భారత్ X శ్రీలంక: 91 పరుగుల తేడాతో గెలిచిన టీం ఇండియా

లంకతో జరుగుతున్న టీ20 మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. భారత్ X శ్రీలంక: 91 పరుగుల తేడాతో గెలిచిన టీం ఇండియా

    సూర్యకుమార్ యాదవ్

    ఫొటో సోర్స్, ANI

    శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ 91 పరుగుల తేడాతో గెలిచింది.

    229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 131 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

    అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య రెండు వికెట్ల చొప్పున తీశారు.

    తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.

    జరుగుతున్న టీ20 మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు.

    45 బంతుల్లో 8 సిక్సులు 6 ఫోర్ల సాయంతో 100 పరుగులు తీశాడు.

    మొత్తం మీద 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు 7 ఫోర్లు ఉన్నాయి.

    శుభ్‌మన్ గిల్ 36 బంతుల్లో 46, రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు చేశారు.

  3. విమానంలో మహిళపై మూత్రం పోసిన కేసు.. ఎవరేమంటున్నారు

  4. తేనెటీగలకు వ్యాక్సీన్.. ప్రపంచంలోనే తొలిసారి... దీన్ని ఎలా ఇస్తారు

  5. బ్రేకింగ్ న్యూస్, భారత్ వర్సెస్ శ్రీలంక: సూర్యకుమార్ యాదవ్ సెంచరీ

    క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్

    ఫొటో సోర్స్, Getty Images

    శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు.

    45 బంతుల్లో 8 సిక్సులు 6 ఫోర్ల సాయంతో 100 పరుగులు తీశాడు.

    మొత్తం మీద 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు 7 ఫోర్లు ఉన్నాయి.

    20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.

    శుభ్‌మన్ గిల్ 36 బంతుల్లో 46, రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు చేశారు.

  6. అస్సాం: ‘మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’

  7. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిగాలులు

  8. తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  9. సమ్మెద్ శిఖర్: జైనులకు ఈ ప్రాంతం ఎందుకు అంత పవిత్రం... ఇతర మతస్తులు రాకూడదని వారు కోరుకుంటున్నారా

  10. సానియా మీర్జా: వచ్చే నెలలో ప్రొఫెషనల్ టెన్నిస్‌ నుంచి రిటైర్మెంట్

    టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన రిటైర్మెంట్‌పై ప్రకటన చేశారు.

    ఫిబ్రవరిలో జరగబోయే దుబయి టెన్నిస్ చాంపియన్‌షిప్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సానియా చెప్పారు.

    శుక్రవారం వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. మైనర్ హిందూ బాలిక ‘కిడ్నాప్, మతమార్పిడి, వివాహం’.. పాకిస్తాన్‌లో ఆందోళనలు

  12. శ్రీలంక: చిన్నారుల చదువులను చిదిమేస్తున్న ఆర్థిక సంక్షోభం

  13. జెయింట్ పాండా: 12 ఏళ్లు ప్రవాసం తర్వాత స్వదేశం చైనా చేరుకోనున్న పాండా జంట

  14. ఆలయం నుంచి మహిళను జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన దారుణం.. వీడియో వైరల్, ఇమ్రాన్ ఖురేషి, బీబీసీ కోసం

    బెంగళూరు ఆలయంలో మహిళపై దాడి

    ఫొటో సోర్స్, Twitter/ScreenGrab

    కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఆలయంలో ఒక మహిళపై దాడిచేసి, ఆమెను జట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకెళుతున్న వీడియో వైరల్ అవుతోంది.

    ఈ సంఘటన డిసెంబర్ 21వ తేదీన జరిగినట్లు చెప్తున్నారు. బాధిత మహిళ తనపై దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అమృతహళ్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దేవుడి విగ్రహం పక్కన కూర్చోవాలని ఆమె భావించారని, ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని అక్కడి పూజారులు కోరినపుడు ఆమె కదలలేదని చెప్తున్నారు.

    పదే పదే కోరినా ఆమె కదలకపోవటంతో.. ఆలయ సిబ్బందిలో ఒకరైన మునికృష్ణ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

    ‘‘ప్రాధమిక దర్యాప్తులో ఆమె మానసికంగా అస్థిరంగా ఉన్నారని, ఆలయం నుంచి బయటకు వెళ్లటానికి తిరస్కరించారని తెలిసింది’’ అని సదరు అధికారి తెలిపారు. ఆయన తన పేరు వెల్లడించవద్దని కోరారు.

    ఈ ఉదంతంపై ‘‘ఐపీసీ సెక్షన్లు 354, 323, 324, 504, 506, 509 కింద కేసు నమోదు చేశాం’’ అని బెంగళూరు (నార్త్ ఈస్ట్) డీసీపీ అనూప్ షెట్టి బీబీసీకి చెప్పారు.

    ఆ మహిళ తను షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తినా కాదా అనేది వెల్లడించలేదని పోలీసులు పేర్కొన్నారు.

  15. జోషిమఠ్‌: ఎందుకు కుంగిపోతోంది? జనం ఎందుకు ఇళ్లు వదిలి పోతున్నారు?

  16. అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రంజెంటేటివ్స్ స్పీకర్‌గా కెవిన్ మెకార్థి

    కెవిన్ మెకార్థి

    ఫొటో సోర్స్, Reuters

    అమెరికా హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌కు స్పీక‌ర్‌గా రిప‌బ్లిక‌న్ నేత కెవిన్ మెకార్థి ఎన్నిక‌య్యారు. 15వ రౌండ్ ఓటింగ్ త‌ర్వాత ఆయ‌న స్పీక‌ర్‌గా విజయం సాధించారు.

    స్పీక‌ర్ ఎన్నిక కోసం నాలుగు రోజులుగా ఓటింగ్ జ‌రుగుతోంది.

    అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది.

    అయితే, కొంద‌రు రెబ‌ల్స్ వ‌ల్ల కెవిన్ తీవ్ర పోరాటం చేయాల్సి వ‌చ్చింది.

    చివరకు 15వ రౌండ్ ఓటింగ్‌లో మొత్తం 428 ఓట్లు పోలవగా మెకార్థికి 216, డెమొక్రాట్స్ అభ్యర్థి హకీమ్ జెఫ్రీస్‌కు 212 ఓట్లు నమోదయ్యాయి. దీంతో మెకార్థి హౌజ్ స్పీక‌ర్‌గా ఎన్నిక‌య్యారు.

  17. బాలకృష్ణ, శృతి హాసన్‌ల హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ - టెక్నికల్ లోపమే కారణం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    బాలకృష్ణ హెలికాప్టర్

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, బాలకృష్ణ శుక్రవారం ఈ హెలికాప్టర్‌లోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ కోసం ఒంగోలు వచ్చారు

    టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తటంతో పైలట్ అత్యవసరంగా దించేశారు.

    బాలకృష్ణతో పాటు వీరసింహారెడ్డి సినీ యూనిట్‌ సభ్యులు పలువురు ఈ హెలికాప్టర్‌లో ఉన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో శుక్రవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బాలకృష్ణ, శృతి హాసన్ సహా కొందరు ప్రముఖులు హెలికాప్టర్‌లో హైదరాబాద్ ప్రయాణమయ్యారు.

    అయితే బయలుదేరిన 15 నిమాషాలకే ఏటీసీ క్లియరెన్స్ లేకపోవడం, ఇతర కారణాలతో హెలికాప్టర్‌ను ఒంగోలులోని పోలీస్ గ్రౌండ్స్‌లో అత్యవసరంగా దింపారు.

    వాతావరణం సహకరించకపోవడం, ఇతర కారణాలు కూడా తోడయ్యాయని చెబుతున్నారు.

    క్లియరెన్స్ లభిస్తే హెలికాప్టర్‌లో లేదా రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరేందుకు బాలకృష్ణ, శృతిహాసన్ తదితరులు ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌లో కొంత సేపు వేచి చూశారు.

  18. మాఫియా డాన్ 'ది మౌస్'ను ఎలా అరెస్ట్ చేశారు... ఆ ప్రయత్నంలో 29 మంది ఎందుకు బలయ్యారు?

  19. రాహుల్ గాంధీ: ‘మోదీ చేయనిది.. రాహుల్ చేశారు’ – భారత్ జోడో యాత్ర గురించి విదేశీ మీడియా ఎలా విశ్లేషిస్తోంది?

  20. అమెరికా: టీచర్‌ను తుపాకీతో కాల్చిన ఆరేళ్ల బాలుడు, మాట్ మర్ఫీ, బీబీసీ న్యూస్

    హ్యాండ్ గన్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒక ఆరేళ్ల బాలుడు టీచర్ మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు చెప్పారు.

    న్యూపోర్ట్ న్యూస్ నగరంలోని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయని చీఫ్ స్టీవ్ డ్రూ తెలిపారు.

    ఆ బాలుడికి తుపాకీ ఎలా వచ్చిందో ఇంకా తెలియలేదన్నారు. అయితే ఆ ఘటన ‘‘ప్రమాద వశాత్తూ జరిగిన కాల్పులు’’గా ఆయన అభివర్ణించారు.

    ఆరు నుంచి ఏడేళ్ల వయసు పిల్లలు ఉండే మొదటి తరగతి క్లాస్‌రూమ్‌లో టీచర్‌కు, విద్యార్థికి మధ్య వాగ్వాదం తర్వాత ఈ ఘటన జరిగింది.

    ఈ కాల్పుల్లో టీచర్ తీవ్రంగా గాయపడ్డారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 30 ఏళ్ల వయసున్న ఆ టీచర్ పేరును అధికారులు వెల్లడించలేదు.

    ఈ స్కూల్‌లో దాదాపు 550 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో మెటల్ డిటెక్టర్ సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థులను అడపా దడపా తనిఖీ చేస్తారు కానీ ప్రతి ఒక్క విద్యార్థినీ తినిఖీ చేయరని పోలీస్ చీఫ్ వివరించారు.

    బాలుడు ఉపయోగించిన ఆయుధం పేరును వెల్లడించటానికి పోలీసులు నిరాకరించారు. అయితే అతడు ఒక హ్యాండ్‌గన్ ఉపయోగించినట్లు చెప్పారు.