లవ్లీనా బోర్గోహైన్‌కు స్వర్ణం.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్వర్ణం

ప్రపంచ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. 75 కేజీల విభాగంలో లవ్లీనా వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.

  2. WPL ఫైనల్‌లో ముంబయి లక్ష్యం 132

    WPL final

    ఫొటో సోర్స్, ani

    మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో దిల్లీ కేపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

    జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ 35, షిఖా పాండే 27 పరుగులు, చివర్లో రాధా యాదవ్ 27 పరుగులు చేశారు.

    ముంబయి బౌలర్లలో వాంగ్, హెయిలీ మాథ్యూస్ చెరో 3 విట్లు తీశారు.

  3. స్కాట్లాండ్‌లో ఒరిగిన నౌక.. 35 మందికి గాయాలు

  4. ట్యునీషియా సమీపంలో సముద్రంలో రెండు బోట్లు మునిగి 29 మంది మృతి

    boat

    ఫొటో సోర్స్, Getty Images

    ట్యునీషియా సమీపంలో సముద్రంలో రెండు బోట్లు మునిగిపోవడంతో 29 మందికి పైగా మృత్యువాతపడ్డారు.

    ఇటలీ వెళ్లడానికి మధ్యధరా సముద్రాన్ని దాటే ప్రయత్నంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు.

    గత అయిదు రోజుల్లో మరో 5 బోట్లు ట్యునీషియా ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయాయి.

  5. వంటింట్లో పాత్రలు కడిగే స్పాంజ్‌ మీ ఒంట్లో రోగాలకు కారణమవుతుందా?

  6. బ్రేకింగ్ న్యూస్, మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు

    Indian boxers

    ఫొటో సోర్స్, Getty Images

    ఈ ఏడాది మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు దక్కాయి.

    నీతూ ఘంఘాస్ 48 కిలోల విభాగంలో, స్వీటీ బూరా 81 కిలోల విభాగం, నిఖత్ జరీన్ 52 కేజీలు, లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీలవిభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించారు.

  7. బ్రేకింగ్ న్యూస్, లవ్లీనా బోర్గోహైన్‌కు 75 కేజీల విభాగంలో స్వర్ణం

    Lovlina Borgohain

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు.

    75 కేజీల విభాగంలో లవ్లీనా వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.

    దిల్లీలో ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల విభాగం ఫైనల్లో లవ్లీనా ఆస్ట్రేలియా బాక్సర్ కైట్లిన్ పార్కర్‌పై గెలుపొందారు.

    ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన లవ్లీనా బోర్గోహైన్ సత్తా చాటుతూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

    టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఆమె దేశానికి కాంస్య పతకాన్ని అందించారు.

    తాజా ఎడిషన్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ముందు భారత్ నుంచి గతంలో అయిదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు.

    మేరీ కోమ్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలవగా, సరితా దేవి, ఆర్‌ఎల్ జెన్నీ, కేసీ లేఖ, నిఖత్ జరీన్ ఈ ఘనత సాధించారు.

    దిల్లీ వేదికగా జరిగిన ఈ తాజా ఎడిషన్‌తో వరల్డ్ చాంపియన్‌ల జాబితాలో నీతూ, స్వీటీలతో పాటు లవ్లీనా కూడా చేరడంతో భారత్‌లో వరల్డ్ చాంపియన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.

    దిగ్గజ మేరీకోమ్ తర్వాత నిఖత్ జరీన్ మాత్రమే ఒకటి కంటే ఎక్కువసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్నారు.

    ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీలో నలుగురు బాక్సర్లు ఫైనల్‌కు చేరగా, నలుగురూ విజేతలుగా నిలిచి స్వర్ణ పతకాలను అందుకున్నారు.

  8. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?

  9. నిఖత్ జరీన్: ఒళ్లంతా దెబ్బలు, రక్తం చూసి అమ్మ భయపడింది.. బాక్సింగ్ చేసే అమ్మాయికి పెళ్లి కాదని నాన్నను భయపెట్టారు.. అయినా వెనుకాడలేదు

  10. బ్రేకింగ్ న్యూస్, నిఖత్ జరీన్: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌‌గా తెలంగాణ అమ్మాయి.. వరుసగా రెండోసారి టైటిల్

    Nikhat Zareen

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.

    సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా ఆమె ఘనత సాధించారు.

    దిల్లీ వేదికగా జరిగిన అంతర్జతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) వరల్డ్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం 50 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆమె గెలుపొందారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వియత్నాం క్రీడాకారిణి న్యూయెన్‌పై విజయం సాధించారు.

    బాక్సింగ్‌లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా నిఖత్ జరీన్ రికార్డ్ సృష్టించారు.

    ఆమె ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్’ నామినీల్లో ఒకరు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున పెట్టుబడి ధనం ఇవ్వాలి: కేసీఆర్

    brs

    ఫొటో సోర్స్, kcr

    మహారాష్ట్రలో రైతులకు ఎకరాకు రూ. 10 వేలు చొప్పున పెట్టుబడి ధనం ఇవ్వాలని, 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    రైతులు ఎవరైనా చనిపోతే తెలంగాణ తరహాలో రూ. 5 లక్షల బీమా చెల్లించాలని అన్నారు.

