డోనాల్డ్ ట్రంప్: ఏప్రిల్ 4న కోర్టుకు హాజరుకానున్న అమెరికా మాజీ అధ్యక్షుడు

తన లాయర్‌కు ఇచ్చిన డబ్బును లీగల్ ఫీజులుగా చూపించడం, అందుకోసం నకిలీ పత్రాలు సృష్టించారనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు.

లైవ్ కవరేజీ

  1. ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా మొదలైంది?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. సుఖేశ్ చంద్రశేఖర్: ‘‘కేజ్రీవాల్ తరఫున టీఆర్‌ఎస్ పార్టీకి రూ. 75 కోట్లు చేరవేశా’’

    సుకేశ్ చంద్రశేఖర్

    ఫొటో సోర్స్, ANI

    కేజ్రీవాల్ చెప్పడంతో 2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీకి రూ. 75 కోట్లు చేరవేశానని మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ప్రస్తుతం జైలులో ఉన్న సుఖేశ్ శుక్రవారం ఒక లేఖను విడుదల చేశారు.

    ఆ లేఖలో అరవింద్ కేజ్రీవాల్‌తో వాట్సాప్, టెలిగ్రామ్‌లలో తాను చేసిన చాట్ 700 పేజీలు ఉందని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా 2020లో కేజ్రీవాల్ తరఫున రూ. 75 కోట్ల డబ్బును టీఆర్‌ఎస్ పార్టీకి చేరవేసినట్లు వెల్లడించారు.

    తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఆయన ఈ లేఖను విడుదల చేశారు.

    ‘‘కేజ్రీవాల్ గారూ, నేను 2020లో వ్యక్తిగతంగా డెలివరీ చేసిన 15 కేజీల నెయ్యి (ఘీ)కి సంబంధించిన చాట్ ట్రైలర్‌ను చూపించబోతున్నా. నెయ్యి అంటే కోటి రూపాయలు. జైన్, కేజ్రీవాల్ కలిసి పెట్టిన కోడ్ పదం అది. అంటే మీ తరఫున ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి రూ. 15 కోట్లు నేను చేరవేశాను’’ అని సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు.

    ‘‘5 కేసుల నెయ్యి లేదా 5x15 కోట్లను హైదరాబాద్‌లో ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు వద్ద రేంజ్ రోవర్ కారులో ఉండే ఏపీ అనే వ్యక్తి ఇవ్వాలని చెప్పారు’’ అని లేఖలో సుఖేశ్ రాశారు.

    అయితే ఆ లేఖలోని ఆరోపణలు ఎంత వరకు నిజమో తెలియదు.

    సుఖేశ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు.

  4. సావర్కర్‌పై వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ప్రతిపక్షాల ఐక్యతకు గండికొట్టారా?

  5. డొనాల్డ్ ట్రంప్: వచ్చే వారం కోర్టు విచారణకు హాజరు కానున్న అమెరికా మాజీ అధ్యక్షుడు

    డొనాల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం న్యూయార్క్‌లో కోర్టుకు హాజరు అయ్యేటప్పుడు ఆయనకు సంకెళ్లు వేయరని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు.

    న్యాయ విచారణ గురించి ఏబీసీ న్యూస్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ న్యాయవాది జో టాకోపినా బదులిచ్చారు.

    ‘‘ఈ అంశాన్ని చూపుతూ ప్రాసిక్యూటర్లు తాము పొందగలిగినంత పబ్లిసిటీని పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఆయనకు సంకెళ్లు విధించరు.

    వారు ప్రతీ చిన్న అంశాన్ని కోర్టులో ఎత్తి చూపనున్నారని నాకు అర్థమైంది. మేం కోర్టు విచారణకు హాజరవుతాం. నిర్దోషులుగా బయటకొస్తాం. ఈ కేసు చట్టబద్ధతను బట్టి ఇప్పటికిప్పుడు దాఖలు చేసే పిటిషన్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టండి’’ అని టాకోపినా అన్నారు.

  6. ఐపీఎల్: రుతురాజ్ గైక్వాడ్ అవుట్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ (92) అదరగొట్టాడు.

    గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రుతురాజ్ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

    అతను 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. అంతకుముందు 23 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు.

    ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతికి ల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్ పట్టడంతో అతను అవుట్ అయ్యాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు బీజేపీలో చేరారా..? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించారు?

  8. రిలయన్స్, అదానీ, టాటా వంటి పెద్ద సంస్థలతో నష్టం కూడా ఉందా?

  9. అట్టహాసంగా ఐపీఎల్-16 ప్రారంభం, టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా

    హార్దిక్ పాండ్యాతో ధోని

    ఫొటో సోర్స్, ANI

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ ఎడిషన్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

    అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రఖ్యాత సింగర్ అర్జిత్ సింగ్‌తో పాటు హీరోయిన్లు తమన్నా భాటియా, రష్మిక మంధాన ప్రదర్శనలు ఇచ్చారు.

    అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేదికపైకి రాగా, స్టేడియం మొత్తం బాణాసంచా వెలుగులతో వెలిగిపోయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో నాలుగు సార్లు చాంపియన్ సీఎస్కే తలపడుతుంది.

    టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. బంగారం: విదేశాల నుంచి ‘ఉచితంగా’ ఎంత తెచ్చుకోవచ్చు? ఏం చేస్తే స్మగ్లింగ్ అంటారు?

  11. పశ్చిమ బెంగాల్: రెండు వర్గాల మధ్య ఘర్షణలు... గవర్నర్‌తో మాట్లాడిన అమిత్ షా

    అమిత్ షా

    ఫొటో సోర్స్, Amit Shah/Facebook

    పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. శివ్‌పూర్ సహా పలు ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడులు, హింసాత్మక ఘటనలు జరిగాయి. శ్రీరామ నవమి రోజున మొదలైన ఈ ఘర్షణలు శుక్రవారం కూడా కొనసాగాయి.

    ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

    గురువారం జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధమున్న సుమారు 36 మందిని అరెస్టు చేసినట్లు ఒక పోలీస్ అధికారి చెప్పారు.

    మరోవైపు, ఈ హింసాత్మక ఘటనలపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.బీజేపీ, దాని అనుబంధ సంఘాలే ఈ హింసాత్మక ఘటనలకు కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

    ఓ ప్రైవేట్ చానల్‌తో మాట్లాడిన మమతా బెనర్జీ, '' మతం ఎన్నటికీ అశాంతికి ఆశ్రయం ఇవ్వదు. ప్రణాళిక ప్రకారమే ఈ ప్రాంతంలో అల్లర్లు వ్యాప్తి చేస్తున్నారని భావిస్తున్నా. మైనారిటీలు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపులను నిర్వహించొద్దని నేను ముందే విజ్ఞప్తి చేశాను'' అని ఆమె అన్నారు.

    పశ్చిమ బెంగాల్ బీజేపీ మాత్రం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించింది.

    గురువారం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి జరగడంతో అక్కడ హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. చాలా దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘర్షణల్లో పలు దుకాణాలు, వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు.

    పోలీసులపై కూడా ఆందోళనకారులు రాళ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులు జర్నలిస్టులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలైనట్లు సమాచారం.

    పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఘర్షణల మీద ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. నరేంద్ర మోదీ డిగ్రీల వివాదం ఏంటి..? సర్టిఫికెట్లు అడిగిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఫైన్ ఎందుకు వేశారు?

  13. గంగవరం పోర్ట్ గేట్ వద్ద ఉద్రిక్తత... జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్న కార్మికులు

    గంగవరం పోర్ట్ గేటు

    ఫొటో సోర్స్, UGC

    లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    విశాఖపట్నం, గంగవరం పోర్ట్ గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ జీతాలు పెంచమని గత కొంతకాలంగా గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులు అందోళనలు చేస్తున్నారు.

