You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు ఎందుకు ఓడించారు?: ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రశ్న
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది.
లైవ్ కవరేజీ
కేరళ: పెళ్లయిన 29 ఏళ్ల తరువాత ఈ దంపతులు మళ్లీ ఎందుకు వివాహం చేసుకుంటున్నారు?
దర్శన్ సోలంకి: ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి ఆత్మహత్యపై మధ్యంతర నివేదికలో ఏముంది?
కె-డ్రామా: కొరియన్ సీరియళ్లు బాలీవుడ్ సినిమాలను మరపిస్తున్నాయా, ఎందుకీ క్రేజ్?
మేఘాలయ ముఖ్యమంత్రిగా సంగ్మా ప్రమాణ స్వీకారం
మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. కాన్రాడ్ సంగ్మా నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం సంగ్మా మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధికి గత ఐదేళ్లలో వేసిన పునాదులపై మరింత కృషి చేస్తాం. యువత, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తాం. వివిధ పథకాల ప్రయోజనాలు అట్టడుగు వర్గాలకు చేరే సామర్థ్యం మెరుగుపడింది" అన్నారు.
"కూటమిలో భేదాభిప్రాయాలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ, సామరస్యంగా కలిసి పనిచేయడం, పరిష్కారాలు కనుగొనడం ముఖ్యం. ముందుకెళుతున్న కొద్దీ మరింత మెరుగైన సమన్వయంతో బలమైన జట్టుగా ఎదిగే ప్రయత్నం చేస్తాం" అన్నారు సంగ్మా.
2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటోన్న భవీనా పటేల్
కెమికల్స్ లేకుండా మోదుగు పూలతో హోలీ రంగు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..
చైనా: పిల్లలను కనేందుకు మహిళలు ఎందుకు నిరాకరిస్తున్నారు?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కేసు నమోదు
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్‌ల మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
‘‘మా వాళ్లు చంపేస్తారు...’’
‘‘నిన్ను కూడా చంపేస్తారు...’ అంటూ చెరుకు సుహాస్‌తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో ఇటీవల బయటకు వచ్చింది.
చెరుకు సుహాస్ చేసిన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు, కోమటిరెడ్డి వెంటకరెడ్డి మీద ఐపీసీ సెక్షన్-506 కింద కేసు నమోదు చేశారు.
‘‘బైరి నరేశ్‌ను బట్టలూడదీసి కొట్టమని నేనే చెప్పినా...’’ బండి సంజయ్ పబ్లిక్‌గా వెల్లడి... పోలీసుల రియాక్షన్ ఏంటి?
ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి 'మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్' ప్రయోగం
భారత నావికాదళం మంగళవారం నాడు ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి MRSAM (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్) ఫైరింగ్‌ను విజయవంతంగా చేపట్టింది.
ఎంఆర్ఎస్ఏఎం క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేసిందని నేవీ తెలిపింది.
ఇది 'ఆత్మనిర్భర్ భారత్' పట్ల నేవీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
ఖుష్బూ: ‘మా నాన్న లైంగికంగా వేధించాడని చెబితే... నేను ఆయన పరువు తీశానని విమర్శిస్తున్నారు’
తెలంగాణ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కేసు నమోదు
మహిళా సైంటిస్టులకు నెలకు రూ.55 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?
లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు ఎందుకు ఓడించారు?: ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రశ్న
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది.
యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా సోమవారం చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని పుదూర్ నుంచి గంగాధర మండలం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గంగధార చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత రెండు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారో చెప్పాలని ప్రశ్నించారు.
‘‘చొప్పదండి వేదికగా తెలంగాణ ప్రజలను ప్రశ్నిస్తున్నా. తెలంగాణలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారు? తెలంగాణ ఇచ్చినందుకా? ఉచిత విద్యుత్ ఇచ్చినందుకా? ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకా? ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు అమలు చేసినందుకా? మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకా?” అని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు.
‘ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులు,రోడ్లే ఉన్నాయి. కరీంనగర్,వరంగల్ జిల్లాకు13లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో నీళ్లు అందించాం. కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీరుస్తామంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కానీ అందులో చొప్పదండికి చుక్క నీరు రాలే. దళిత ముఖ్యమంత్రి,దళితులకు మూడెకరాల భూమి,మైనార్టీలకు రిజర్వేషన్లు,గిరిజనులకు రిజర్వేషన్లు,పోడు భూములకు పట్టాలు,ప్రతి నియోజకవర్గంలో100పడకల ఆస్పత్రి,ప్రతి మండల కేంద్రంలో30పడకల ఆస్పత్రి,నిరుద్యోగభృతి,డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,రైతుకు రుణమాఫీ,కేజీ టు పీజీ ఉచిత విద్య,ఇంటికో ఉద్యోగం,ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు..ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు’ అన్నారు రేవంత్ రెడ్డి.
సోమవారం యాత్ర ప్రారంభానికి ముందు కొండగట్టు అంజన్నను రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం పాదయాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు పోతారం రిజర్వాయరును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పోతారం చెరువు బ్యాక్ వాటర్ వల్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
‘‘వానాకాలంలో రాకపోకలకు ఇక్కడి గ్రామాల ప్రజలకు అంతరాయం ఏర్పడుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొనాపూర్ లో135కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదు.మత్తడి నిర్మాణం పూర్తి కాలేదనే సాకుతో బ్రిడ్జ్ నిర్మాణం సాగడం లేదు. నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారికి పరిహారం అందించడంలేదు. కేవలం రూ.25కోట్లు ఖర్చు పెడితే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్... ఇక్కడి ప్రజల సమస్యలు ఎందుకు తీర్చడంలేదు?తక్షణమే ఈ రోడ్ లో బ్రిడ్జ్ నిర్మించాలి. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల మూడు నెలల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమస్యలను గ్రామాలకు సంబంధించిన రైతులతోఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళతారు. పనులు పూర్తి చేయకపోతే వచ్చే సోమవారం నుంచి స్థానిక కాంగ్రెస్ పోరాట కార్యాచరణ మొదలు పెడుతుంది’ అన్నారు రేవంత్ రెడ్డి.
హెచ్3ఎన్2 వైరస్ ఏమిటి? డాక్టర్లు ఏమంటున్నారు?
భారత్ పెద్దరికానికి అడ్డంకి రష్యాయేనా?
హైదరాబాద్‌లో సిద్ధమవుతున్న భారీ అంబేడ్కర్ విగ్రహం, ఎలా ఉందంటే...
‘బిడ్డకు పాలిస్తూ హాకీ ప్రాక్టీస్ చేసి బంగారు పతకం సాధించా’