హోరాహోరీ పోరులో విజేత అర్జెంటీనా... షూటౌట్‌లో ఫెయిలైన ఫ్రాన్స్

కొదమ సింహాల మధ్య జరిగిన హోరాహోరీ పోరు‌లో ఇరు జట్లూ సమంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్ రెండు గోల్స్ మాత్రమే చేయగా, అర్జెంటీనా 4 గోల్స్ చేసి విజేతగా నిలిచింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. హోరాహోరీ పోరులో విజేత అర్జెంటీనా... షూటౌట్‌లో ఫెయిలైన ఫ్రాన్స్

    ఫుట్‌బాల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022ను అర్జెంటీనా గెలుచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చివరి వరకూ పోరాడి, పెనాల్టీ షూటౌట్‌లో ఓడిపోయింది.

    దోహాలోని లూసెయిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ రోమాంచిత ఉత్కంఠతో సాగింది.

    మ్యాచ్ తొలి సగంలో అర్జెంటీనా పూర్తిగా ఆధిక్యం ప్రదర్శించింది. ఫ్రాన్స్‌కు అవకాశం దక్కనివ్వలేదు.

    కెప్టెన్ మెస్సీ 23వ నిమిషంలో పెనాల్టీ గోల్ స్కోర్ చేయగా, 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా గోల్ చేశాడు.

    అయితే మ్యాచ్ రెండో సగం చివర్లో ఫ్రాన్స్ ఆటగాడు ఎంబెపి రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

    మ్యాచ్ 80వ నిమిషంలో పెనాల్టీని గోల్ స్కోర్ చేసిన ఎంబపి, ఆ తర్వాత రెండు నిమిషాల్లోనే, మ్యాచ్ 81వ నిమిషంలో మరో గోల్ చేశాడు.

    దీంతో స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. హోరాహరీ పోరు మొదలైంది. చివర్లో మెస్సీ చేసిన గోల్ దాడిని అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుకున్నాడు.

    ఆ తర్వాత 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ ఆట కొనసాగింది.

    మ్యాచ్ 108వ నిమిషంలో మెస్సీ గోల్ చేశాడు.

    దీంతో అర్జెంటీనా 3-2 స్కోరుతో ఫ్రాన్స్ మీద ఆధిక్యంలోకి వచ్చింది.

    అయితే మ్యాచ్ 118వ నిమిషంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఎంబపి గోల్ చేశాడు.

    దీంతో స్కోర్లు మళ్లీ సమం అయ్యాయి.

    స్కోర్లు టై కావటంతో విజేతను తేల్చటానికి పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు.

    అందులో ఫ్రాన్స్ 4 పెనాల్టీ షాట్లలో 2 గోల్స్ మాత్రమే చేసింది.

    అర్జెంటీనా 4 పెనాల్టీ షాట్లనూ గోల్స్‌గా మలచి విజేతగా నిలిచింది.

  3. ఎక్స్‌ట్రా టైమ్‌లో చెరో గోల్.. మళ్లీ స్కోర్లు సమం.. పెనాల్టీ షూటౌట్‌లోకి మ్యాచ్

    ఫుట్‌బాల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫ్రాన్స్, చాలెంజర్ అర్జెంటీనాల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌‌లో ఎక్స్‌ట్రా టైమ్‌లో 109వ నిమిషంలో మెస్సీ గోల్ చేశాడు.

    దీంతో అర్జెంటీనా 3-2 స్కోరుతో ఫ్రాన్స్ మీద ఆధిక్యంలోకి వచ్చింది.

    అయితే మ్యాచ్ 117వ నిమిషంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఎంబపి గోల్ చేశాడు.

    దీంతో స్కోర్లు మళ్లీ సమం అయ్యాయి.

    ఎక్స్‌ట్రా టైమ్ 30 నిమిషాలు ముగిశాక మరో 3 నిమిషాల అదనపు సమయం ఆట కొనసాగించారు.

  4. అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్: చెరో రెండు గోల్స్‌తో హోరాహోరీ.. ఎక్స్‌ట్రా టైమ్‌‌‌లోకి పోరు

    ఎంబపి

    ఫొటో సోర్స్, Catherine Ivill/Getty Images

    డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, చాలెంజర్ అర్జెంటీనాల మధ్య జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌‌లో నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసే సరికి ఇరు జట్లూ 2 స్కోర్లతో సమ ఉజ్జీగా నిలిచాయి.

    దీంతో విజేతను నిర్ణయించటానికి 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్‌లో ఆటను కొనసాగిస్తున్నారు.

    ఖతార్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఫస్ట్ హాఫ్‌లో 2-0 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది.

    కెప్టెన్ మెస్సీ 23వ నిమిషంలో పెనాల్టీ గోల్ స్కోర్ చేయగా, 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా గోల్ చేశాడు.

    మ్యాచ్ తొలి సగంలో అర్జెంటీనా పూర్తిగా ఆధిక్యం ప్రదర్శించింది. ఫ్రాన్స్‌కు అవకాశం దక్కనివ్వలేదు.

    కానీ సెకండాఫ్ చివర్లో ఫ్రాన్స్ ఆటగాడు ఎంబపి వరుసగా రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

    79వ నిమిషంలో పెనాల్టీని గోల్ స్కోర్ చేసిన ఎంబపి, ఆ తర్వాత రెండు నిమిషాల్లోనే, మ్యాచ్ 81వ నిమిషంలో మరో గోల్ చేశాడు.

    దీంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. హోరాహరీ పోరు మొదలైంది. చివర్లో మెస్సీ చేసిన గోల్ దాడిని అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుకున్నాడు.

    విరామం తర్వాత 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ ఆట మొదలైంది.

  5. బ్రేకింగ్ న్యూస్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫ్రాన్స్‌కు వెంట వెంటనే రెండు గోల్స్ చేసిన ఎంబపి.. స్కోర్లు సమం

    ఎంబపి

    ఫొటో సోర్స్, Getty Images

    హోరాహోరీగా సాగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఎంబపి వరుసగా రెండు గోల్స్ చేసి అర్జెంటీనాతో స్కోర్ సమం చేశాడు.

    అంతకుముందు మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి రెండు గోల్స్ చేసింది.

    సెకండ్ హాఫ్‌లో మ్యాచ్ 79వ నిమిషంలో పెనాల్టీని గోల్ స్కోర్ చేసిన ఎంబపి, ఆ తర్వాత రెండు నిమిషాల్లోనే, మ్యాచ్ 81వ నిమిషంలో మరో గోల్ చేశాడు.

    దీంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు మొదలైంది.

  6. మ్యాజికల్ మెస్సీ

    ఒక ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో.. గ్రూప్ స్టేజిలోను, రౌండ్ ఆఫ్ 16 లోను, క్వార్టర్ ఫైనల్‌లోను, సెమీ ఫైనల్‌లోను, ఫైనల్‌లో - గోల్స్ సాధించిన తొలి క్రీడాకారుడిగా లియోనల్ మెస్సీ రికార్డు సృష్టించారు.

  7. ఫుట్‌బాల్ ప్రపంచ కప్: 2-0 ఆధిక్యంలో అర్జెంటీనా

    అర్జెంటీనా గోల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఖతార్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఫస్ట్ హాఫ్‌లో 2-0 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది.

    కెప్టెన్ మెస్సీ 23వ నిమిషంలో పెనాల్టీ గోల్ స్కోర్ చేయగా, 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా గోల్ చేశాడు.

    మ్యాచ్ తొలి సగంలో అర్జెంటీనా పూర్తిగా ఆధిక్యం ప్రదర్శించింది. ఫ్రాన్స్‌కు అవకాశం దక్కనివ్వలేదు.

    అర్జెంటీనా గోల్ పోస్ట్ మీద మూడు షాట్లు కొట్టగా ఫ్రాన్స్ ఒక్క షాట్ కూడా కొట్టలేదు.

  8. బ్రేకింగ్ న్యూస్, ఫైనల్ మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన అర్జెంటీనా

    మెస్సి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ మీద అర్జెంటీనా పై చేయి సాధించింది.

    మ్యాచ్ 22వ నిమిషంలో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ పెనాల్టీ గోల్ స్కోర్ చేశారు.

    దీంతో అర్జెంటీనా 1-0 స్కోరుతో లీడ్‌లోకి వెళ్లింది.

    ప్రస్తుత ప్రపంచ కప్ పోటీల్లో మెస్సీకి ఇది ఆరో గోల్.

    మ్యాచ్ ఆరంభం నుంచీ అర్జెంటీనా ఆటగాళ్లు బాల్ కోసం ఫ్రాన్స్ మీద దాడి చేస్తున్నారు.

  9. అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం హేమాహేమీ జట్ల మధ్య హోరాహోరీ పోరు షురూ

    అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయి ఉంది

    ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది.

    భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:30 గంటలకు దోహాలోని లూసెయిల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది.

    ఇరు జట్ల అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయి ఉంది.

    ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు రెండూ.. ప్రపంచ కప్‌ను రెండేసి పర్యాయాలు గెలుచుకున్నాయి.

    2018 ప్రపంచ కప్ పోటీల్లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్.. ఇప్పుడు తన టైటిల్‌ను కాపాడుకోవటానికి పోరాడుతోంది.

    హేమాహేమీ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అందరి కళ్లూ ఇద్దరు క్రీడాకారుల మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.

  10. ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే...

  11. పఠాన్: బికినీ రంగు, ‘లవ్ జిహాద్’ వివాదంలో షారుఖ్, దీపికల సినిమా

  12. మహారాష్ట్ర: పాల్ఘర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, 8మంది అరెస్టు

    బాలిక అత్యాచారానికి గురైన ప్రాంతం
    ఫొటో క్యాప్షన్, బాలిక అత్యాచారానికి గురైన ప్రాంతం

    మహారాష్ట్రలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

    పాల్ఘర్ జిల్లాలోని సత్పతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 8మందిని అరెస్టు చేసి పోక్సోతో సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

    డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం నుంచి బాధితురాలు కనిపించకుండా పోయింది.17వ తేదీన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    సత్పతి పోలీస్ స్టేషన్
    ఫొటో క్యాప్షన్, సత్పతి పోలీస్ స్టేషన్

    బాలికకు ఫోన్ చేసినప్పుడు ఆమె తమకు ఏమీ చెప్పలేదని, ఏడుస్తోందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

    ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే పనేరి ప్రాంతంలో ఆ మైనర్ బాలిక ఆచూకీ లభించింది. మాహిమ్ గ్రామంలోని బీచ్‌లో ఒక పాడుబడ్డ బంగ్లాలో 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 17వ తేదీ శనివారం ఉదయం 11 గంటల వరకు, మొత్తం 8 మంది నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలిక తెలిపింది.

    ఎనిమిది మంది నిందితుల్లో ఒకరికి బాలిక తెలుసని, ఆమెను అతనే సంఘటనా స్థలానికి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.

    ఎనిమిది మంది నిందితులను పాల్ఘర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను తమ కస్టడీకి కోరామని పోలీసులు వెల్లడించారు.

  13. ఝార్ఖండ్: గిరిజన మహిళను చంపి ముక్కలుగా నరికి పారేసిన దారుణం.. భర్త అరెస్ట్, రాంచీ నుంచి ఆనంద్ దత్తా, బీబీసీ కోసం

    హతురాలు రబితా పహాడిన్

    ఫొటో సోర్స్, ANAND DUTTA

    ఝార్ఖండ్‌లో ఘోర ఉదంతం వెలుగు చూసింది. రుబిక పహాడిన్ అనే మహిళను హత్య చేసి ముక్కలుగా నరికి పారేసిన దారుణ ఉదంతం సాహెబ్‌గంజ్ జిల్లాలో చోటు చేసుకుంది.

    ఆమె శరీరంలోని 18 ముక్కలు ఇప్పటివరకూ లభించాయని, మిగిలిన భాగాల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

    రుబిక ఆదివాసీ తెగ అయిన ప్రహారియా సముదాయానికి చెందిన మహిళగా చెప్తున్నారు. రుబికకు నెల రోజుల కిందటే దిల్దార్ అన్సారీ అనే ముస్లిం యువకిడితో పెళ్లయిందని, వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారని పోలీసులు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దిల్దార్‌కు ఇది రెండో పెళ్లి అని, అతడి మొదటి భార్య కూడా దిల్లార్ ఇంట్లోనే నివసిస్తోందని తెలిపారు. రుబిక హత్య కేసులో దిల్దార్‌ను, అతడి కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

    ఈ కేసులో భర్త ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని.. అయితే కొన్ని రోజుల కిందట అతడు తన భార్య కనిపించటం లేదని బోరియో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని డీఐజీ సుదర్శన్ మండల్ తెలిపారు.

    రుబికను కుట్ర చేసి చంపారని, హత్య చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నిరికి సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పడేశారని డీఐజీ చెప్పారు.

  14. గుజరాత్‌లో గిరిజనుల తొలి ప్రాధాన్యం బీజేపీయే: ప్రధాని మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    గిరిజన ప్రజల సమస్యలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు తొలి ప్రాధాన్యం బీజేపీకి ఇచ్చారని.. గిరిజనుల కోసం రిజర్వు చేసిన 27 స్థానాల్లో బీజేపీ 24 స్థానాలు గెలిచిందిని చెప్పారు.

    ప్రధాని మోదీ ఆదివారం నాడు త్రిపుర రాజధాని అగర్తలాలో రూ. 4,350 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

    ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జనజాతీయ సమాజాల జీవితాలను మెరుగుపరచటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల కోసం రూ. 3,400 కోట్లకు పైగా వ్యయంతో ఈ ఇళ్లను అభివృద్ధి చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

    అగర్తల బైపాస్ రోడ్డు విస్తరణ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 230 కిలోమీటర్ల నిడివి గల 32 రోడ్ల నిర్మాణానికి శంకుస్తాపనలు చేశారు.

    అంతకుముందు మోదీ అగర్తలలో రోడ్ షో నిర్వహించారు. జనం రోడ్లకు ఇరువైపులా నిల్చుని ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    మేఘాలయలో పర్యటన

    త్రిపుర పర్యటనకు ముందు ప్రధాని మోదీ మేఘాలయలో పర్యటించారు. షిల్లాంగ్‌లో నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ గోల్డెన్ జూబిలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈశాన్య భారతదేశంలో, మేఘాలయలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.

    ‘‘గత ఎనిమిదేళ్లలో కొన్ని సంస్థలు హింసామార్గం విడిచి శాంతి మార్గంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో పరిస్థితిని నిరంతరం మెరుగుపరుస్తున్నాం’’ అని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  15. Argentina vs France: అర్జెంటీనాకు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ ఎలా కీలకం అయ్యాడు

  16. ఇరాన్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలిపిన నటి అరెస్ట్

    నటి అలిదూస్తి అరెస్టు

    ఫొటో సోర్స్, TARANEH ALIDOOSTI

    ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్ధతు తెలిపినందుకు ఆ దేశంలో ప్రముఖ నటి తరనేహ్ అలిదూస్తిని అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

    అలిదూస్తి అస్కార్ అవార్డు పొందిన సేల్స్‌మ్యాన్ సినిమాలో నటిగా సుప్రసిద్ధురాలు.

    ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న వ్యక్తికి మరణ శిక్ష విధించడాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో విమర్శించారు.

    మరణశిక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సంస్థలు గళమెత్తకపోవడాన్ని ఆమె తన పోస్టులో తప్పుబట్టారు.

    ‘‘మరణశిక్ష ఎదుర్కొన్న వ్యక్తి పేరు మొహ్‌సెన్ షెకారీ. ఈ మారణకాండను కళ్లారా చూస్తున్న అనేక ప్రపంచస్థాయి సంస్థలు నోరు మెదపడం లేదు. అది మానవాళికే అవమానం’’ అని ఆమె తన పోస్టులో రాశారు.

    నవంబర్ నెలలో ఆమె స్కార్ఫ్ లేకుండా దిగిన ఫొటోను షేర్ చేయడం ద్వారా మహ్సా అమీనీ కి మరణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్ధతును ప్రకటించారు.

  17. చైనాతో ‘సరిహద్దు ఘర్షణలు’ జరుగుతున్నా.. ఆ దేశం నుంచి భారత్ దిగుమతులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.. ఎందుకు?

  18. పవన్ కల్యాణ్: ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదు’ - సత్తెనపల్లి సభలో జనసేన నేత

  19. కౌలురైతు భరోసా యాత్ర సభ కోసం సత్తెనపల్లి చేరుకున్న పవన్ కల్యాణ్

    పవన్ కల్యాణ్

    ఫొటో సోర్స్, JANASENA

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లి చేరుకున్నారు. అక్కడ నిర్వహించే కౌలురైతు భరోసా యాత్ర సభలో ఆయన పాల్గొంటున్నారు.

    ఈ సందర్భంగా ఏటుకూరు, నల్లపాడు కూడళ్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

  20. ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్స్.. గంటలు, నిమిషాలు లెక్కబెట్టుకుంటున్న అభిమానులు

    ఫ్రాన్స్

    ఫొటో సోర్స్, Getty Images

    నేడే ఫిఫా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్. ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టిస్తుంది. ఫ్రాన్స్ గెలిస్తే 92 ఏళ్ల ఫుట్‌బాల్ చరిత్రలో వరుసగా రెండోసారి కప్ గెలిచిన మూడవ జట్టుగా రికార్డ్ సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఇటలీ, బ్రెజిల్ మాత్రమే రెండుసార్లు వరుసగా వరల్డ్ కప్ గెలిచాయి.

    లియోనెల్ మెస్సీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, లియోనెల్ మెస్సీ

    అర్జెంటీనా ఆశలన్నీ మెస్సీ పైనే. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఇదే చివరి ఫుట్‌బాల్ వరల్డ్ కప్. ఇప్పటి వరకు మెస్సీ తన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికుల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ, ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.

    ఈ ప్రపంచ కప్‌లో మెస్సీ ఆరు మ్యాచ్‌లు ఆడాడు. నాలుగింటిలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

    ఫిఫా ప్రపంచ కప్

    ఫొటో సోర్స్, PA MEDIA

    ఫ్రాన్స్, అర్జెంటీనా అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఫైనల్ మ్యాచ్ కోసం గంటలు, నిమిషాలు లెక్కెడుతున్నారు.