You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

బీజేపీకి ఒక్క చాన్సివ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాం - బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర భైంసా నుంచి ప్రారంభమైంది. ఈ సభకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

లైవ్ కవరేజీ

  1. అక్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే

  2. పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్: కోహ్లీ కాకుండా హార్దిక్, దినేశ్ కార్తీక్ కొడితే బాధపడేవాడిని

  3. అమ్మాయి చనువుగా మాట్లాడిందని లైవ్‌లో ముద్దు పెట్టేస్తారా? ముంబయిలో దక్షిణ కొరియా లైవ్‌స్ట్రీమర్‌ను వేధించిన యువకుల అరెస్ట్

  4. రోడ్డు ప్రమాదంలో నలుగురు విశాఖ వాసులు మృతి

    ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విశాఖపట్నం వాసులు మరణించారు.

    ఖుర్దా జాతీయ రహదారి మీద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో మారియా ఖాన్(24), రాఖీ(45), కబీర్‌లతోపాటు మరొక వ్యక్తి చనిపోయారు.

    వీరు భువనేశ్వర్‌లో పెళ్లికి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

    మృతుల్లో మారియా ఖాన్‌, బీచ్ రోడ్ ప్రాంతానికి చెందినవారు కాగా రాఖీది విశాలాక్షి నగర్. కబీర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

  5. శిఖర్ ధవన్:‘రిషభ్ పంత్ మ్యాచ్ విన్నర్... విఫలమైనా కొన్ని అవకాశాలు ఇవ్వాలి’

    న్యూజీలాండ్ వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచుల్లో సంజు శాంసన్‌ను ఆడించకపోవడం మీద కెప్టెన్ శిఖర్ ధవన్ వివరణ ఇచ్చాడు.

    ‘సంజు శాంసన్ మంచి ప్లేయర్. బాగా ఆడుతున్నాడు. అవకాశం ఇచ్చిన ప్రతిసారీ బాగానే ఆడాడు. అయినా కొన్ని సార్లు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ కంటే ముందు ఉన్న ప్లేయర్ బాగా ఆడుతున్నాడు.

    అతడు(రిషబ్ పంత్) మ్యాచ్‌ను గెలిపించే సత్తా గల వాడు అనే విషయం మాకు తెలుసు. కాబట్టి ఫాం లేక పోయినా అతనికి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కొన్ని రోజులు అవకాశం ఇచ్చాం.

    ఇంగ్లండ్‌లో ఆడినప్పుడు రిషబ్ సెంచరీ కొట్టాడు. ఇలా సెంచరీ చేసే వాళ్లనే ఎప్పుడూ ఆడిస్తారు. ఒక పెద్ద ప్లేయర్‌కు ఎంత వరకు సపోర్ట్ ఇవ్వాలి అనే విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ అని శిఖర్ ధవన్ అన్నాడు.

    న్యూజీలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. 1-0 తేడాతో న్యూజీలాండ్ గెలిచింది. సంజు శాంసన్‌కు బదులు ఫామ్‌లో లేని రిషభ్ పంత్‌ను ఆడించడం మీద విమర్శలు వచ్చాయి.

  6. దిల్లీ లిక్కర్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల మీద కల్వకుంట్ల కవిత ఎలా స్పందించారు?

  7. బ్రేకింగ్ న్యూస్, వైఎస్ షర్మిల: పాదయాత్రను ఆపేందుకే అరెస్ట్

    సర్వేలో వైఎస్‌ఆర్‌టీపీకి ఆదరణ ఉందని తెలిసి టీఆర్‌ఎస్ భయపడుతోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

    ప్రతి రోజూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే పాదయాత్రను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

    తనను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆగదని కేసీఆర్ భావించారని, అందుకే అరెస్టు చేశారని షర్మిల అన్నారు.

    హైదరాబాద్‌లో మంగళవారం షర్మిల కూర్చొని ఉన్న కారును తెలంగాణ పోలీసులు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత గవర్నర్ తమిళసైను కలిసి నరసంపేటలో జరిగిన దాడి ఆ తరువాత పరిణామాలను షర్మిల వివరించారు.

    తనను రిమాండ్‌కు పంపేందుకు మాత్రమే పోలీసుల మీద దాడి చేశాననే ఆరోపణలు మోపారని ఆమె అన్నారు.