    ఈ విషయంపై లేబర్ కమిషనర్ కార్యాలయంలో కూడా అనేక వినతిపత్రాలు ఇచ్చామని కార్మికులు చెప్పారు. అయినా కూడా ఇటు పోర్టు యాజమాన్యం నుంచి కానీ, లేబర్ కమిషనర్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదని కార్మికులు చెప్పారు.

    ఈ నేపధ్యంలో పేర్ల నూకరాజు అనే అనే కార్మికడ్ని గంగవరం పోర్టు యాజమాన్యం తొలగించింది.

    జీతాలు పెంపు, తొలగించిన నూకరాజుని విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తూ ఇవాళ మరోసారి అందోళనకు దిగారు.

    పోర్టు గేటు వద్ద ఆందోళన చేస్తుండగా.. ధనరాజు అనే కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.

    అయితే అది గమనించిన తోటి కార్మికులు, అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ధనరాజుని అడ్డుకున్నారు.

    దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోర్టు యాజమాన్యం, కార్మికులతో చర్చిస్తోంది.

  14. తెనాలి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో గలాటా.. కౌన్సిలర్ల కొట్లాట

    తెనాలి

    ఫొటో సోర్స్, UGC

    శంకర్ వడిసెట్టి, బీబీసీ కోసం

    తెనాలి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వివాదం హద్దులు మీరింది. కౌన్సిలర్లు కొట్లాటకు దిగారు. టీడీపీ కౌన్సిలర్లపై అధికార పార్టీ నేతలు చేయి చేసుకున్నారు.

    పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ సందర్భంగా ఈ వివాదం రాజుకుంది.

    వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెనాలి అబివృద్ధి కుంటుపడిందని టీడీపీ ఆరోపించింది.

    దానికి ప్రతిగా అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రత్యారోపణలకు దిగారు. ఆక్రమంలో మాటా మాటా పెరిగి వివాదం చొక్కాలు పట్టుకునే వరకూ వెళ్లింది.

    వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మెజార్టీ ఉండడంతో టీడీపీ కౌన్సిలర్ల మీద దాడికి పాల్పడ్డారు.

    మునిసిపల్ చైర్ పర్సన్ వారించినా కౌన్సిలర్లు ఖాతరు చేయలేదు. చైర్ పర్సన్ ఖలేదా నసీమ్, కమిషనర్ వెంకట కృష్ణ వివరణ ఇస్తుండగానే ఈ గలాటా జరిగింది.

    ఈ దాడిని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఖండించారు. తెనాలిలో అధికార పార్టీ నేతల రౌడీయిజం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. టీడీపీ కౌన్సిలర్లపై దాడికి నిరసనగా ఆపార్టీ కార్యకర్తలు ఆందోళనకుదిగారు.

    దాడిలో టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ చొక్కా చిరిగింది.

  15. దిల్లీ: మస్కిటో కాయిల్ తిరగబడి ఊపిరి అందక ఆరుగురు మృతి

    మస్కిటో కాయిల్

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. కార్బన్ మోనాక్సైడ్ వాయువు కారణంగానే వారు మరణించారని పోలీసులు తెలిపారు.

    "దోమల కోసం మస్కిటో కాయిల్ వెలిగించారు. ఏ అర్థరాత్రో అది తిరగబడి పరుపు మీద పడిపోయింది. మంటలు అంటుకున్నాయి. పొగ కమ్ముకుంది. విషవాయులు వ్యాపించాయి. అవి పీల్చడం వల్ల ఇంట్లో ఉన్న సభ్యులు స్పృహ కోల్పోయారు. తరువాత చనిపోయారు" అని డీసీపీ జాయ్ టిర్కీ చెప్పారని ఏఎన్‌ఐ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    నలుగురు మగవాళ్లు, ఒక మహిళ, ఒక ఆరు నెలల పసిబిడ్డ చనిపోయారని, మరొక 15 ఏళ్ల అమ్మాయి, ఒక పురుషుడు గాయాలతో బయటపడ్డారని డీసీపీ తెలిపారు. మంటల్లో గాయపడిన ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు వస్తున్నట్టు గమనించిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు.

