బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం పెట్టారు.
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
పరారీలో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్‌పాల్ సింగ్ బుధవారం తన తొలి వీడియోను విడుదల చేశారు.
పంజాబ్‌ను కాపాడాలనుకుంటే సిక్కులందరూ కలిసి ముందుకు రావాలని ఈ వీడియోలో పిలుపునిచ్చారు.
తాను పోలీసు కస్టడీలో లేనని కూడా ఈ వీడియోలో అమృత్‌పాల్ సింగ్ తెలిపారు.
‘‘నేను బాగున్నా... నాకు ఎవరూ హాని చేయలేరు... ఇక అరెస్ట్ అనేది ఆ గురువు చేతిలో ఉంది.
పంజాబ్‌ను కాపాడాలనుకుంటే సర్బత్ ఖల్సా ఉద్యమంలో సిక్కులందరూ పాల్గొనాలని కోరుతున్నా. నా మీద తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన సిక్కుల అందరికీ నేను రుణపడి ఉంటా’’ అని ఆయన వీడియోలో అన్నారు.
‘‘ఒకవేళ ప్రభుత్వం మమ్మల్ని ఇంటి వద్ద అరెస్ట్ చేయాలనుకుంటే, మేము అరెస్ట్ చేయనిచ్చే వాళ్లం. కానీ, పెద్ద సంఖ్యలో పోలీసులు గుమికూడి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకున్నారు. ఆ సమయంలో దేవుడు నన్ను రక్షించాడు’’ అని ఈ వీడియోలో మార్చి 18న జరిగిన సంఘటల గురించి అమృత్‌పాల్ సింగ్ వివరించారు.
తన మద్దతుదారుల్లో చాలా మందిని అస్సాం జైలుకి తరలించారని అమృత్‌పాల్ సింగ్ ఆరోపించారు.
అయితే, ఎక్కడ ఈ వీడియోను అమృత్‌పాల్ సింగ్ తీశారో ఇంకా తెలియరాలేదు. ఈ వీడియో రికార్డు చేసిన తేది, సమయం కూడా ఇంకా ధ్రువీకరణ కాలేదు.
మార్చి 18 నుంచి అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి ఆయన కోసం పంజాబ్ పోలీసులు వెతుకుతున్నారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం పెట్టారు.
ఆ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అనేక విషయాల మీద ఆయన మాట్లాడారు.
‘‘హైదరాబాద్‌లో నేను హైటెక్ సిటీని తీసుకొచ్చాను. దాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. నాకు పేరు వస్తుందని దాన్ని ఆయన ఆపివేసి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఎలా ఉండేది?
నేను అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చా. నాకు పేరు వస్తుందని దాన్ని ఆపివేసుంటే? జినోమ్ వ్యాలీ తీసుకొచ్చాం. దాన్ని ఆపివేసుంటే ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి ఉండేదా?’’ అని చంద్రబాబు అన్నారు.
సమాజంలో సంపద పంపిణీలో అంతరాయాలు ఎక్కువగా ఉన్నాయని నగరాల్లో ఉండే వారు పేదవాళ్లను దత్తత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
భారతీయ యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మార్చి 29న బెంగళూరులో ఆందోళనలను చేపట్టారు.
బెంగళూరులో జరుగుతున్న ఆందోళనలను పోలీసులు నీటితో చెదరగొట్టారు.
ఆ తర్వాత, ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యూపీఐ చెల్లింపుల మీద చార్జీలు వసూలు చేస్తారంటూ వస్తున్న వార్తల మీద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ) స్పందించింది.
ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపులు ఉచితమేనని, వాటి మీద ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని ఎన్‌సీపీఐ తెలిపింది. వినియోగదారులు, వ్యాపారులకు ఇద్దరికీ ఉచితమేనని వెల్లడించింది.
‘‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్స్(పీపీఐ వాలెట్స్) మీద ఇంటర్‌చేంజ్ చార్జీలు వసూలు చేస్తున్నాం. పీపీఐ మర్చంట్ లావాదేవీలకు మాత్రమే అది వర్తిస్తుంది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించే సాధారణ యూపీఐ చెల్లింపుల మీద ఎటువంటి చార్జీలు ఉండవు’’ అని ఎన్‌సీపీఐ తెలిపింది.
అయితే పేటీఎం, ఫోన్‌పే, మోబిక్విక్ వంటివి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్స్ విభాగంలోకి వస్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక విషయంలో వేచి చూస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడంతో ఖాళీ అయిన వాయనాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్‌ను మీడియా ప్రశ్నించగా- “ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఆరు నెలల గడువు ఉంది. అప్పీలుకు వెళ్లేందుకు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. కాబట్టి మేం వేచి చూస్తాం” అని సమాధానమిచ్చారు.
కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్‌పై ఇటీవల అనర్హత వేటు పడింది.
‘మోదీ’అనే ఇంటిపేరును ఉద్దేశించి 2019 ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయన్ను సూరత్ కోర్టు దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది.
సూరత్ కోర్టు తీర్పుతో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సచివాలం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఫొటో సోర్స్, ANI
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో మే 10న పోలింగ్ జరుగనుంది. ఫలితాలు మే 13న రానున్నాయి. షెడ్యూలును ఎన్నికల కమిషన్(ఈసీ) బుధవారం ప్రకటించింది.
నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ 20.
కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
80 ఏళ్లు నిండిన ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయొచ్చని ఎన్నికల కమిషన్ చెప్పింది.
ఈసారి ఎన్నికల్లో కొత్త ఓటర్లపై దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.
కర్నాటక ఎన్నికల్లో తొమ్మిది లక్షల మందికి పైగా ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు.
1,320 పోలింగ్ కేంద్రాల బాధ్యతలను కేవలం మహిళలే చూడనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌పై వేసిన అనర్హత వేటును లోక్‌సభ ఎత్తేసింది.
ఒక క్రిమినల్ అప్పీలుపై కేరళ హైకోర్టు మార్చి 25న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.
ఒక కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్ధరిస్తూ, లక్షద్వీప్‌లోని కవరట్టి సెషన్స్ కోర్టు జనవరి 11న జైలు శిక్ష వేసింది.
ఆ తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేస్తూ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైకోర్టు తాజా ఉత్తర్వు నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ అమలు కాదని స్పష్టం చేసింది.
ఒక క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఫైజల్ అనర్హత వ్యవహారం చర్చనీయాంశమయ్యింది.

ఫొటో సోర్స్, Facebook/Andhra Pradesh CM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం దిల్లీలో పర్యటించనున్నారు.
రెండు వారాల వ్యవధిలో జగన్ రెండోసారి దిల్లీ వెళుతున్నారు.
మార్చి 16న దిల్లీ వెళ్లిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా అప్పట్లో జగన్ దిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.
తాజా పర్యటనలో ముఖ్యమంత్రి సమావేశాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు.