You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆంధ్రప్రదేశ్: సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ బదిలీ

జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయాలంటూ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

    విచారణ కోసం హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసుకు రావాల్సిందిగా కోరింది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చిలో తన ఇంట్లో హత్యకు గురయ్యారు.

    ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.

  3. కోమాలోకి వెళ్లి... మృత్యువుతో పోరాడి గెలిచి

  4. వగీర్: ‘శత్రువుల కంటపడకుండా సముద్రంలో కదిలే జలాంతర్గామి’

  5. వేడుకగా కేఎల్ రాహుల్, అథియా శెట్టిల వివాహం

    క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అథియా శెట్టి సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

    ఖండాలాలో కుటుంబసభ్యులు, సన్నిహితులతో నిర్వహించిన వేడుకలో వీరు వివాహం చేసుకున్నారు.

    పెళ్లి తరువాత అథియా తండ్రి సునీల్ శెట్టి మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ తర్వాత పెళ్లి రిసెప్షన్ ఉండొచ్చని తెలిపారు.

    అయితే, రిసెప్షన్‌కు సంబంధించి కేఎల్ రాహుల్, ఆయన కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

    కాగా కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫొటోలు షేర్ చేశారు.

  6. ఖురాన్ దహనం: స్వీడన్, తుర్కియేల మధ్య మరింత ముదిరిన వివాదం

  7. క్రైస్తవం: జెరూసలేంలో మొదటి మహిళా పాస్టర్ నియామకం

  8. ఆంధ్రప్రదేశ్: సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ బదిలీ

    ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

    జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయాలంటూ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు.

    ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఎన్.సంజయ్‌కి సీఐడీ చీఫ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

    ఇటీవల డీజీగా సునీల్ కుమార్‌కు పదోన్నతి లభించింది.

    సునీల్ కుమార్, సీఐడీ చీఫ్‌గా ఉన్న కాలంలో అనేక విమర్శలు వచ్చాయి.

    ఆయన తీరు మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

    సునీల్ కుమార్‌ను బదిలీ చేసిన నేపథ్యంలో తదుపరి ఆయనకు ఎలాంటి బాధ్యతలు కేటాయిస్తారనేది చర్చనీయాంశమైంది.

  9. ఐసీసీ మహిళల టి20 జట్టులో స్మృతి మందాన

    ఈ ఏడాది ఐసీసీ మహిళల ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.

    ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లతో ఐసీసీ ఈ జట్టును ప్రకటిస్తుంది.

    ఈ జట్టులో భారత్ నుంచి స్మృతి మందానతో పాటు దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుక సింగ్ ఎంపికయ్యారు.

    ఐసీసీ మహిళల ప్లేయింగ్ ఎలెవన్ జట్టు: స్మృతి మందాన, బేత్ మూనీ, సోఫీ డివైన్, థాలియా మైగ్రేత్, నిదా డార్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ ఎకెల్‌స్టోన్, ఇనోకా రణవీరా, రేణుకా సింగ్

  10. ఐసీసీ పురుషుల టి20 జట్టులో విరాట్‌తో సహా చోటు ఎవరికి దక్కిందంటే...

    ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లతో కూడిన టి20 జట్టును ఐసీసీ ప్రకటించింది.

    ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కించుకున్నారు.

    విరాట్ కోహ్లితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు ఐసీసీ పురుషుల టి20 జట్టులో స్థానం దక్కింది. ఈ జట్టుకు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది.

    ఐసీసీ టి20 ప్లేయింగ్ ఎలెవన్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), మొహమ్మద్ రిజ్వాన్ విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్, సికిందర్ రజా, హార్దిక్ పాండ్యా, సేన్ కరన్, వనిందు హసరంగ, హారిస్ రవూఫ్, జోషల్ లిటిల్.

  11. పాస్తా తినడం మంచిదేనా? తింటే లావు అవుతారా?

  12. పాకిస్తాన్‌లో పోయిన కరెంటు... ఆర్థికసంక్షోభమే కారణమా

  13. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య

    టాలీవుడ్‌ యువనటుడు సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడ్డారు.

    వ్యక్తిగత కారణాలతో వైజాగ్‌లోని తన నివాసంలో సుధీర్ ఆత్మహత్య చేసుకున్నారు.

    రాఘవేంద్ర రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో సుధీర్ నటించారు.

    కుందనపుబొమ్మతో పాటుసెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో కూడా ఆయన నటించారు.

    ఆయన మృతి పట్ల సహనటుడు సుధాకర్ కోమాకుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుందనపు బొమ్మ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

  14. జీవో నం. 317 రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులకు మద్దతుగా బీజేవైఎం నిరసనలు

    స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తోన్న ఆందోళనకు బీజేవైఎం మద్దతుగా నిలిచింది.

    జీవో నెంబరు 317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    అయితే, నగర పోలీసులు వారిని అడ్డుకున్నారు.

    పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

  15. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లయిన ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?

  16. విశాఖపట్నం: కోొటి రూపాయల విలువైన దేశవిదేశాల చేపల ఎగ్జిబిషన్

  17. దిల్లీ: వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా‌లపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలంటూ పిటిషన్

    భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు సహా ఇతర తీవ్ర ఆరోపణలు చేసిన భారత రెజ్లర్లకు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

    ఈ అంశంపై వార్తా సంస్థ ఏఎన్ఐ వార్తను ప్రచురించింది.

    లైంగిక వేధింపుల చట్టాలను రెజ్లర్లు పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆ పిటిషన్‌లో ఆరోపించినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది.

    ఒకవేళ ఎవరైనా లైంగిక వేధింపుల బారిన పడితే వారు పోలీసులు, కోర్టుల సహాయంతో చట్ట ప్రకారం నడుచుకోవాలని అందులో పేర్కొన్నారు.

    పదవికి రాజీనామా చేయాలని డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ను పీడిస్తూ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసిన వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా సహా ఇందులో పాల్గొన్న ఇతర రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా దిశానిర్దేశం చేయాలని పిటిషన్‌లో కోర్టును కోరారు.

    బ్రిజ్ భూషన్‌ ఇంట్లో వంట పని చేసే విక్కీ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు వారి తరఫు లాయర్ ఎస్ ప్రసాద్ వెల్లడించారు.

  18. రిషభ్ పంత్ కోలుకోవాలని ఉజ్జయిన్ మహాకాళేశ్వర ఆలయంలో భారత క్రికెటర్ల పూజలు

    రిషభ్ పంత్ వేగంగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థించినట్లు భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.

    మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయిన్‌లోని మహాకాళేశ్వర్ మందిరాన్ని సోమవారం ఉదయం భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ సందర్శించారు.

    ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భస్మ ఆరతి పూజలో క్రికెటర్లు పాల్గొన్నారు.

    అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన తమ సహచరుడు రిషభ్ పంత్ కోసం ప్రార్థించినట్లు చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ‘‘రిషభ్ కోసం దేవుడిని ప్రార్థించాం. అతని పునరాగమనం మాకు చాలా ముఖ్యం. న్యూజీలాండ్‌పై ఇప్పటికే సిరీస్ గెలిచాం. అయినప్పటికీ వారితో చివరి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం’’ అని సూర్యకుమార్ వ్యాఖ్యానించారు.

  19. వరంగల్: ఉమెన్స్ హాస్టల్‌లో దొంగతనం చేసి పారిపోతూ వ్యవసాయ బావిలో పడిన దొంగ

    దొంగతనం చేసి పారిపోతూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన ఒక దొంగను ప్రాణాలతో కాపాడారు.

    వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

    స్థానిక ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్‌లోకి చొరబడ్డ ముగ్గురు దొంగలు విద్యార్థినుల సెల్ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు తీసుకుని పారిపోతుండగా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి వారిని వెంబడించారు.

    ఈ క్రమంలో దొంగలు కాలేజ్ వెనుక ఉన్న పొలాల గుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

    పోలీసులు, కాలేజీ సెక్యూరిటీ సిబ్బందివారిని బంధించే ప్రయత్నంలో ఒక దొంగ పొలాల్లోని వ్యవసాయ బావిలో పడిపోయారు.

    అతన్ని తాళ్ల సహాయంతో పోలీసులు బయటకు లాగారు.

    దొంగతనానికి ప్రయత్నించిన వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తించామని హసన్‌పర్తి సీఐ ఆర్. నరేందర్ బీబీసీకి తెలిపారు.

    ఇందులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కాగా, మరో యువకుడు ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్.

    ఖర్చులకు డబ్బులు లేకసంక్రాంతి సెలవు దినాల్లో ఇలా దొంగతనానికి వచ్చారని సీఐ వివరించారు.

  20. పరాక్రమ్ దివస్: నేతాజీ గుర్తుగా నిర్మించనున్న స్మారకాన్ని ఆవిష్కరించిన మోదీ

    భారత చరిత్రకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసమాన సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.

    సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకొని మోదీ, ఆయనకు నివాళులు అర్పించారు.

    ఈ మేరకు ట్వీట్ చేశారు.

    ‘‘నేడు పరాక్రమ దినోత్సవం సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నా నివాళులు. ఆయన దేశ చరిత్రకు అసమాన సేవ చేశారు. వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన కనబరిచిన ధీరత్వం ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆలోచనలు స్ఫూర్తిని రగిలించాయి. ఆయన కలగన్న భారత్‌ను నిర్మించేందుకు మేం కృషి చేస్తున్నాం’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23వ తేదీని భారత ప్రభుత్వం ‘పరాక్రమ దివస్’గా 2021లో ప్రకటించింది

    ఆయన జయంతిని పురస్కరించుకొని సోమవారం ప్రధాని మోదీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు.

    ఈ కార్యక్రమానికి మోదీ వర్చువల్‌గా హాజరయ్యారు.

    అలాగే నేతాజీ గుర్తుగా ‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం’’లో నిర్మించనున్న జాతీయ స్మారకాన్ని ఆయన ఆవిష్కరించారు.