కందుకూరు తొక్కిసలాట కేసులో టీడీపీ నేత ఇంటూరి నాగేశ్వరరావు అరెస్టు

టీడీపీ కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. హైదరాబాదులోని తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. రాజమౌళి: ఎన్‌వైఎఫ్‌సీ ఉత్తమ దర్శకునిగా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్

  3. గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...

  4. కందుకూరు తొక్కిసలాట కేసులో టీడీపీ నేత ఇంటూరి నాగేశ్వరరావు అరెస్టు

    ఇంటూరి నాగేశ్వరరావు

    ఫొటో సోర్స్, UGC

    కందుకూరు తొక్కిసలాట కేసులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత ఇంటూరి నాగేశ్వరరావు‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

    టీడీపీ కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. హైదరాబాదులోని తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    రెండు కార్లలో కందుకూరు నుంచి పోలీసులు హైదరాబాద్ వచ్చినట్లుగా సమాచారం.

    కందుకూరులో చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించారు.

  5. ముగిసిన పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియలు

    పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియలు

    ఫొటో సోర్స్, VATICAN MEDIA

    పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియలు వాటికన్‌లో ముగిశాయి.

    వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్‌లో చివరి సారి బెనెడిక్ట్ మృతదేహాన్ని పోప్ ఫ్రాన్సిస్‌ ఆశీర్వదించారు. ఆ తరువాత ఖననం చేసేందుకు బెనెడిక్ట్ శవపేటికను సెయింట్ పీటర్ బసిలీకాకు తీసుకెళ్లారు.

    పోప్ బెనెడిక్ట్ 95ఏళ్ల వయసులో గత శనివారం మరణించారు. వాటికన్ సిటీలో ఆయనకు నివాళులు అర్పించేందుకు సుమారు 50వేల మంది వచ్చారు. వీరిలో క్యాథలిక్ మతాధికారులతో పాటు ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు.

    సుమారు 600 సంవత్సరాల తరువాత పోప్ పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా బెనెడిక్ట్ నిలిచారు.

  6. హల్ద్వానీ: ‘రాత్రికి రాత్రే వేలాది మందిని నిరాశ్రయులను చేయడం తగదు’- సుప్రీం కోర్టు

  7. కామారెడ్డి: మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా... పోలీసులతో ఘర్షణ, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    కామారెడ్డి రైతుల ధర్నా

    ఫొటో సోర్స్, UGC

    కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని భారీ సంఖ్యలో రైతులు, వారి కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ముందు బైఠాయించారు.

    పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు చొచ్చుకుపోయారు.

    కలెక్టర్ వచ్చి వినతిపత్రం తీసుకోకపోతే గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్తామని రైతులు హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

    కామారెడ్డి మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో ప్రతిపాదించిన ఇండస్ట్రీయల్, గ్రీన్ జోన్‌లో రైతుల భూములు పెద్ద ఎత్తున పోతున్నాయి.

    ఈనేపథ్యంలో బుధవారం రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

    రాములు ఆత్మహత్యతో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది.ఉపసర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పీఏసీఎస్ డైరెక్టర్ రాజీనామాలు సమర్పించారు.

    రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.

    కామారెడ్డి మున్సిపల్‌లో విలీనం చేసిన ఏడు గ్రామాల రైతులు ఈరోజు సీఎస్ఐ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్‌కు భారీగా చేరుకున్నారు.

    గత నెలరోజులుగా మాస్టర్ ప్లాన్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి.

  8. గుండెపోటు: 40వేల అడుగుల ఎత్తులో విమానప్రయాణికునికి హార్ట్‌స్ట్రోక్... 5 గంటల పాటు వైద్యం చేసి బతికించిన డాక్టర్

  9. సికింద్రాబాద్ బన్సీలాల్ మెట్ల బావి చరిత్ర ఏంటో తెలుసా...

  10. స్కూలుకు పంపించడానికి ఒక బిడ్డనే ఎంచుకోవాలి... ఓ అయిదుగురు పిల్లల తల్లి కథ

  11. దిల్లీ: కారుతో 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి చంపేసింది ఈ అమ్మాయినే

  12. మాజీ పోప్ బెనెడిక్ట్ XVI అంత్యక్రియలు నేడే

    మాజీ పోప్ బెనెడిక్ట్

    ఫొటో సోర్స్, EPA

    మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ను చివరి చూపు చేసేందుకు గత మూడు రోజుల్లో 2 లక్షల మంది వచ్చారని వాటికన్ వెల్లడించింది.

    మాజీ పోప్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం పేటికలో ఉంచారు. అంత్యక్రియలు గురువారం నాడు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం పోప్ ఫ్రాన్సిన్ నేతృత్వంలో జరుగుతుంది. ఒక సిటింగ్ పోప్ తనకు పూర్వం ఆ హోదాలో ఉన్న వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడం 220 ఏళ్ళలో ఇదే మొదటిసారి అని వాటికన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

    మాజీ పోప్ 95 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో కొత్త ఏడాది మొదటి రోజును తుది శ్వాస విడిచారు.

    సెయింట్ పీటర్స్ బసీలికా వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు జరిగే అంత్యక్రియలకు వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  13. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమో ప్రమోషన్ కార్యక్రమంపై బజరంగ్ దాడులు

    పఠాన్ సినిమా

    ఫొటో సోర్స్, CREDIT - YRF PR

    షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంపై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులు చేశారు. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్‌ ఆల్ఫా వన్ మాల్‌లో ఈ సినిమా ప్రమోషన్‌ వేదిక వద్ద బజరంగ్ దళ్ సభ్యులు వీరంగం చేశారు. షారుఖ్ ఖాన్ ఫోటోలున్న పబ్లిసిటీ బోర్డులను ధ్వంసం చేశారు.

    ఒకవేళ సినిమాను విడుదల చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. పఠాన్ మూవీలోని బేషరం రంగ్ పాట విడుదలైనప్పటి నుంచే దీనిపై వివాదాలు మొదలయ్యాయి. ఈ పాటపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. బ్రేకింగ్ న్యూస్, అమెజాన్‌లో 18,000 ఉద్యోగాల కోత, ఎవరెవరిని తీసేస్తామన్నది జనవరి 18 నుంచి చెబుతామన్న సీఈఓ

    అమెజాన్

    అమెజాన్ సంస్థ తన ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా 18,000 ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయించింది.

    ఈ నిర్ణయం ప్రభావం ఎవరెవరి మీద ఉంటుందో వారందరికీ జనవరి 18 నుంచి చెబుతామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాసీ సంస్థ సిబ్బంది కోసం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

    అంటే, దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులన్న అమెజాన్‌లో దాదాపు 6 శాతం మంది ఉద్యోగాలు పోనున్నాయి. సిబ్బంది కోత ఉంటుందని ఈ సంస్థ గత ఏడాది నవంబర్‌లో తెలిపినప్పటికీ ఆ సంఖ్య ఏ స్థాయిలో ఉండవచ్చన్నది అప్పుడు చెప్పలేదు.

    అమెజాన్

    ఫొటో సోర్స్, Getty Images

    "ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వారికి ఎలాంటి మద్దతు ఇవ్వాలనే విషయమై మేం ఆలోచిస్తున్నాం. ఉద్యోగ నిష్క్రమణ ప్యాకేజి, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, ఇతర సంస్థల్లో ఉద్యోగావకాశాలకు సహకారం అందించడం వంటివి చేసేందుకు సిద్ధమవుతున్నాం" అనని జాసీ అన్నారు.

    గతంలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని అమెజాన్ నిలబడిందని, అలాగే ఇక ముందు కూడా కొనసాగుతుందని కూడా జాసీ చెప్పారు.

    అయితే, ఈ ఉద్యోగాల కోత ఏయే ప్రాంతాల్లో ఉంటుందన్నది ఆయన స్పష్టం చేయలేదు. ఎక్కువగా అమెజాన్ స్టోర్స్ ఆపరేషన్స్, టెక్నాలజీ టీమ్‌లపై ఈ ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు.