లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు
దిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారానికి అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు

ఫొటో సోర్స్, Getty Images
అబుదాబి నుంచి విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ఇటాలియన్ మహిళ, విమాన సిబ్బందిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా మరో సిబ్బందిపై ఉమ్మివేశారు. దీంతో, విమానయాన సంస్థ సిబ్బంది ఆమెను తన సీటుకే నిర్బంధించి పోలీసులకు అప్పజెప్పారు.
సోమవారం ముంబైలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆ మహిళను విడుదల చేశారు.
విమానయాన సిబ్బంది చేసిన ఆరోపణలన్ని తప్పుడు కథనాలుగా ఆ మహిళ న్యాయవాది కొట్టిపారేస్తున్నారు.
వికృత ప్రవర్తనతో, హింసాత్మకంగా వ్యవహరిస్తుండటంతోనే ఆ మహిళను తమ సిబ్బంది అదుపులో పెట్టాల్సి వచ్చిందని విస్తారా తెలిపింది.
తమను కొట్టినట్టు, తమ కొలీగ్‌పై ఉమ్మివేసినట్టు విస్తారా సిబ్బంది పోలీసు ఫిర్యాదు దాఖలు చేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.
ఎకానమీ క్లాస్‌లో తనకు కేటాయించిన సీటును పక్కన పెట్టి, బిజినెస్ క్లాస్‌లోకి వెళ్లి కూర్చుందని ఫిర్యాదులో పేర్కొన్నారు సిబ్బంది.
ఆమెను ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో విమాన కెప్టెన్ వార్నింగ్ కార్డు జారీ చేశారు. దీంతో ఆమెను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని విస్తారా తెలిపింది.
తనకు కేటాయించిన సీటులో అసౌకర్యవంతంగా భావించి, ఖాళీగా ఉన్న సీటును కేటాయించాలని ఇటాలియన్ మహిళ కోరినట్టు ఆమె న్యాయవాది ప్రభాకర్ త్రిపాఠి బీబీసీకి తెలిపారు.
ఈ విషయంలో సిబ్బందితో ఘర్షణ తలెత్తిందన్నారు. ఈ ఘర్షణతో సిబ్బంది ఆమెను బాత్‌రూమ్ వాడుకునేందుకు కూడా అనుమతించలేదన్నారు.
ఆ తర్వాత తనని వాష్‌రూమ్‌కి వెళ్లనిచ్చారని, కానీ తిరిగి రాగానే నిర్భదించారని న్యాయవాది త్రిపాఠి ఆరోపించారు. ఆ మహిళ తాగి ఉందని పోలీసులు చెప్పినట్టు వస్తున్న మీడియా కథనాలను ఆయన కొట్టివేశారు.

పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మసీదులో జరిపిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగింది.
అత్యంత సెక్యూరిటీ జోన్‌లోని మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
బాంబర్ మసీదు లోపలకు ఎలా వచ్చాడన్న దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
శిథిలాల కిందనున్న మృతదేహాలను సహాయక సిబ్బంది బయటికి తీశారు. తొమ్మిది మందిని ప్రాణాలతో రక్షించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.
పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో ఉగ్రవాదులు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాలని చూశారని ప్రధాన మంత్రి హెహబాజ్ షరీఫ్ అన్నారు.
ఇప్పటికే 20కి పైగా పోలీసు అధికారుల అంత్యక్రియలు కూడా జరిగాయి. వారి శవపేటికలపై పాకిస్తాన్ జాతీయ పతకాన్ని ఉంచారు. ఈ దాడిలో చనిపోయిన వారిలో చాలా మంది పోలీసు సిబ్బందే ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
గుజరాత్‌లోని మూడు నెలల క్రితం జరిగిన మోర్బి వంతెన ప్రమాదానికి సంబంధించి, ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టిన ఒరెవా గ్రూప్ ఎండీ జేసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయారు.
గుజరాత్‌లోని మోర్బి కోర్టులో ఆయన సరెండర్ అయినట్టు పీటీఐ రిపోర్టు చేసింది.
గత ఏడాది అక్టోబర్ 30న ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 134 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
లొంగిపోయిన జేసుఖ్ పటేల్‌ను కోర్టు జ్యూడిషియల్ కస్టడీకి పంపించింది.
జనవరి 27న కోర్టులో సమర్పించిన 1,262 పేజీల ఛార్జ్‌షీటులో జేసుఖ్ పటేల్‌ని నిందితుడిగా దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఒరెవా గ్రూప్ ఎండీ పటేల్‌కి వ్యతిరేకంగా గత వారం కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఒరెవా ఈ బ్రిడ్జి మరమ్మతు కార్యకలాపాలు చేపట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, FACEBOOK/APCM
కోడికత్తితో దాడి కేసులో బాధితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమయ్యింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనుపల్లి శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. అయితే కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఇందులో బాధితుడు షెడ్యూల్ కూడా ఉంచాలని తెలిపింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశించింది.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా విశాఖ ఎయిర్ పోర్టులో ఆయన మీద దాడి జరిగింది. ఈ కేసుని తొలుత ఏపీ పోలీసులు విచారించగా, ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ)కి అప్పగించారు.
నిందితుడు నాలుగేళ్లుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు.
జనుపల్లి శ్రీనివాస్‌కి బెయిల్ ఇవ్వాలని, విచారణ వేగవంతం చేయాలని ఇటీవల అతని కుటుంబీకులు ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం వద్ద ఆందోళనకు ప్రయత్నించారు.
చివరకు నాలుగేళ్ల తర్వాత కేసు విచారణ మొదలయ్యింది. ఇప్పటికే జాప్యం జరిగినందున, ఇకపై కేసు విచారణ త్వరగా పూర్తి కావాలని తాము ఆశిస్తున్నట్టు నిందితుడి తరుపు న్యాయవాది సలీం మీడియాకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆర్థిక సర్వేను మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉందని ఆర్థిక సర్వే అభివర్ణించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతం మధ్యలో పెరుగుతుందని ఆర్థిక సర్వే 2023 అంచనావేసింది.
ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం(పీఎల్ఐ) స్కీమ్, పీఎం గతి శక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విస్తరణ, మూలధన పెట్టుబడులు భారత ఆర్థిక వృద్ధికి సహకరిస్తాయని సర్వే పేర్కొంది.
2021 డేటా ప్రకారం దేశ జనాభాలో 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 47 శాతం మంది జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారని ఆర్థిక సర్వే 2023 తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కచ్చితంగా గ్రామీణాభివృద్ధిపై దృష్టిసారించాలని వెల్లడించింది.
గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిస్తే, దేశంలో అన్ని వైపుల అభివృద్ధి సాధిస్తామని ప్రభుత్వం తెలిపింది.
బుధవారం ఆర్థిక మంత్రి దేశ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
ప్రధాన ఆర్థిక సలహాదారు తన టీమ్‌తో కలిసి ఆర్థిక సర్వేను సిద్ధం చేశారు. డాక్టర్ వీ అనంత్ నాగేశ్వరన్ భారత్ ప్రధాన ఆర్థిక సలహాదారు.
ఆర్థిక సర్వే 2023ను వివరించేందుకు మంగళవారం సాయంత్రం ఆయన పత్రికా సమావేశం నిర్వహించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోని పెషావర్ మసీదులో జరిగిన బాంబు దాడిలో 92 మంది మృతి చెందగా, 157 మంది గాయాలు పాలయ్యారు.
బాంబు దాడి తర్వాత చేపట్టిన సహాయక చర్యలు ప్రస్తుతం ముగిశాయి.
గాయాలు పాలైన వారిలో 57 మందికి చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తెలిసింది.
సహాయక చర్యల్లో భాగంగా అర్థరాత్రి, మంగళవారం ఉదయం 24 మృతదేహాలను వెలికి తీశారు.
శిథిలాల కిందనున్న 9 మంది ప్రజల్ని ప్రాణాలతో రక్షించారు.
ప్రార్థనలు చేసుకుంటున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని మసీదులో సోమవారం మధ్యాహ్నం 1.30కి(8.30 జీఎంటీ) సమయంలో ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.
ఈ మసీదు పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంతంలో ఉంది.
ప్రతి రోజూ ఆ మసీదుకు 1,500 మంది నుంచి 2 వేల మంది వరకు పోలీసు అధికారులు వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారని పెషావర్ పోలీసు చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ చెప్పారు.
దాడి జరిగిన సమయంలో 300 మంది నుంచి 400 మంది పోలీసులు ఆ మసీదులో ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు.

ఫొటో సోర్స్, AP CMO
త్వరలోనే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
దిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.
తాను కూడా త్వరలోనే విశాఖపట్నానికి మారుతున్నానని జగన్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారానికి అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు.

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Tarakarathna
నందమూరి తారకరత్న ఆరోగ్యం మీద సినీనటుడు చిరంజీవి స్పందించారు.
‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.
ఇకపై ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. తను త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటూ ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, భగవంతునికి ధన్యవాదాలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ నెల 27న నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో తారకరత్న అనారోగ్యానికి లోనయ్యారు. ఆయనకు గుండె పోటు వచ్చినట్లు నాడు నందమూరి బాలకృష్ణ తెలిపారు.
ప్రస్తుతం బెంగళూరులో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, MAAZ TARIQ
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో మృతుల సంఖ్య 59కి చేరింది.
ఈ మసీదు పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంతంలో ఉంది.
ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే దాడి జరిపినట్టు ప్రకటించలేదు. పాకిస్తాన్ తాలిబాన్‌తో సంబంధమున్న వారు ఈ దాడి జరిపినట్లు భావిస్తున్నారు. మరో వైపు ఆ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ తాలిబాన్ ప్రకటించింది.
బాంబు దాడి జరిగిన సమయంలో మసీదులో 300 నుంచి 400 మంది వరకు పోలీసు అధికారులు ప్రార్థనలు చేస్తున్నారని స్థానిక మీడియాకు పెషావర్ పోలీసు చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ చెప్పారు.
సోమవారం మధ్యాహ్నం 1.30కి(8.30 జీఎంటీ) ప్రార్థనలు జరిగే సమయంలో ఆ దాడి జరిగింది.