You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్.. నాంపల్లి కోర్టు ఆదేశం

హైదరాబాద్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ మీదా, ఎస్సై మీదా దాడి చేశారన్న ఆరోపణలపై పోలీసులు వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు.

లైవ్ కవరేజీ

  1. నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. షర్మిలకు 14 రోజుల రిమాండ్.. నాంపల్లి కోర్టు ఆదేశం

    అమరేంద్ర యార్లగడ్డ

    బీబీసీ ప్రతినిధి

    పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

    టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ కేసు విషయమై సిట్ సారథిని కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని, ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కోర్టులో ఆమె తరపు న్యాయవాది వాదించారు.

    41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని న్యాయవాది ఆరోపించారు. ఆమెను రిమాండ్‌కు పంపొద్దని కోరారు.

    ఈ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

  3. అర్ధగంటకు ఒకసారి మూడు నిమిషాలు నడిస్తే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

  4. ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

  5. ప్రీమెచ్యూర్ మెనోపాజ్: 40 ఏళ్లకు ముందే పీరియడ్స్ ఆగిపోతే ఏమవుతుంది?

  6. వేసవి: కారు ప్రయాణంలో తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు

  7. వైఎస్ వివేకా హత్య కేసు - అవినాష్ రెడ్డి: హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టిన సుప్రీంకోర్టు

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినా‌ష్ రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ‌జారీచేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు ఈ రోజు పక్కనపెట్టింది.

    హైకోర్టు ఏప్రిల్ 18న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    హైకోర్టు ఉత్తర్వుపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 21న స్టే ఇచ్చింది. ఈ అంశంపై తదుపరి విచార‌‍‌‍ణ ఏప్రిల్ 24న చేపడతామని, అప్పటివరకు అవినా‌‍‌ష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ‌సీబీఐను ఆదేశించింది.

    ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది.

  8. సూడాన్‌: అక్కడ ఏం జరుగుతోంది? ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?

  9. ఒక హిజ్రా మరొక హిజ్రాను పెళ్లి చేసుకుంటారా?

  10. సచిన్ పక్కన కూర్చోనిస్తారా అని అమితాబ్ ఎప్పుడు అడిగారు...

  11. పోలీసులపై చేయిచేసుకున్నారంటూ వై.ఎస్. షర్మిల పై కేసు నమోదు

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ మీదా, ఎస్సై మీదా దాడి చేశారన్న ఆరోపణలపై పోలీసులు వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వై.ఎస్. షర్మిలపై కేసు నమోదు చేశారు.

    టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

    ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్నకానిస్టేబుల్‌పై ఆమె చేయిచేసుకున్నారు. సొంతపనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల్ నివాసం లోటస్ పాండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

  12. గాంధీ కెమాల్ : తుర్కియే పవర్‌ఫుల్ ప్రెసిడెంట్‌ను గద్దె దింపగలరా?

    మహాత్మా గాంధీని పోలిన రూపురేఖలు, గుండ్రటి కళ్లజోడు, మీసాలు ఉన్న తుర్కియే రాజకీయ నాయకుడు 74 ఏళ్ల కెమాల్ కులిచ్దారోలు చాలా శాంతమూర్తి, మృదుస్వభావి. అందుకే ఆయన్ను 'గాంధీ కెమాల్' అని పిలుస్తారు.

    తుర్కియేలో అత్యంత శక్తిమంతమైన నాయకుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్‌ను గద్దె దించేందుకు కెమాల్ సన్నద్ధమవుతున్నారు. 20 ఏళ్ల క్రితం పదవిలోకి వచ్చిన ఎర్దోవాన్‌కు ఆ దేశంలో ఎదురులేదు. ఇప్పుడు కెమాల్ ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు.

    మాజీ సివిల్ సర్వెంట్ అయిన కెమాల్ వినయ స్వభావం ఎర్దోవాన్ ఆడంబరతకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

    కెమాల్ 2010లో తుర్కియేలోని రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) నాయకత్వాన్ని చేపట్టారు. పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

  13. ‘‘బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయమంటే పోలీసులు పట్టించుకోవట్లేదు’’

    భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ మరోసారి భారత మహిళా రెజ్లర్లు, జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు.

    ఆదివారం మధ్యాహ్నం నుంచి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సాగుతోంది.బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచినప్పటికీ తమకు ఇంకా న్యాయం జరగలేదని రెజ్లర్లు చెప్పారు. ఆయనపైఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని తెలిపారు.

    రెజ్లర్లు మాట్లాడుతూ, ‘‘ఎఫ్ఐఆర్ రాసివ్వాలని మాకు చెప్పారు. మేం ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని అడిగితే పోలీసులు వినట్లేదు’’ అని అన్నారు.

    మరోవైపు దిల్లీ పోలీసులు మాట్లాడుతూ, తమకు ఏడు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

    ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దిల్లీ మహిళా కమిషన్ కూడా పోలీసులకు నోటీసులు పంపించింది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆదివారం బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, రవి దహియా, సాక్షి మలిక్ ధర్నాకు దిగారు.

  14. వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?