లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
రేపు ఉదయం బెయిల్ ఆదేశాలు కరీంనగర్ జైలుకు చేరుతాయని అప్పుడు బండి సంజయ్ విడుదల అవుతారని లాయర్లు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/Facebook
తెలంగాణ 10వ తరగతి హిందీ పేపర్ లీకు కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హన్మకొండ జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది.
‘‘బండి సంజయ్ బెయిల్ విషయంలో కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. 420 సెక్షన్ కింద చీటింగ్, మాల్‌ప్రాక్టీస్ వంటి వాటి కింద ఆయన మీద కేసులు పెట్టారు. కుట్ర కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రశ్నాపత్రం వాట్సాప్‌కు వచ్చిన వారిలో బండి సంజయ్ ఒకరు. మా వాదనతో ఏకీభవించి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు’’ అని బండి సంజయ్ కుమార్ తరపున లాయర్లు తెలిపారు.
రూ.20 వేల పూచీకత్తుతోపాటు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.
రేపు ఉదయం బెయిల్ ఆదేశాలు కరీంనగర్ జైలుకు చేరుతాయని అప్పుడు బండి సంజయ్ విడుదల అవుతారని లాయర్లు తెలిపారు.
సుమారు 8 గంటల పాటు వాదనలు జరిగాయి.

ఫొటో సోర్స్, ANI
హనుమాన్ జయంతి సందర్భంగా దిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో గురువారం భారీ భద్రత మధ్య శోభాయాత్ర జరిగింది.
శోభాయాత్ర నిర్వహించేందుకు హిందూ వాహినీ సంస్థకు దిల్లీ పోలీసులు అనుమతులు ఇచ్చారు. నిర్దేశిత దూరం వరకు మాత్రమే శోభాయాత్రను అనుమతించారు.
విశ్వ హిందూ పరిషత్ కూడా జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించింది.
బజ్‌రంగ్‌దళ్ ఆధ్వర్యంలో దిల్లీలోని నంద్‌నగరి ప్రాంతంలోనూ హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపు జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శోభాయాత్ర జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకున్నాం'' అని దిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ చెప్పారు.
శ్రీరామ నవమి సందర్భంగా దేశంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో హనుమాన్ జయంతికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
హనుమాన్ జయంతికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, UGC
తెలంగాణలో అతిపెద్ద జాతరల్లో ఒకటైన నాగర్ కర్నూల్ జిల్లా సలేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు రావడంతో నల్లమల అటవీప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది.
బుధవారం ప్రారంభమైన జాతర రేపు శుక్రవారం వరకు మూడు రోజుల పాటు జరుగుతుంది.
ఊహించని స్థాయిలో భక్తులు రావడంతో సలేశ్వరం లోయలోని లింగమయ్య స్వామి గుహాలయం సమీపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యూలైన్లలో కొంతమంది భక్తులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కల్వకుర్తికి చెందిన చంద్రయ్య (50) అనే వ్యక్తి ఊపిరాడక లోయలో చనిపోయాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటూ కర్నాటక, తమిళనాడు నుంచి కూడా ఈ జాతరకు భక్తులు హాజరవుతారు.
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులను అటవీశాఖ లోపలికి అనుమతిస్తోంది.
అయితే ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మన్ననూర్, రాంపూర్, చెంచుపెంట వద్ద పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అయింది.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు.
అనిల్ ఆంటోనిని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్‌లు బీజేపీలోకి ఆహ్వానించారు.
తనను బీజేపీలో చేర్చుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అనిల్ ఆంటోని ధన్యవాదాలు తెలిపారు.
‘‘ఒక కుటుంబం కోసం పనిచేయడమే కర్తవ్యంగా చాలా మంది కాంగ్రెస్ నేతలు భావిస్తారు. కానీ, ప్రజల కోసం పనిచేయాలన్నది నా కర్తవ్యమని నేను భావిస్తాను. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీకి ఒక స్పష్టమైన విజన్ ఉంది’’ అని బీజేపీలో చేరిన తర్వాత అనిల్ ఆంటోని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, bbc news
13 మంది మాజీ గుర్ఖా సైనికుల్ని బ్రిటన్ నుంచి తరలించే కేసును తాము తిరిగి సమీక్షిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
కాబూల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పుడు, ఈ మాజీ సైనికులందర్ని అఫ్గానిస్తాన్ నుంచి బ్రిటన్‌కు తరలించారు.
వీరు అంతకుముందు అఫ్గానిస్తాన్‌లో బ్రిటన్ రాయబార కార్యాలయంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వారు.
ప్రస్తుతం వీరందరూ లండన్‌లోనే పనిచేస్తున్నారు. కానీ, గత వారం వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిని నేపాల్ లేదా భారత్‌కు తరలించాలని బ్రిటన్ భావించింది.
కానీ, వీరిని బ్రిటన్ నుంచి తరలించే ప్రక్రియపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ 13 మంది సైనికులకు బ్రిటన్‌లో నివసించే చట్టపరమైన హక్కు ఉందని వారి తరఫున వాదించే న్యాయవాది తెలిపారు.
కాబూల్‌లో బ్రిటన్, కెనడా రాయబార కార్యాలయాలను సంరక్షించే బాధ్యతలను చేపట్టే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ తరఫున వీరు పనిచేశారు.
ఆగస్ట్ 2021లో అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు, బ్రిటన్ ఆర్మీ కోసం పనిచేసే వారిని కాబూల్ నుంచి తరలించారు.

ఫొటో సోర్స్, Mallikarjun Kharge
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు గురువారం పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ‘తిరంగా మార్చ్’ను చేపట్టాయి.
పార్లమెంట్ నడవకుండా ప్రభుత్వమే వ్యవహరిస్తుందని, అదానీ కుంభకోణంపై చర్చకు అంగీకరించకుండా ఎందుకిలా చేస్తున్నారంటూ మార్చ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ ఉభయ సభలు పదేపదే వాయిదా పడుతూ వస్తున్నాయి.
అదానీ స్టాక్స్, ఇతర విషయాలపై జాయింట్ పార్లమెంటరీ విచారణ జరపాలని విపక్షాలు ఆందోళన చేస్తోన్న క్రమంలో లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది.
సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత విపక్ష పార్టీలు ఈ మార్చ్‌ను ప్రారంభించాయి.
లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
‘ప్రజాస్వామ్య గర్భం నుంచి బీజేపీ పార్టీ పుట్టింది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాన నరేంద్ర మోదీ ప్రసంగించారు.
భారత దేశం కోసం బీజేపీ రాత్రింబవళ్లు పనిచేస్తుందని, ‘మా భారతి’కి, రాజ్యాంగానికి, దేశానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు.
హనుమాన్ జీ విలువలను, పాఠాలను స్ఫూర్తిగా తీసుకుని తమ పార్టీ, పార్టీ కార్యకర్తలు రేయింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా మోదీ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 370 ఒక రోజు చరిత్రలో కలిసిపోతుందని విపక్షాలు అసలు భావించలేదని, బీజేపీ నిర్ణయాన్ని అవి జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, FACEBOOK/NARENDRA MODI
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8వ తేదీన తెలంగాణకు రానున్నారు. 2 గంటల పర్యటన నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు.
ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, తిరిగి మధ్యాహ్నం 1.30కు అదే విమానశ్రయం నుంచి తిరిగి వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా.. 11.45 నుంచి మధ్యాహ్నం 12.05 నిమిషాల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.
12.15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.20 వరకు పరేడ్ గ్రౌండ్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఫొటో సోర్స్, UGC
పారాచూట్ శిక్షణలో ప్రమాదవశాత్తు నేవీ ఉద్యోగి చందక గోవింద్ మృతి చెందారు.
గోవింద్ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన వారు.
విశాఖ నేవల్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్న గోవింద్ కోల్‌కతాలో పారాచూట్ శిక్షణ పొందుతున్నారు.
హెలికాఫ్టర్ నుంచి కిందకి దూకే క్రమంలో పారాచూట్ తెరచుకోకపోవడంతో గోవింద్ మృతి చెందారు.
గోవింద్ మృతితో పర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, RBI
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేటు రెపోను యథాతథంగా ఉంచింది.
మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.5 శాతంగా ఉంచేందుకే ఏకగ్రీవంగా అంగీకరించినట్లు గురువారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీ నిర్వహించిన తొలి ద్వైపాక్షిక సమావేశం ఇది.
పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మే 2022 నుంచి ఆర్‌బీఐ రెపో రేటు పెంచుతూ వచ్చింది.
ఇప్పటి వరకు మొత్తం ఈ కీలక రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు పెరిగింది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఈ వడ్డీ రేటును విధిస్తారు.
ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతూ రావడంతో, బ్యాంకులు సైతం ప్రజలపై వడ్డీ రేట్ల భారాన్ని మోపాయి.
ఫిబ్రవరి ప్రారంభంలో జరిగిన ఎంపీసీ సమావేశంలో కూడా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేర్చింది ఆర్‌బీఐ.
రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించగానే.. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.
అలాగే వాస్తవిక జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా అంచనావేస్తున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, reuters
దక్షిణ బ్రెజిల్‌లో 25 ఏళ్ల ఒక వ్యక్తి ప్రీ-స్కూల్ పిల్లలపై గొడ్డలితో దాడి చేశాడు.
ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, ఐదుగురు గాయాలు పాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.
చిన్న గొడ్డలితో గోడపై నుంచి స్కూల్‌లోకి దూకిన ఆ వ్యక్తి పిల్లలపై దాడి జరిపినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
ఈ దాడి చేసిన తర్వాత తనకు తానుగా దుండగుడు పోలీసులకు లొంగిపోయినట్లు సెక్యూరిటీ చీఫ్ మార్సియో అల్బెర్టో ఫిలిప్పి తెలిపారు.
చనిపోయిన చిన్నారుల్లో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నట్లు చెప్పారు.
గాయపడిన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది.