అమృత్‌పాల్ సింగ్‌ అరెస్ట్‌పై పంజాబ్ ఐజీ ఏమన్నారంటే...

కొన్ని వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ ఉద్యమకారుడు, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ తెలుగు లైవ్ పేజీ ముగిస్తున్నాం

    నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. వయసును తగ్గించుకునేందుకు ఈ బిజినెస్‌ మేన్ ఏం చేస్తున్నారంటే...

  3. పట్టపగలే తుపాకీ చూపి చైన్ స్నాచింగ్

  4. ఆకలి చావుతో స్వర్గం: 21 మృతదేహాలను గుర్తించిన కెన్యా పోలీసులు, పాస్టర్ అరెస్ట్

  5. జంతర్ మంతర్: మరోసారి నిరసనకు దిగిన మహిళా రెజ్లర్లు

    రెజ్లర్ల నిరసన

    ఫొటో సోర్స్, YEARS

    బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ నేతృత్వంలో మరోసారి కొందరు మహిళా రెజ్లర్లు నిరసనకు దిగారు.

    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్‌లు నిరసన దీక్ష చేపట్టారు.

    గత రెండున్నర నెలలుగా న్యాయం కోసం తాము వేచి చూస్తున్నామని, కానీ, ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగలేదని ఈ ముగ్గురు రెజ్లర్లు చెప్పారు.

    ‘‘మా ఓపిక నశించింది. జంతర్ మంతర్ వద్ద కూర్చుని నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదు’’ అని వినేశ్ ఫోగట్ తెలిపారు.

    ‘‘రెండు రోజులక్రితం, ఏడుగురు అమ్మాయిలు సీపీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిలో ఒకరు మైనర్. పోక్సో కేసు కూడా దాఖలైంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు’’ అని సాక్షి మాలిక్ అన్నారు.

    ఈ ఫిర్యాదు కూడా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా నమోదైందని తెలిపారు.

    రెజ్లర్లు ఇంతకుముందు కూడా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. అయితే, ఆయన తనపై వస్తోన్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.

    క్రీడాకారుల ఆరోపణల తర్వాత మేరీ కోమ్ నేతృత్వంలో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో బబితా ఫోగట్, యోగేశ్వర్ దత్ కూడా సభ్యులు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. అమృత్‌పాల్‌ను ఎలా అరెస్ట్ చేశారంటే..

    సుఖ్‌చైన్ సింగ్ గిల్

    సుమారు నెల రోజులుగా పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను ఆదివారం ఉదయం 6.45 గంటలకు పంజాబ్‌లోని మోగా జిల్లా రోడ్ గ్రామంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

    అమృత్‌పాల్‌ను అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలిస్తున్నట్లు పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుఖ్‌చైన్ సింగ్ గిల్ చెప్పారు.

    మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆయన అమృత్‌పాల్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

    ఒకప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన భింద్రన్‌వాలేది కూడా రోడ్ గ్రామమేనని.. ఈ గ్రామంలోనే గత ఏడాది అమృత్‌పాల్‌ను వారిస్ పంజాబ్ దే సంస్థకు అధ్యక్షుడిగా ప్రకటించారని చెప్పారు గిల్.

    వీడియో క్యాప్షన్, ‘వారిస్ పంజాబ్ దే’ అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు

    అమృత్‌పాల్ ఈ గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేటప్పటికి ఆయన స్థానిక గురుద్వారాలో ఉన్నారని గిల్ చెప్పారు.

    ‘గురుద్వారా అత్యంత గౌరవప్రదమైనది.. ఆ గౌరవానికి భంగం కలగకుండానే గురుద్వారా చుట్టూ పోలీసులు మోహరించారు. తప్పించుకోవడానికి మార్గంలేదని అమృత్‌పాల్‌కు సందేశం పంపించాం’ అని గిల్ చెప్పారు.

    పంజాబ్ పోలీసులు, పంజాబ్ పోలీస్ ఇంటిలిజెన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇదని గిల్ తెలిపారు.

  7. ప్రజలు శాంతియుతంగా ఉండాలి.. పంజాబ్ పోలీసుల అభ్యర్థన

    అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు ధ్రువీకరించారు. ఈ మేరకు పంజాబ్ పోలీస్ విభాగం ట్విటర్ వేదికగా వెల్లడించింది.

    ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి తప్పుడువార్తలను ప్రచారం చేయొద్దని పోలీసులు అభ్యర్థించారు.

    కాగా అమృత్‌పాల్‌ను అస్సాంలోని డిబ్రూగఢ్‌కు తరలించే అవకాశం ఉందంటూ పంజాబ్ పోలీసులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. బ్రేకింగ్ న్యూస్, అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్

    amritpal singh

    ఫొటో సోర్స్, ani

    కొన్ని వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పంజాబ్‌కు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు బీబీసీ పంజాబీ రిపోర్టర్ అర్వింద్ చాబ్రాకు తెలిపారు.

    కాగా ఫిబ్రవరి 23న అమృత్‌పాల్, ఆయన మద్దతుదారులు కలిసి అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

    అనంతరం అమృత్‌పాల్ బంధువులు, అనుచరులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేసినా అమృత్ పాల్ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు.

    మార్చ్ 18 నుంచి అమృత్‌పాల్ సింగ్ అజ్ఞాతంలో ఉన్నారు.

    ఇటీవల అమృత్‌పాల్ భార్య దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో పోలీసులుకు దొరికిపోయారు.

    తాజాగా అమృత్‌పాల్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  9. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  10. భారత్ vs పాకిస్తాన్: ముస్లిం జనాభా గురించి నిర్మలా సీతారామన్ అన్న మాటలు ఎంతవరకు నిజం? - రియాల్టీ చెక్