ఎన్నికలకు ముందుగా ప్రతిపక్షాలను అడ్డుకునేందుకే ఈ జీవో – పవన్ కల్యాణ్

ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో 1ను తీసుకొచ్చిందని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ఎన్నికలకు ముందుగా ప్రతిపక్షాలను అడ్డుకునేందుకే ఈ జీవో – పవన్ కల్యాణ్

    పవన్ కల్యాణ్

    ఫొటో సోర్స్, Facebook/Pawan kalyan

    ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో 1ను తీసుకొచ్చిందని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు.

    ‘‘ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు మీరు పాద యాత్రలు చేయచ్చు, రోడ్‌ షోలు చేయచ్చు.ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు - ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతేఎలా? మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకివచ్చాక ఇంకో రూలా?’’అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. మంచులో రాకెట్‌లా దూసుకుపోయే అమ్మాయి

  4. అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?

  5. గణితంలో బ్రిటన్ వెనుకబడిందా... 18ఏళ్ల వరకూ అందరూ మ్యాథ్స్ చదవాలంటున్న రిషి సునాక్

  6. నందమూరి బాలకృష్ణ: వీరసింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై ఏపీ పోలీసుల అభ్యంతరం

  7. సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిక

    కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, శ్వాసకోస ఇబ్బందులతో దిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు.

    ‘సోనియా గాంధీ ఛాతీ సంబంధిత విభాగంలో చేరారు. ఆమెకు చికిత్స అందిస్తున్నాం’ అని గంగా రామ్ ఆసుపత్రి చైర్మన్ డా. అజయ్ స్వరూప్ వార్తా సంస్థ ఏఎన్‌‌ఐకు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. చంద్రబాబు కుప్పం పర్యటన: ‘నా నియోజకవర్గం నుంచి నేను పారిపోవాలా’... పోలీసుల మీద టీడీపీ అధినేత ఆగ్రహం

  9. దిల్లీలో బుధవారం 4.4°C కనిష్ట ఉష్ణోగ్రత.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

    దిల్లీ చలి

    ఫొటో సోర్స్, ANI

    రాజధాని దిల్లీలో బుధవారం ఈ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ధర్మశిల (5°C), నైనిటాల్ (6°C), డెహ్రాడూన్ (4.5°C) కంటే దిల్లీలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

    దాంతో, వాతావరణ శాఖ దిల్లీలో మరో రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

    పొగమంచు కారణంగా విజిబిలిటీ (దృశ్యమానత) 200కి పడిపోయిందని, దిల్లీకి వచ్చే 19 రైళ్లు గంటన్నర నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయని రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపినట్టు పీటీఐ వెల్లడించింది.

    రానున్న 24 నుంచి 48 గంటల పాటు చలిగాలులు, చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనామణి తెలిపారు. జనవరి 7 తరువాత వాతావరణం మెరుగవుతుందని అన్నారు.

    ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావచ్చని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

    ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు వాతావరణ శాఖ బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది.

  10. కుప్పం: టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ, తులసీ ప్రసాద్, బీబీసీ కోసం

    చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, UGC

    చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మీద ఉత్కంఠ నెలకొంది. సభలు, రోడ్ షోలకు అనుమతులు లేవంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను పోలీసులు అడ్డుకుంటున్నారు.

    కుప్పంలో చంద్రబాబు నాయుడు రోడ్‌ షో చేపట్టనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు వస్తుండటంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

    ఇటీవల చంద్రబాబు ర్యాలీల్లో కొందరు మరణించడంతో, రోడ్ షోలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది.

    చంద్రబాబు

    ఫొటో సోర్స్, UGC

    మూడు రోజుల పర్యటన సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో పర్యటించనున్న చంద్రబాబు ప్రచార వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    చంద్రబాబు సభకి తరలివస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతిపురం మండలంలోని గొల్లపల్లి వద్ద టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. కార్యకర్తల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

    చంద్రబాబు

    ఫొటో సోర్స్, UGC

    ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, చంద్రబాబు పర్యటనపై ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌కు నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. సభలకు అనుమతులు లేవని, సభలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

    ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారిపై, కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

    ఈ మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్న చంద్రబాబు రోడ్డు మార్గం నుంచి శాంతిపురం చేరుకున్నారు.

    శాంతిపురంలో చంద్రబాబు సభ కోసం ఏర్పాటుచేసిన స్టేజిని పోలీసులు తొలగించారు.

  11. దర్గా ముందు తిండి కోసం ఎదురు చూసే ఈ చిన్నారి మిలియనీర్ ఎలా అయ్యాడు?

  12. యూరప్‌లో శీతాకాలంలో రికార్డ్ స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు.. స్పెయిన్‌లో 25 డిగ్రీలు

    యూరప్‌

    ఫొటో సోర్స్, EPA

    యూరప్‌లోని పలు దేశాల్లో జనవరి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఎనిమిది దేశాల్లో జాతీయ స్థాయి రికార్డులు దాటిపోగా, మూడు దేశాల్లో రాష్ట్ర స్థాయి రికార్డులు దాటి పోయాయి.

    ఆదివారం పోలండ్‌లో 18.9C నమోదు కాగా, స్పెయిన్‌లో 25.1C నమోదైంది.

    మరోవైపు, నార్త్ అమెరికాలో మంచు తుపాన్లు కురుస్తున్నాయి. కొన్ని రోజులకు ముందు వచ్చిన తుపానులో 60 మంది చనిపోయారు.

    రానున్న రోజుల్లో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తుందని, ఉరుములతో కూడిన వానలు పడతాయని అంచనా.

    కానీ, యూరప్‌లో పరిస్థితి వేరుగా ఉంది, నెదర్లాండ్స్, లిచ్టెన్‌స్టెయిన్, లిథువేనియా, లాట్వియా, చెక్ రిపబ్లిక్, పోలాండ్, డెన్మార్క్, బెలారస్‌లలో ఉష్ణోగ్రతలు జాతీయ రికార్డులను బద్దలు కొట్టాయి.

    జర్మనీ, ఫ్రాన్స్, యుక్రెయిన్‌లలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  13. గోదావరి తీరంలో ఎండు చేపల కథ

  14. భోపాల్ గ్యాస్ విషాదం: 39 ఏళ్లయినా తేలని మృతుల సంఖ్య, అందని పరిహారం

  15. ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒక మహిళపై మూత్ర విసర్జన చేశారు

    ఎయిర్ ఇండియా

    ఫొటో సోర్స్, Getty Images

    న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఒక మహిళపై మూత్ర విసర్జన చేశారు. ఇది జరిగి నెల పైనే అయింది కానీ, విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.

    ఇది "సిగ్గుమాలిన పని" అని, "షాకింగ్" అని చాలామంది విమర్శిస్తున్నారు.

    బిజినెస్ క్లాసులో ఒక వృద్ధ మహిళ ప్రయాణిస్తున్నారు. అదే క్లాసులో ప్రయాణిస్తున్న కొందరు పురుషులు మద్యం మత్తులో ఉన్నారు. ఒక వ్యక్తి ఆమెపై మూత్రవిసర్జన చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాను కోరింది.

    విమానయాన సంస్థ నుంచి నివేదిక కోరామని, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ బుధవారం తెలిపింది.

    2022 నవంబర్ 26న ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాసులో మద్యం మత్తులో ఉన్న ఒక పురుషుడు ఒక మహిళపై మూత్ర విసర్జన చేశారని, ఎయిర్ ఇండియా పోలీసు కంప్లైంట్ చేసిందని అదే సంస్థకు చెందిన అధికారి ఒకరు చెప్పినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది.

  16. స్పామ్ కాల్స్: 'హలో... మీకు 5 లక్షల పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది, తీసుకుంటారా?'

  17. రష్యా: సైనికులు ఫోన్ వాడడం వల్లే వారిపై మిసైల్ దాడి జరిగింది

    మాకియివ్కా

    ఫొటో సోర్స్, REUTERS

    రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో మిసైల్ దాడిలో కనీసం 89 మంది రష్యన్లు చనిపోయారని, సైనికులు మొబైల్ ఫోన్లు వాడడం వల్లే ఇలా జరిగిందని రష్యా అంటోంది.

    జనవరి 1 అర్ధరాత్రి దాటిన తరువాత ఆక్రమిత దోన్సాస్క్ ప్రాంతంలోని మాకియివ్కాలో రష్యా ట్రూపులపై యుక్రెయిన్ మిసైల్ దాడి చేసింది.

    రషా సైనికులకు ఫోన్ వాడకం నిషేధించినప్పటికీ, వాళ్లు వాటిని వాడడం వల్ల తమ లొకేషన్ ప్రత్యర్థులకు తెలిసిపోయిందని రష్యా మిలటరీ అంటోంది.

    ఈ దాడిలో చనిపోయినవారి సంఖ్య స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ యుద్ధంలో అత్యధికంగా మరణాలు చోటు చేసుకున్న ఘటన ఇదేనని రష్యా అంగీకరించింది.

    కాగా, మృతుల సంఖ్య అంచనా వేసిన దాని కన్నా చాలా ఎక్కువ అని, 400 మంది సైనికులు చనిపోయారని, 300 మంది గాయపడ్డారని యుక్రెయిన్ చెబుతోంది.

    కొత్త సంవత్సరం తొలిరోజు స్థానిక సమయం అర్థరాత్రి 12.01 గంటలకు అమెరికా నిర్మిత హిమార్స్ రాకెట్ సిస్టం నుంచి ఆరు రాకెట్లు ఒక వొకేషనల్ కాలేజీ మీద పడ్డాయని, వాటిలో రెండిటిని ధ్వసం చేశామని రష్యా తెలిపింది.

    మరణించిన వారిలో రెజిమెంట్ డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ బచురిన్ కూడా ఉన్నారని రష్యా మిలటరీ బుధవారం టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

    ఈ దాడికి ప్రధాన కారణం సైనికులు మొబైల్ ఫోన్ వాడడమేనని, దాని వల్లే వారి ఉనికి యుక్రెయిన్‌కు తెలిసిందని పేర్కొంది.

    దాడిలో చనిపోయినవారికి సంతాపం తెలుపుతున్న రష్యన్లు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, దాడిలో చనిపోయినవారికి సంతాపం తెలుపుతున్న రష్యన్లు

    ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో తెలిపారు.

    ఈ దాడిలో 63 మంది చనిపోయారని తొలుత రష్యా చెప్పింది. తరువాత ఈ సంఖ్యను 89కి పెంచింది.

    మృతుల సంఖ్యను కచ్చితంగా నిర్థరించడం దాదాపు అసాధ్యం. అయితే, రష్యా.. యుద్ధ రంగంలో మరణాల సంఖ్యను ప్రస్తావించడం చాలా అరుదు.

    దాడి జరిగిన సమయంలో వొకేషనల్ కాలేజీ సైనికులతో నిండి ఉంది. దగ్గర్లోనే మందుగుండు సామాగ్రి కూడా ఉంది. అదంతా బూడిదైపోయింది.

  18. రక్తంతో ప్రేమలేఖలు, అమరుల చిత్రాలు, విన్నపాలు, నిరసనలు... ఈ ఎరుపుదనం ఓ బలమైన ప్రతీకగా ఎలా మారింది?

  19. హిజాబ్ లేకుండా ఆడినందుకు ఇరాన్ చెస్ ప్లేయర్‌కు బెదిరింపులు

    ఇరాన్ చెస్ క్రీడాకారిణి సారా ఖాదిమ్‌

    ఫొటో సోర్స్, REUTERS

    ఫొటో క్యాప్షన్, ఇరాన్ చెస్ క్రీడాకారిణి సారా ఖాదిమ్‌

    ఇరాన్ చెస్ క్రీడాకారిణి సారా ఖాదిమ్‌ హిజాబ్ లేకుండా చదరంగం పోటీల్లో పాల్గొంటున్నందుకు ఆమెకు బెదిరింపు కాల్స్ వెళ్లాయి. వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని హెచ్చరికలు వచ్చాయి.

    సారా గత వారం కజకిస్థాన్‌లో ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో హిజాబ్ ధరించకుండా పాల్గొన్నారు. ఇరాన్‌లో మహిళలకు హిజాబ్ ధరించడం తప్పనిసరి.

    ఆమె వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని, ఇక్కడికి వస్తే తన సమస్య తీరుస్తామని బెదిరింపు కాల్స్ అనేకం వచ్చాయని సారా ఖాదీమ్‌ సన్నిహిత వర్గాలు తెలిపినట్టు రాయిటర్స్ పేర్కొంది.

    ఇరాన్‌లో ఉన్న సారా తల్లిదండ్రులు, బంధువులకు కూడా బెదిరింపు కాల్స్ వెళ్లాయి.

    కాగా, ఇరాన్ విదేశాంగ శాఖ ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

    సారా మంగళవారం స్పెయిన్ చేరుకున్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.

  20. భారత్-శ్రీలంక టీ20 సీరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

    శివం మావి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, శివం మావి

    భారత్-శ్రీలంక మధ్య మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

    హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి తోడు శివం మావి అద్భుతమైన బౌలింగ్ భారత్‌ను గట్టెక్కించింది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ఇది అయిదో విజయం.

    2024లో జరిగే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

    టీ20ల్లోకి అరంగ్రేటం చేసిన బౌలర్ శివం మావి కూడా టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.

    భారత్-శ్రీలంక టీ20 సీరీస్

    ఫొటో సోర్స్, Getty Images

    టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది.

    దీపక్ హూడా (23 బంతుల్లో 41 పరుగులు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 37 పరుగులు), అక్షర్ పటేల్ (20 బంతుల్లో 31 నాటౌట్) బ్యాట్ ఝళిపించారు.

    అనంతరం, శ్రీలంక 160 పరుగులోకు ఆల్ అవుట్ అయింది.

    శివం మావి 22 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ (2/17), హర్షల్ పటేల్ (2/41) కూడా రాణించడంతో గెలుపు భారత్ పక్షాన చేరింది.

    శ్రీలంక్ కెప్టెన్ శానక (27 బంతుల్లో 45 పరుగులు), చమిక (16 బంతుల్లో 23 నాటౌట్) గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ శ్రీలంక ఓడిపోయింది.

    మూడు టీ20ల సీరీస్‌లో రెండవ మ్యాచ్ జనవరి 5, గురువారం పుణెలో జరగనుంది.