బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జేమ్స్ ఫ్రెండ్

ఫొటో సోర్స్, Getty Images
బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జేమ్స్ ఫ్రెండ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు ఈ అవార్డు వచ్చింది.
టీడీపీ తమతో మంచిగానే ఉంటోంది కానీ 20 సీట్లకే తమను పరిమితం చేసేలా సంకేతాలు ఇస్తోందని ఆయన అన్నారు. అయినా, అలాంటి లోపాయికారీ ఒప్పందాలకు తాను లొంగే ప్రసక్తే లేదని పవన్ తేల్చిచెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జేమ్స్ ఫ్రెండ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు ఈ అవార్డు వచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింగా ‘‘యాన్ ఐరిష్ గుడ్‌బై’’

ఫొటో సోర్స్, Reuters
బెస్ట్ డాక్యుమెంటరీ సినిమాగా నవాల్నీ.
ఈ విభాగంలో భారత్ నుంచి ‘‘ఆల్ ది బ్రీత్స్’’ పోటీ పడింది. దీన్ని శౌనక్ సేన్ డైరెక్ట్ చేశారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shuttersto
ఆస్కార్ వేడుకల కార్యక్రమంలో వేదిక మీద ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు స్టెప్పులు వేశారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shuttersto
ఉత్తమ సహాయకనటి అవార్డును జేమీ లీ కూర్టిస్ గెలుచుకున్నారు.
ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని పాత్రకు ఈ అవార్డు వచ్చింది.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstoc
ఉత్తమ సహాయకనటుడిగా కీ హూ క్వాన్ ఆస్కార్ గెలుచుకున్నారు.
ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని పాత్రకు ఈ అవార్డు వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బెస్ట్ యానిమేటెడ్ సినిమా అవార్డును Gullermo del Toro's Pinocchio గెలుచుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
‘బీబీసీ వన్’లో క్రీడా కార్యక్రమం ప్రసారానికి ఒక రోజు అంతరాయం కలగడంపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ లైసెన్స్ ఫీ చెల్లింపుదారులకు క్షమాపణ చెప్పారు.
బీబీసీ వన్ చానల్‌లో శనివారం ప్రసారం కావాల్సిన ఫుట్‌బాల్ షో ప్రసారాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు.
నిజానికి ‘మ్యాచ్ ఆఫ్ ద డే’ ప్రోగ్రాం హోస్ట్ గారీ లినెకెరెకు మద్దతుగా కామెంటరేటర్లు వాకవుట్ చేయడంతో షో ఆగిపోయింది.
ఈ ఘటన అనంతరం ‘మ్యాచ్ ఆఫ్ ది డే’ ప్రోగ్రాం నిడివి 20 నిమిషాలకు తగ్గించారు.
బ్రిటిష్ ప్రభుత్వ ఇమిగ్రేషన్ పాలసీని విమర్శిస్తూ లినెకెరె వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు శనివారం లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
2014లో రాష్ట్రం విడిపోవడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చివరి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత ఆయన జైసమైక్యాంధ్ర పేరిట ఏపీలో సొంత పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలలో పోటీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసినప్పటికీ సీట్లు సాధించలేకపోయారు. అనంతరం కొద్దికాలానికి ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో పార్టీ మారుతారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఫొటో సోర్స్, nallari kiran kumar reddy

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ వివాహాలను అధికారికంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
ఇలాంటి వివాహంతో ఏర్పడే కుటుంబాలను భారతీయ కుటుంబ వ్యవస్థతో పోల్చలేమని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.
స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం కానీ, వారి మధ్య లైంగిక సంబంధాలు కానీ నేరం కానప్పటికీ వివాహబంధం కాదని పేర్కొంది.
తమ వివాహాలను గుర్తించాలని కోరుతూ ఇటీవల నాలుగు స్వలింగ జంటలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేంద్రం అభిప్రాయం కోరింది కోర్టు.
దీంతో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. సామాజికంగా చూసినా, సాంస్కృతికంగా చూసినా, చట్టపరంగా చూసినా మతాలకు అతీతంగా వివాహానికి అర్థం ఒకటేనని.. కానీ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే సామాజిక సమస్యలు తలెత్తవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, ani
కర్ణాటకలోని మాండ్యాలోలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కురిపించారు.
‘మోదీని సమాధి చేయడానికి గోతిని తవ్వాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కానీ, ఈ దేశంలోని కోట్లాది మంది అమ్మలు, అక్కల దీవెనలే మోదీకి అతిపెద్ద రక్షణ కవచం అని వారికి తెలియదు’ అన్నారు మోదీ.
‘‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మోదీ కోసం సమాధి తవ్వే పనిలో బిజీగా ఉన్నాయి. కానీ, మోదీ మాత్రం బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు.. మోదీకి సమాధి కట్టే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉంది.. అదేసమయంలో మోదీ మాత్రం పేదల జీవితాలు సులభం చేసే పనిలో బిజీగా ఉన్నారు’’ అన్నారాయన.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మోదీ తన కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరు-కుషాల్ నగర్ మధ్య నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేశారు.
‘‘ఈ అభివృద్ధి పనులన్నీ ఇక్కడి ప్రజల జీవితాలలో మార్పు తెస్తాయి. సుసంపన్నతకు మార్గమేస్తాయి. మౌలిక వసతులు కేవలం సదుపాయాలనే తీసుకురావు.. ఉద్యోగాలను, పెట్టుబడులను, ఆదాయాన్ని తెస్తాయి. గత కొన్నేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక్క కర్ణాటకలోనే రూ. లక్ష కోట్ల హైవే ప్రాజెక్టులు చేపట్టింది’ అని చెప్పారు మోదీ.

ఫొటో సోర్స్, ANI
రైతుల కోసం తన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పిన ఆయన చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తి పెంచుతున్నామని.. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు.
మొన్నటి బడ్జెట్‌లో కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినట్లు మోదీ చెప్పారు.
కాగా మోదీ కారు డోర్ పట్టుకుని నిల్చుని అభివాదం చేస్తూ ముందుకు సాగగా దారిపొడవునా బారులుతీరిన జనం ఆయనపై పూల వర్షం కురిపించారు. దీంతో కారుపై పేరుకుపోయిన పూలను మోదీ తిరిగి ప్రజలపైకి విసిరారు.

ఫొటో సోర్స్, BRS
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం ఏఐజీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ పొత్తికడుపులో నొప్పితో ఆసుపత్రికి వచ్చారు. ఎండోస్కోపీ, సీటీ స్కాన్ చేసి కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించాం. మిగతా వైద్య పరీక్షల ఫలితాలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, janasena party
జగన్ పోవాలి.. పవన్ రావాలి’ అనేదే కాపు సంక్షేమ సేన లక్ష్యమని కాపునేత చేగొండి హరిరామజోగయ్య అన్నారు.
పవన్ కల్యాణ్ నేతృత్వంలో మంగళగిరిలో నిర్వహించిన కాపు సంక్షేమ సేన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విపక్షాలు కలవాలని చంద్రబాబు అంటారు.. కానీ రాజ్యాధికారం వారి చేతుల్లో పెట్టాలంటారని అన్నారు.
జనసేనను బలహీనపరచాలని చంద్రబాబు చూస్తున్నారని, కన్నా లక్ష్మీనారాయణను జనసేనలో చేరకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని జోగయ్య ఆరోపించారు.

ఫొటో సోర్స్, janasena
తెలుగుదేశం పార్టీతో పొత్తుల విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తమతో మంచిగానే ఉంటోంది కానీ 20 సీట్లకే తమను పరిమితం చేసేలా సంకేతాలు ఇస్తోందని ఆయన అన్నారు. అయినా, అలాంటి లోపాయికారీ ఒప్పందాలకు తాను లొంగే ప్రసక్తే లేదని పవన్ తేల్చిచెప్పారు.
మంగళగిరిలో ఆదివారం ఆయన కాపు సంక్షేమ సేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపులు లేకుండా రాజకీయం లేదని, అలా అని కాపులు ఒక్కరితోనే సమాజం నడవదని అన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోనూ కాపులు ఉన్నారని.. అందరినీ కలుపుకొంటే దక్షిణ భారతదేశంలోనే కాపులు అత్యంత కీలకం అవుతారని పవన్ అన్నారు.

ఫొటో సోర్స్, janasena
‘కాపులకు మంచి చేసేది నేనే’
తాను పార్టీ పెట్టి పదేళ్లు గడిచినా ఇంకా ప్రతికూల పవనాలే వీస్తున్నాయని.. అనుకూల పవనాలు ఇంకా రాలేదని చెప్పిన పవన్ కల్యాణ్ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలిచినాని, ఓడిపోయినా వెనక్కు తగ్గకుండా ఎవరినీ విరాళలు అడగకుండా సొంత డబ్బుతో పార్టీని నడిపిస్తున్నానని పవన్ చెప్పారు.
కాపులకు ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం రిజర్వేషన్ల పట్ల బీసీ సంఘాల్లో వ్యతిరేకత లేదని పవన్ అన్నారు.
2024 ఎన్నికలు కీలకమని చెప్పిన ఆయన కాపులు తనను కాపు అనుకోవడం లేదని.. అదే పెద్దసమస్యని అన్నారు. కాపులకు మంచి జరగాలంటే అది తన వల్లేనని పవన్ స్పష్టం చేశారు.