ఇరాన్: నిరసనకారులకు ఉరిశిక్షలు ఆపాలంటూ జైలు వెలుపల ఆందోళన

కరాజ్ నగరంలోని రజాయి షహర్ జైలు వెలుపల ఆదివారం రాత్రి నిరసనకారులు నినాదాలు చేస్తున్న వీడియోలను ప్రతిపక్ష ఉద్యమకారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. ఆశాకిరణ్ బార్లా: వయసు 17 ఏళ్లు.. రన్నింగ్‌లో 11 నేషనల్, 2 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్.. కానీ...

  3. రష్యా: పుతిన్‌ను నీడలా వెంటాడుతున్న ఆ మహిళ ఎవరు?

  4. ఇరాన్: నిరసనకారులకు ఉరిశిక్షలు ఆపాలంటూ జైలు వెలుపల ఆందోళన, డేవిడ్ గ్రిటెన్, బీబీసీ న్యూస్

    మొహమ్మద్ ఘోబొడ్లూ, మొహమ్మద్ బొరోఘని

    ఫొటో సోర్స్, TWITTER

    ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ఘోబొడ్లూ (ఎడమ), మొహమ్మద్ బొరోఘని (కుడి)లకు బూటకపు విచారణల అనంతరం మరణశిక్ష విధించారని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు

    ఇరాన్‌లోని ఒక జైలులో మరో ఇద్దరు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను ఉరితీయటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్న వార్తలతో.. ఆ మరణశిక్షలను ఆపాలంటూ జైలు వెలుపల నిరసనకారులు ఆందోళనకు దిగారు.

    కరాజ్ నగరంలోని రజాయి షహర్ జైలు వెలుపల ఆదివారం రాత్రి నిరసనకారులు నినాదాలు చేస్తున్న వీడియోలను ప్రతిపక్ష ఉద్యమకారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    ఇరాన్‌ నిరసనలు

    ఫొటో సోర్స్, 1500TASVIR

    ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ఘొబాడ్లో తల్లి తన కొడుకుకు క్షమాభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేశారు

    ఉరికంబం ఎక్కబోతున్న వారిలో ఒకరైన మొహమ్మద్ ఘొబాడ్లో అనే యువకుడి తల్లి కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టాలని వేడుకున్నారు.

    శనివారం నాడు ఇద్దరు నిరసనకారులను ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. దీనిపై అంతర్జాతీయంగా ఖండనలు వెల్లువెత్తాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కారాజ్‌లో నవంబర్‌లో జరిగిన పారామిలటరీ సిబ్బంది ఒకరి హత్యలో వీరు దోషులని రివల్యూషనరీ కోర్టు ప్రకటించి, వీరికి మరణశిక్ష విధించింది. వారిరువురూ తమను హింసించి నేరం ఒప్పుకునేలా చేశారని ఆరోపించారు.

    సెప్టెంబర్‌లో దేశంలో నిరసనలు మొదలైనప్పటి నుంచి మొత్తం నలుగురు నిరసనకారులను ఇరాన్ ఉరితీసింది.

  5. కరోనావైరస్: చైనా యువత కావాలని కోవిడ్ తెచ్చుకుంటున్నారు.. ఎందుకు?

  6. జస్‌ప్రీత్ బుమ్రా: శ్రీలంకతో వన్డే సిరీస్‌‌కు దూరమే

    శ్రీలంకతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండబోవడం లేదని బీసీసీఐ ప్రకటించింది.

    వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే గౌహతిలో జట్టుతో చేరుతారని భావించిన బుమ్రాకు మరికొంత సమయం అవసరం అని బీసీసీఐ పేర్కొంది. గాయం నుంచి కోలుకున్న బుమ్రాకు మళ్లీ ఇబ్బంది రాకుండా ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. 19న తెలంగాణలో మోదీ పర్యటన

    ప్రధాని మోదీ జనవరి 19న తెలంగాణలో పర్యటించనున్నారని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

    సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వందేభారత్ రైలును ఆయన ప్రారంభిస్తారని, ఆ రైల్వే స్టేషన్‌లో రూ. 699 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని ఏఎన్ఐ చెప్పింది.