  16. ‘‘నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు’’

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Narendra Modi/Facebook

    నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం ప్రధానమంత్రి కార్యాలయానికి లేదని గుజరాత్ హై కోర్టు తీర్పు చెప్పింది.

    ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌తో పాటు గుజరాత్ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీలను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ) ఆదేశించింది.

    అయితే ఈ ఆదేశాలను గుజరాత్ హై కోర్టులోని జస్టిస్ బిరెన్ వైష్ణవ్ కొట్టిపారేశారు.

    ప్రధానిమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు అడిగిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25,000 జరిమానాను కోర్టు విధించిందని ఆయన లాయర్ పెర్సీ కవీనా బీబీసీకి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  17. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల వివాదంలో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. ఏప్రిల్ 12న కోర్టుకు హాజరు కావాలని సమన్లు

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, RAHUL GANDHI/YOUTUBE

    సుచిత్ర మొహంతి, బీబీసీ కోసం

    మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిహార్ మాజీ డిప్యుటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ కేసు వేశారు.

    దీనికి సంబంధించిన్ ఏప్రిల్ 12న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని పట్నాలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది.

    "అందరు దొంగలకీ ఇంటిపేరు మోదీ ఎలా అయింది?" అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

    మార్చి 23న ఇదే విధమైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీని ఆధారంగా లోక్ సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు కూడా పడింది.

    ఈ కేసు విషయమై సుశీల్ మోదీతో మాట్లాడేందికు బీబీసీ ప్రయత్నించింది.

    "ఈ అంశం కోర్టులో ఉంది కాబట్టి, దీనిపై వ్యాఖ్యానించలేనని" ఆయన అన్నారు.

    2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ 'మోదీ' ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సుశీల్ మోదీ ఆరోపించారు.

    అంతేకాకుండా, రాహుల్ వెనుకబడిన వర్గాలపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అందుకు వచ్చే ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అన్నారు.

    ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ కేసులో బెయిల్ మీద ఉన్నారు.

    సుశీల్‌ కుమార్‌ మోదీతో పాటు రోడ్డు నిర్మాణ శాఖ మాజీ మంత్రి నితిన్‌ నవీన్‌, బంకీపూర్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత సంజీవ్‌ చౌరాసియా, బీజేవైఎం నేత మనీశ్‌ కుమార్‌ సాక్షులుగా కోర్టులో తమ వాంగ్మూలాలను సమర్పించారు.

  18. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  19. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన

  20. టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నించిన వైఎస్ షర్మిల అరెస్టు

    వైఎస్ షర్మిల

    ఫొటో సోర్స్, YS Sharmila/Twitter

    టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పలువురు ప్రయత్నించారు.

    నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వెళ్లే దారి వద్ద పోలీసులు వారిని అరెస్టు చేశారు.

    షర్మిలను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు, వైఎస్సార్టీపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో, కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఎంజే మార్కెట్-నాంపల్లి దారిలో ట్రాఫిక్ స్తంభించింది.

    టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయ టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి వెళ్లే ముందు వైఎస్ షర్మిల ఒక వీడియో విడుదల చేశారు.

    అందులో ఆమె మాట్లాడుతూ, నిరుద్యోగుల పక్షాన తెలంగాణలో తొలిసారిగా పోరాడింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ స్కాంలో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు. చిన్న వాళ్లనే దోషులుగా చిత్రీకరిస్తున్నారన్నారు.

    వారం రోజులుగా తనను హౌస్ అరెస్టు చేశారని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఏవో కారణాలు చూపించి పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. నిన్న రాత్రి ఎలాగొలా తప్పించుకుని బయటకు వచ్చి రాత్రంతా ఒక హోటల్లో తలదాచుకున్నానని షర్మిల వీడియోలో చెప్పారు.

    తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసిందని, "నోటీసులు ఇవ్వడానికి నేనేమన్నా క్రిమినల్ నా?" అని ప్రశ్నించారు.