You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కిరణ్ కుమార్ రెడ్డి: బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రా మాజీ ముఖ్యమంత్రి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ కండువా కప్పి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  2. రంజాన్: పెరుగు, యాలకులు, పుదీనా తింటే రోజంతా దాహం వేయదా?

  3. 18 మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30 ఏళ్లకు పైగా సాగిన విచారణ...

  4. ‘‘క్యాథలిక్ చర్చిలో 600 మంది చిన్నారులను లైంగికంగా వేధించిన మతబోధకులు’’

  5. ఆంధ్రప్రదేశ్: మిరియాలను ఎక్కడ సాగు చేయొచ్చు? పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత?

  6. 'రావ‌ణాసుర' రివ్యూ: ర‌వితేజ హీరోనా? విల‌నా?

  7. ఏప్రిల్ 14 వరకు పోలీసులందరికీ సెలవులు రద్దు చేసిన పంజాబ్ ప్రభుత్వం

    రాష్ట్రంలో పనిచేసే పోలీసులందరికీ ఏప్రిల్ 14 వరకు సెలవులను రద్దు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ మేరకు పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    వారిస్ పంజాబ్ దే నేత అమృత్ పాల్ సింగ్ సరెండర్‌పై వస్తోన్న తప్పుడు వార్తలను, రూమర్లను నమ్మొద్దని పంజాబ్ పోలీసులు ప్రజలకు సూచించారు.

    మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

  8. డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మబలికి 12 మందిని హత్య, మెజిషియన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    12 మంది వ్యక్తుల్ని హత్య చేసినట్లు ఆరోపణలున్న మెజిషియన్‌ను ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేశారు.

    వారి డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మబలికి వారిని క్రూరంగా చంపినట్లు మెజిషియన్‌పై ఆరోపణలున్నాయి.

    మెజిషియన్ గార్డెన్ నుంచి పలువురి మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    తన గార్డెన్‌లో చాలా మంది వ్యక్తుల మృతదేహాలను ఖననం చేసినట్లు 45 ఏళ్ల మెజిషియన్ సలామిత్ తోహ్రి పోలీసులకు తెలిపారు.

    తమ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని అడిగేందుకు వెళ్లిన కస్టమర్లను పొటాషియం సైనైడ్ విషమిచ్చి వారిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    మెజిషియన్ ఇంటికి వెళ్లిన తన తండ్రి తిరిగి రాలేదని ఒక కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

    మెజిషియన్ ఇంటికి దగ్గర్లో పలు సమాధులను పోలీసులు గుర్తించారు.

    కొన్ని సమాధుల్లో ఇద్దర్ని, ముగుర్ని కలిపి ఖననం చేశారు. ప్రతి సమాధి వద్ద మినరల్ వాటర్ బాటిల్‌ను పోలీసులు గుర్తించారు.

    హత్యకు గురైన వారి వయసు 25 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంది. ఈ హత్యలను మెజిషియన్ ఖండించడం లేదు. నకిలీ నోట్ల వ్యాపారంలో ప్రమేయం ఉండటంతో 2019లో కూడా ఈ మెజిషియన్ జైలుకి వెళ్లాడు.

  9. కిచ్చా సుదీప్ సినిమాలను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థన

    కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మూవీలను, షోలను, కమర్షియల్స్‌ను స్క్రీన్ చేయడం, టెలికాస్ట్ చేయడం ఆపాలని కోరుతూ జనతా దళ్(సెక్యులర్) ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.

    రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని తన లేఖలో పేర్కొంది.

    మే 10న కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తరఫున ప్రచారం చేయనున్నట్లు సుదీప్ చెప్పారు.

    అయితే, ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు.

  10. బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

    మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు.

    కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ కండువా కప్పి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు.

    మార్చి 12న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

    మోదీ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశ్యంతో తాను బీజేపీలోకి చేరినట్టు చెప్పారు.

    కాంగ్రెస్ హైకమాండ్ పొరపాటు నిర్ణయంతో రాష్ట్రం విడిపోయిందన్నారు.

    అభివృద్ధి విషయంలో పేద ప్రజలు, యువత విషయంలో బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందన్నారు.

    పేద ప్రజలకు లబ్ది చేకూరేలా బీజేపీ పనిచేస్తుందన్నారు. దేశమంతా అభివృద్ధి జరిగేలా పాటుపడుతుందన్నారు.

  11. కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న నమీబియా చీతాను వెనక్కి తీసుకొచ్చిన అధికారులు

    కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న నమీబియా చీతా ‘ఒబాన్’ను అటవీ అధికారులు తిరిగి వెనక్కి తీసుకొచ్చారు.

    ఐదు రోజుల కిందట మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాకి సమీపంలోని ఒక గ్రామంలో ఈ చీతా కనిపించిందని అధికారులు చెప్పారు.

    శివ్‌పురి జిల్లా అటవీ ప్రాంతం నుంచి దీన్ని రక్షించి కునో నేషనల్ పార్క్‌కి తీసుకొచ్చినట్లు తెలిపారు.

    ‘‘శివ్‌పురి జిల్లాకి సమీపంలో బైరాద్ గ్రామానికి దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలో సాయంత్రం 4,5 మధ్యలో ఒబాన్‌ను పట్టుకున్నాం. దాన్ని తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్ పల్పూర్ అడవిలో వదిలిపెట్టాం’’ అని కునో వన్యప్రాణుల విభాగపు జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) ప్రకాశ్ కుమార్ వర్మ తెలిపారు.

    నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒబాన్ కూడా ఒకటి.

  12. NCERT: మొఘలుల చరిత్రను పాఠాల నుంచి ఎందుకు తొలగించారు?

  13. క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ బాధను తప్పించే బ్లడ్ టెస్ట్ ఇది

  14. సికింద్రాబాద్, తిరుపతి మధ్య రేపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆత్మగౌరవం, సౌకర్యం, అనుసంధానతలకి పర్యాయపదంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

    సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రవేశపెట్టే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పర్యాటకానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేష ప్రయోజనం చేకూరుస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఇది ఆర్థికాభివృద్ధిని కూడా పెంచుతుందని చెప్పారు.

    దీంతో పాటు, డీడీ న్యూస్ ట్వీట్ చేసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ ప్రాజెక్ట్ ఫోటోలను కూడా మోదీ రీట్వీట్ చేశారు.

    ఈ ముఖ్యమైన మౌలిక సదుపాయాల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

    ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు ఆంక్షలు విధించారు రైల్వే అధికారులు.

    రైల్వే స్టేషన్ పదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆంక్షలుంటాయని దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.

  15. లెబనాన్, గాజాపై ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున క్షిపణి దాడులు

    గాజా స్ట్రిప్‌పై, లెబనాన్‌లో ఉన్న పాలస్తీనా తీవ్రవాద గ్రూప్ హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం భారీ ఎత్తున క్షిపణి దాడులు చేసింది.

    లెబనాన్ నుంచి తమ దేశంపై హమాస్ తీవ్రవాదులు పెద్ద ఎత్తున రాకెట్ దాడులు చేపట్టడంతో ఈ చర్యకు దిగినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.

    దక్షిణ లెబనాన్‌లోని హమాస్ తీవ్రవాదుల స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ప్రకటించాయి.

    ఈ వారం ప్రారంభంలో జెరూసలెం ఆల్-అక్సా మసీదుపై ఇజ్రాయెల్ పోలీసులు వరుసగా దాడులు చేపట్టడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

    ఈ మసీదు ఇస్లాంకు చెందిన మూడవ అత్యంత పవిత్రమైన స్థలం.

    ఈ పవిత్ర స్థలంలో పాలస్తీనా ప్రజలతో ఇజ్రాయెల్ పోలీసులు ఘర్షణకు దిగారు.

  16. టెన్త్ పేపర్ లీక్ కేసు: కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ బెయిల్‌పై విడుదల

    పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్‌పై ఈ ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు.

    జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మాట్లాడిన బండి సంజయ్.. లీకేజీ విషయంలో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేస్తానని చెప్పారు.

    పేపర్ లీక్‌కి, మాల్ ప్రాక్టీస్‌కి తేడా తెలియదా? అని వరంగల్ సీపీ రంగనాథ్‌ను ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను అవమానించేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

    ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.

    టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

    టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నా పత్రాల లీకేజీ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, త్వరలో వరంగల్‌లో భారీ నిరసన ర్యాలీ చేపడతామని అన్నారు.

    హైదరాబాద్‌లో రేపు జరగబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనని విజయవంతం చేయాలని ఆయన బీజేపీ కార్యకర్తలను కోరారు.

  17. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.