    మొత్తంగా ప్రధాని మోదీ తన తెలంగాణ పర్యటనలో రూ. 7 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. ‘ఆ ప్లాంట్లకు మా భూములు ఇచ్చి తప్పుచేశాం’ - అదానీ సిమెంట్ ప్లాంట్ల మూతతో రోడ్డున పడ్డ వేలాది జనం

  9. దట్టమైన పొగమంచు కారణంగా 260కి పైగా రైళ్లు రద్దు

    భారతీయ రైల్వే

    ఫొటో సోర్స్, ANI

    ప్రతికూల వాతావరణం కారణంగా సోమవారం 260కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.

    పంజాబ్, రాజస్థాన్, బిహార్, హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో విజిబిలిటీ బాగా తగ్గింది. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతోందని పీటీఐ తెలిపింది.

    82 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 140 ప్యాసింజర్ రైళ్లు, 40 సబర్బన్ రైళ్లు సహా మొత్తం 267 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

    ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం 335 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వీటిలో 88 రైళ్లను రద్దు చేయగా, 31 రైళ్లను దారి మళ్లించారు. 33 రైళ్లను నిర్దిష్ట మార్గంలో రద్దు చేశారు.

    సోమవారం ఆగ్రా, బటిండాలలో విజిబిలిటీ సున్నా మీటర్లకు పడిపోయింది. పాటియాలా, చండీగఢ్, అంబాలా, భివానీ, సఫ్దర్‌జంగ్, రిడ్జ్, గంగానగర్, వారణాసి, ఫుర్సత్‌గంజ్, భాగల్‌పూర్‌లలో విజిబిలిటీ 25 మీటర్లు ఉంది.

    హిసార్, కర్నాల్, పాలం, మీరట్, లక్నో, బహ్రైచ్, పట్నాలలో 50 మీటర్ల విజిబిలిటీ స్థాయిలు నమోదయ్యాయి.

    వాతావరణ శాఖ కార్యాలయం ప్రకారం, విజిబిలిటీ స్థాయి సున్నా నుండి 50 మీటర్ల వరకు ఉంటే, 'అత్యంత దట్టమైన పొగమంచు' కమ్ముకున్నట్టు పరిగణిస్తారు.

  10. 'ఎంతమంది కలిసి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగన్ ప్రభుత్వమే' - సజ్జల

    సజ్జల రామకృష్ణారెడ్డి

    ఫొటో సోర్స్, SAJJALAOFFICIAL

    ఫొటో క్యాప్షన్, సజ్జల రామకృష్ణారెడ్డి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు.

    షెడ్యూల్ ప్రకారమే 2024 ఎన్నికలు జరుగుతాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయన్నారు.

    చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ భేటీపై స్పందిస్తూ, అక్రమ సంబంధాన్ని పవిత్రం చేయడానికి చంద్రబాబు, పవన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.

    బలమైన జగన్ను ఎదుర్కొనేందుకు వీళ్లంతా ఏకం అవుతున్నారని, దీన్ని వామపక్షం స్వాగతించడం ఆశ్చర్యమని అన్నారు.

    బీజేపీ కూడా వారితో కలిస్తే అప్పుడు సీపీఐ రామకృష్ణ ఏం చేస్తారని ప్రశ్నించారు.

    చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోతే కనీసం పవన్ పరామర్శించలేదు కానీ, ఆ మరణాలకు కారణమైన చంద్రబాబును పవన్ పరామర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

    ప్రజల ప్రాణాల పరిరక్షణ కోసమే జీవో నంబర్ 1ను తీసుకుని వచ్చామని, అందులో రోడ్లపై సభలు పెట్టుకోవద్దని మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

    "రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతున్నారు. పేద ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వాన్ని దించాలన్నదే వాళ్ల కుట్ర. ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగన్ ప్రభుత్వమే" అన్నారు సజ్జల.

  11. ఆ స్కూల్‌లో విద్యార్థినులందరూ టీనేజీ తల్లులే...

  12. యానాం: ప్రజా సమస్యలకు పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నిరాహారదీక్ష

    యానాం

    ఫొటో సోర్స్, UGC

    యానాం ప్రజల సమస్యలకు పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేపట్టిన నిరాహారదీక్ష నాలుగో రోజుకి చేరింది.