    ‘నేను పాదయాత్ర చేసి మరొక పార్టీకి మైలేజీ ఎందుకిస్తాను?’ అని షర్మిల ప్రశ్నించారు.

    ‘భారతదేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ కుటుంబం ఎవరిదైనా ఉన్నది అంటే అది కేసీఆర్ కుటుంబమే. వారి మీద విచారణ జరపాలి’ అని ఆమె అన్నారు.

  8. సీబీఐ విచారణకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్

    తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సీబీఐ విచారణకు హాజరయ్యారు.

    ఈమేరకు దిల్లీలోని సీబీఐ ప్రధానకార్యాలయానికి వారు చేరుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    కొద్ది రోజుల కిందట తెలంగాణ భవన్‌లో దొరికిన నకిలీ సీబీఐ అధికారి కేసులో వీరి పాత్ర ఉందనే ఆరోపణల మీద విచారిస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

  9. గుజరాత్‌లో కొనసాగుతున్న పోలింగ్

    గుజరాత్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 11గంటల నాటికి 18.95శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

    సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

  10. రైళ్లలో టిల్టింగ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీనితో ప్రయోజనాలేంటి?

  11. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ‘కొనుగోలు’ కేసులో నిందితులకు బెయిల్

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ‘కొనుగోలు’ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లకు తెలంగాణ హై కోర్టు బెయిల్ ఇచ్చింది.

    రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లకు బెయిల్ ఇచ్చిన హై కోర్టు... ప్రతి సోమవారం సిట్ విచారణకు హాజరకు కావాలని ఆదేశించింది.

    రూ.3 లక్షలు వ్యక్తిగత పూచీకత్తుతోపాటు పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని వెల్లడించింది.

  12. వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?

  13. దిల్లీ లిక్కర్ కేసు: ‘అరెస్ట్ చేస్తారా... చేయండి...అంతకంటే ఏం చేస్తారు’... కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

  14. అఫ్తాబ్ పూనావాలకు నేడు నార్కో పరీక్ష

    శ్రద్ధ మర్డర్ కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు నేడు రోహిణిలోని అంబేడ్కర్ ఆసుపత్రిలో నార్కో పరీక్షలు నిర్వహించనున్నారు.

    ఇందుకోసం తీహార్ జైలు నుంచి అఫ్తాబ్‌ను రోహిణికి తరలించారు.

  15. నేటి నుంచి భారత్ జీ20 అధ్యక్షత ప్రారంభం

    భారత్ జీ20 అధ్యక్షత నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవుతోంది.

    ‘ప్రపంచమంతా ఒక్కటే అనే భావనను పెంచేందుకు భారత్ కృషి చేస్తుంది’ అని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో జీ20 కూటమికి అధ్యక్షత వహించిన దేశాలు ఎంతో నిర్మాణాత్మకమైన కృషిని చేశాయని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  16. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌: ఆమె ఒక్కతే, కానీ ఆమెలో 2,500 మంది ఉన్నారు, కోర్టులో సాక్ష్యం కూడా చెబుతున్నారు.

  17. గుజరాత్ ఎన్నికలు: ప్రారంభమైన తొలి దశ పోలింగ్

    గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    నేడు తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

    ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.

    క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ నుంచి బరిలో ఉన్నారు.

  18. పాకిస్తాన్‌పై ఒకే రోజు నలుగురు సెంచరీలు

  19. ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ

  20. దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కల్వకుంట్ల కవితపేరు

    దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చేర్చింది.

    ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అమిత్ అరోరాను దిల్లీలోని రౌస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఆమె పేరు ఉంది.

    కాగా అమిత్ అరోరాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించింది.

    అయితే, ఈ కుంభకోణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కవిత వివిధ సందర్భాలలో చెప్పారు.

    ఆధారాలు నాశనం చేసేందుకు గాను అమిత్ అరోరా 11 సార్లు ఫోన్ మార్చడం/ధ్వంసం చేయడం చేశారని.. అలాగే ఈ కేసులో ఆరోపణలున్న మరికొందరు గత ఏడాది కాలంలో వినియోగించిన లేదా ధ్వంసం చేసిన డిజిటల్ డివైస్‌ల(సీడీఆర్ ఐఎంఈఐ విశ్లేషణ ఆధారంగా) నంబర్లు, వారి పేర్లు అంటూ ఒక జాబితా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అందులో కల్వకుంట్ల కవిత పేరు ఉంది.