మహిళల టీ-20 వరల్డ్ కప్‌-2023: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరగబోయే మహిళల టీ-20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    తాజా వార్తలతో రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.

  2. ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు రోడ్‌ షోలో విషాదం, తొక్కిసలాటలో 8 మంది మృతి

  3. మహిళల టీ-20 వరల్డ్ కప్‌-2023: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

    భారత మహిళల క్రికెట్ జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరగబోయే మహిళల టీ-20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

    ఆ తరువాత దక్షిణాఫ్రికాలో భారత్ - వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా ట్రై సిరీస్‌లో కూడా ఈ జట్టే పాల్గొంటుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మందన్న కొనసాగుతారు.

    ప్రపంచ మహిళల క్రికెట్ కప్ పోటీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రారంభమవుతాయి. భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12 సాయంత్రం 6.30 గంటలకు పాకిస్తాన్‌తో ఆడుతుంది.

  4. హార్దిక్, సూర్యకుమార్ యాదవ్‌లకు పగ్గాలు... మరి రోహిత్, రాహుల్‌ల సంగతేంటి?

  5. మన శ్వాస, శరీరం నుంచి వచ్చే చెమట చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయా?

  6. పొన్నియిన్ సెల్వన్ 2: మణిరత్నం సినిమా రెండో భాగం విడుదల ఎప్పుడంటే..

    పొన్నియిన్ సెల్వన్ 2

    ఫొటో సోర్స్, Lyca Productions

    మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్-2 విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బుధవారం వెల్లడించింది.

    విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తి, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబరు 30న విడుదలైన సంగతి తెలిసిందే.

    తాజాగా రెండో భాగానికి సంబంధించి లైకా ప్రోడక్షన్స్ ఒక ప్రోమోను ట్వీట్ చేస్తూ విడుదల తేదీని ప్రకటించింది.

    కల్కి కృష్ణమూర్తి పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. దంతాల కోసం హిప్పోల అక్రమ వేట, ఆఫ్రికా ఏనుగుల్లాగే ఇవీ అంతరించిపోయే పరిస్థితికి వస్తుందా?

  8. హీరాబెన్ త్వరగా కోలుకోవాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్

    ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

    ‘తల్లి, బిడ్డల మధ్య ప్రేమ అనంతమైనది. వెల కట్టలేనిది. మోదీజీ, ఈ కఠిన సమయంలో నా మద్దతు మీకు ఉంటుంది.

    మీ తల్లి సాధ్యమైనంత త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని రాహుల్ గాంధీ ఆ పోస్టులో అన్నారు.

    100ఏళ్ల హీరాబెన్ అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. భద్రాచలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, I&PR,TELANGANA

    తెలంగాణలోని భద్రాచలంలో వనవాసి కల్యాణ పరిషత్ నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

    సమ్మక్క సారలమ్మ ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, ఇలాంటి ఉత్సవాలు సమాజంలో సామరస్యతకు తోడ్పడతాయని ముర్ము అన్నారు.

    కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ కార్యక్రమంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాల అభివృద్దికి తోడ్పాటు లభిస్తుందోని ఆమె తెలిపారు.

    ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, I&PR,TELANGANA

    వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీల విద్య, మహిళా వికాసం కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రశంసించారు.

    తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ముర్ము, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వచ్చారు. అక్కడ రామాలయంలో దేవతా మూర్తులను సందర్శించారు.

    హెలికాప్టర్ దిగుతున్న ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, I&PR,TELANGANA

  10. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ‘కొనుగోలు’ కేసులో ఈడీ దర్యాప్తు మీద స్టేకు హైకోర్టు నిరాకరణ

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

    ఫొటో సోర్స్, Pilot Rohith Reddy/Facebook

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ‘కొనుగోలు’ కేసులో ఈడీ దర్యాప్తు మీద స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

    ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది.

    ఈనెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

    రోహిత్‌ రెడ్డి తరఫున వైకాపా ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

    ‘పార్టీ మారాలని తనకు వంద కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ నన్ను వేధిస్తోంది’ అంటూ రోహిత్ రెడ్డి వాదించారు.

  11. బ్రేకింగ్ న్యూస్, హీరాబెన్ మోదీ ఆరోగ్యం స్థిరంగానే ఉందన్న ఆసుపత్రి

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా హాస్పిటల్ ప్రకటన విడుదల చేసింది.

  12. హీరాబెన్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి

  13. స్టడీ బంకర్: అంబేడ్కర్ స్ఫూర్తితో లైబ్రరీ

  14. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆసుపత్రిలో చేరిక

    తల్లి హీరాబెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, BJP Gujarat/Facebook

    నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు.

    ఆమె ఆరోగ్యపరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని చూడటానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  15. దుకాణం నడుపుతూ, దాచుకున్న డబ్బులతో లైబ్రరీ పెట్టిన యువకుడు

    ఈయన వారానికి రెండు, 15 రోజులకు నాలుగు, నెలకు ఎనిమిది పుస్తకాలు చదువుతారు. ఓ దళిత గ్రామంలో జీవించే మోయీన్ అంబేద్కర్ స్ఫూర్తితో ఒక లైబ్రరీ కూడా పెట్టారు. ఇక్కడ 700కుపైగా పుస్తకాలు ఉన్నాయి.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  16. కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’

  17. తెలంగాణ: రచయిత, కవి శ్రీభాష్యం విజయ సారథి మరణం, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    విజయ సారథి

    ఫొటో సోర్స్, UGC

    కరీంనగర్ జిల్లాకు చెందిన రచయిత, కవి శ్రీ భాష్యం విజయ సారథి(86) మరణించారు.

    కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన స్వగృహంలో అర్ధరాత్రి దాటాక సుమారు ఒకటిన్నర సమయంలో తుదిశ్వాస విడిచారు.

    కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 10న విజయ సారథి జన్మించారు. 7వ ఏటనే పద్యరచనప్రారంభించిన ఆయన, తెలుగులో 100కు పైగా పుస్తకాలు రాశారు.

    2020లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.

    ఇవాళ సాయంత్రం అధికారిక లాంఛనాలతో కరీంనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  18. మైసూరు: ‘చర్చి మీద దాడి’

    మైసూరులోని ఒక చర్చి మీద దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి.

    పిరియపట్న చర్చిలోని ‘బాల యేసు’ బొమ్మతో పాటు ఇతర సామాగ్రిని ధ్వంసం చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    ఈ ఘటన మీద విచారణ మొదలు పెట్టామని, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నామని మైసూరు ఎస్పీ సీమ లట్కర్ తెలిపారు. హుండిని దొంగిలిచినట్లుగా తెలుస్తోందని వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. బ్రేకింగ్ న్యూస్, నారా లోకేశ్: 400 రోజులు... 4,000 కిలోమీటర్ల పాదయాత్ర

    నారా లోకేశ్

    ఫొటో సోర్స్, Facebook/Nara Lokesh

    ఆంధ్రప్రదేశ్‌లో 4వేల కిలోమీటర్ల మేర నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రకటించింది.

    మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

    ‘యువగళం’ పేరుతో సాగనున్న ఈ యాత్రం 400 రోజులపాటు జరగనుంది.

    జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర కుప్పం నుంచి మొదలు కానుంది.

  20. మల్లెపూలు కనుమరుగు కానున్నాయా?

    ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను అనేక రంగాలు చవి చూస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పూలమొక్కల సాగు చేసే రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

    పెరిగిన రసాయనాలు, ఎరువుల ధరలతో పాటు కూలీలు దొరకకపోవడం వంటి అనేక సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.

    పూల పెంపకంలో వాతావరణ మార్పుల ప్రభావంపై మహారాష్ట్ర నుంచి బీబీసీ ప్రతినిధులు అమృత దుర్వే, షార్దుల్ కదమ్ అందిస్తున్న కథనం.