లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయంవైపు నడిపించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
అత్యంత సులభ సాధ్యమైన విజయ లక్ష్యాన్ని రెండు వికెట్ల నష్టపోయి చేరుకున్న భారత్ జట్టు రెండో వన్డేలో న్యూజీలాండ్ పై విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 20.1 ఓవర్లలో 111 పరుగులు చేసింది.
7 ఫోర్లు, 2 సిక్సులతో అర్ధ సెంచరి చేసిన రోహిత్ శర్మ...50 బంతులలో 51 పరుగుల చేసి అవుటయ్యాడు.
రోహిత్ శర్మతోపాటు ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
విరాట్ కోహ్లీ 11 పరుగులకు అవుటయ్యాడు.
మూడు వన్డేల ఈ సిరీస్ లో భారతజట్టు 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది.
మూడో వన్డే ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది.
పరుగులు చేయలేక తడబడ్డ న్యూజీలాండ్
అంతకు ముందు న్యూజీలాండ్ జట్టు 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి ఆలౌటయింది.
భారత బౌలర్ల ధాటికి ఆరంభంలో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయిన న్యూజీలాండ్ జట్టు ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది.
వికెట్లు కాపాడుకునే క్రమంలో న్యూజీలాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడినా భారత బౌలర్లు వరస స్పెల్స్ లో వికెట్లు తీస్తూ పోయారు. దీంతో న్యూజీలాండ్ జట్టుకు వంద పరుగులు చేయడమే గగమన్నట్లుగా మారింది.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, వాషింగ్టన్ సుందర్, హార్ధిక్ ప్యాండ్యాలు చెరో 2 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లు తలా ఒక వికెట్ తీసి న్యూజీలాండ్‌ను 108 పరుగులకే కట్టడి చేశారు.
న్యూజీలాండ్ బ్యాట్స్‌మన్లలో గ్లెన్ ఫిలిప్(36), మిషెల్ శాంట్నర్ (27), మైఖేల్ బ్రేస్‌వెల్ (22) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

భారత హేతువాద సంఘం ఛైర్మన్, హేతువాది మాస పత్రిక ఎడిటర్, బహుగ్రంథ రచయిత రావిపూడి వెంకటాద్రి శనివారం నాడు చీరాలలో మరణించారు. ఆయన వయసు 101 సంవత్సరాలు.
గత కొద్ది రోజులుగా వెంకటాద్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హేతువాదాన్ని ఒక ఉద్యమంగా మలిచి, దానిని ప్రచారం చేసే కార్యక్రమాలను తెలుగునాట మొదలుపెట్టిన వారిలో రావిపూడి వెంకటాద్రి ఒకరు.
ఇటీవలే వందేళ్లు పూర్తి చేసుకున్న వెంకటాద్రి హేతువాదంపై అనేక పుస్తకాలు రాశారు.
రావిపూడి వెంకటాద్రి మృతికి భారత హేతువాద సంఘం, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం, రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్, హేతువాది, హేమా పబ్లికేషన్స్,రేషనలిస్ట్ తదితర సంస్థలు సంతాపం ప్రకటించాయి.

ఫొటో సోర్స్, ANI
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో భారత్-న్యూజీలాండ్‌ల మధ్య రెండో వన్డే జరుగుతోంది.
మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఒక సరదా ఘటన జరిగింది.
టాస్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కివీస్ సారథి టామ్ లాథమ్‌లతో పాటు జవగళ్ శ్రీనాథ్ మైదానంలోకి వచ్చారు.
టాస్ వేశారు. రోహిత్ శర్మ టాస్ గెలుపొందాడు. అయితే, టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకోవాలా లేక బౌలింగ్ చేయాలా అనే విషయాన్ని రోహిత్ శర్మ మరచిపోయాడు.
ఏమీ చెప్పకుండా నుదుటిపై చేయి వేసుకొని కొన్ని సెకన్ల పాటు ఆలోచిస్తూ నిలుచుండిపోయాడు.
బాగా గుర్తు చేసుకొని తర్వాత బౌలింగ్ ఎంచుకుంటున్నట్లు చెప్పాడు.
దీంతో మైదానంలో ఉన్న టామ్ లాథమ్‌తో పాటు శ్రీనాథ్.. వారి వెనుక నిల్చున్న భారత క్రికెటర్ సిరాజ్ నవ్వుతూ కనిపించారు.
