లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బీఆర్‌ఎస్ పార్టీ కేడర్‌లో నమ్మకం పోతోందంటూ ఆ పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Mynampally Hanumantha Rao/Facebook
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బీఆర్‌ఎస్ పార్టీ కేడర్‌లో నమ్మకం పోతోందంటూ ఆ పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఇంట్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేక్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బి.సుభాష్ రెడ్డి భేటీ అయ్యారు.
ఆ సమావేశం జరుగుతున్న సమయంలోనే అక్కడికి మీడియా చేరుకుంది. మీడియాతో మాట్లాడకుండా పోతే ‘తప్పుడు’ అర్థాలు వస్తాయని అందుకే మాట్లాడుతున్నామని మైనంపల్లి హనుమంతరావు అన్నారు.
‘ఈ సమావేశం గురించి చెప్పకపోయినప్పటికీ మీడియాకు కొందరు లీకులు ఇచ్చారు.
మేం ఇక్కడ కార్యకర్తల సమస్యలను చర్చించేందుకు భేటీ అయ్యాం.
ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. జిల్లా నాయకత్వం విఫలమైంది కాబట్టే మేం సమావేశమయ్యాం. మంత్రి మల్లారెడ్డి పార్టీ పదవులన్నీ తన ప్రాంతంలోని వారికే ఇస్తున్నారు.
మేడ్చల్‌కు మాత్రమే ఆయన మంత్రి కాదు. కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బీఆర్‌ఎస్ కేడర్‌లో నమ్మకం పోతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మీడియా ద్వారా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం’ అని మైనంపల్లి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
మహారాష్ట్రలో ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం తన నెలల బిడ్డను తీసుకొని అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు.
‘కరోనా వల్ల గత రెండేళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. నేను తల్లిని అయినప్పటికీ నా గొంతు వినిపించేందుకు ఇక్కడి వరకు వచ్చాను.
నాకు ఓటు వేసిన వారి ప్రశ్నల జవాబుల కోసం వచ్చాను’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఆమె అన్నారు.
ఈ ఏడాది సెప్టెంబరు 30న సరోజ్ బాబులాల్ బిడ్డకు జన్మనిచ్చారు.
హైదరాబాద్ పాతబస్తీలో లలిత్ బాగ్ కార్పొరేటర్ ఆజం షరీఫ్ మేనల్లుడిని హత్య చేశారు.
లలితా బాగ్‌లో గల కార్పొరేటర్ ఆఫీసులోనే ఆయన మేనల్లుడు మహ్మద్ అనస్ మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కత్తులతో పొడిచారు.
ఓవైసీ ఆసుపత్రికి అనస్‌ను తీసుకుపోగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు భవాని నగర్ ఇన్‌స్పెక్టర్ ఎండీ అంజద్ అలీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు.
‘మీ(నరేంద్ర మోదీ) నాయకత్వంలో సాంకేతిక మార్పులను వేగంగా అందిపుచ్చుకోవడం చాలా ప్రేరణ ఇస్తోంది. మన బంధం మరింత బలపడాలని ఆశిస్తున్నాను’ అంటూ సుందర పిచాయ్ ట్వీట్ చేశారు.
‘గూగుల్ ఫర్ ఇండియా’ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు పిచాయ్ భారత్‌కు వచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు.
‘ధరల పెరుగుదల చాలా పెద్ద సమస్య. బీపీఎల్ కుటుంబాలకు ఒక ఏడాదిలో 12 గ్యాస్ సిలిండర్లను రూ.500 చొప్పున ఇస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని ప్రారంభిస్తాం’ అని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వరుసగా మూడోసారి ‘అంధుల క్రికెట్ వరల్డ్‌కప్’ను గెలిచినందుకు భారత అంధుల క్రికెట్ జట్టును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ సన్మానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో మాట్లాడాలంటే ఇంగ్లిష్ కావాలని, ‘హిందీతో ఉపయోగం లేదని’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
‘ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో మాట్లాడాలంటే హిందీ పనికిరాదు. ఇంగ్లిష్ కావాలి. పేద రైతులు, కార్మికుల పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వాళ్లతో పోటీపడీ గెలవాలని మేం కోరుకుంటున్నాం.
రాజస్థాన్‌లో 17,00 ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ తెరచినందుకు సంతోషంగా ఉంది.
కానీ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధించకూడదని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. కానీ వాళ్ల పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకే వెళ్తారు.
నిజానికి పేద రైతులు, కార్మికుల పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోకూడదు అనేదే వారి కోరిక’ అని రాజస్థాన్‌లో ఆయన అన్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ రాజస్థాన్‌లో జరుగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
తన శాశ్వత నివాసం భారత్‌లోనేనని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు.
‘ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. యూరప్, ఆఫ్రికా, ఆసియాలోనూ మార్పులు వస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు చైనా కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది.
కానీ చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. భారత్ చాలా మంచి ప్రదేశం. అందువల్లే నేను ఇక్కడే ఉంటాను. నెహ్రూ చూపించిన కాంగ్రా అద్భుతమైన ప్రాంతం. ఇదే నా శాశ్వత నివాసం’ అని దలైలామా మీడియాతో అన్నారు.
ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో చైనా, భారత బలగాల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నల సందర్భంగా దలైలామా అలా స్పందించారు.

ఫొటో సోర్స్, Reuters
కెనడాలోని టొరంటోలో ఒక సాయుధుడు కాల్పులు జరపడం వల్ల అయిదుగురు చనిపోయారు.
వాఘన్ ప్రాంతంలోని ఒక భవనం వద్ద ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపారని భావిస్తున్న వ్యక్తి కూడా చనిపోయినట్లు వారు వెల్లడించారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మరొకవ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

ఫొటో సోర్స్, ANI
బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ భవనంలోని 'సువర్ణ విధాన సౌధ'లో వినాయక్ దామోదర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడంపై వివాదం చెలరేగింది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య స్పీకర్‌కు లేఖ రాస్తూ, వాల్మీకి, బసవన్న, కనక్ దాస్, భీమ్రావ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల చిత్రపటాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తరువాత సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, "ఇది నిరసన కాదు. కర్ణాటక అసెంబ్లీ హాలులో జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తల చిత్రపటాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వీర్ సావర్కర్ చిత్రపటాన్ని అసెంబ్లీలో పెట్టాలని స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయించారు" అని అన్నారు.
"ఎవరి చిత్రపటాన్ని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు. ప్రభుత్వం శాంతి భద్రతల వంటి వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తోంది" అని వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు సిద్ధరామయ్య.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ, "భావజాలంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, వీర్ సావర్కర్ స్వాతంత్ర్య సమరయోధుడు. లేకపోతే, ఎవరి పోస్టర్ పెట్టాలో సిద్ధరామయ్యను అడగండి. దావూద్ ఇబ్రహీం పోస్టర్ పెట్టాలా?" అని అన్నారు.
"స్వాతంత్య్ర ఉద్యమంలో తమ పాత్ర, త్యాగాల గురించి కాంగ్రెస్ చెబుతూనే ఉంటుందిగానీ, అప్పటి కాంగ్రెస్, ఇప్పటి కాంగ్రెస్ రెండూ ఒకటి కావు. ఇప్పుడు మన ముందు ఉన్నది డూప్లికేట్ కాంగ్రెస్" అని ప్రహ్లాద్ జోషి అన్నారు.
ప్రతి సంవత్సరం కర్ణాటక శాసనసభ సమావేశాలు బెలగావిలోని 'సువర్ణ విధాన సౌధ'లో జరుగుతాయి.

ఫొటో సోర్స్, EPA
చైనాలో ఈ శీతాకాలంలో కోవిడ్ 19 మరో వేవ్ రావచ్చని, ఇప్పటికే మొదటి దశ ప్రారంభమైందని ఆ దేశ సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు చెప్పారు.
చైనాలో ఈ నెల ప్రారంభంలో కఠినమైన కోవిడ్ నిబంధనలను సడలించారు. అప్పటి నుంచి కోవిడ్ సంక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
అయితే, రోజువారీ కేసుల సంఖ్యలో తరుగుదల ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కోవిడ్ పరీక్షలు తగ్గినందువల్లే ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.
ఆదివారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, చైనాలో 2097 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
జనవరి మధ్య వరకు కేసులు పెరుగుదల కొనసాగవచ్చని ఎపిడెమాలజిస్ట్ వూ జున్యో చెబుతున్నారు. జనవరి 21న లూనార్ న్యూ ఇయర్ రానుంది. ఆ వేడుకల సందర్భంగా, రెండవ దశ ప్రారంభం కావచ్చని, కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆయన అంటున్నారు.
శనివారం జరిగిన ఓ సదస్సులో వూ జున్యో మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ఎంతగానో ఉపయోగపడిందని, ఫలితంగా సీరియస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అన్నారు.
