You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కల్వకుంట్ల కవిత: ‘మోదీ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టరు... కేసీఆర్ 300 మంది జర్నలిస్టులతో పెడతారు’
బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నమస్తే తెలంగాణ పత్రికను నడుపుతున్నాం. కొన్ని స్థానిక పత్రికలు తెలంగాణ ఇమేజ్ దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నాయి. రాజకీయ పార్టీలకు పత్రికలు ఉంటే దాన్ని బహిరంగంగా చెప్పుకోవాలి.
లైవ్ కవరేజీ
లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
కల్వకుంట్ల కవిత: మోదీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు...
ప్రధాని నరేంద్ర మోదీ తనకు నచ్చిన మీడియాతోనే మాట్లాడతారని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇవ్వడం దురదృష్టకరం. అదీ తాను చెప్పాలనుకుంది మాత్రమే ఆయన చెబుతారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం 300-350 మంది జర్నలిస్టులతో ప్రెస్ మీట్ పెడతారు. వారి అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తారు.
9ఏళ్లుగా ప్రధాని ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దీన్ని ఒక్క జర్నలిస్టు కూడా ప్రశ్నించలేదు.
బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నమస్తే తెలంగాణ పత్రికను నడుపుతున్నాం. కొన్ని స్థానిక పత్రికలు తెలంగాణ ఇమేజ్ దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నాయి. రాజకీయ పార్టీలకు పత్రికలు ఉంటే దాన్ని బహిరంగంగా చెప్పుకోవాలి.
తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం. జర్నలిస్టు చనిపోతే వారి భార్యకు నెలకు రూ.3 వేలు పింఛను ఇస్తున్నాం’ అని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా కవిత అన్నారు.
కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
విమానంలో వృద్ధురాలిపై మూత్రం పోసిన వ్యక్తి తండ్రి ఏమంటున్నాడంటే..
పండ్లు, కూరగాయలకు తొక్క తీయాలా, తీయకూడదా?
ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి వైదొలిగిన నవోమీ ఒసాకా
జపాన్ టెన్నిస్ ప్లేయర్, నవోమీ ఒసాకా... ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకున్నారు.
మరొక 8 రోజుల్లో టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
కానీ ఎందుకు వైదొలుగుతోందో మాత్రం 25ఏళ్ల ఒసాకి చెప్పలేదు.
సీనియర్ ప్లేయర్ వీనస్ విలియమ్స్, వరల్డ్ నెంబర్ ఒన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ కూడా ఈ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే వైదొలిగారు.
రోమియో జూలియట్:‘‘బలవంతంగా మాతో నగ్నంగా నటింపజేశారు’’- 70 ఏళ్ల వయసులో కేసు వేసిన హీరో హీరోయిన్లు
సంగారెడ్డి: గడ్డపోతారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం... ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములోకి మారుస్తున్న క్రమంలో స్టాటిక్ ఎనర్జీతో ప్లాష్ ఫైర్ రావడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంట్రాక్టు కార్మికులు పరితోష్ మెహతా( 40), బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్( 27), లోకేశ్వర రావు తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
కవల పిండాల్లో ఒకదాన్ని తొలగించాలని కోర్టుకెక్కిన మహిళ...చట్టం ఒప్పుకుంటుందా?
గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? నీటి నుంచి ఎలా ఉత్పత్తి చేస్తారు?
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ: ‘జీవో నంబర్ 1పై ఎలా పోరాడాలనే అంశంపై చర్చించాం’
వర్జీనియా స్కూల్‌లో కాల్పులు: ప్రాణాపాయం నుంచి బయటపడిన టీచర్
అమెరికా వర్జీనియాలో ఆరేళ్ల చిన్నారి జరిపిన కాల్పుల్లో గాయపడిన టీచర్ అబీ జ్వెర్నర్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని, చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు.
రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూలులో శుక్రవారం ఆమెపై ఆరేళ్ల బాలుడు హ్యాండ్ గన్‌తో కాల్పులు జరిపాడు. ఆమె పరిస్థితి మొదట విషమంగా ఉందని గవర్నర్ ఫిలిప్ జోన్స్ వెల్లడించారు.
30ల వయసులోనున్న అబీ ప్రాణాలతో బయటపడాలని సోషల్ మీడియాలో యూజర్లు ట్వీట్లు, పోస్టులు పెడుతున్నాయి.
అసలు ఆ చిన్నారి చేతికి గన్ ఎలా వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
అమెరికా జైలు నుంచి విడుదలైన ‘క్వీన్ ఆఫ్ క్యూబా’ - ఎవరీ గూఢచారి? అమెరికాకు ఎలా నష్టం చేశారు
‘‘తప్పుడు కేసులో జైలుకు పంపి సెక్స్‌కు దూరం చేశారు.. రూ. 10 వేల కోట్లు పరిహారం ఇవ్వాలి’’ - ప్రభుత్వంపై కేసు
ఇరాన్: ఇద్దరు పురుషులకు ఉరి శిక్ష అమలు, ఆంటోనియెట్ రాడ్‌ఫోర్డ్, సారా ఫోలర్, బీబీసీ న్యూస్
ఇరాన్‌లో ఇద్దరు పురుషులకు మరణశిక్ష అమలు చేశారు. ఒక సైనికుడిని హత్య చేశారన్న కేసులో.. మొహమ్మద్ మాహ్దీ కరామి, సయ్యద్ మొహమ్మద్ హొసేనీలను ఉరితీశారు.
ఇరాన్‌లో నాలుగు నెలల కిందట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలైనప్పటి నుంచీ ప్రభుత్వం ఉరితీసిన నిరసనకారుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
గత ఏడాది నిరసనలు జరుగుతున్నపుడు వీరిద్దరూ పారామిలటరీ ఆఫీసర్ రుహొల్లా అజామియాన్‌ను హత్య చేయటంలో ప్రధాన నేరస్తులు కరామి, హొసేనీలని ఇరాన్ న్యాయ వార్తా సంస్థ మిజాన్ పేర్కొంది.
ఈ కేసులో వీరికి మరణ శిక్ష విధిస్తూ గత డిసెంబర్‌లో తీర్పు చెప్పారు. అయితే.. తమను హింసించి నేరం అంగీకరించేలా చేశారంటూ వారిద్దరూ అప్పీలు చేసుకున్నారు.
కానీ ఇరాన్ సుప్రీంకోర్టు వారికి విధించిన శిక్షను ఖరారు చేసింది. దీంతో ప్రభుత్వం శనివారం నాడు వారికి మరణశిక్ష అమలు చేస్తూ ఉరి తీసింది.
ఈ విచారణ బూటకమని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. మరో 26 మందికి మరణ శిక్ష విధించాలని ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం కోరుతున్నట్లు పేర్కొంది.
2022 సెప్టెంబర్‌లో హిజాబ్‌ను ‘సరిగా ధరించలేద’ని ఆరోపిస్తూ నైతిక పోలీసులు నిర్బంధించిన ఒక మహిళ వారి కస్టడీలో చనిపోవటంతో ఇరాన్‌లో నిరసనలు రాజుకున్నాయి.
హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ చెప్తున్నదాని ప్రకారం.. ఈ అలజడిలో ఇప్పటివరకూ 516 మంది నిరసనకారులు చనిపోయారు. వారిలో 70 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తం 19,262 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హింసాత్మక నిరసనల్లో 68 మంది భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.