ఆప్‌కు జాతీయ పార్టీగా ఈసీ గుర్తింపు.. ఏపీలో బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా తొలగింపు

మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి, డి.రాజా నేతృత్వంలోని సీపీఐకు జాతీయ పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. ఈ విషయాన్ని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  2. ప్రపంచంలోని 70 శాతం పులులు భారత్‌లోనే.. పులులకు అటవీ ప్రాంతం సరిపోకపోతే ఏం జరుగుతుంది?

  3. ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?

  4. తెలంగాణ: మూడు పెండింగ్ బిల్లులను ఆమోదించిన గవర్నర్ తమిళిసై

    తెలంగాణ గవర్నర్ తమిళిసై

    బళ్ల సతీశ్

    బీబీసీ ప్రతినిధి

    తెలంగాణ గవర్నర్ తమిళిసై పలు పెండింగ్ బిల్లులను క్లియర్ చేశారు. వాటిలో మూడు బిల్లులను ఆమోదించగా, రెండు బిల్లులను వెనక్కు పంపారు. మరో రెండు బిల్లులు రాష్ట్రపతికి పంపారు.

    ఇంకా ఆమె దగ్గర రెండు బిల్లులు పెండింగులో ఉన్నాయి.

    తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ బిల్లులను తమిళిసై ఆమోదించారు.

    ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు.

    2022 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు మొత్తం 10 బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

    కొన్ని నెలలుగా గవర్నర్, ప్రభుత్వం మధ్య బిల్లులకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఆ వివాదం కోర్టు వరకూ వెళ్లింది. గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదంటూ ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లడం భారతదేశంలో చాలా అరుదైన విషయం.

  5. ఆప్‌కు జాతీయ పార్టీగా ఈసీ గుర్తింపు.. ఏపీలో బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా తొలగింపు

    ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, FB/Arvind Kejriwal

    ఫొటో క్యాప్షన్, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)కు జాతీయ పార్టీగా భారత ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇచ్చిందని ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)కి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీ హోదాను ఈసీ తొలగించిందని ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది.

    రాష్ట్ర పార్టీ హోదాను నిలబెట్టుకొనేందుకు అవసరమైన అర్హతలను ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ సంపాదించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఈసీ తెలిపింది.

    ఎన్నికల కమిషన్ లేఖ

    మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)కి,డి.రాజా నేతృత్వంలోని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి జాతీయ పార్టీ హోదాను ఈసీ ఉపసంహరించింది.

    నాగాలాండ్‌లో ఎన్‌సీపీని, మేఘాలయలో టీఎంసీని రాష్ట్ర పార్టీలుగా ఈసీ గుర్తిస్తుంది.

    జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..?

    ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఎన్నికల కమిషన్ నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం సాధించాలి.

    దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.

    (లేదా)

    కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి.

    (లేదా)

    గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే..?

    ఎన్నికల కమిషన్ 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి.

    (లేదా)

    ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.

    (లేదా)

    ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.

    (లేదా)

    ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.

    (లేదా)

    లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం వచ్చి ఉండాలి.

    ఒక పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత పార్టీలు తమ హోదాను నిలబెట్టుకోవడం లేదా కోల్పోవడం జరుగుతుంది.

  6. ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?

  7. ఎనిమిదేళ్లకే రజస్వల.. ఎందుకిలా జరుగుతుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  8. అగ్నిపథ్‌ స్కీమ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

    అగ్నిపథ్ స్కీమ్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, సైన్యంలో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను దిల్లీ హైకోర్టు ఫిబ్రవరిలో తోసిపుచ్చింది.

    సుచిత్రా కె.మొహంతి

    బీబీసీ కోసం

    అగ్నిపథ్ స్కీమ్‌ను సమర్థిస్తూ దిల్లీ హైకోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.

    భారత సైన్యంలో నియామకాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌నూ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

    అగ్నిపథ్ స్కీమ్‌లో ప్రజాప్రయోజనం ఇమిడి ఉందని, ఇతర అంశాల కన్నా అదే ప్రధానమైనదని కోర్టు వ్యాఖ్యానించింది.

    సైన్యంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను దిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 27న కొట్టివేసింది.

    హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రెండు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 10న తోసిపుచ్చింది.

  9. పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో పోలీసుల విచారణకు హాజరైన ఈటల

    ఈటల రాజేందర్
    ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్

    ప్రవీణ్ శుభం బీబీసీ కోసం

    పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

    వరంగల్ జిల్లా కమలాపూర్ బాలుర హైస్కూల్ సెంటర్ నుంచి పేపర్ లీక్ చేశారనే కేసులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌పై ఏ-1 నిందితుడుగా కేసు నమోదయ్యింది.