ఈ సరదా వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మలిక్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు.
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తొలి వన్డేలో భారత్ 12 పరుగులతో న్యూజీలాండ్‌పై గెలుపొందింది.
న్యూజీలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, నికోల్స్, డెరెన్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెర్నీ షిప్లే, బ్లెయిన్ టిక్నర్, లాకీ ఫెర్గూసన్
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Mohit Kandhari/BBC
గణతంత్ర దినోత్సవానికి ముందు జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో శనివారం జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించాయి.
జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు జరిగినట్లు జమ్మూకశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేశ్ సింగ్ ధ్రువీకరించారు.
ఏకకాలంలో జరిగిన ఈ రెండు పేలుళ్లలో ఆరుగురు పౌరులు గాయపడినట్లు ఆయన వెల్లడించారు.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Mohit Kandhari/BBC
నర్వాల్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో పేలుడు సంభవించినట్లు స్థానిక పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.
ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నర్వాల్ ప్రాంతంలో దుకాణాలను మూసివేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.భారత్ జోడో యాత్ర, జనవరి 23న జమ్మూలో ప్రవేశిస్తుంది.
నార్వాల్ ప్రాంతానికి చెందిన ఒక దుకాణాదారుడు రాజేష్ కుమార్ ఫోన్‌లో బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ ఇక్కడ రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, BEN MCKAY/EPA-EFE/REX/SHUTTERSTOCK
న్యూజీలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డన్ స్థానంలో లేబర్ పార్టీ ఎంపీ క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు.
పార్టీ అగ్రనేత పదవి రేసులో ఆయన ఒక్కరే పోటీదారుగా నిలిచారు. దీంతో ఆయన ప్రధానమంత్రి పదవికి కూడా ఎన్నికవడం ఖాయంగా మారింది.
క్రిస్ హిప్‌కిన్స్ 2008లో తొలిసారి ఎంపీ అయ్యారు. 2020 నవంబర్‌లో మంత్రిగా నియమితులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు గురువారం జెసిండా ప్రకటించారు.
ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజీలాండ్‌లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓడిపోతే హిప్‌కిన్స్ ఎనిమిది నెలలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉంటారు.
44 ఏళ్ల హిప్‌కిన్స్ ప్రస్తుతం పోలీస్, విద్య, పబ్లిక్ సర్వీసెస్ మంత్రిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు నాలుగు నెలల్లో రెండుసార్లు పెరోల్ లభించింది. అత్యాచారం, హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.
అయితే, ఆయనకు మరోసారి 40 రోజుల పెరోల్ లభించినట్లు అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ పెరోల్‌కు సంబంధించిన పేపర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, జనవరి 21న అంటే ఈరోజు ఆయన విడుదల కానున్నట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
రోహ్‌తక్ సునారియా జైలులో రామ్ రహీమ్ శిక్ష అనుభవిస్తున్నారు.
గత నాలుగు నెలల్లో రామ్ రహీమ్‌కు పెరోల్ రావడం ఇది రెండోసారి.అక్టోబర్‌లో కూడా రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్ లభించింది.
తన ఇద్దరు శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్ 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
దిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వరుసగా రెండో రోజు కలిసిన అనంతరం తమ నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం అర్ధరాత్రి వారు ఈ ప్రకటన చేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారత రెజ్లర్లు, లైంగిక వేధింపులతోపాటు ఇతర తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు నిరసనలు చేపట్టారు.
శుక్రవారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశమైన అనంతరం రెజ్లర్లు, ఠాకూర్‌తో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ సందర్భంగా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లు చేసిన ఆరోపణలపై విచారణ వచ్చే నాలుగు వారాల్లో పూర్తవుతుంది. అప్పటి వరకు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంచుతాం. ఈ అంశంపై ఒక విచారణ కమిటీ ఏర్పాటు అవుతుంది. విచారణ పూర్తయ్యే వరకు సమాఖ్య రోజూవారీ కార్యకలాపాలను ఆ కమిటీ పర్యవేక్షిస్తుంది’’ అని అన్నారు.
అనంతరంరెజ్లర్ బజరంగ్ పూనియా మాట్లాడుతూ, "కేంద్ర మంత్రి, ఆటగాళ్లందరికీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం హామీ ఇచ్చినందున మేం మా ఆందోళనను విరమిస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.
స్టార్ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ఈ అంశాన్ని విచారిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి