పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కేసు: డోనాల్డ్ ట్రంప్ విచారణ.. న్యూయార్క్‌లో భారీ భద్రత
డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో సెక్స్‌లో పాల్గొన్నారని, ఆ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు తనకు డబ్బు చెల్లించారని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తున్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా బీజేపీతో పవన్ చర్చలు’

ఫొటో సోర్స్, JSP
ఫొటో క్యాప్షన్, మంగళవారం దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. చిత్రంలో నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీ సీనియర్ నాయకులతో తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చర్చలు జరిపారనిజనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
సోమ, మంగళవారాల్లో దిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు.
మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో పవన్‌తోపాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ పాలన నుంచి విముక్తం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు జరిపారు” అని జనసేన చెప్పింది.
రెండు రోజులపాటు సాగిన చర్చల సత్ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రజలకు అందుతాయని పవన్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రధాన ప్రాజెక్టుల గురించి కేంద్ర నాయకత్వానికి పవన్ తెలియజేశారని జనసేన చెప్పింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీలో ఆయన కోరారని చెప్పింది.
నాటో కూటమిలోకి ఫిన్‌లాండ్

ఫొటో సోర్స్, JOHN THYS/AFP
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో ఫిన్‌లాండ్ చేరింది. ఈ భద్రతా కూటమిలో 31వ దేశంగా ఫిన్‌లాండ్ భాగస్వామ్యం అయింది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు 'నాటో చేరిక పత్రాన్ని' ఫిన్‌లాండ్ విదేశాంగ మంత్రి అందజేశారు.
నాటో ప్రధాన కార్యాలయం ముందు ఇప్పటివరకున్న 30 సభ్య దేశాల జెండాలతో పాటు కొత్తగా ఫిన్‌లాండ్ దేశపు తెలుపు, నీలం రంగు జెండా కూడా చేరింది.
రష్యాకు పక్కనే ఫిన్‌లాండ్ ఉండటం గమనార్హం.
నాటోలో ఫిన్‌లాండ్ చేరిక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురుదెబ్బే.నాటోలో ఫిన్‌లాండ్ చేరికతో రష్యాతో నాటో సభ్యదేశాల సరిహద్దు ప్రాంతం రెట్టింపు అయ్యింది.
'వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్'పై పిడుగు
ఈ హిప్పోలను కోట్లు ఖర్చు పెట్టి మరీ కొలంబియా నుంచి ఎందుకు పంపించేస్తున్నారు?
సిక్కింలో మంచు చరియలు విరిగిపడి ఏడుగురి మృతి

ఫొటో సోర్స్, ANI
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మంచు చరియలు విరిగిపడటంతో ఏడుగురు చనిపోయారని భారత సైన్యం తెలిపింది.
ఈ ప్రమాదంలో 27 మందిని కాపాడామని సైన్యం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం గ్యాంగ్‌టక్- నాథులా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది.
సాయంత్రం మరోసారి మంచు పెళ్లలు విరిగిపడటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
ఇతరుల శరీరం నుంచే వచ్చే వాసన మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
కర్ణాటకలో ఆవులను తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్‌పై 'గోరక్షకుల' మూక దాడి, హత్య: అసలేం జరిగింది?
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన చైనా.. భారత్ స్పందన ఏమిటి?
‘‘కళ్లు తెరచి చూసేసరికి, సైనికుల కాలి దగ్గర పడి ఉన్నాను. గాయపడిన నా కాలిపై వారు ఆరు సిగరెట్లతో కాల్చారు.’’
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కేసు: కొన్ని గంటల్లో డోనాల్డ్ ట్రంప్ లొంగిపోయే అవకాశం