    లీక్ అయిన హిందీ పేపర్ వాట్సప్ ద్వారా చేరిన వారిలో ఈటల రాజేందర్, ఆయన పీఏలు ఉన్నారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు.

    ఈ కేసులో ఏప్రిల్ 7న విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఈటలకు నోటీసులు ఇచ్చారు.

    ముందస్తు షెడ్యూళ్ల కారణంగా ఏప్రిల్ 10న విచారణకు హాజరవుతానని ఈటల పోలీసులకు తెలిపారు.

    ఈ మేరకు ఆయన ఈ రోజు వరంగల్ డీసీపీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు.

    పోలీసులు చెబుతున్న నంబర్ నుంచి తనకు ఎలాంటి వాట్సాప్ మెసేజ్ రాలేదని, వేరే నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌ను తాను ఓపెన్ చేసి చూడలేదని పోలీసులకు వివరించినట్టుగా ఈటల తెలిపారు.

  10. అమృత్‌పాల్ సన్నిహితుడు పపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్: పంజాబ్ ప్రభుత్వం

    పపల్ ప్రీత్ సింగ్

    ఫొటో సోర్స్, PAPALPREET/YOUTUBE

    ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పపల్ ప్రీత్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఈ విషయాన్ని బీబీసీ పంజాబీ జర్నలిస్ట్ అర్వింద్ ఛబ్రాకు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.

    పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో పపల్ ప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.

    అమృత్‌సర్‌కి చెందిన పపల్ ప్రీత్ సింగ్ మార్చి 18 నుంచి కనిపించలేదు. ఆయన కూడా అమృత్‌పాల్ సింగ్‌తో కలిసి పారిపోయినట్లు తెలిసింది.

    మార్చి 18 నుంచి అమృత్‌పాల్ సింగ్, ఆయన అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

    అయితే, అమృత్‌పాల్ సింగ్ ఇంకా ఎక్కడున్నారన్నది తెలియలేదు.

    ఇప్పటికే ఆయన అనుచరుల్లో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    గత కొన్నేళ్లుగా పపల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్లు పనిచేయడం లేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. బాలుడి పెదాల మీద దలైలామా ముద్దు పెడుతున్న వీడియోపై వివాదం.. క్షమాపణలు చెప్పిన బౌద్ధ మత గురువు

  12. ట్విటర్ లేబుల్‌ను తప్పుబట్టిన బీబీసీ.. "మాది ఎప్పటికీ స్వతంత్ర సంస్థే "

    బీబీసీ

    ఫొటో సోర్స్, TWITTER

    తమను ప్రభుత్వ ఫండెడ్ మీడియా సంస్థగా ట్విటర్ చూపించడాన్ని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) తప్పుబట్టింది. తాము ఎప్పటికీ స్వతంత్ర సంస్థేనని చెప్పింది.

    బ్రిటన్ ప్రజలు చెల్లించే లైసెన్స్ ఫీజులతో తమ సంస్థ నడుస్తోందని తెలిపింది. బీబీసీ ట్విటర్ అకౌంట్‌ కింద ‘గవర్నమెంట్ ఫండెడ్ మీడియా’గా ట్విటర్ పేర్కొంది.

    బీబీసీకి ఈ లేబుల్ ఇవ్వడం కంటే ముందే అమెరికన్ న్యూస్ గ్రూప్ ఎన్‌పీఆర్ సంస్థను కూడా ప్రభుత్వ ఫండెడ్ మీడియా సంస్థగా ట్విటర్ అభివర్ణించింది.

    దీనిపై ట్విటర్‌తో చర్చలు జరుపుతున్నట్లు బీబీసీ తెలిపింది.

    • బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
  13. నందిని వర్సెస్ అమూల్.. కర్ణాటకలో చెలరేగిన ఆందోళనలు

    నందిని వర్సెస్ అమూల్

    ఫొటో సోర్స్, ANI

    కర్ణాటకలోకి అమూల్ ఉత్పత్తులు రావడంపై ఆ రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగాయి.

    బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు ఈ ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారుల్లో కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ హసన్‌లోని నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించారు.

    70 లక్షల మందికి పైగా రైతులు పాలను ఉత్పత్తి చేసి, నందినికి ఇస్తున్నారని శివకుమార్ అన్నారు.

    గుజరాత్ అమూల్‌ను కూడా రైతులే ఉత్పత్తి చేస్తున్నారని, కానీ అమూల్‌ను ప్రమోట్ చేసి, నందినిని వెనక్కి నెట్టడం సరైంది కాదన్నారు.

    రైతులకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని ఆరోపించారు.

    తమ ప్రొడక్ట్‌ను, తమ రైతుల్ని కాపాడుకోవాల్సి ఉందని శివకుమార్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    అయితే, నందిని తమ రాష్ట్రంలో చాలా మంచి బ్రాండ్‌ అని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీ(ఎస్)లు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  14. 'ఎలిఫెంట్ విస్పరర్స్'తో ప్రధాని మోదీ

  15. పెళ్లిలో గన్‌తో కాల్పులు జరిపి పారిపోయిన పెళ్లికూతురు

  16. ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, లండన్ బయలుదేరిన ఫ్లయిట్ వెనక్కి

    ఎయిరిండియా విమానం

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం(AI-111) కొద్దిసేపట్లోనే వెనుతిరగాల్సి వచ్చింది.

    విమాన సిబ్బందితో ఒక ప్రయాణికుడు గొడవకు దిగడంతో, ఫ్లయిట్‌ను తిరిగి దిల్లీలో ల్యాండ్ చేశారు.

    అతని ప్రవర్తన మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో, విమానాన్ని తిరిగి దిల్లీకి తీసుకురావాల్సి వచ్చిందని ఎయిరిండియా అధికారులు చెప్పారు.

    ఆ విషయంపై దిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఎయిరిండియా అధికారులు ఫిర్యాదు చేశారు.

    విమానంలో సిబ్బందితో గొడవపడిన వ్యక్తిని 25 ఏళ్ల జస్కిరాత్ సింగ్‌గా దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

    ఆయన తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్తున్నట్లు చెప్పారు.

    ఆ ప్రయాణికుడు పంజాబ్‌లోని కపూర్తలాకి చెందిన వారు. ఎయిరిండియా దీనిపై తమకు ఫిర్యాదు చేసిందని, ఫిర్యాదు మేరకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

    ఎయిరిండియా విమానంలో ప్రయాణికుల ప్రవర్తనపై ఇంతకుముందు కూడా పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి.

    కొన్ని రోజుల క్రితం ఒక ప్రయాణికుడు, తన తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కూడా సీరియస్ అయింది. ప్రయాణికుడిపై చర్యలు తీసుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. ‘గోల్ఫ్’ బంతి ధర రూ. 52 లక్షలు, దాని ప్రత్యేకత ఏంటంటే?

  18. 35,199కి పెరిగిన యాక్టివ్ కరోనా కేసులు, దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపడుతోన్న ఆస్పత్రులు

    కరోనా మాక్ డ్రిల్

    ఫొటో సోర్స్, ANI

    కోవిడ్ 19 సంసిద్ధతపై హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

    దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్‌ను నిర్వహిస్తున్నారు.

    హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్న ఎయిమ్స్‌లో, పాట్నాలోని ఐజీఐఎంఎస్ ఆస్పత్రిలో, చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఇలా దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు.

    రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలపై ఆరోగ్య మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించుకోవాలని కేంద్రం కోరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కాగా, దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 35,199కి పెరిగింది.

    గత 24 గంటల్లో భారత్‌లో కొత్త కేసులు 5,880గా నమోదయ్యాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  19. కోటి రూపాయల విలువైన బంగారం పట్టివేత

    బంగారం

    ఫొటో సోర్స్, ANI

    కాకినాడ కస్టమ్స్ డివిజన్ రూ.1.07 కోట్ల విలువైన 1784.5 గ్రాముల బంగారాన్ని పట్టుకుంది.

    చెన్నై నుంచి తణుకుకు ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తోన్న వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

    ఏలూరుకి దగ్గర్లోని టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తోన్న ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    నిందితుడిని అరెస్ట్ చేసి, దీనిపై తదుపరి విచారణ చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుడి నుంచి 455 గ్రాముల బంగారం స్వాధీనం

    దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిని ఆర్‌జీఐఏ హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

    అతని బ్యాగేజ్‌ను స్కాన్ చేసి, 455 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.

    ఈ బంగారాన్ని అతను ట్రాలీ వీల్స్‌కి రాడ్స్‌గా, మేకులుగా పెట్టుకుని వెళ్తున్నాడు.

    వాటిని విప్పదీసి అధికారులు సీజ్ చేశారు.

    దీనిపై తదుపరి విచారణ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  20. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్

    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు

    ఫొటో సోర్స్, Jupally Krishna Rao, Ponguleti Srinivas Reddy/Facebook

    మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.

    పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో వీరిని బీఆర్ఎస్ నుంచి బహిష్కరించింది.

    బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.

    కాగా, కొద్ది రోజులుగా ఆత్మీయ సమావేశాల పేరుతో జిల్లాలోని తమ నేతలతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమావేశమవుతున్నారు.

    ఈ ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు.