉంటుంది... ఒకప్పుడు ఈ రెండు భాషలూ ఒకటేనా?

  14. హైదరాబాద్: నాలుగు అడుగుల హరినారాయణకు రెండు అడుగుల చిన్న బైక్

  15. అడవిలో దారితప్పి అయిదు రోజులు వైన్ తాగి బతికిన లిలియన్

  16. దక్ష: సెక్స్ సంబంధ గాయాలతో చనిపోయిన ఆడ చీతా

  17. పాకిస్తాన్: ఇమ్రాన్‌ఖాన్ కోసం రాత్రికి రాత్రే ప్రత్యేక జైలు

    ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

    ఫొటో సోర్స్, REUTERS

    మంగళవారం అరెస్టైన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఖైదు చేసేందుకు ఇస్లామాబాద్‌లోని పోలీస్ లైన్ ప్రధాన కార్యాలయాన్ని రాత్రికి రాత్రే సబ్‌జైలుగా ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం.

    పటిష్టమైన భద్రత ఉన్న ఈ కార్యాలయంలోని గెస్ట్ హౌస్‌లో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కోర్టు ప్రోసీడింగ్స్ కూడా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఇమ్రాన్‌ఖాన్ పార్టీ కార్యాలయం షేర్ చేసింది. పాకిస్తాన్‌లోని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, బీబీసీ దీన్ని ధృవీకరించుకోలేదు.

    బీబీసీ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం ఇమ్రాన్‌ ఖాన్‌ను 14 రోజుల రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా నేషనల్ అంకౌటబిలిటీ బ్యూరో కోరే అవకాశం ఉంది.

    ఇమ్రాన్‌ఖాన్ అరెస్టును ఇస్లామాబాద్ హైకోర్టు సమర్ధించగా, ఇది చట్టబద్ధమేనంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలపట్ల ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు ఫవాద్ చౌధరి విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోకుండా ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని, ఈ నిర్ణయాన్ని పీటీఐ సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని ఆయన అన్నారు.

    ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

    ఫొటో సోర్స్, EPA

    మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఆగ్రహంతో ఉన్న పీటీఐ కార్యకర్తలు లాహోర్‌లోని ఆస్కారీ టవర్‌కు నిప్పు పెట్టారు. అలాగే ముస్లిం లీగ్-ఎన్ పార్టీ కార్యాలయాన్ని వారు ముట్టడించారు.

    మరోవైపు స్వాత్ చక్ద్రా రహదారి మీదున్న టోల్ ప్లాజాను దగ్ధం చేశారు.

    తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో యాక్సెస్‌ను పాక్షికంగా నిలిపేశారు.

  18. ఐపీఎల్ 2023: సూర్యకుమార్ అదిరిపోయే ఇన్నింగ్స్... బెంగళూరుపై ముంబయి విజయం

  19. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    కర్ణాటక ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    కర్ణాటకలో 224 స్థానాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది.

    ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్(సెక్యులర్) మధ్య పోటీ నెలకొంది.

    మొత్తం 224 స్థానాలకు గాను 2,615 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 58,545 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది.

    పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13న ఈ పోలింగ్ ఫలితాలు వెలువడతాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. డోనల్డ్ ట్రంప్: లైంగిక వేధింపుల కేసులో దోషిగా గుర్తించిన కోర్టు, భారీ జరిమానా

    డోనల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ సివిల్ కేసులో జ్యూరీ నిర్ధరించింది. అయితే ఆయన ఆమెపై అత్యాచారానికి పాల్పడలేదని జ్యూరీ తెలిపింది.

    1990లో న్యూయార్క్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో జీన్ కెరల్‌ అనే మహిళను ట్రంప్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలు ఓ మేగజైన్ కాలమిస్ట్.

    ఈ కేసు దాఖలైన తర్వాత బాధితురాలి ఆరోపణలను కల్పితాలుగా, అబద్ధాలుగా పేర్కొన్నందుకు ట్రంప్ పరువు నష్టం చెల్లించాల్సి ఉంటుందని జ్యూరీ పేర్కొంది. ఈ కేసులో బాధితురాలు కెరల్‌కు 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.41 కోట్లు) చెల్లించాలని జ్యూరీ తీర్పు చెప్పింది.

    కరోల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇన్నాళ్లకు ప్రపంచానికి వాస్తవం ఏంటో తెలిసొచ్చిందని తీర్పు అనంతరం బాధితురాలు జీన్ కెరల్‌ వ్యాఖ్యానించారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, యావత్ మహిళాలోకానిదని ఆమె అన్నారు.

    లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్ దోషిగా తేలడం ఇదే తొలిసారి. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్న ట్రంప్‌కు ఈ తీర్పు ఇబ్బందికరంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.