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, స్టార్మీ డేనియల్స్, డోనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారనే కేసులో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని మాన్‌హటన్ కోర్టులో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం విచారణకు హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ నగరంలో పెద్దయెత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ట్రంప్ మద్దతుదారులు మాన్‌హటన్ కోర్టు బయటనిరసన ప్రదర్శనలకు దిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.
అమెరికాలో క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే.
ఆయన వయసు 76 సంవత్సరాలు.
విచారణ కోసం సోమవారం ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి న్యూయార్క్‌కు బయల్దేరే ముందు, తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో‘కక్ష సాధింపు’ అని పోస్ట్ చేశారు.
విచారణ నేపథ్యంలో ఆయన న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఉంటున్నారు.
ట్రంప్ ఎదుర్కొంటున్న అభియోగాల పూర్తి వివరాలను విచారణ సందర్భంగా కోర్టు వెల్లడించనుంది. న్యూయార్క్ కాలమానం ప్రకారం ఇది మంగళవారం మధ్యాహ్నం 2:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11:45గంటలకు) ఉంది.
ట్రంప్ తొలుత మాన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ కార్యాలయంలో లొంగిపోవొచ్చని భావిస్తున్నారు.
ట్రంప్ వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్న తర్వాత, ఆయన్ను అరెస్టు చేసినట్టు, కస్టడీలో ఉన్నట్టు పరిగణిస్తారు. ఆ తర్వాత ట్రంప్‌పై అభియోగాలను కోర్టులో చదివి వినిపిస్తారు.
తాను ఏ నేరానికీ పాల్పడలేదని విచారణలో ట్రంప్ నివేదించనున్నారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు.
విచారణ తర్వాత ఆయనకు బెయిలు లభించే అవకాశం ఉంది. బెయిలు వస్తే న్యూయార్క్ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రమే ఆయన ఫ్లోరిడాకు తిరిగి వెళ్తారు.
ట్రంప్ 'ఇండిక్ట్‌మెంట్'కు మాన్‌హటన్ గ్రాండ్ జ్యూరీ ఇటీవల ఆమోదం తెలిపింది. క్రిమినల్ అభియోగాలతో ఇండిక్ట్‌మెంట్ ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే. 235 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి ఆంథోనీ జుర్చర్ చెప్పారు.
ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డారనే రాతపూర్వక అభియోగమే ఇన్‌డిక్ట్‌మెంట్. సాధారణ అభియోగాలను ఎవరైనా ప్రాసిక్యూటర్ ముందుకు తెస్తారు.ఇండిక్ట్‌మెంట్ అనేది ఒక 'గ్రాండ్ జ్యూరీ' ప్రొసీడింగ్స్ తర్వాత జరుగుతుంది.
విచారణ ప్రారంభించడానికంటే ముందే ప్రాసిక్యూటర్ సమర్పించే ఆధారాలను పరిశీలించే కొందరు పౌరుల బృందాన్నిగ్రాండ్ జ్యూరీ అంటారు. అవసరమైతే సాక్షులను ఈ జ్యూరీ విచారిస్తుంది. అభియోగం మోపేందుకు తగినంత ఆధారం ఉందా, లేదా అనేది జ్యూరీ సభ్యులు రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ట్రంప్ విషయంలో ఇలాగే నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, మాన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం వెలుపల పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు స్టార్మీ డేనియల్స్ ఆరోపణ ఏమిటి?
స్టార్మీ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె 1979లో లూసియానాలో జన్మించారు.
ట్రంప్ 2006లో తనతో సెక్స్‌లో పాల్గొన్నారని, ఆ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు తనకు డబ్బు చెల్లించారని స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తున్నారు.
2016 అక్టోబరులో ఆమెకు ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ 1.3 లక్షల డాలర్లు చెల్లించారని 2018లో ద వాల్‌స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన ఒక కథనం చెప్పింది.
ట్రంప్ 2016 నవంబరులో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ జరిపిన చెల్లింపును వ్యాపార ఖర్చు(బిజినెస్ ఎక్స్‌పెన్స్)గా చూపించారని, ఇది బిజినెస్ రికార్డులను తప్పుగా నమోదు చేయడమేననే ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్‌లో బిజినెస్ రికార్డులను ఇలా చూపించడం చట్టవిరుద్ధం.
నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్స్: అగ్రికల్చర్ విద్యార్థులు నెలకు 3 వేల ఉపకారవేతనం పొందాలంటే ఏంచేయాలి?
ఏసీల కరెంటు బిల్లు తగ్గించేందుకు ఎనిమిది చిట్కాలు
విటమిన్-డి అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలి?
అఫ్గానిస్తాన్: డ్రగ్స్‌కు బానిసైనవారిని బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న తాలిబాన్లు
ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న డబ్బుతో ఊరికి రోడ్డు వేయించిన మహిళ
తెలంగాణ: పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
పరీక్షల తొలి రోజున వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటన మరవక మునుపే మరో ఘటన జరిగింది.
రెండో రోజు వరంగల్ జిల్లాలో హిందీ క్వశ్చన్ పేపర్ లీకైనట్లు గుర్తించారు.
ఉదయం 9:30కి పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ వాట్సాప్ లో కనిపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు ఘటనలో బాధ్యులుగా గుర్తించి ఇద్దరు ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి కలిపి నలుగురిని విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
రెండో రోజున హిందీ క్వశ్చన్ పేపర్ వాట్సాప్ లో బయటికి రావడం కలకలం రేపుతోంది.
అయితే ఈ హిందీ క్వశ్చన్ పేపర్ ఏ సెంటర్ నుంచి బయటకు వచ్చింది.. ఎవరు చేశారు అనే దానిపై స్పష్టత లేదు.
దీనిపై విద్యాశాఖ అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కూల్ రూఫ్: వేడి, కరెంట్ బిల్లు రెండూ తగ్గుతాయని చెప్తున్న ఈ విధానం ఏమిటి? తెలంగాణలో అమలు ఎలా
ఇండియాలో తయారైన ఓ కంటి మందుతో ఇన్ఫెన్షన్లు: యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక, స్టాక్ వెనక్కు తెప్పించిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ సంస్థ

ఫొటో సోర్స్, GLOBAL PHARMA HEALTHCARE
భారత్‌లోని గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఐ డ్రాప్స్ వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది.
రాయిటర్స్ వార్త సంస్థ కథనం ప్రకారం.. ఇండియా నుంచి దిగుమతి అవుతున్న కంటి చుక్కల మందు వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని, ఈ చుక్కల మందు వేసుకున్న కొందరు కంటిచూపు కోల్పోయారని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది.
ఈ ఐ డ్రాప్స్ కారణంగా సుమారు 55 మందిలో సమస్యలు వచ్చాయని, ఒకరు ప్రాణాలు కోల్పోయారని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది.
కాగా చెన్నై కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ అమెరికా మార్కెట్‌లోని తన కంటి మందులన్నిటినీ వెనక్కు తెప్పించింది.
భారత్‌లోని ఔషధ తనిఖీ, నియంత్రణ సంస్థలు ఆ ప్లాంట్ తనిఖీకి వెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