    రైతులు పండించే పంటలను ప్రభుత్వాలే కొనాలన్నారు కేసీఆర్.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. స్విస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ

    భారత జోడీ

    ఫొటో సోర్స్, YEARS

    స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత జోడీ సాత్విక్-చిరాగ్ గెలుచుకున్నారు.

    ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టిల జోడీ చైనాకు చెందిన ప్రత్యర్థి జోడీపై విజయం సాధించింది.

    చైనాకు చెందిన రెన్ జియాంగ్, తెన్ చియాంగ్ జోడీని భారత జోడీ 21-19, 24-22 తేడాతో ఓడించింది.

  13. 90 వేల మంది ఊచకోత: 45 ఏళ్ల తరువాత శవాలను తవ్వితీసి అస్థికలు అప్పగించిన ప్రభుత్వం, తమవారివి కావంటున్న కుటుంబీకులు

  14. సినీ నటి ఆకాంక్ష దుబె మృతి.. ఆత్మహత్యగా అనుమానం

    akankshadubey

    ఫొటో సోర్స్, akankshadubey_official

    భోజ్‌పురి సినీ నటి ఆకాంక్ష దుబె వారణాసిలోని ఓ హోటల్‌లో చనిపోయి కనిపించారు.

    సినిమా షూటింగ్ కోసం వారణాసి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం తన హోటల్ గదిలోకి వెళ్లారని అనంతరం చనిపోయారని చెప్తున్నారు.

    ఆమె మరణానికి కారణాలు తెలియనప్పటికీ ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.

    కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారణాసి వరుణ జోన్ డీసీపీ తెలిపారు.

  15. తిరుమల పాపవినాశం పరిధిలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

    ఎర్రచందనం

    ఫొటో సోర్స్, bbc

    తిరుమల పాపవినాశం పరిధిలో 16 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    టాస్క్‌ఫోర్స్ టీమ్ శనివారం తిరుమల రేంజ్ పాపవినాశం నుంచి కూంబింగ్ చేపట్టింది.

    వారికి తుంబురుతీర్థం నిషేధిత అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు.

    అదే సమయంలో స్మగ్లర్లు కూడా టాస్క్ ఫోర్స్ టీమ్‌ను గమనించి దుంగలు పడేసి పారిపోయారు.

    దీంతో 16 దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

    పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు.

    తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఐ బాలకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.

  16. వైజాగ్: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తప్పిన ప్రమాదం

  17. కాంగ్రెస్‌లో చేరిన ధర్మపురి అరవింద్ తండ్రి డి.శ్రీనివాస్

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసిన డి.శ్రీనివాస్ తిరిగి ఆ పార్టీలో చేరారు.

    తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరి ఆయన రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.

    ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో ఉన్నారు.

    రాహుల్ గాంధీ అనర్హతకు నిరసనగా నేడు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరుగుతున్న దీక్షకు డి.శ్రీనివాస్ హాజరయ్యారు. అక్కడే ఆయన పార్టీలో చేరారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. తిరుమల: కాంట్రాక్ట్ ఉద్యోగి వద్ద గంజాయి లభ్యం, తులసీ ప్రసాద్, బీబీసీ కోసం

    ఉద్యోగి వద్ద గంజాయి

    ఫొటో సోర్స్, UGC

    తిరుమలలో లక్ష్మీ శ్రీనివాసం కార్పోరేషన్ సంస్థ తరపున వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న గంగాధరంను తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) విజిలెన్స్ వింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

    గంగాధరం వద్ద నుంచి 20 చిన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్నరసింహ కిషోర్ బీబీసీకి తెలిపారు.

    కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు విచారణ నిమిత్తం తిరుమల ఎస్ఈబీ పోలీసులకు అప్పగించారు.

    తిరుమలకు నిషేధిత వస్తువులు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో విజిలెన్స్ సిబ్బంది అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా గంగాధర్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి సుమారు 125 గ్రాముల బరువు గల గంజాయి ప్యాకెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

    గంజాయి ప్యాకెట్లు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, గంజాయి ప్యాకెట్లు
  19. ప్రియాంక గాంధీ: ‘‘రాముడు, పాండవులవి కూడా కుటుంబ రాజకీయాలా..? నా అన్నకు తండ్రి ఎవరో తెలియదంటూ నా తల్లిని మీరు అవమానించలేదా?’’

  20. రాహుల్ గాంధీ అనర్హత: దిల్లీలో కాంగ్రెస్ దీక్ష

    మల్లికార్జున ఖర్గే

    ఫొటో సోర్స్, Indian National Congress/Facebook

    రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు ‘‘సంకల్ప్ సత్యాగ్రహ’’ అనే దీక్షను చేపట్టింది.

    దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర సీనియర్ నేతలు దీక్షలో పాల్గొన్నారు.

    ‘‘ఈ సత్యాగ్రహ దీక్షను దేశవ్యాప్తంగా చేపడతాం. రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను కర్నాటకలో చేశారు. కానీ కేసును గుజరాత్‌కు బదిలీ చేశారు. పరువు నష్టం దావా వేయడానికి కర్నాటకలోని బీజేపీకి శక్తి లేదా?’’ అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది