రిపబ్లిక్ డే: పరేడ్‌లో బీఎస్ఎఫ్ ఒంటెల దళంలో తొలిసారిగా మహిళా జవాన్లు
కర్తవ్య పథ్‌లో జరుగుతున్న 74వ గణతంత్ర వేడుకల్లో మొట్ట మొదటిసారి ఈజిప్ట్ సాయుధ దళాల కంటింజెంట్ కూడా మార్చ్ నిర్వహించింది. ఈ టీమ్‌లో 120 మంది జవాన్లు పాల్గొన్నారు. బీఎస్ఎఫ్ ఒంటెల దళంలో మహిళా జవాన్లు ఆకట్టుకున్నారు.
లైవ్ కవరేజీ
తారకరత్న: బెంగళూరు తరలించడం లేదు.. కుప్పంలోనే వైద్యం అందించనున్న బెంగళూరు వైద్యులు
ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/Facebook
నందమూరి తారకరత్నను బెంగళూరు తరలించే యోచనను వైద్యులు విరమించుకున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఇంతకుముందే బెంగళూరు నుంచి వైద్య బృందం తరలివచ్చింది.
కుప్పంలోని పీఈసీ ఆస్పత్రిలోనే ఆయనకు వైద్యం అందించాలని బెంగుళూరు వైద్య బృందం నిర్ణయించుకుంది.
ఫిన్‌లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
పవన్ కల్యాణ్: తారకరత్న త్వరగా కోలుకోవాలి
ఫొటో సోర్స్, JanaSena Party/Facebook
నందమూరి తారకరత్న అస్వస్థతకు గురి కావడం బాధాకరమని జనసేన
అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
‘మెరుగైన చికిత్స కోసం
బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని
భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ
కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
తారకరత్న: ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్
ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/Facebook
ఫొటో క్యాప్షన్, (ఫైల్ ఫొటో)
నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నారా
లోకేశ్ చేరుకున్నారు.
నేటి పాదయాత్ర పూర్తి చేసుకుని పీఈఎస్ ఆసుపత్రికి ఆయన
వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
ఇక తారకరత్న
ఆరోగ్యపరిస్థితి పరిశీలించుందకు బెంగుళూరు నారాయణ హృదయాలయ నుంచి ప్రత్యేక వైద్యులు
బృందం కుప్పం చేరుకుంది.
దిల్లీ
యూనివర్సిటీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
నరేంద్ర మోదీ మీద
బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించడంతో
అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దిల్లీ
యూనివర్సిటీలోని ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ బయట బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని
ఎన్‌ఎస్‌యూఐ-కేఎస్‌యూ ప్రకటించింది. అయితే దీనికి అనుమతి లేదంటూ దిల్లీ
యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఈ నేపథ్యంలో
దిల్లీ పోలీసులు యూనివర్సిటీలో మోహరించారు. డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించిన
సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?
‘తారకరత్న పరిస్థితిని పరిశీలించేందుకు నారాయణ హృదయాలయ నుంచి వైద్యులు’
ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/Facebook
తారకరత్న ఆరోగ్యపరిస్థితిని
పరిశీలించేందుకు నారాయణ హృదయాలయ నుంచి వైద్యులు వస్తున్నట్లు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య
చౌదరి మీడియాకు తెలిపారు.
కాస్త రికవరీ
అయినప్పటికీ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ మీదనే తారకరత్న ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర నేడు కుప్పం నుంచి మొదలైంది. ఆ యాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి
ఫొటో సోర్స్, UGC
ఒడిశా మాజీ
ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో చేరారు.
ఆ పార్టీ
అధ్యక్షుడు కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
గిరిధర్ గమాంగ్‌తోపాటు
ఇతర నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
గిరిధర్ గమాంగ్
గతంలో కాంగ్రెస్ తరపున కొంత కాలం ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
భారతదేశ
భవిష్యత్తు కోసం బీఆర్‌ఎస్ ప్రస్థానం మొదలైందని అన్న కేసీఆర్, బీఆర్‌ఎస్‌లో చేరిన
ఒడిశా నేతలకు అభినందనలు తెలిపారు.
ఫొటో సోర్స్, Facebook/KCR
జమున: తెలుగు సినిమా సత్యభామ ఆమె...కాస్టింగ్ కౌచ్ గురించి ఏం చెప్పేవారు?
అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు వెళ్లిన టీం ఇండియా
ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిల అండర్-19
టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్
చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో 107 పరుగులు చేయగా 15 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని
చేధించింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
శ్వేత శెరావత్ 61
పరుగులు చేయగా సౌమ్య తివారీ 22 పరుగులు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
షారుక్ ఖాన్: తొలి రోజే రూ.100 కోట్లను దాటేసిన పఠాన్...విమర్శకులు ఏమన్నారు?
తారకరత్న గుండెకు స్టంట్... కొనసాగుతున్న చికిత్స
ఫొటో సోర్స్, Facebook/Nandamuri Tarakarathna
నారా లోకేశ్
పాదయాత్రలో అస్వస్థతకు లోనైన నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
ఉదయం 11 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా
బాలకృష్ణ, తారకరత్న
పాల్గొన్నారు.
ఈ క్రమంలో
లక్ష్మీపురం వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది దూరం
నడిచాక మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. మసీదు నుంచి బయటకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున
టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక తారకరత్న ఒక్కసారిగా
సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు.
తారకరత్నను తొలుత కేసీ ఆసుపత్రికి తరలించగా.. ఆ సమయంలో ఆయన
స్పృహలో లేరని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు తెలిపారు.
'ఆసుపత్రికి తీసుకురాగానే చికిత్స చేశాం. పల్స్ తక్కువగా
ఉంది. ఏకోలో హార్ట్ రేట్ కనిపించింది. లోబీపీ ఉంది. మెరుగైన చికిత్స కోసం పీఈఎస్ఆసుపత్రికి పంపించాం’
అని కేసీఆస్పత్రి వైద్యులు తెలిపారు.
పీఈఎస్ ఆసుపత్రిలో
ఆయనకు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారని చెబుతున్నారు. తారకరత్నకు కార్డియాక్
అరెస్ట్ అయిందని టీడీపీ నేతలు చెబుతుండగా ఆసుపత్రి వర్గాలు మాత్రం
ధ్రువీకరించలేదు.
మరింత మెరుగైన
చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని ఆ గిరిజన గ్రామం ఏటా కోటిన్నర ఎలా సంపాదిస్తోంది?
జనాబాయి జమునగా ఎలా మారారో తెలుసా?
బ్రేకింగ్ న్యూస్, నందమూరి తారకరత్నకు అస్వస్థత
ఫొటో సోర్స్, Facebook/Nandamuri Tarakarathna
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు లోనయ్యారు.
తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుగుదేశం నాయకులు బీబీసీకి తెలిపారు.
యాంజియోగ్రామ్ చేస్తున్నామని, పరిస్థితి స్థిమితంగా ఉందని స్థానిక వైద్యులు చెప్పారు.
మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కళ్లు తిరిగి పడిపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
‘యువగళం’ పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర నేడు కుప్పం నుంచి ప్రారంభమైంది.
400 రోజుల పాటు సాగే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.
ఫొటో సోర్స్, UGC
ప్రస్తుతం కుప్పంలోని ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న బాబాయి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఫొటో సోర్స్, UGC
నందమూరి తారకరత్న: మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలింపు
బాగేశ్వర్ ధామ్: మనసులో మాటను ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిజంగా కనిపెడతారా, ఈ మతలబు ఏమిటి?
అదానీ గ్రూప్: ఆ నివేదిక అంతా అబద్ధం; 'అయితే, కోర్టులో తేల్చుకుందాం' అని సవాలు విసిరిన హిండెన్‌బర్గ్
జమున కన్నుమూత, హైదరాబాద్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచిన అలనాటి నటి