    పట్టణంలో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచాలని, ఇళ్ల స్థలాల సమస్య వంటివి పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు.

    పుదుచ్చేరి ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

    దీక్ష నాలుగో రోజుకి చేరడంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గ్లూకోజ్ లెవల్, బీపీ పడిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు.

    యానాం

    ఫొటో సోర్స్, UGC

    పుదుచ్చేరి పరిధిలోని యానాంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అశోక్ గెలిచారు. అయితే, అక్కడున్న రాజకీయాల్లో ఎమ్మెల్యే మాటకు గౌరవం లేకుండా పోయిందని, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మాటకే విలువనిస్తున్నారన్న విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూనే ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో, యానాం ప్రజా ఉత్సవాల పేరుతో గత వారం ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి యానాంలో పర్యటించారు.

    అయినా, సమస్యలు పరిష్కారం కాలేదని చెబుతూ ఎమ్మెల్యే అశోక్ దీక్షకు దిగారు.

    ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రంగస్వామినే యానాంలో అశోక్ ఓడించడం విశేషం.

    ఆయన దీక్షకు పలువురు స్థానికులు, ఏపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వంటి వారు సంఘీభావం తెలిపారు.

  13. వాల్తేరు కోహ్లీ.. 'రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు, నాపేరు మీదే రికార్డ్స్ ఉంటాయి'

    వాల్తేరు వీరయ్య

    ఫొటో సోర్స్, StarSportsTelugu/Twitter

    శ్రీలంకపై టీ20 సీరీస్ గెలిచిన ఉత్సాహంతో టీమిండియా వన్‌డేలకు సిద్ధమవుతోంది.

    జనవరి 10, మంగళవారం శ్రీలంక, భారత్‌ల మధ్య తొలి వన్‌డే జరగనుంది.

    ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి వాల్తేరు వీరయ్య సినిమాలోని డైలాగును అన్వయిస్తూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఒక సరదా ట్వీట్ పోస్ట్ చేసింది.

    "రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు, నాపేరు మీదే రికార్డ్స్ ఉంటాయి" అంటూ "కింగ్ కోహ్లీ బ్యాక్ ఇన్ యాక్షన్" అని ఆ సినిమాలో చిరంజీవి పోస్టరుకు కోహ్లీ ముఖం తగిలించి పోస్ట్ చేసింది.

    ఈ నెల 13న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. జీవితంలో డాన్స్ చేయలేననుకున్నాడు, కానీ స్టార్ డాన్సర్ అయ్యాడు

  15. దిల్లీ: వణికిస్తున్న చలి.. హిమాచల్, ఉత్తరాఖండ్‌ల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు

    దిల్లీ

    ఫొటో సోర్స్, ANI

    దేశ రాజధాని దిల్లీలో వరుసగా ఐదో రోజు చలి తీవ్రత కొనసాగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం ఉదయం దిల్లీలో విజిబిలిటీ (దృశ్యమానత) 25 మీటర్లకు తగ్గింది. దీని కారణంగా రైలు, విమానాల రాకపోకలకు పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతోంది.

    ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల కంటే దిల్లీలో ఉష్ణోగ్రత తక్కువగా ఉందని పీటీఐ తెలిపింది.

    ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని పాలెంలో విజిబిలిటీ 25 మీటర్ల వరకు ఉంది.

    ప్రతికూల వాతావరణం కారణంగా 15 విమానాలు ఆలస్యమయ్యాయని, ఒక విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చిందని విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పినట్టు పీటీఐ తెలిపింది.

    పొగమంచు కారణంగా ఇప్పటివరకు 29 రైళ్లు రెండు నుంచి ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

    చలి

    పంజాబ్, రాజస్థాన్ నుంచి బిహార్, హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్ వరకు ఉపగ్రహ చిత్రాలలో దట్టమైన పొగమంచు కనిపిస్తోంది.

    దిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 3.8 డిగ్రీల సెల్సియస్ కాగా, ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీలు నమోదైంది.

    వణికిస్తున్న చలి కారణంగా పాఠశాలలకు జనవరి 15 వరకు సెలవులను పొడిగించినట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

  16. గుజరాత్: 300మంది యువతులకు వివాహం జరిపించిన సూరత్ వ్యాపారి

  17. ఇండిగో విమానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఇద్దరు ప్రయాణికుల అరెస్టు

    ఇండిగో

    ఫొటో సోర్స్, ANI

    చందన్ కుమార్ జాజ్వాడే, బీబీసీ ప్రతినిధి

    దిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను పట్నా పోలీసులు అరెస్ట్ చేశారు.

    పట్నా విమానాశ్రయం డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇండిగో విమానం ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పట్నా విమానాశ్రయానికి చేరుకుంది. విమానం ల్యాండ్ కావడానికి ముందే అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించాన్న సమాచారం ఆయనకు అందింది. వెంటనే పోలీసులకు ఆ సమాచారం అందించారు.

    విమానం ల్యాండ్ అయిన తరువాత ప్రయాణికులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానయాన సంస్థ, స్థానిక పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు.

    ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారని ఫ్లైట్ మేనేజర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్టు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ పోలీసులు బీబీసీకి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    వారిద్దరూ బిహార్‌లోని హాజీపూర్‌కు చెందిన యువకులు. ప్రస్తుతం వారిని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. వారికి కరోనా పరీక్ష చేస్తారు. రిపోర్ట్ వచ్చిన తరువాత ఎక్సైజ్ కోర్టుకు పంపి, అక్కడి నుంచి ఎక్సైజ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

    కాగా, బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. బయటి నుంచి ఎవరూ మద్యం సేవించి అక్కడికి వెళ్లకూడదు. నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ యువకులిద్దరిపైనా కేసులు పెడతామని ఎయిర్‌పోర్ట్ పోలీసులు చెప్పారు.

  18. భారతీయ సంతతికి చెందిన మోనికా సింగ్ అమెరికా తొలి సిక్కు మహిళా జడ్జి

    మోనికా సింగ్

    ఫొటో సోర్స్, FB/MONICA SINGH

    ఫొటో క్యాప్షన్, మోనికా సింగ్

    భారతీయ సంతతికి చెందిన మోనికా సింగ్ అమెరికాలో జడ్జిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి సిక్కు మహిళ ఆమె.

    హారిస్ కౌంటీ జడ్జిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.

    మోనికా సింగ్ అమెరికాలోని హ్యూస్టన్‌లో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి 1970లలో అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో బెలేలో నివసిస్తున్నారు.

    మోనికా సింగ్ శుక్రవారం టెక్సాస్‌లోని హారిస్ కౌంటీ సివిల్ కోర్టులో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారని పీటీఐ తెలిపింది.

    గత 20 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్న మోనికా సింగ్ అమెరికాలోని అనేక పౌర హక్కుల సంస్థలతో కలిసి పనిచేశారు.

    ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, "ఈ పదవి నాకెంతో గౌరవం. ఇది దక్కినందుకు సంతోషిస్తున్నాను" అన్నారు.

    అమెరికాలో సిక్కుల జనాభా సుమారు ఐదు లక్షలు ఉంటుందని అంచనా. వీరిలో 20 వేల మంది హ్యూస్టన్‌లో నివసిస్తున్నారు.

    మోనికా సింగ్ సాధించిన విజయం సిక్కు సమాజానికి గర్వకారణమని హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పేర్కొన్నారు.

  19. కామారెడ్డి: మాస్టర్ ప్లాన్‌ను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

  20. రుణాల కుంభకోణ కేసులో కొచ్చర్ దంపతులకు ఊరట

    చందా కొచ్చర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్ రుణాల కుంభకోణ కేసులో కొచ్చర్ దంపతులకు ఊరట లభించింది.

    ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్‌కి, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కి బొంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    వీరిద్దరిని జ్యూడిషియల్ కస్టడీ నుంచి విడుదల చేస్తున్నట్టు బొంబై హైకోర్టు తెలిపింది. చట్ట ప్రకారం వీరి అరెస్ట్ జరగలేదని కోర్టు పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో వీరిద్దరిని సీబీఐ గత నెల చివరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

    కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.