చైనా జనాభాలో 90 శాతం కంటే ఎక్కువ మంది వ్యాక్సీన్ రెండు డోసులు వేయించుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో పాఠశాల విద్యార్థులతో జరిగిన ఒక కార్యక్రమంలో నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి పాల్గొన్నారు.
'చైల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ బ్లెండ్ ఆఫ్ నేచర్ అండ్ ఫ్యూఛర్ ఆఫ్ తెలంగాణ' అన్న అంశంపై ఆయన ప్రసంగించారు.
బాలల హక్కుల ఉద్యమకారుడైన సత్యార్థి 1980లలో 'బచ్‌పన్ బచావో' ఆందోళన చేపట్టి వేలమంది పిల్లల బాల్యాన్ని, వారి హక్కులను కాపాడారు.
2014లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి వెంకటాపూర్‌లో డిసెంబర్ 16 శుక్రవారం తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో ఇంటికి నిప్పంటుకుని ఆరుగురు సజీవ దహనం అయిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇంటి యజమాని మాసు శివయ్య (50), అతని భార్య పద్మ అలియాస్ రాజ్యలక్ష్మీ , కూతురు వరుస అయ్యే సమీప బంధువు మౌనిక (35), ఆమె కూతుర్లు హిమబిందు (2), స్వీటీ (4)లతో పాటు శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు కూడా ఉన్నారు.
ఆసుపత్రికి తరలించే వీలులేకపోవడంతో శవాలకు ఘటనాస్థలంలోనే పంచనామా, పోస్ట్ మార్టం నిర్వహించారు.
మృతులకు అంత్యక్రియలు పూర్తికాగా శాంతయ్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
కేసులో కొత్త కోణాలు
ఆరుగురు సజీవ దహనం అయిన కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.
అనుమానాస్పద ఘటనగా కేసునమోదు చేసి విచారణ సాగిస్తున్న మందమర్రి పోలీసులు తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించినా, ఆతర్వాత ఘటనాస్థలానికి సమీపంలో ఓ ఆటో, పక్కనే రెండు డీజిల్ డబ్బాలు దొరకడంతో, ఇది ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా నిర్ధారణకు వచ్చారు.
గుడిపెల్లికి సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం రాత్రి ఆటోలో వచ్చిన కొంతమంది వ్యక్తులు రెండు డబ్బాల్లో డీజిల్ నింపుకుంటున్న సిసి ఫూటేజీ పోలీసులకు లభ్యం అయింది.
శాంతయ్య కుటుంబ సభ్యులు పథకం ప్రకారం ఈ హత్యలకు పాల్పడి ఉంటారా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. కొంతమంది పాత నేరస్థులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, వారికి గుడిపెల్లికి చెందిన ఒక వ్యక్తి ఆ రోజు రాత్రి సహకరించారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనను సుపారీ హత్యగా పోలీసులుఅనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, UGC
కుటుంబ సభ్యుల విచారణ
ఘటనలో చనిపోయిన సింగరేణి కార్మికుడు శాంతయ్య, పద్మలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మద్య వివాహేతర సంబందం కొనసాగుతున్నట్టుగా మందమర్రి పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో శాంతయ్యకు అతని భార్య సృజనకు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.
వీరిద్దరి మద్య గతంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి.
శాంతయ్య మరికొన్నేళ్లలో సింగరేణి జాబ్ నుండి రిటైర్ అవుతుండటం, ఇటీవల వారసత్వ ఆస్తిలో వాటాగా వచ్చిన డబ్బుల కోసం తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది.

ఫొటో సోర్స్, UGC
విచారణ సీరియస్ గా తీసుకున్నాం
కేసులో విచారణ కొనసాగుతోందని, ఒకటి రెండు రోజుల్లో ఈ హత్యల వెనుక ఉన్న కారణాలపై ఓ నిర్ధరణకు రాగలుగుతామని బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల అశోక్ బీబీసీకి తెలిపారు.
’హత్యలకు మోటివ్ ఏంటీ అన్నది ఇంకా తేలలేదు. కుటుంబసభ్యులతో పాటు అనుమానం ఉన్న వారిని పిలిచి విచారించి పంపుతున్నాం. ఇప్పటి వరకైతే ఎలాంటి అరెస్టులు చేయలేదు. గతంలో పలుమార్లు శాంతయ్యకు అతని భార్యకు మధ్య పంచాయతీలు జరిగాయి. ఆ పంచాయతీల్లో పాల్గొన్న పెద్ద మనుషులను పిలిచి విచారించాం. కేసును సీరియస్ గా తీసుకున్నాం’’ అని ఏసీపీ ఎడ్ల అశోక్ తెలిపారు.